Showing posts with label Bhagavad Gita. Show all posts
Showing posts with label Bhagavad Gita. Show all posts

Tuesday, June 3, 2025

భగవద్గీత ఎందుకు చదవాలి? Why one should read Bhagavad Geetha?

 🙏భగవద్గీత ఎందుకు చదవాలి?🙏
Why one should read Bhagavad Geetha?

🌺కృష్ణం వందే జగద్గురుమ్🌺



 

సంతోషంగా ఉన్నావా ... >>>

భగవద్గీత చదువు.


బాధలో ఉన్నావా ... >>>

భగవద్గీత చదువు.


ఏమీ తోచని స్థితి లో ఉన్నావా ... >>> 

భగవద్గీత చదువు.


ఏదో గెలిచినావా ... >>>

భగవద్గీత చదువు.


ఏదో ఓడిపోయినావా ... 

భగవద్గీత చదువు.


నువ్వు మంచి చేసినావా ... >>> 

భగవద్గీత చదువు.


నువ్వు చెడు చేసినావా ... >>>

భగవద్గీత చదువు.


నువ్వు ఏదో సాధించాలి అనుకుంటున్నావా... >>>

భగవద్గీత చదువు.


నువ్వు ఏది సాధించ లేక పోతున్నావా... >>> 

భగవద్గీత చదువు.


నువ్వు చాలా ధనవంతుడవా... >>> 

భగవద్గీత చదువు.


నువ్వు చాలా బీద వాడివా ... >>> 

భగవద్గీత విను.


నువ్వు సమాజాన్ని బ్రతికించాలని అనుకుంటున్నావా... >>> 

భగవద్గీత చదువు.


నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నావా... >>>

భగవద్గీత చదువు.


నువ్వు మోసం చేసినావా ... >>>

భగవద్గీత చదువు.


నువ్వు మోసపోయినావా... >>> 

భగవద్గీత చదువు.


నీకు అందరూ ఉన్నారా... >>> 

భగవద్గీత చదువు.


నీవు ఒంటరివా.... >>>

భగవద్గీత చదువు.


నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా... >>>

భగవద్గీత చదువు.


నీవు వ్యాధిగ్రస్తుడవయ్యావా... >>>

భగవద్గీత చదువు.


నీవు చాలా విద్యావంతుడవా... >>> 

భగవద్గీత చదువు.


నీవు విద్యా హీనుడవా ... >>> 

భగవద్గీత చదువు.


నీవు పురుషుడవా... >>>

భగవద్గీత చదువు.


నీవు మహిళవా... >>>

భగవద్గీత చదువు.


నీవు ముసలివాడివా ...>>>

భగవద్గీత చదువు.


నీవు యవ్వనస్తుడివా ... >>>

భగవద్గీత చదువు.


దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా ... >>> 

భగవద్గీత చదువు.


దేవుడు లేడు అని అనుకుంటున్నావా .... >>>

భగవద్గీత చదువు.


ఆత్మ అంటే ఏమిటి? తెలుసుకోవాలని అనుకుంటున్నావా... >>>

భగవద్గీత చదువు.


పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నావా...>>>

భగవద్గీత చదువు.


మనిషి జీవితం ఎందుకో తెలుసుకోవాలని అనుకుంటున్నావా ... >>>

భగవద్గీత చదువు.


కర్మ అంటే ఏమిటో  తెలుసుకోవాలని ఉందా... >>>

భగవద్గీత చదువు.


ఈ సృష్టి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని వుందా... >>>

భగవద్గీత చదువు.


పుట్టకముందు మనం ఎవరో తెలుసుకోవాలని వుందా... >>>

భగవద్గీత చదువు.


చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో  తెలుసుకోవాలని వుందా... >>>

భగవద్గీత చదువు.


దేవుడంటే అసలు ఎవరో తెలుసుకోవాలని వుందా... >>>

భగవద్గీత చదువు.


నీలో కామం, క్రోధం, లోభం, మొహం, మధం, మాత్సర్యము వంటి అరిషడ్వర్గాలు ఉన్నాయా... >>>

భగవద్గీత చదువు.


నీవు ప్రేమిస్తున్నావా... >>> 

భగవద్గీత చదువు.


నీవు ద్వేషిస్తున్నావా... >>>

భగవద్గీత చదువు.


నీలో వైరాగ్యం ఉందా... >>>

భగవద్గీత చదువు.


జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలని వుందా...>>>

భగవద్గీత చదువు.


బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలని వుందా... >>> 

భగవద్గీత చదువు.


ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలని వుందా... 

భగవద్గీత చదువు.


మోక్షం అంటే ఏమిటో, స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంటే ...>>>

భగవద్గీత చదువు.


పంచ భూతాలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉన్నాయి? తెలుసుకోవాలంటే.... >>>

భగవద్గీత చదువు.


ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే... 

భగవద్గీత చదువు.


ఇక చివరగా... 

నీవు ఎవరు, 

ఎక్కడ నుండి వచ్చావు, 

ఎక్కడికి పోతావు, 

నీవారు ఎవరు, 

నీ అసలు గమ్యం ఏమిటి 

అని తెలుసుకోవాలి అంటే....

భగవద్గీత చదువు.

Monday, June 1, 2020

Spiritual Quiz

Spiritual Quiz


1. భగవద్గీతను లిఖించిన దెవరు?
=విఘ్నేశ్వరుడు.

2. భగవద్గీత మహాభారతంలోని 
ఏ పర్వములోని భాగము?
= భీష్మ పర్వము.

3. గీతాజయంతి 
ఏ మాసములో ఎప్పుడు వచ్చును?
=మార్గశిర మాసము.

4. గీతాజయంతి 
ఏ ఋతువులో వచ్చును?
=హేమంత ఋతువు.

5. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వసంత ఋతువు.

6. భగవద్గీత ఎవరు ఎవరికి బోధించెను?
=శ్రీకృష్ణుడు అర్జునునికి.

7. భగవద్గీత 
ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను?
=కురుక్షేత్ర సంగ్రామము.

8. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభ మయ్యెను?
=కౌరవ పాండవులకు.

9. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారధిగా వుండెను?
=అర్జునుడు.

10. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=సామవేదము.

11. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి?
=పాంచజన్యము.

12. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు?
=పద్దెనిమిది (18)

13. “నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో, 
నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోథుడెవరు?
= వినోబా భావే.

14. “సంశయములు నన్నావ రించినపుడు, సంకటములు సంప్రాప్త మైనపుడు, 
నిరాశా నిస్పృహలు జనించి నపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. 
అందు ఏదో ఒక శ్లోకము నన్నూర డించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
= మహాత్మా గాంధీ.

15. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు?
= సంజయుడు.

16. సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కుమారస్వామి.

17. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి?
=దేవదత్తము.

18. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి?
= ఐదు. 
(అనుష్టుప్, 
ఇంద్రవజ్ర, 
ఉపేంద్రవజ్ర, 
ఉపజాతి, విపరీతపూర్వ.)

19. భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు?
=నలుగురు. అర్జునుడు, 
వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు.

20. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= శ్రీరామచంద్రుడు.

21. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=అచ్యుత, 
అనంత, జనార్ధన.

22. భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు?
=ధనుంజయ, పార్ధ, కిరీటి.

23. శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. 
ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి?
=గీతా గానం.

24. “ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్” అనే పేరుతో భగవద్గీతను ఆంగ్లభాషలో పద్యరూపమున వ్రాసిన ఆంగ్లకవి ఎవరు?
=ఎడ్విన్ ఆర్నాల్డ్.

25. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరేమిటి?
=పౌండ్రము.

26. ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=శంకరుడు.

27. “నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించెను. 
కానీ అప్పటినుండి భగవద్గీత యను తల్లి ఆ స్ధానమును ఆక్రమించి, 
నా పక్కనే వుండి నన్ను కాపాడుచున్నది.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు?
=మహాత్మాగాంధీ.

28. భగవద్గీత 
ఏ వేదము లోనిది?
=పంచమ వేదం-మహాభారతం.

29. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది?
=11వ అధ్యాయము

30. ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=విష్ణువు

31. భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి?
=అర్జున విషాద యోగము.

32. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుధ్ధము చేయగలడు?
=పదివేలమంది.

33. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి?
=అనంతవిజయము.

34. భగవద్గీత  మొదటి శ్లోకం 
ఏ పదం (శబ్దము)తో ప్రారంభమవుతుంది?
= “ధర్మ” - శబ్దముతో గీత ప్రారంభ మయినది.

35. ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతీ విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికపుడు ప్రత్యక్షంగా (లైవ్) వివరించినదెవరు?
=సంజయుడు.

36. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటిరోజున పాండవుల తరపున వ్యూహ రచన చేసినది ఎవరు?
=దృష్టద్యుమ్నుడు.

37. ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వజ్రాయుధము.

38. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధవ్యూహము పేరేమిటి?
=వజ్ర వ్యూహం.

39. గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు?
=భీష్ముడు.

40. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాసుకి.

41. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= అనంతుడు.

42. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి?
=సుఘోషము.

43. అర్జునుని ధనస్సు పేరేమిటి?
=గాండీవము.

44. జీవునకు 
ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను?
=నాలుగు. (బాల్యము, యౌవనము, వార్థక్యము, 
దేహాంతర ప్రాప్తి)

45. నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గంగానది.

46. ఆత్మ యెట్టిది?
=నాశరహితమైనది.

47. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసిననూ నిష్ఫలము కాని కర్మను ఏమందురు?
=నిష్కామ కర్మ.

48. మనుజునకు దేనియందు అధికారము కలదు?
=కర్మలు చేయుటయందు మాత్రమే. (ఫలము నాశించుట యందులేదు.)

49. అర్జునుడు ఎవరి లక్షణములు-భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను?
=స్థితప్రజ్ఞుడు (జీవన్ముక్తుని లక్షణములు.)

50. వృక్షములలో తాను ఏ వృక్షమని 
శ్రీ కృష్ణుడు చెప్పెను?
= రావిచెట్టు.

51. పంచభూతములచే నాశనము పొందనిది ఏది?
=ఆత్మ.

52. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి?
=మణిపుష్పకము.

53. ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?
=ఆత్మయందు.

54. మహాభారత సంగ్రామంలో అర్జునుని రధము యొక్క జెండాపై గల వానరుడెవరు?
=హనుమంతుడు.

55. పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= గరుత్మంతుడు.

56. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును?
=తాబేలు.

57. కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?
=చేయుటయే మేలు.

58. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితో సహా మఱి వేనిని సృష్టించిరి?
=యజ్ఞములు (సత్కార్యములు, దైవకార్యములు)

59. వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలెను?
=లోక క్షేమం కొరకు.

60. ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కామధేనువు.

61. స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది?
=స్వధర్మము.

62. పొగచేత అగ్నియు, 
మురికిచేత అద్దము, 
మావిచేత గర్భమందలి శిశువు కప్పబడి వున్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును?
=కామము చేత.

63. దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకొన్ననూ పాపమును చేయుచున్నాడు?
= కామము యొక్క ప్రేరణచే.

64. భగవంతుడెపుడు అవతరించును?
=ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధి పొందునపుడు.

65. అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ప్రహ్లాదుడు.

66. గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= చిత్రరథుడు.

67. హృదయ శుద్ధి తద్వారా మోక్షము దేనివలన కలుగగలదు?
=జ్ఞానతపస్సు.

68. జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి?
=పరమశాంతి.

69. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు?
=గాలిలేనిచోట గల దీపంతో.

70. ఏ సాధనములచేత మనస్సు నిగ్రహింపబడగలదు?
=అభ్యాసము, వైరాగ్యము.

71. భయంకరమైన మాయను దాటుట ఎట్లు?
=భగవంతుని శరణుపొందుట వలన.

72. భగవంతుని సేవించువారిని ఎన్నిరకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను?
=నాలుగు రకాలు (ఆర్తుడు, 
జిజ్ఞాసువు, 
అర్ధార్థి, జ్ఞాని.)

73. భగవత్స్వరూపమును ఎవరు తెలిసి కొనలేరు?
=అజ్ఞానులు.

74. విద్యలలోకెల్లా శ్రేష్ఠమైనది, అతిరహస్యమైనది ఏది?
=బ్రహ్మవిద్య.

75. మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= భృగు మహర్షి.

76. బ్రహ్మవిద్యకు అర్హత యేమి?
=హృదయ శుద్ధి, అసూయాది దుర్గుణరాహిత్యము.

77. ఆకాశమునందు వాయువు వలె, 
సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితిగలిగి యున్నది?
=పరమాత్మయందు.

78. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడెట్లు కాగలడు?
=పరమాత్మయందు అనన్యభక్తిచే.

79. ఎప్పటికీ దుర్గతి పొందనది ఎవరు?
=భగవంతుని భక్తుడు.

80. సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యగాత్మ ఎవరు?
=సాక్షాత్తు పరమాత్మయే.

81. ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మనస్సు.

82. పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను?
=మేరువు.

83. పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=బృహస్పతి.

84. వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=ఓం కారము.

85. యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను?
=జప యజ్ఞము.

86. ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఐరావతము.

87. గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఉచ్ఛైశ్శ్రవసము.

88. శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకమలుగా పేర్కొనబడెను?
= మూడు 
(సాత్విక, రాజస, తామసాహారము)

89. దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= నారదుడు.

90. సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
=కపిల మునీంద్రుడు.

91. భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి?
= మోక్షసన్యాస యోగము.

92. లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= కాలము.

93. జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మొసలి.

94. ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములేవి?
= సత్త్వ, రజ, తమో గుణములు.

95. వేగముగా సంచరిస్తూ పవిత్రమొనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాయువు.

96. భక్తియోగమైన పన్నెండవ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 35.

97. విద్యలోల తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను?
= ఆధ్యాత్మ విద్య.

98. రాగద్వేష రహితముగా, 
తత్త్వ నిశ్చయము కొరకు వాదించువారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను?
= వాదము.

99. అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను?
= "అ"-కారము.

100. భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను?
= అర్జునుడు. (వ్యాసుడు, వ్యాసుని వరం వలన సంజయుడు, రథ ధ్వజంపై అదృశ్యరూపంలో వున్న హనుమంతుడు కూడా)

101. మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను?
= మార్గశిరము.

102. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తము ఎన్ని చెప్పబడెను?
= 20 (ఇరువది).

103. శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు 
ఎన్ని పేర్కొనబడెను?
= 26 (ఇరువదియాఱు).

104. శ్రీకృష్ణ భగవానునిచే అసుర గుణములు ఎన్ని పేర్కొనబడెను?
= 6 (ఆఱు).

105. తపస్సు లెన్ని రకములు?
= మూడు 
(శారీరక, వాచిక, మానసిక)

106. పరబ్రహ్మమునకు ఎన్నిపేర్లు కలవు?
= మూడు 
(ఓమ్, తత్, సత్).

107. మోక్షమును పొందుటకు కర్మలను వదల వలెనా?
=లేదు. 
కర్మలు చేయు నపుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై వుండ వలెను.

108. సంజయుడు ఎవరి అనుగ్రహముచే ఈ గీతా సంవాదమును నేరుగా (లైవ్) విన గలిగెను?
వేదవ్యాసుడు.

Sunday, September 9, 2018

Role of Arjuna and Karna in Mahabharatham




మహాభారతంలోని రెండు పాత్రలైన కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది...

కర్ణుడు కృష్ణుడుని అడిగాడు...

నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది..

అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే..

ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు..ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో..

పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు..

పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు..

ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది..

ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే..

నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే..

అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు...

దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు...

నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను..

నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది..

నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను..

చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు..

నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను...

నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను..

నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా..

నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు..

మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ..

సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది..

నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు..

నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను..పైగా నన్ను వివాహం చేసుకున్నవారు..వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ..

జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది..

అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది..

సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది...

అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు...పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన...

ఒకటి గుర్తుంచుకో కర్ణా..

జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి..

జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు..

దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే..

ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు..

మనకు ఎంత అన్యాయం జరిగినా..

మనకు ఎన్ని పరాభవాలు జరిగిన..

మనకు రావల్సినది మనకు అందకపోయినా...

మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది..

జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో..అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు...ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు..అని కర్ణునికి క్రృష్ణుడు బోధించాడు..

Wednesday, December 13, 2017

యధార్ధ సంఘటన Real Incident




యధార్ధ సంఘటన Real Incident

అది 1970 వ సంవత్సరం. తిరువనంతపురం ( నేటి త్రివేడ్రం) సముద్రపు ఒడ్డున ఒక పెద్దమనిషి భగవద్గీత పఠనములో ఉన్నాడు. అక్కడికి ఒక నాస్తికుడైన ఒక కుర్రవాడు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు.

ఆ కుర్రాడు ఈ పెద్దమనిషినితో " ఈకాలంలో కూడా ఇలాంటి పుస్తకాలు చదవడం వలన , మీరంతా మూర్ఖులుగా మిగులుతున్నారు. మాకు సిగ్గుగా ఉన్నది" అని రెచ్చగొడుతూ మాట్లాడము మొదలుపెట్టాడు.

పైగా " మీరే కనుక ఇలాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు పుస్తకాలు చదువుతూంటే, మనదేశం ఈపాటికి చాలా అభివృద్ధి సాధించి ఉండేది " అని ఆవేశంతో అన్నాడు.

ఆ పెద్దమనిషి ఆ కుర్రవాని పరిచయం అడిగాడు. అప్పుడా కుర్రవాడు " నేనొక కలకత్తానుండి వచ్చిన సైన్స్ పట్టభద్రుడిని. ఇక్కడ భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్లో పనిచేయటానికి వచ్చాను " అని గర్వంగా చెప్పాడు.

" మీరు వెళ్ళి ఈ భగవద్గీత లాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు మీద పుస్తకాలు చదవమని, ఇలాంటి పుస్తకాలు చదవడం వలన జీవితంలో సాధించేది ఏదీ ఉండదని " ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు.

ఆ పెద్దమనిషి నవ్వి, అక్కడనుండి వెళ్ళడానికి ఉపక్రమించాడు. ఆయన అలా లేవగానే నలుగురు రక్షక దళ భటులు ఆయనను చుట్టుముట్టి, ఆయనకు రక్షణగా నిలబడ్డారు. ఆయన కోసం ఒక అధికార ఎర్రబుగ్గ కారు వచ్చింది. ఇదంతా చూసి, ఆ కుర్రవాడు భయపడి, ఆ పెద్దమనిషిని " మీరెవరూ " అనడిగాడు. ఆ పెద్దమనిషి తనపేరు " విక్రం సారాభాయి" చెప్పాడు. అంటే, అప్పటికి ఆ కుర్రవానికి తను పనిచేయబోయే సంస్థకు ఆయన చైర్మన్ అని అర్ధం అయ్యింది.


ఆ సమయానికి భారతదేశంలో 13 రీసెర్చ్ సంస్థలు, విక్రం సారాభాయి పేరుమీద నడుస్తున్నాయి. అణువిజ్జాన పధకాలు రచించే సంస్థకు ఆయన అధిపతి. ఆయనను ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా దానికి నియమించింది.

అప్పుడు ఆ కుర్రవాడు వలవలా ఏడుస్తూ, ఆయన కాళ్ళమీద పడ్డాడు. అప్పుడు కీ.శే. విక్రం సారాభాయి చెప్పిన గొప్ప విషయం ఇది.

" ఈ విశ్వంలో ప్రతి వస్తువు పరమాత్మచే సృష్టించబడినదే. అది పురాణకాలం కావచ్చును. మహాభారత సమయం కావచ్చు. ప్రస్తుత సమయం కావచ్చును. మిత్రమా !! దైవాన్ని ఎప్పుడూ మరువకు. " అని బోధించాడు.

ఇప్పటి నాస్తికులు ప్రతిదీ హేతువాదం , అంటూ డాంబికముగా కరాళ నృత్యాలు చేయవచ్చును. కానీ సైన్సును అభివృద్ది చేసినది మటుకు ఆస్తికులే అని చరిత్ర చెపుతోంది. దైవం నిత్య సత్యం. భగవద్గీత ఒక అమోఘమైన విజ్జాన శాస్త్రము. దానిని ఎవరూ తప్పుబట్టలేరు. దానిలో చెప్పినది ఆచరించి ప్రపంచంలో ఎందరో లాభము పొందుతున్నారు. ప్రపంచములో ఉన్న సమస్యల కన్నిటికీ భగవద్గీతలో పరిష్కారాలున్నాయి.

శ్రీమత్భగవద్గీత సకలశాస్త్ర సారం !

శ్రీ కృష్ణం వందే జగద్గురుం !!

Tuesday, January 31, 2017

Download The Bhagavad Gita



Download The Bhagavad Gita


Click here to Download


Click here to Download

<iframe src="https://docs.google.com/document/d/1pOPN8Dci3legyBA7ZDfnM85aC3mhVSHKgTY-K2dHHBg/pub?embedded=true"></iframe>

7 Inspirational quotes from The Bhagavad Gita

7 Inspirational quotes from The Bhagavad Gita