Friday, April 7, 2017

Rules for Navagraha Pooja

Rules for Navagraha Pooja 



* నవ గ్రహా ప్రదక్షణలో పాటించాల్సిన నియమాలు, వాటి వల్ల లాభాలు..


మనలో చాలా మంది గుడి వెళ్తుంటారు. అందరూ అక్కడ వున్న దేవుళ్ళందరికీ దండం పెట్టుకోని వచ్చేస్తారు కాని అక్కడే వున్న నవ గ్రహాలకు పెట్టారు. కారణం చాలా మంది కి భయం. ఇంకొంత మందికి అసలు పూజ ఎలా చేయాలో తెలియదు, మరికొంత మందికి ఏ నియమాలు పాటించాలో తెలియదు. సో వారి కోసం నవ గ్రహా లకు ప్రదక్షణలు ఎలా చేయాలో, అక్కడ ఎలాంటి నియమాలు ఎలా పాటించాలో ఇప్పుడు చూద్దాం. హిందు సంప్రదాయం ప్రకారం నవగ్రహా ప్రదక్షణలు చేయటం వల్ల మంచి ఫలితాలు వుంటాయట. అలాగే గ్రహాస్థితుల వల్ల మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఆధారపడి వుంటాయని చెప్తున్నారు జ్యోతిష్కులు. ఇంతకీ ఈ నవగ్రహా ప్రదక్షిణాలు చేయడానికి ఒక పద్దతి వుందట.

అదేమిటంటే నవగ్రహాలకు ప్రదక్షిణం చేసేటప్పుడు వాటిని తాకకూడదంట. ఈ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళినప్పుడు ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుంది కుడి వైపునకు 9 ప్రదక్షణలు చేయాలంట. ఇది పూర్తయిన తరువాత కుడి నుంచి ఎడమ వైపుకు 2 ప్రదక్షణాలు రాహూవు, కేతువు కోసం చేయాలంట. చివరిగా నవగ్రహాల కు వీపు చూపకుండా రావాలంట. అలాగే ముందుగా గుడిలో ని మూల విరాటును దర్శించుకున్న తరువాత మాత్రమే నవగ్రహాలను దర్శించుకోవాలంట. సో ఈ సారి వెళ్ళినప్పుడు ఈ పద్దతి ఫాలో అవ్వండి. ఒక వేళ మీ స్నేహితులకు తెలియకపోతే చెప్పండి.

ధ్వజస్థంభం పుట్టుక dwajasthambam




:tulip::tulip:ధ్వజస్థంభం పుట్టుక

Dwajasthambam


:tulip::tulip:

:golf::golf::golf::golf::golf::golf::golf::golf::golf::golf:
మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.

శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.

మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.


source: http://www.gotelugu.com/issue36/994/telugu-columns/dwajasthambam-history/
:pray::pray::pray::pray::pray::pray::pray::pray::pray:

Thursday, April 6, 2017

Manasa Sarovar మానస సరోవరం



Manasa Sarovar
మానస సరోవరం


సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడు ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాసం ఉందన్నది భక్తుల విశ్వాసం. ఆ పర్వతాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేదని.. పదాలకు అంతుచిక్కనిది. ఒక్కసారి కైలాసగిరిని దర్శించుకుంటే.. సర్వపాపవిమోచనం కలుగుతుంది. అంత పవిత్రమైన స్థలం.. కైలాసపర్వతం. ఆ కైలాసం విశ్వాంతరాల్లోనో, పాతాళలోకంలోనే లేదు.. భూమిపైనే ఉంది. శివపార్వతులు అక్కడే కొలువై ఉన్నారు. ప్రమథగణాలతో ఈ లోకాన్ని పాలిస్తున్నారు. పరమపవిత్రమైన హిమాలయాల్లో.. దేవాదిదేవతలు కొలువైన మంచుకొండల మధ్యలో... ఈ భూలోక కైలాసం ఉంది. అదే.. హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరం. కేవలం మహాశివుడు మాత్రమే కాదు.. అక్కడికి వెళితే మహాలక్ష్మితో సేవలందుకుంటూ పాలసముద్రంలో పవళించిన విష్ణుమూర్తి దర్శనమూ లభిస్తుంది. బ్రహ్మమనస్సు నుంచి ఉద్భవించిన పరమపవిత్రమైన సరోవరమూ ఇక్కడ ఉంది. దేవతలు స్నానమాచరించే, ఈ పవిత్ర జలాల్లో ఒక్క మునకేసినా... పాపలన్నీ నశించి.. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నవారవుతారు. కైలాస పర్వతంపైనే మహాశివుడి నివాసం ఉందని పురాణాలు చెబుతున్నాయి. తరతరాలుగా భక్తుల నమ్మకం కూడా అదే. అందుకే, భోళాశంకరుడి దర్శనం కోసం ఎన్నో కష్టాలకు ఓర్చి మానససరోవర యాత్రను చేస్తుంటారు. ఈ యాత్ర చేయాలంటే, డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. అంతకు ముంచి ఆధ్యాత్మిక బలం, సంకల్పం ఉండాల్సిందే.

శివ భగవానుడే కాదు, ఆయన వాహనమైన నందీశ్వరుడు, విఘ్నాలకు అధిపతి గణపతి, దేవతల సేనాధిపతి కుమారస్వామి కైలాస పర్వతంపై దర్శనమిస్తారు. సూర్యభగవనాడు భక్తితో అర్పించే కిరణాలు... కైలాస శిఖరాన్ని తాకగానే... వెండికొండ కాస్తా బంగారు మయమై.. శోభిస్తుంది. ఆ దర్శనం జన్మజన్మల సుకృతం. సముద్ర మట్టానికి 22 వేల 778 అడుగుల ఎత్తులో ఉందీ భూలోక కైలాసం. ఇక్కడికి వెళ్లిన ప్రతీఒక్కరినీ శివరూపదర్శనం లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం. అడుగడుగునా ఆధ్యాత్మికత పరుచుకున్న ఈ అందమైన శిఖరాన్ని దర్శించుకుంటే దొరికే అనుభూతి.. దేన్ని చూసినా రాదంటారు శివభక్తులు. మౌంట్ కైలాస్‌ భూలోకంలో ఉన్న ఓ అద్భుతమనే చెప్పాలి. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో రహస్యాలు ఈ పర్వతం చుట్టూ దాగిఉన్నాయి. నాలుగువైపులా నాలుగు రంగుల్లో కనిపించడం కైలాస పర్వతానికి ఉన్న మరో ప్రత్యేకత . అందుకే.. హిమాలయాల్లోనే అత్యంత అరుదైన పర్వతంగా పేరుగాంచింది.


Manasa Sarovar
మానస సరోవరం

Manjunatha Sannidi మంజునాథ సన్నిధి ధర్మస్థలం


Manjunatha Sannidi

Importance of Sree Ramanavami

Importance of Sree Ramanavami


శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.


శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

చరిత్ర

రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు; కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేక పోతే రాజ్యానికి వారసులు ఉండరని. అప్పుడు వశిష్ట మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. రుష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్ని దేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగ భాగం మొదటి భార్య కౌసల్యకూ, రెండో సగ భాగం చిన్న భార్య యైన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్యయైన సుమిత్రకు ఇచ్చారు. కొద్దికాలానికే వారు ముగ్గురూ గర్భం దాల్చారు. చైత్ర మాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు, మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్ర లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు.

ఉత్సవం

ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్ళలో చిన్న సీతా రాముల విగ్రహాలకు కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి (మహారాష్ట్రలో), లేదా వసంతోత్సవం (ఆంధ్రప్రదేశ్ లో) తో తొమ్మిది రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.[1][2]

ఉత్సవంలో విశేషాలు

ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.

బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.

ఉత్సవ మూర్తుల ఊరేగింపు. రంగు నీళ్ళు చల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవం.

ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం స్వీకరిస్తారు.).[ఆధారం చూపాలి]

దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో బాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది.

భద్రాచలంలో రామదాసు చే కట్టబడిన రామాలయంలో, ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తన తలమీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తాడు.

ఇస్కాన్ దేవాలయం వారు ఈ వేడుకలను నానాటికీ ఎక్కువవుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఇంకా ఘనంగా నిర్వహిస్తోంది. కొన్ని చోట్ల స్వామి నారాయణ్ జయంతిని కూడా దీనితో కలిపి జరుపుకుంటారు.

రామ రాజ్యం

దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. మహాత్మా గాంధీ కూడా స్వాతంత్ర్యానంతరం భారతదేశం రామరాజ్యంగా విలసిల్లాలని భావించాడు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ఆరంభమౌతుంది. శ్రీరాముడు జన్మించినట్లుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు ఉత్సవం. ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం, అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన నలుగురు వ్యక్తులు. ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. ఊరేగింపులో పాల్గొనేవారు చేసే రామరాజ్యాన్ని గురించిన పొగడ్తలు,నినాదాలతో యాత్ర సాగిపోతుంది .

శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు. సూర్యుడు, రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైనవారు. వీరిలో రఘు కచ్చితంగా మాట మీద నిలబడే వాడిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాటకోసం పదునాల్గేళ్ళు వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలవబడుతుంటాడ
ు.

"ర" అక్షరం ప్రాముఖ్యత : చారిత్రికంగా చూస్తే రామాయణం కథ ప్రాచుర్యం పొందడానికి పూర్వమే రామనవమి అనే రోజుకు ఒక ప్రాముఖ్యత ఉండేదని భావిస్తున్నారు.[ఆధారం చూపాలి]. ముఖ్యంగా రామాయణం, రామ నవమిలలో సూర్యుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది."రవి" అంటే సూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని "Amon Ra" లేదా "Ra" అనేవారు. లాటిన్ భాషలో కూడా "Ra" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. (ఉదా: Radiance, Radium). కడప దగ్గర ఉన్న ఒంటిమిట్ట ఆలయము కూడా ప్రాచీనమైనది.

ప్రశస్తం

‘రామ’ యనగా రమించుట అని అర్ధం. కాన మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న ఆ 'శ్రీరాముని’ కనుగొనుచుండవలె.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం’ అని, విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది.

దానికి పరమేశ్వరుడు, “ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!” అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక భక్త రామదాసు అయితే సరేసరి! శ్రీరామనామ గానమధుపానాన్ని భక్తితో సేవించి, శ్రీరామ నీనామ మేమి రుచిరా… ఎంతోరుచిరా… మరి ఎంతో రుచిరా… అని కీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు ‘రా’ అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట! అలాగనే ‘మ’అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందువల్లనే మానవులకు ‘రామనామ స్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట! శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు

Ramayanam రామాయణం


Ramayanam
*🕉రామాయణం🕉*


*ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ*

*ఒక కొడుకుకి తండ్రి మీద ఉన్న గౌరవం*

*ఒక భర్తకి భార్య మీద ఉన్న బాధ్యత*

*ఒక భార్యకి భర్త మీద ఉన్న నమ్మకం*

*ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం*
*ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం*

*ఒక మనిషిలోని బలం,*

*మరో మనిషి లోని స్వార్ధం,*

*ఇంకో మనిషి లోని కామం.....*

*ఒకరి ఎదురు చూపులు,*

*మరొకరి వెతుకులాటలు,*

*అండగా నిలిచిన మనుషులు,*

*అన్ని కలిపి మనిషి మనిషి గా బ్రతకడానికి అవసరమైన ఒక నిఘంటువు.*



Ramayanam రామాయణం

శ్రీరామ నామం జగత్కళ్యాణ కారకం,
శ్రీరామ నామం సర్వ శుభకరం..

రామా అని పలికినంతనే సర్వ పాపాలు దూరమవుతాయట,
రామా అని పిలిచిన పలికే కారుణ్య మూర్తి రామచంద్రుడు.

రామా అన్న తారక నామం పలికినంతనే కిరాతుడు వాల్మీకి అయ్యి రామాయణ దివ్య చరితామృతాన్ని లోకానికి అందించారు..

సాక్ష్యాత్తు శ్రీమన్నారాయణుడి అంశ అయ్యుండి కూడా కేవలం ఒక మానవ మాతృడి వలే వున్నాడు..

మనిషి అంటే హేళనగా చూసే రావణుడితోనే చేతులెత్తి మొక్కించుకుని, మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించాడు...

ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించి #రామో_విగ్రహవాన్_ధర్మః అని ఆ ధర్మానికే నిలువెత్తు రూపం అయ్యాడు...

కొడుకు అంటే తల్లిదండ్రుల ఆస్తునే కాదు వారి ఆదర్శాలను కూడా స్వీకరించాలి అని చెప్పిన ఆదర్శమూర్తి...

అన్నిటికీ మించి స్వర్ణ,రత్న,మణి భూషితమైన లంకను చూసి #జననీ_జన్మభూమిశ్చ_స్వర్గాదపి_గరీయసి అని, ఇది గొప్పదైనా నా జన్మభూమి గొటికి సరితూగదు అన్న దేశ భక్తుడు..

*******************************************

ప్రజాక్షేమమే తన క్షేమం అని తన భార్యను సైతం వదిలేసిన రాముడి దక్షత డబ్బు కోసం అధికారం ఆశించే వారికి అర్థం కాదు..

అయోధ్యకి రాజైనా తల్లికి బిడ్డే అన్న రాముడి మాతృభక్తి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వారికి ఏం అర్థం అవుతుంది...

పర స్త్రీని తల్లీ అని సంభోదించే రాముడి సంస్కారం కనపడ్డ ప్రతీ అమ్మాయినీ వంకరగా చూసే వారికి ఏం అర్థమవుతుంది..

తాను ఎంత పరాక్రమ శాలియైనా అంతా తన గురువులు నేర్పిన విద్య అనే రాముడి విధేయత మిడిమిడి జ్ఞానంతో ఉపాద్యాయుడినే హేళన చేసే వారికి ఏం అర్థమవుతుంది...

తాను ఏమైపోయినా సరే కానీ తన వంశం, తన పూర్వీకులకు చెడ్డ పేరు రావద్దు అని వనవాసంకేగిన రాముడి త్యాగం
నేను బాగుంటే చాలు నాకోసం కష్టపడ్డ తల్లిదండ్రులు, వారి పరువు మర్యాదలు ఏమైపోతే నాకేంటి అని వారికి నచ్చిన వారితో వెళ్లిపోయే వారికి ఏం అర్థం అవుతుంది ...

మాతృమూర్తి, మాతృదేశం స్వర్గం కంటే గొప్పవి అన్న రాముడి దేశభక్తి ఈ దేశంలో పుట్టి ఈ నేల తిండి తిని, ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం అనే వారికి ఏం అర్థమవుతుంది...

మాకేం అర్థమవుతుంది రామా... ఏం అవుతుంది..

చూసే మనసుంటే నీ సంస్కారం, నీ విధేయత, నీ వినయం,నీ సౌశీల్యం అర్థమవుతాయి..
మనలోనూ మార్పు వస్తుంది..

పిల్లలకి వీలైతే రాముడి గొప్పతనం చెప్పండి,ఆయన విలువలు, సుగుణాలు నేర్పండి..
ప్రతి ఇంటా రామాయణం వుండాలి...
ప్రతి భారతీయుడు చదవాల్సిన గ్రంథం "రామాయణం"

జై శ్రీరామ.. సకల సద్గుణ రామ..
సుందర సమనోహర రామా..

*భగవంతుడు ఏవిధముగా దర్శనమిస్తాడు ?*



*భగవంతుడు ఏవిధముగా దర్శనమిస్తాడు ?*


విగ్రహములకు పడి ,పడి మ్రొక్కు వారాలకున్ననూ ,హృదయములో నుండి మ్రొక్కిన వారికి భగవంతుడు దర్శనమిస్తాడు .
కోటి దేవతలను రమ్మని అరచేవారికన్నాను తన హృదయములో కోటి తలంపులను పారద్రోలిన వారికి మోక్షము ,ఆనందము లబించును .అద్దములో చూచుకొనువానికి తన ముఖము ఆ అద్దములో కనిపించును .అటులే తను తినవలసిన ఆహారపదార్థములు తాను తినుట మాని అద్దములో కనిపించే తన ప్రతిమకు పెడితే తన ప్రతిమ తింటుందా ?, తినదు ,తన యొక్క ఆకలి తీరుతుందా ?,తీరదు . అటులే హృదయమునకు బైట ఉన్న విగ్రహాసములకు హృదయములోన ఉన్న నీకు మధ్యన "నేను " అను అహంకారపు అద్దము అడ్డముగా ఉన్నది .ఆ అద్దమును తప్పించితే అప్పుడు అంతా తానే మిగులును .తన తలనొప్పి యొక్క బాధ ఏమిటో ఎలాగుంటుందో అద్దములో చూచినా తెలియునా ?,బాధ కనిపించునా ? తన యొక్క తలనొప్పి అద్దములో చూచినా తెలియదు .అటులనే భగవంతుడిని చూడాలనుకున్న విగ్రహములలో కనబడడు . విగ్రహములలో నీవు కల్పించిన ఒక ఆకారము మాత్రమే కనిపించును .కాని సృష్టికి ఆదిమూలమైన భగవంతుడు కనబడడు .భగవంతుడిని చూడాలన్న ముందుగా నీలోనున్న నిన్ను చూచుకోవలెను .అప్పుడు మాత్రమే నీలోనున్న ఆ భగవంతుడిని చూడగలవు .