Devotional Knowlege
"However many holy words you read, And however many you speak, What good will they do you If you do not act upon them?" - Buddha
Friday, April 18, 2025
Friday, April 11, 2025
Thursday, March 13, 2025
గోమతి చక్రాల విశిష్టత
గోమతి చక్రాల విశిష్టత 🏵️
గోమతి చక్రాలు అరుదైన సహజసిద్ధంగా లభ్యమయ్యే సముద్రపు ఉత్పత్తి.
చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో
సోడియం లేదా, కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో రూపుదిద్దికుంటాయి.
వీటి ఆకారం శ్రీమహావిష్ణువు చేతిలోని చక్రాన్ని
పోలి ఉంటుంది.
అందుకే 'నాగ చక్రం', 'విష్ణు చక్రం' అని పిలుస్తారు. గోమతిచక్రం నత్తగుళ్ళని పోలి ఉంటుంది కాబట్టి
వీటిని 'నత్త గుళ్ళ' స్టోన్ అని కూడా అంటారు.
గోమతి చక్రాలు వెనుకభాగం ఉబ్బెత్తు గాను, ముందుభాగం చదరం (ఫ్లాట్) గాను ఉంటుంది.
వృషభ రాశి, రోహిణి రాశులు శుక్రగ్రహానికి చెందినవి, శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీదేవికి సోదరుడు కావడం వల్ల ఈ చక్రాల ఉపయోగం అనేకం,
అనంతం, అత్యంత శ్రేష్ఠం అని చెప్పవచ్చు.
జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్థ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారణం కావడం వలన గోమతి చక్రాన్ని ధరించడం వల్ల అనేక శ్రేష్టమైన ఉపయోగాలు ఉన్నాయి.
ఈ గోమతి చక్రాలు గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలోని గోమతి నదిలో లభిస్తాయి.
గోమతిచక్రలు రెండు రంగులలో లభిస్తాయి
తెల్లనివి, ఎరుపువి.
తెలుపురంగు గోమతిచక్రాలను అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకల కార్యసిద్ధికి, ఆరోగ్య సమస్యలకి ధరించడానికి ఉపయోగపడతాయి.
ఎరుపురంగు గోమతి చక్రాలు వశీకరణం, శత్రునాశనం, క్షుద్రపూజలకు, తాంత్రిక ప్రయోగాలకు మాత్రమే ఉపయోగించాలి.
గోమతి చక్రాలలో ఆరు, తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉంటాయి.
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఆరు శుక్ర గ్రహానికి,
తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి.
జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావడం,
వివాహం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబరచకపోవడం వంటి
దోషాలు సైతం గోమతిచక్ర ధారణ వల్ల నివారింపబడతాయి.
గోమతి చక్రాల పూజా విధానం.......
గోమతి చక్రాలను సిద్ధం చేసుకుని వాటిని ముందుగా గంగాజలం లేదా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుని పరిశుభ్రమైన పొడి బట్టతో తుడుచుకోవాలి, గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా
అష్టలక్ష్మీ యంత్రంతో పీఠంపై అమర్చుకోవాలి.
గోమతి చక్రాల పూజను శుక్రవారం రోజు,
దీపావళి రోజు లేదా వరలక్ష్మీవ్రతం రోజు చేసుకుని
మనకు కావలసిన సమయాలలో తీసుకుని ఉపయోగించవచ్చు.
గోమతి చక్రాలను లలితా సహస్ర నామాలను జపిస్తూ కుంకుమతో లేదా హనుమాన్ సింధూరంతో గాని
అర్చన చేయాలి.
పూజ పూర్తయిన తరువాత గోమతి చక్రాలను
ఎఱ్ఱని బట్టలో కాని, హనుమాన్ సింధూరంలో కానీ పెట్టుకోవాలి.
గోమతి చక్రాలను పిరమిడ్ లో గాని వెండి బాక్స్ లోగాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా
కుంకుమతో పాటు బీరువాలో భద్రపరచుకోవాలి.
గోమతి చక్రాల ఉపయోగాలు.....
1. ఒక గోమతిచక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి
ఆ నీటిని త్రాగటం వల్ల మనుషులలోని రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి లభిస్తుంది.
2. గోమతిచక్రాన్ని లాకెట్ రూపంలో ధరిస్తే
నరదృష్టి బాధలనుండి విముక్తి కలుగుతుంది,
బాలారిష్ట దోషాలు కూడా సమసిపోతాయి.
3. రెండు గోమతిచక్రాలను బీరువాలో కాని పర్సులో కాని ఉంచినట్లయితే ధనాభివృద్ధి కలిగి ఎప్పుడూ ధనానికి లోటు ఉండడు.
4. రెండు గోమతి చక్రాలను భార్యాభర్తలు నిద్రించే'
పరుపు క్రింద కాని దిండు క్రింద కాని ఉంచినట్లయితే వారిద్దరి మధ్యా ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.
5. మూడు గోమతి చక్రాలను బ్రాస్ లెట్ లా చేసుకుని చేతికి ధరిస్తే జనాకర్షణ, కమ్యూనికేషన్,
సహకారం లభిస్తుంది.
6. మూడు గోమతి చక్రాలను మన దగ్గర అప్పుగా తీసుకుని డబ్బులు తిరిగి ఇవ్వని వారి పేరు
మూడు గోమతిచక్రాల మీద వ్రాసి నీటిలో వేయటం కాని వాటిని వెంట పెటుకుని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా యిచ్చే అవకాశం ఉంటుంది.
(ఈ ప్రయోగాన్ని మంగళవారం చేస్తే ప్రయోజనం కలుగుతుంది)
7. నాలుగు గోమతి చక్రాలను పంట భూమిలో పొడిచేసి కాని మామూలుగా కాని చల్లటం వలన పంట బాగా పండుతుంది.
8. నాలుగు గోమతి చక్రాలను గృహ నిర్మాణ సమయంలో గర్భస్థానంలో భూమిలో స్థాపించడం వలన
ఆ ఇళ్ళు త్వరగా పూర్తయి అందులో నివశించేవారు
సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉంటారు.
9. నాలుగు గోమతి చక్రాలను వాహనానికి కట్టడం వలన వాహన నియంత్రణ కలిగి వాహన ప్రమాదాల నుండి నివారింప బడతారు.
10. ఐదు గోమతి చక్రాలను తరచూ గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకి కట్టడం వలన
గర్భం నిలుస్తుంది.
11. ఐదు గోమతి చక్రాలను చదువుకునే పిల్లల పుస్తకాల దగ్గర ఉంచడం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది. తరచూ ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి.
12. ఐదు గోమతి చక్రాలను నదిలో కాని జలాశయంలో కాని విసర్జన చేస్తే పుత్రప్రాప్తి కలుగుతుంది.
13. ఆరు గోమతి చక్రాలను అనారోగ్యం కలిగిన
రోగి మంచానికి కట్టడం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది.
14. ఆరు గోమతి చక్రాలు ఇంట్లో ఉంచుకుంటే శత్రువులపై విజయం సాధించవచ్చు,
కోర్టు గొడవలు ఉండవు,
ఉన్నా విజయం సాధిస్తారు.
15. ఏడు గోమతి చక్రాలు ఇంటిలో ఉండడం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
ఇతరులతో సామాజిక సంబంధాలు బాగుంటాయి.
16. ఏడు గోమతిచక్రాలను నదిలో విసర్జన చేసిన.. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు మటుమాయం అవుతాయి.
17. ఎనిమిది గోమతిచక్రాలు అష్టలక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు.
18. తొమ్మిది గోమతిచక్రాలు ఇంటిలో ఉండడం వలన మన ఆలోచనలని ఆచరణలో పెట్టవచ్చు.
ఆధ్యాత్మిక చింతన కలుగుతాయి.
ఆ ఇంట్లోని వ్యక్తులు సమాజంలో గౌరవించబడతారు.
19. పది గోమతి చక్రాలు ఆఫీసులో ఉండడం వలన
ఆ సంస్థకి అమితమైన గుర్తింపు లభించడంతో పాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి,
వారు సమాజంలో గొప్ప పేరుప్రఖ్యాతలతో గుర్తింపబడతారు.
20. పదకొండు గోమతి చక్రాలు లాభ లక్ష్మీస్వరూపంగా పూజిస్తారు.
భవన నిర్మాణ సమయంలో పునాదిలో పదకొండు గోమతిచక్రాలను ఉంచడం వలన ఎటువంటి
వాస్తుదోషా, శల్యదోషాలు ఉండవు.
21. పదమూడు గోమతి చక్రాలను శివాలయంలో
దానం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.
22. 27 గోమతిచక్రాలను వ్యాపార సముదాయంలో ద్వారబంధానికి కట్టి రాకపోకలు ఆ ద్వారం ద్వారా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి అవుతుంది.
23. జాతకంలో నాగదోషం, కాలసర్ప దోషం ఉన్నవారు పంచమస్థానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాల దృష్టి కాని, సాంగత్యం కాని ఉన్న సంతాన దోషం ఉంటుంది.
దీనినే నాగదోషం అంటారు.
జాతకంలో రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్ప దోషం అంటారు.
ఈ రెండు దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలను పూజించడం గాని, దానం చేయడం గాని,
గోమతి చక్రాన్ని మెడలో లాకెట్ లాగా ధరించడం చేయాలి.
Wednesday, February 12, 2025
మనం భస్మం ఎందుకు ధారణ చేయాలి?🙏
మనం భస్మం ఎందుకు ధారణ చేయాలి?🙏
🌸భస్మం శివారాధన చేసేవాళ్ళో, లేక శైవులో పరమేశ్వరుడికి ఇష్టం కాబట్టి పెట్టుకుంటారంటే చాలా పొరపాటు పడినట్లే.. ఐశ్వర్యం గోషు సంపన్నం (మహాభారతం ) లో చెప్పబడినది.
🌿అంటే ఐశ్వర్యం గోవు తో పోల్చారు గోవు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది అని అర్ధం. కొంతమంది అడగవచ్చు. ఏమని?,
🌸గోవు ఉంటే ఐశ్వర్యం ఉండటం ఏమిటి అని,(మహాభారతం గో మాహాత్మ్యం పర్వం ) లో చెప్పబడినది గోమయం లో లక్ష్మీదేవి ఉంటుంది అని. ఆ గోమయాన్ని మనం ముఠాలు అనగా గుండ్రముగా తయారుచేసి దానిని హుతం చేసి అనగా కాల్చి వచ్చినటువంటి బూడిదని (భస్మాన్ని) మనం ధారణ చేస్తున్నాము.
🌿అంటే మనము సాక్షాత్తు లక్ష్మిదేవిని ధారణ చేస్తున్నాము. అందుకనే భస్మాన్ని (విభూతిర్భూతిరైస్వర్యం) అన్నారు భస్మము ధారణ చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది అని పండితులు, పెద్దలు, చెప్తూ ఉంటారు.
🌿కొన్ని పురాణాలలో (త్రి పుమ్డ్రేన వినదానం త్రి పుమ్డ్రేన వినా జపం త్రి పుమ్డ్రేన వినా శ్రాద్ధం తోయం నిష్ఫలదాయకం )అన్నారు. భస్మం లేకుండా చేసిన దానం ,భస్మం లేకుండా చేసిన జపం, భస్మం లేకుండా చేసిన శ్రాద్ధం ఫలితం ఇవ్వవు అని.
🌸భస్మం ఎవ్వరైనా ధారణ చేయవచ్చు ,భస్మ ధారణ చేసి మహాలక్ష్మి ,పరమేశ్వర అనుగ్రహము పొంది అష్ట ఐశ్వర్యాలు పొందవచ్చు, ఏ మాత్రము సందేహము లేదు..
🌹భస్మ ధారణ శ్లోకం :🌹
🌷శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ
నివారణమ్!
లోకే వశికరణం
పుంసాం భస్మ త్రైలోక్య పావనమ్!!.🙏
గోవుతో గృహప్రవేశం ఎందుకు?
గోవుతో గృహప్రవేశం ఎందుకు?
మనందరికీ సొంతింట్లో నివసించాలనిపిస్తుంది. ఆ స్వగృహ కల నెరవేరినప్పుడు బంధుమిత్రుల్ని పిలిచి గృహప్రవేశ వేడుక చేసుకుంటాం.
ఆ వేడుకలో మొదటి ఆచారం దూడతో సహా గోమాతను నూతన గృహంలోకి తీసుకెళ్లి మంత్రం జపిస్తూ ఇల్లంతా తిప్పడం. ఆ తర్వాతే ఇంటి యజమాని, ఇతర కుటుంబ సభ్యులు లోనికి వెళ్తారు. ఈ ఆచారం వెనుక ఉన్న ఆంతర్య మేమిటో చూద్దాం...
పురాణాలూ ఇతిహాసాలూ గోవును సకలదేవతా స్వరూపంగా వర్ణించాయి. గోవు ఉన్నచోట సకల దేవతలూ ఉంటారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. అందువల్ల ఆవును తీసుకెళ్తే.. దేవతలూ గృహంలో ప్రవేశిస్తారన్నమాట. అందుకే కొత్తింట్లో గోవును తిప్పటం ఆచారమయ్యింది. ఆ సమయంలో గోవు మూత్రం పోసినా, పేడ వేసినా మరింత శుభకరంగా భావిస్తారు. ప్రస్తుత కాలంలో బహుళ అంతస్తుల్లో గోవును తిప్పటం కుదరదు కనుక ఆ ప్రాంగణంలో ఆవూదూడలను అలంకరించి పూజిస్తారు. గోమయాన్ని, గోమూత్రాన్ని ఇంట్లో చిలకరిస్తారు.
అరుణాచలం గిరి ప్రదక్షిణ 14కి.మీ. నడవలేని వాళ్ళు ఎం చెయ్యాలి?
ప్రశ్న:అరుణాచలం గిరి ప్రదక్షిణ 14కి.మీ. నడవలేని వాళ్ళు ఎం చెయ్యాలి?
నేను 1కి.మీ. అయితే నడవగలను అంతకు మించి మా వల్ల కాదు అండీ మా ఆరోగ్యరీత్యా అంత దూరం ప్రయాణం చేయలేము మాకు ఆ ప్రదక్షిణ ఫలితం దక్కదా అని బాధపడేవాళ్ళు ఏం చెయ్యాలి?
సమాధానం:అరుణాచలం ప్రదక్షిణ కాలికి ఆపరేషన్ చేసి మీరు నడవలేరు ఎక్కువ దూరం అన్నవాళ్ళు కూడా 14కి.మీ. ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహముతో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఇప్పటికీ కూడా చేస్తుంటారు.శతవిధాలా ప్రదక్షిణ చెయ్యడానికి ప్రయత్నించండి.
ఇంకా ఆరోగ్యరీత్యా నా వల్ల అవ్వదు అనుకునేవాళ్ళు అరుణాచలం ప్రధాన దేవాలయం అదే అగ్ని లింగం ఉండే ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు అరుణాచలేశ్వరుడి నామ స్మరణ చేస్తూ చేసినా అదే ఫలితం వస్తుంది అని భగవాన్ రమణ మహర్షి చెప్పారు. ఇది శాస్త్రంలో కూడా చెప్పబడింది.
లేదండీ ఇది కూడా మా వల్ల అవ్వదు అనుకుంటే అరుణాచలం గర్భాలయం వెనుక వైపు పేయి గోపురం ఉంటుంది దానిలో నుంచి వస్తుంటే మీకు కుడి వైపు ఒక గేట్ కనిపిస్తుంది(ఇది గర్భాలయం వెనుక పేయి గోపురం మధ్యలో ఉంటుంది) ఆ గేట్ తీసి లోపలికి వెళ్తే ఒక చిన్న మండపంలో ఈ క్రింది ఫొటోలో ఉన్న పాదాలు కనిపిస్తాయి.అవి సాక్షాత్తు అరుణాచలేశ్వరుడి పాదాలు వాటికి నమస్కారం చేసుకుని నామ స్మరణ చేసుకుంటూ మూడు ప్రదక్షిణలు చేస్తే అరుణాచలం గిరి ప్రదక్షిణ ఫలితం వస్తుందని పెద్దలు చెప్తారు.ఇవి ప్రదక్షిణ ఫలితం కావాలి అనుకునే వారికోసం మాత్రమే.
అరుణగిరికి ప్రదక్షిణ చెయ్యలేని వాళ్ళు వీటికి చేసుకోవడం ఉత్తమం.
కానీ జీవితంలో ఒక్కసారైనా అరుణగిరికి పాదచారియై ప్రదక్షిణ చేస్తుంటే అస్సలు ఆ ప్రశాంతత,ఆనందం(ప్రదక్షిణ ఫలితం దేవుడెరుగు) వర్ణించడం ఎవ్వరికీ సాధ్యం కాదు.మనస్సు చిందులేస్తుంది అంతే.ఈ ఆనందం,ప్రశాంతత కోసమే చాలామంది ప్రదక్షిణ ఖచ్చితంగా నియమం పెట్టుకుని చేస్తుంటారు.అందుకే విశ్వ ప్రయత్నం చేసైనా సరే అరుణగిరికి ఒక్క ప్రదక్షిణ చెయ్యాలి అంటారు అంత అద్భుతంగా ఉంటుంది. చాలామంది ఈ ప్రదక్షిణ కోసం జీవితాలు జీవితాలు ఇచ్చేస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు.
ఆ ప్రదక్షిణ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే
అది అమోఘం,
అపూర్వం,
అనంతం,
చిత్ ప్రకాశం,
సచ్చిదానందం,
సకల మంత్ర స్వరూపం,
సకల మంగళ దాయకం,
సర్వ సమ్మోహనం,
సకలము మోక్షసిద్ది.
☘️🔱🕉️🔱☘️ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః☘️🔱🕉️🔱☘️
Wednesday, November 20, 2024
ఇంటి ముందు దిష్టికోసం గుమ్మడికాయ ఎందుకు కట్టాలి ? ఎప్పుడు కట్టాలి ?
ఇంటి ముందు దిష్టికోసం గుమ్మడికాయ ఎందుకు కట్టాలి ? ఎప్పుడు కట్టాలి ? 💐💐💐
ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్లగుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు,కుంకుమ రాసి దాన్ని ఇంటి ముందు ఉట్టిలో వేలాడదీయండి.
ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి. రెండు అగరబత్తీలు వెలిగించి దానికి ధూపం చూపించండి. ప్రతీ రోజు అంటే ఇంట్లో పూజ చేసుకున్నపుడు దానికి ఒక అగరబత్తిని వెలిగించి గుచ్చండి .
ఇంటి ముందు గుమ్మడికాయ ఉండటం వలన ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మక శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని అది రాకుండా అడ్డం పడుతుంది.మన ఇంటి మీద చూపించేటటువంటి చెడు ప్రబావాన్ని అది లాక్కుంటుంది .
ఒకవేళ మీరు తరచుగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుల్లిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోండి. మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి.
వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి. ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారబంధానికి పైన ఈ యొక్క గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి.
గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష,నరపీడ,నరదృష్టి, నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి.
పాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టేయాలి.ఇప్పటివరకు అసలు గుమ్మడికాయను కట్టకపోతే వెంటనే కొత్త గుమ్మడికాయను తీసుకువచ్చి కట్టేయండి. ఇలా బుధ, గురు, ఆదివారం రోజు గానీ కట్టాలి.