Showing posts with label Temples. Show all posts
Showing posts with label Temples. Show all posts

Wednesday, August 6, 2025

Ekasila Awakens: Bhadra Deepotsavam Illuminates Warangal’s Spiritual Heart

 

Ekasila Awakens: Bhadra Deepotsavam Illuminates Warangal’s Spiritual Heart

The ancient city of Warangal, steeped in cultural and historical legacy, is once again embracing its spiritual roots through the Bhadra Deepotsavam—a grand event at the sacred Sri Bhadrakali Temple. Held amidst divine chants and a sea of lit lamps, this celebration is not just a festival but a deep spiritual awakening for the devotees of Telangana.

A Temple of Historical Grandeur

Located atop the historic Ekasila (single rock) hillock, the Sri Bhadrakali Temple stands as a symbol of devotion and architectural brilliance. With a history that dates back over 150 years, this shrine holds immense cultural significance. The temple has undergone several renovations over time, but what’s remarkable today is the new energy being infused into the premises through structured development and spiritual rejuvenation.

Reviving Traditions with a Modern Touch

As part of the spiritual upliftment, the temple authorities and community members have initiated the construction of a majestic new stone mandapam. Designed with traditional architecture, this 16-pillared stone structure is being rebuilt as part of a broader plan to enhance the sanctity and visual appeal of the temple complex.

Alongside, the priests and devotees are preparing for the massive Deepotsavam (festival of lights) —a visual and spiritual spectacle where thousands of lamps will be lit, symbolizing the victory of divine energy over darkness. The festival is a powerful blend of faith, community spirit, and age-old Vedic traditions.

Highlights of the Deepotsavam

  • Over 150 traditional stone lamps will be used for the grand lighting ceremony.

  • Priests and temple staff are orchestrating special rituals and homams (fire ceremonies).

  • The temple surroundings will resonate with Vedic chants, devotional music, and festive cheer.

  • Thousands of devotees are expected to participate, transforming the temple grounds into a glowing ocean of faith.

More Than a Festival: A Spiritual Movement

This initiative is not just about celebration but about reviving ancient heritage and instilling pride among the locals about their rich cultural past. It also encourages younger generations to connect with their roots and understand the importance of preserving temples as centers of spiritual and social harmony.

Looking Ahead

The new additions to the temple, including the impressive stone structure and upcoming renovations, are expected to enhance the temple’s status as a major spiritual destination in Telangana. Devotees and tourists alike will soon witness a space that combines devotion with artistic and architectural excellence.


🕉️ When light shines on tradition, it becomes legacy.

Warangal’s Bhadrakali Temple stands not only as a place of worship but also as a beacon of cultural resurgence. The Ekasila city is glowing once again—with the divine light of Bhadra Deepotsavam.

కరవును ఎదుర్కొన్న భద్రాద్రి రామయ్య క్షేత్రం - ఏకశిల నుండి పునరుజ్జీవం వరకు!

 కరవును ఎదుర్కొన్న భద్రాద్రి రామయ్య క్షేత్రం - ఏకశిల నుండి పునరుజ్జీవం వరకు!

పూర్వం భద్రాద్రిలో నీటి కొరత తీవ్రంగా ఉండేది. స్వయంగా శ్రీరాముడే కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం కరువు కాటకాలతో కళావిహీనమైంది. 16వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయం తొలుత ఏకశిలపై వెలిసింది. కాలక్రమేణా నీరు లేక నిర్మానుష్యంగా మారిన ఈ దివ్య స్థలాన్ని భక్తులు మరచిపోయే స్థితికి చేరుకున్నారు.

సుమారు 150 ఏళ్ల క్రితం, గోదావరి వరదలు పోటెత్తడంతో మళ్లీ ఈ ప్రాంతానికి పూర్వ వైభవం వచ్చింది. ఊహించని విధంగా వరద నీరు రామాలయానికి చేరుకుని, స్వామివారి మూలవిరాట్ పాదాలను తాకింది. ఇది స్థానికులకు ఒక దివ్య సంకేతంగా అనిపించింది. అప్పటినుండి భక్తులు మళ్లీ రావడం మొదలుపెట్టారు.

నల్లరాతితో చెక్కిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నిత్య పూజలు, ఉత్సవాలతో భద్రాద్రి మళ్లీ కళకళలాడుతోంది. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి. భద్రాద్రి రాముని కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుందాం.




Monday, June 2, 2025

తిరుమలలోని ఏడు కొండల పేర్లు

 తిరుమలలోని ఏడు కొండల పేర్లు




1. శ్రీవారి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు తెచ్చిన కొండపేరు 'గరుడాద్రి:



2. శ్రీమహవిష్ణువు చేతిలో హతమైన వృషభరాసుడి పేరుతో ‘వృషభాద్రి:




3. హనుమంతుని తల్లి అంజనీ దేవి 。" తప్పమాచరించిన కొండ 'అంజనాద్రి:


4. కొండపై తొలిసారి తలనీలాలు ఇచ్చిన భక్తురాలు నీలాంబారి పేరిట 'నీలాద్రి:


5. ఆడిశేషుడి పేరిట శేషాద్రి:


   6. పుష్కరిణ్ణి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణుడి పేరిట ‘నారాయణాద్రి:


7. పాపాలను దహించే (వేం:పాపాలను కట= దహించునది) కొండగా 'వేంకటాద్రి:

Thursday, May 29, 2025

శ్వాస తీసుకునే* కాళహస్తీశ్వర్

 శ్వాస తీసుకునే* కాళహస్తీశ్వర్


*సముద్రమే వెనక్కివెళ్లే*
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్,
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.


*స్త్రీవలె నెలసరి* అయ్యే


1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,
2. కేరళ దుర్గామాత.

*బహ్మ పేరు తో ఏకైక శివాలయాలు*

అలంపూరులో నవఁబహ్మేశ్వర ఆలయాలు
9 రూపాలలో శివలింగాలు ఉంటాయి

*రంగులు మారే ఆలయం.*

1. ఉత్తరాయణం, దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే శివాలయం పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం సోమేశ్వర స్వామి వారి ఆలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.

*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు*

 1. కాణిపాకం,
2. యాగంటి బసవన్న,
3. కాశీ తిలభండేశ్వర్,
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి

*స్వయంభువుగా*

సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.
*ఆరునెలలకు ఒకసారి తెరిచే*
1. బదరీనాథ్,
2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)
3. గుహ్యకాళీమందిరం.

*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు*
హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.

*12 ఏళ్లకు ఒకసారి*
పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.

*స్వయంగా ప్రసాదం తినే*
1. కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం

*ఒంటి స్తంభంతో*
యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.

*రూపాలు మారే*
ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.

*నీటితో దీపం వెలిగించే* ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.

*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు*
1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి

*మనిషి వలె గుటకలు*
వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.

*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.*

*ఛాయా విశేషం*
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం

*నీటిలో తేలే* విష్ణువు _(వేల టన్నుల బరువుంటుంది ), నేపాల్_

*పూరీ*
_పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం._


నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.

 నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.

1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.






2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,




3. మంజునాథ్.





నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు

 *_నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:_*

1. _మహానంది_
2. _జంబుకేశ్వర్_
3. _బుగ్గరామలింగేశ్వర్_
4. _కర్ణాటక కమండల గణపతి._
5. _హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం._
6. _బెంగళూర్ మల్లేశ్వర్_
7. _రాజరాజేశ్వర్_ _బెల్లంపల్లి శివాలయం_
8. _సిద్ధగంగా_
9._అలంపురం_




సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు_:*

 సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు_:*


1. _నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం._
2. _కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం._
3. _బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం._
4. _అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం._
5. _మొగిలీశ్వర్._
6. _కోదండరామ దేవాలయం, కడప జిల్లా._
7._సూర్యనారాయణ దేవాలయం జోగుళాంబ అలంపూరు గద్వాల జిల్లా_






అరుణాచలం (తిరువణ్ణామలై)


అరుణాచలం (తిరువణ్ణామలై)



 జీవకోటి యాత్రలో ఒక గీత అడ్డంగా పెడతారట. ఏమా గీత అంటే... అరుణాచల ప్రవేశానికి పూర్వం, తర్వాత అట. ‘అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు’ అని ఓ సిద్ధాంతం ఉంది. నేనూ ఈ సిద్ధాంతాన్ని నమ్మాను. ఎందుకంటే పదేళ్ల నుంచి అక్కడికి వెళ్లాలని వెళ్లలేకపోయాను. ఈసారి ఎలాగైనా వెళ్లాలని సంకల్పించుకున్నాను.


అరుణాచలేశ్వరుడి చుట్టూ 14 కిమీ గిరి ప్రదక్షిణం నడక... ఇది కేవలం యాత్ర కాదు, ఒక జీవన మార్గం. ఈ ప్రదక్షిణ వల్ల మనస్సు శుద్ధి, ఆత్మాన్వేషణ, శివ అనుగ్రహం లభిస్తాయి. 

అరుణాచలం ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? ఎలా చేయాలి మీకున్నా అన్ని సందేహాలకు ఈ పోస్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.


1. అరుణాచల క్షేత్ర మహిమ ఏమిటీ?


అరుణాచలం (తిరువణ్ణామలై) శైవమతంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ఇది ఐదు భూతలింగాలలో అగ్నిలింగం కి ప్రతీక.

‘‘అరుణాచలేశ్వరుడు’’ అనగా – ఆరున్ (తేజస్సు), అచల (అచంచలుడు) – శివుడు స్వయంగా తేజోమయంగా లింగరూపంలో వెలసిన స్థలం.


శివుడు తన స్వరూపాన్ని చూపించడానికి ఎక్కడో వెలయించబడతాడు కానీ, ఇక్కడ ఆయన స్వయంగా ‘గిరిరూపం’ గా వెలసాడు. అందుకే అరుణాచలం కేవలం శిల కాదు – శివుడే!


అరుణాచలం గిరిప్రదక్షిణం చేసిన మహనీయులు – ఋషులు, యోగులు, గురువులు


1. భగవాన్ శ్రీ రమణ మహర్షి (Bhagavan Sri Ramana Maharshi)


అరుణాచల గిరిప్రదక్షిణాన్ని అత్యంత పవిత్ర సాధనంగా పరిగణించిన ఆధునిక యోగి.


ఆయ‌న జీవితంలో ఎన్నో సార్లు అరుణాచలం చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేశారు.


"గిరిప్రదక్షిణం అనేది పర్వతాన్ని కాకుండా, శివుని చుట్టూ తిరిగే విధానం" అని రమణ మహర్షి తత్వబోధ.


2. శ్రీ శేషాద్రి స్వామి (Sri Seshadri Swamigal)


రమణ మహర్షికి సమకాలికుడు.


తిరువణ్ణామలై లోనే నివసిస్తూ అరుణాచల గిరిప్రదక్షిణతో తన భక్తులను ఉద్ధరించారు.


3. గౌతమ మహర్షి (Gautama Maharshi)


పురాణాల ప్రకారం, గౌతమ మహర్షి అరుణాచల ప్రాంతంలో తపస్సు చేసి శివానుగ్రహాన్ని పొందాడు.


శివుడు ఈ ప్రాంతంలో స్వయంగా ‘తేజో లింగంగా’ వెలసినట్లు మొదటి సంబందం గౌతమ మహర్షి ద్వారా తెలియజేయబడింది.


4. విరూపాక్ష ఋషి (Virupaksha Deva or Rishi)


ఆయన సాధనానికి ప్రసిద్ధమైన విరూపాక్ష గుహ ఇప్పటికీ అరుణాచల పర్వతంలో ఉంది.


ఆయన అరుణాచలాన్ని శివ స్వరూపంగా చూసి దశాబ్దాలుగా ఆ గుహలో నివసించారు.


5. యోగి రామయ్య (Yogi Ramsuratkumar)


ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన గాఢమైన తపస్వి.


తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుని చుట్టూ ఎన్నో సార్లు గిరిప్రదక్షిణ చేశాడు.


“Viswaroopa of Arunachala” అనే ఆయన మాటలు ప్రసిద్ధం.


6. శ్రీ శివప్రభునంద స్వామి (Sri Shivaprabhananda Swami)


అరుణాచలం గురించి విస్తృతంగా గ్రంథాలు రచించిన ఋషిసమానం గురువు.


గిరిప్రదక్షిణ సాధన విధానాన్ని తాను అనుసరించడమే కాక, భక్తులకు కూడా ప్రేరణగా నిలిచారు.


ఇతర ప్రసిద్ధ ఆధ్యాత్మికుల ప్రస్తావన:


అప్పర్, సంధానర్, జ్ఞానసంబంధర్, మాణిక్యవాచకర్ వంటి నాయనార్లు అరుణాచలేశ్వరుని భక్తులుగా ప్రసిద్ధులు.


శ్రీ శంకరాచార్యులు కూడా అరుణాచల మహత్యాన్ని అభినందిస్తూ కొన్ని శ్లోకాల ద్వారా గుర్తించారని నమ్మకం.


అనేక సాధకులు పేరు తెలియని యోగులు ఈ పర్వతాన్ని తమ జీవితధ్యేయంగా మార్చుకున్నారు.


సూచనలు:


ఈ గురువులు చేసిన గిరిప్రదక్షిణ అనుభవాలు వారి ఆశ్రమాలలో, గుహలలో, ప్రేరణాత్మక రచనలలో ఉద్ఘాటించబడ్డాయి. అరుణాచల పర్వతం కేవలం శిల గోపురం కాదు – అది జీవంత శివ తత్త్వం. గురువులు నడిచిన ఆ బాటలో మనం కూడా ఒక అడుగు వేయడం సాకారం మార్గానికి మొదటి మెట్టు.


2. అరుణాచల గిరి ప్రదక్షిణం ఎలా చేయాలి?


గిరి ప్రదక్షిణం అంటే అరుణాచల పర్వతాన్ని చుట్టూ నడిచి ప్రదక్షిణ చేయడం. దాదాపు 14 కి.మీ. మేర నడక ఉంటుంది. ఇది సాధారణ నడక కాదు – ఒక ఆధ్యాత్మిక సాధన.


#ఎలా_చేయాలి?


కాలినడకన చేయాలి. సాధ్యమైనంత వరకూ పాదయాత్రే శ్రేష్ఠం. శరీర శ్రమ, మనస్సు ఏకాగ్రతతో భక్తి లభిస్తుంది.


“అరుణాచల శివా” అనే నామస్మరణతో నడవాలి.


రాత్రిపూట ప్రదక్షిణ చేయడం పవిత్రంగా భావిస్తారు – చందమామ వెలుతురులో పర్వతం దేవతా స్వరూపంగా అనిపిస్తుంది.


గొప్ప శౌచం, దినచర్య, ఆహార నియమాలు పాటిస్తూ చేయాలి.


ప్రదక్షిణ ప్రారంభానికి ముందు స్నానం చేయడం, శుద్ధ బద్ధంగా ఉండడం శుభకరం.


ప్రదక్షిణలో #ముఖ్యమైనక్షేత్రాలు:


అష్టలింగాలు (ఇవి 8 మూలదిక్కులకు ప్రతీకలు): ఇంద్ర లింగం, అగ్ని లింగం, యమ లింగం, నిరుతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం.

మనం గిరిప్రదక్షిణం చేస్తున్న కొండ చుట్టూ ఈ 8 లింగాలు రోడ్డు పక్కనే ఉంటాయి. వాటిని దర్శించుకొని మనం గిరిప్రదక్షిణం చేస్తే మంచిది. 

అలాగే మార్గం మద్యలో మోక్షమార్గం కూడా ఉంటుంది. ఆ మార్గం గుండా ప్రవేశిస్తే మోక్షం కలుగుతుంది అని చెప్పుతుంటారు.


సద్గురు రమణ మహర్షి ఆశ్రమం.


అనేక ప్రాచీన ఆలయాలు, తీర్థాలు, పుణ్యసంఘాలు ఈ మార్గంలో ఉంటాయి.


3. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడవలన #ప్రయోజనం ఏమిటి?


పాప విమోచనం: గత జన్మల పాపాలు తొలగుతాయి.


మనశ్శాంతి: పర్వతం స్వయంగా శివుడైనందున, చుట్టూ తిరిగితే మనస్సుకు శాంతి లభిస్తుంది.


కార్మిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చే మార్గం.


ఇచ్ఛల సాఫల్యం: సరైన నియమాలతో, శ్రద్ధతో చేసిన గిరిప్రదక్షిణ ఫలితంగా కోరికలు నెరవేరతాయి.


4. #అరుణాచలం ఎలా వెళ్ళాలి?


అరుణాచలం స్థానం: తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై పట్టణంలో ఉంది.


#హైదరాబాద్‌ నుంచి వెళ్ళాలంటే:


#బస్సు: హైదరాబాద్‌ – తిరువణ్ణామలైకి ప్రత్యక్ష బస్సు లేదు. అయితే చిత్తూరు/వెల్లూరు వరకు బస్సు/రైలు ఎక్కి, అక్కడి నుంచి స్థానిక బస్సు లేదా టాక్సీ ద్వారా వెళ్లొచ్చు.


#రైలు: తిరుపతి/కాట్పాడి (వెల్లూరు) వరకు రైలు తీసుకుని అక్కడి నుంచి అరుణాచలానికి వెళ్లవచ్చు.


#కారు: సొంత వాహనంలో వెళ్లాలంటే ~650 కిమీ దూరం, సుమారు 12 గంటలు పడుతుంది.


#విమాన మార్గం: చెన్నై వరకు విమానం తీసుకుని, అక్కడి నుంచి బస్సు లేదా కారు (సుమారు 190 కి.మీ) ద్వారా.


5. అరుణాచలంలో ఉండడానికి ఏర్పాట్లు:


#ధర్మశాలలు:

 రమణాశ్రమం, సద్గురు ఆశ్రమాలు, శైవ మఠాలు.


#హోటల్స్: తిరువణ్ణామలైలో మంచి హోటల్స్ అందుబాటులో ఉంటాయి – ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.


#ఆహారం: సాధారణంగా స్వచ్చమైన సౌత్ ఇండియన్ భోజనం అందుబాటులో ఉంటుంది.


#సూచనలు:


1. మొదటిసారి వెళ్లే వారు రమణాశ్రమంలో గైడ్ చేయించే సమాచారాన్ని తీసుకోవచ్చు.


2. క్షేత్రానికి వెళ్లేముందు శారీరకంగా, మానసికంగా సన్నద్ధత అవసరం.


3. గిరి ప్రదక్షిణ సమయంలో చెప్పులు తొలగించి నడవడం ఉత్తమంగా భావిస్తారు.


4. వర్షాకాలం కాకుండా, శీతాకాలం (నవంబర్–ఫిబ్రవరి) ఉత్తమ సమయం.

Friday, April 11, 2025

Wednesday, July 31, 2024

Saraswathi Temple Basra జ్ఞాన సరస్వతీ ఆలయం – బాసర ...!!

 జ్ఞాన సరస్వతీ ఆలయం – బాసర ...!!



ఇది తెలంగాణ రాష్ట్రం లోని ఆదిలాబాదు జిల్లా, ముధోల్ మండలం బాసరలో ప్రఖ్యాతిచెందిన జ్ఞానసరస్వతి ఆలయం ఉంది.. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. 


భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. 


ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. 

బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. 


ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు.  


ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. 


కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. 


వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్ఠించాడు.  


వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన ‘బాసర’ గా నామాంతరాన్ని సంతరించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. 


ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా, గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది కూడా ఒకటి.


ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః

Tuesday, July 9, 2024

బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం

 బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం


బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం : హైదరాబాదులోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఆషాఢ బోనాల సందర్భంగానే మహోత్సవంగా నిర్వహిస్తారు. హైదరాబాదులోని బల్కంపేటలో రేణుక ఎల్లమ్మ భక్తజనుల ఆరాధనలందుకుంటోంది. ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయంలో ఎల్లమ్మ జలాధివాసిని, స్వయంవ్యక్తమైన తల్లి. అమ్మవారి ఆలయంలో క్షేత్రపాలకురాలిగా ఆరోగ్య ప్రదాయినియైన శీతలాదేవిని స్థాపించారు. జలాధివాసినిగా అమ్మవారు ఆవిర్భవించిన కారణంగా ఆమెను జలదుర్గా స్వరూపంగా ఆర్చిస్తారు. ప్రస్తుతం ఆలయం ఏర్పడి, అర్చామూర్తులు వెలసినా, మూలస్వరూపమైన అమ్మవారిని జలాధివాసినిగా దర్శించవచ్చు. క్షేత్రపాలకురాలు శీతలాదేవి (పోచమ్మ) కూడా ఆలయంలోనే దర్శనమిస్తుంది. కొత్త దంపతులు పసుపుబట్టలతో అమ్మవారిని దర్శించుకుంటే సంసారం ఏ కష్టాలు, చింతలు లేకుండా సాగుతుందని నమ్మకం. ఆలయంలో మూలమూర్తి శిరస్సు వెనుక భాగంలో ఉన్న బావి నుంచి వచ్చే ఊటనీటినే భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఈ నీటిని స్నానం చేసే నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే కలరా, మశూచి, గజ్జి, తామర వంటి వ్యాధులు సమసిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ నీటితో ఇళ్లను శుద్ధిచేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని వారి నమ్మకం. ప్రతి ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం నాడు ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడురోజుల పాటు జరిగే ఈ కల్యాణోత్సవాలుంటాయి. ఎదుర్కోలు, కల్యాణం, రథోత్సవం అనే మూడు దశలుగా సాగే ఈ కార్యక్రమంలో రథోత్సవం నేత్రపర్వంగా సాగుతుంది.

Friday, September 7, 2018

Sri Krishna Mandir - Udipi

Sri Krishna Mandir - Udipi

Image result for Sri Krishna Mandir - Udupi

:blossom::herb:శ్రీ కృష్ణ మందిరం - ఉడిపి:blossom::herb:


*శ్రీ కృష్ణుని విషయానికి వస్తే నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు* ఇవి ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్ లోని మధుర,
గుజరాత్ రాష్ట్రంలో ద్వారక,
దక్షణ భారత దేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి.

ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన జ్ఞానజ్యోతి శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యులవారి జననం, జీవితం ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడిపితో సంబంధించి ఉన్నది.

ఒకరోజు శ్రీ మధ్వాచార్యులవారు వేకువ జామునే సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి ప్రాతః సంధ్యాదికాలు ముగించుకుని ఆ తీరంలోనే కూర్చుని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. ఒక దీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు ఏదో పర్వదినం కావటంతో అనేకమంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు. ప్రశాంతమైన ప్రాతఃకాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించటానికి అనువైన సమయం.

అలాంటి నేపధ్యంలో శ్రీ మధ్వాచార్యులవారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రం లోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చెశారు. ఆరో అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇంతలో.... సముద్రంలో ద్వారక నుంచి సరుకులు తీసుకు వస్తున్న ఒక నౌక తీరం వెంట వెళుతూండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి.

ఈ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకున్నది. దానిని రక్షించుకోవటానికి అందులోని నావికుల ప్రయత్నాలు ఫలించటంలేదు. క్రమంగా నౌక లోకి నీరు చేరటం ఆరంభమయింది.

ఇక ఏ క్షణాన్నైనా మునిపోవటానికి సిద్ధంగా ఉన్నది. నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి తీరం వైపు చూస్తూ రక్షించేవారి కోసం ప్రార్ధన చేయటం మొదలుపెట్టాడు. అంత దూరాన్నుంచి కూడా ఒడ్డుపై నిశ్చలంగా కూర్చుని రచన చేసుకుంటున్న తేజస్వి ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయనను ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్ధించ సాగాడు.

ద్వాదశ స్తోత్ర రచనలో లీనమై ఉన్నప్పటికీ, అంతటి హోరు గాలిలోనూ, అంత దూరాన్నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల చెవిని తాకింది. అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం ఒక కొసను పట్టుకుని గాలిలో నావ కేసి విసిరి వెనక్కు తీసుకున్నారు.

అంతే! ఆ క్షణం వరకూ సముద్రంలో మునిగిపోతుందా అన్నట్టున్న నౌక ఒక్కసారిగా స్తబ్ధతకు వచ్చింది. ఎవరో తాళ్ళు పట్టి లాగినట్టుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది. నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు.

అంతకు మునుపు ప్రార్ధన చేసిన వ్యాపారి వడివడిగా మధ్వాచార్యులవారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక విధాలుగా స్తుతించాడు.

అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి “స్వామీ, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరున్నదేదైనా సరే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి. అని అనేక విధాల ప్రాధేయ పడ్డాడు.

మధ్వాచార్యులవారు చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికను మన్నించారు. “అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు, నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు ఈయగలవా?” అన్నారు. వ్యాపారి ఆశ్చర్య పోయాడు.

ఎందుకంటే, గోపీ చందనం ద్వారకలో ఎక్కడపడితే అక్కడ దొరికే మట్టి. పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడూ దించేటప్పుడూ బరువు సమతూకం తప్పిపోకుండా గోపీ చందనం గడ్డల సాయంతో నౌకలో సరుకును అటూ ఇటూ సర్దుతూ ఉంటారు.

అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు ఈ మహానుభావుడు కోరటం ఆ వ్యాపారికి సుతరామూ నచ్చలేదు. ఎంత ప్రార్ధించినా మధ్వాచార్యులవారు తాను కోరిన గోపీ చందనానికి మించి మరే బహుమతినీ తీసుకోవటానికి అంగీకరించలేదు. చివరికి ఆ వ్యాపారి, స్వామి కోరిన ఆ గోపీచందనం గడ్డలనే ఇవ్వటానికి సిద్ధపడి, అవే కోరటం లోని పరమార్ధమేమిటో, ఆ మట్టిగడ్డల మహిమా విశేషాలేమిటో కనీసం అవయినా తెలుపమని ప్రార్ధించాడు.

స్వామి మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ “నువ్వే చూడు” అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తూ ఉండగా నీటితో కరిగించారు.
అద్భుతం...
ఒక గడ్డ నుంచి బలరాముని విగ్రహం,
రెండవ దాని నుంచి శ్రీ కృష్ణుని విగ్రహం
బయట పడ్డాయి. అక్కడ ఉన్న వారందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు.

శ్రీకృష్ణ విగ్రహ దర్శనం తోనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రం లోని ఆరవ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు. ఇక బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించి శ్రీకృష్ణుని విగ్రహం తీసుకుని ఉడుపికిప్రయాణమయ్యారు.

శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. అమృతరూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి.

ఇంతకీ శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం ఏమిటి. వాస్తవానికి జరిగిందేమిటి? ఈ కథ మరింత ఆసక్తిగా ఉంటుంది. ఆ శ్రీకృష్ణుని విగ్రహం సామాన్యమైనది కాదు. ఒకసారి దేవకీదేవి “కృష్ణా నీ బాల్య లీలలు చూసే భాగ్యం యశోదకు కలిగినట్టుగా నాకు కలుగలేదు. వాటి గురించి వినీ వినీ ఎప్పటికైనా చూడాలని నా మనస్సు ఉవ్విళ్ళూరుతోం
ది. చూపించవా కృష్ణా” అని ప్రార్ధించిందట. కృష్ణుడు అనుగ్రహించాడు.

మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడుగా మారిపోయాడు. తప్పటడుగులు వేస్తూ నడిచాడు. దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్థన్యాన్ని త్రాగాడు. కేరింతలు కొట్టాడు. కుండ పగులగొట్టి వెన్న తిన్నాడు. వంటినిండా రాసుకున్నాడు. పామును తాడు లాగా పట్టుకుని మజ్జిగ చిలికినట్టు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు.

ఈ చేష్టలను చూసే దేవకీదేవి పరవశించి మైమరచిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుడి శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని బావించి వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో శైశవ కృష్ణుని, బలరాముల విగ్రహాలు చేయించింది.

ముందుగా తానే సకల వైభవాలతో ఆ విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది. మరికొంత కాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమయింది. దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో స్థాపించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు.

కాలక్రమంలో అ వనం యావత్తూ గోపీ చందనం మట్టిలో కలిసి కనుమరుగై పోయింది. నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించటం కోసం గోపీచందనం గడ్డల్నిమోసుకెళ్ళే అలవాటు ప్రకారం, కాకతాళీయంగా ఈ విగ్రహాలున్న గోపీచందనం గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు. వాటి విలువ తెలియకుండానే ఆ గడ్డల్ని తీసుకెళ్ళే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది.

ఆ విగ్రహం ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యుల దివ్య దృష్టికి ముందే తెలుసు. ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ ఆ విగ్రహాలను ఆహ్వానించటానికే ఆయన ఆరోజు ఆ తీరానికి వెళ్ళారు.

ఆ శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యులచేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు. తరువాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యులు అభిషేకించిన తరువాత ముప్ఫై మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు! ఎందుకంటే, మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది.

మంత్ర విధులతో మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ విగ్రహాన్ని విళంబి నామ సంవత్సరం మాఘ శుక్ల తదియ నాడు (క్రీ.శ.1236) ఉడుపిలో ప్రతిష్టింప జేశారు. ఆనాటి నుంచీ ఉడుపి ప్రాంత యాజ్ఞీకులందరూ మధ్వాచార్యులు అవలంబించిన విధానాలనే అనుసరిస్తున్నారు.

శ్రీ కృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా తన ఎనిమిది మంది శిష్యులచే నిర్వహింపబడేట్టుగా పెజావరు మఠం..
పుట్టిగే,
పాలిమరు,
ఆడమారు,
సోదే,
కాణియూరు,
శిరూర్,
కృష్ణపురా
అనే ఎనిమిది మఠాలనూ శ్రీ మధ్వాచార్యులు ఏర్పరచారు. వీటిని అష్ట పీఠాలు అంటారు. ఇవన్నీ ఉడుపి కేంద్రం గానే శ్రీ కృష్ణ మఠానికి చుట్టుప్రక్కలే ఉన్నాయి.

ఇదీ సూక్షంగా ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయ చరిత్ర..
:blossom::herb:లోకా సమస్తా..సుఖినో భవంతు..!!:blossom::herb: