Tuesday, November 27, 2018

Self-Purity Debendranath Tagore

Self-Purity 

Debendranath Tagore


Image result for maharshi debendranath

*ఆత్మ స్వచ్ఛత*:blossom::fallen_leaf:°°°°°°°°°°°°°°°°°°°°°°


మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ ధ్యానం చేసేటపుడు వందలకొద్దీ పక్షులు ఆయన సమీపంలోను, ఆయన మీద వాలుతూ ,తుల్లుతూ ఆడుకుంటూ ఉండేవి.... ఆయన యొక్క ఆత్మ స్వచ్ఛత పక్షులు, ఉడుతలు లాంటి జీవులను ఆయనవైపుకు ఆకర్షించేది.
ఒకరోజు ఒక చిన్న బాలుడు ఆయన దగ్గరకొచ్చి తాతగారూ.. నాకు ఒక పక్షిని పట్టి ఇవ్వండి...అని కోరాడు. అందుకు ఆయన " ఉండు నాయనా....నేను ధ్యానం చేసే సమయంలో చాలా పక్షులు వస్తాయి....అప్పుడు నీకొక పక్షిని పట్టిస్తాను అని చెప్పి.. ధ్యానానికి వెళ్ళాడు. ఆశ్చర్యంగా ఒక పక్షి కూడా ఆయన దగ్గర వాలలేదు....ఆ రోజు నుండీ... ఏ పక్షీ ఆయన సమీపంలో వాలకపోవడం గమనించిన ఆయన ఒక పెద్ద పాఠం నేర్చుకున్నాడు.
మనచుట్టూ ఉన్న ప్రకృతికి మనం అనుసంధానం కావాలంటే.....ఆ ప్రకృతి కల్మషం లేకుండా ఎలా స్వచ్చంగా ఉంటుందో...మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీ స్థాయికి ఆత్మ స్వచ్ఛత కల్గి ఉండాలి. ఆయన స్వచంగా ఉన్నంత కాలం పక్షులు ఆయన సమీపంలోకి వచ్చాయి....ఎప్పుడైతే పక్షిని పట్టుకోవాలన్న ఒక చిన్న కల్మషం మనసులో పుట్టిందో....ఆ రోజునుండీ ఆయన ప్రకృతి నుండీ అనుసంధానం తొలగించ బడ్డాడు.
అందుకే ...ఒక్క పక్షీ ఆయన చెంతకు రాలేదు.
*మిత్రమా...సృష్టిలో.. అత్యంత శక్తివంతమైనది ఏమిటంటే.... స్వచ్ఛత. స్వచ్ఛతకు శక్తి ఎక్కువ.*
మనం మన హృదయాలను దివ్యత్వపు ఆలయాలుగా మార్చుకోవడమే స్వచ్ఛతను పొందే మార్గం. మనం ఆత్మ స్వచ్ఛతను పొందిన క్షణం....ఈ సమస్త ప్రకృతిలోని ఎన్నో రహస్యాలు అవగతం అవుతాయి.మనం ప్రకృతితో స్నేహం చెయ్యాలంటే....దాని స్థాయికి చేరుకోగల్గాలి.
*నీవు నీలో దేన్ని కల్గి ఉంటావో....దానినే బయట చూడగలవు.*
*నటించడం... తాత్కాలికం జీవించడం... శాశ్వతం*

Sunday, November 25, 2018

మనం చేసింది పాపమా.. పుణ్యమా..!!

మనం చేసింది పాపమా.. పుణ్యమా..!!

మనం పాపాలు చేసామా..?
పుణ్యాల చేసామా..?

మనలో పాపం ఎక్కువ నిలువ ఉందా? లేదా పుణ్యం ఎక్కువ నిలువ ఉందా? అన్న విషయం ఎలా తెలుస్తుంది? అన్న సందేహం మనకురావచ్చు!

శరీరాలు మూడు రకాలుగా ఉంటాయి.
1. స్థూల శరీరం (సాధారణ భౌతిక శరీరం)
2. సూక్ష్మ శరీరం (కేవలం మనస్సు, బుద్ధిలతో కూడినది)
3. కారణ శరీరం (పాప పుణ్యాల శేష ఫలితాలు బీజరూపకంగా ఉన్న శరీరం)ఇలా మనం చేసిన పాపం ఈ మూడు శరీరాల్లో నిలువ ఉంటుందని శాస్త్రం చెబుతుంది.

మనలో పాపం ఎక్కువ నిలువ ఉందా?
లేదా పుణ్యం ఎక్కువ నిలువ ఉందా?
అన్న విషయం ఎలా తెలుస్తుంది? అన్న సందేహం మనకు రావచ్చు!

దుర్గంధాన్ని బట్టి చెడువస్తువులనూ,
సుగంధాన్ని బట్టి మంచి వస్తువులను అంచనా వేసినట్లు ఈ మూడు శరీర లక్షణాలను బట్టి మనలో నిలువ ఉన్న పాప పుణ్యాలను కూడా అంచనా వేయవచ్చు !

1. స్థూల శరీర లక్షణాలు :
సాధారణంగా స్థూల శరీరలక్షణాలు ఎక్కువగా ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలమీద ఆధారపడి ఉంటాయి.

అ) స్థూల శరీరం పాపరహితంగా పవిత్రంగా ఉంటే తెల్లవారు జామునే మేల్కొంటుంది.
(లేదా తెల్లవారు జామున మేలొన్నా పవిత్రమౌతుంది)

పాపం పెరిగిన కొద్దీ సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తంలోనే గాఢ నిద్ర పట్టడం,
ఆలస్యంగా నిద్రలేవడం ఎక్కువౌతుంది.

ఉదా : ఈ ప్రపంచంలో పాపం అంటే తెలియని స్థితిలో ఉన్న శిశువులు కానీ,
పాప రహితులైన మహాత్ములుగాని తెల్లవారు జామునే మేల్కొటాంరు.
గమనించండీ!

ఆ) స్థూల శరీరం పాప రహితంగా పవిత్రంగా ఉంటే
ఏ మాత్రం బద్ధకం, సోమరితనం లేకుండా ఉపయుక్తమైన ఏ పని చేయడానికైనా సన్నద్ధంగా, ఉత్సాహంగా ఉంటుంది.

ఒకవేళ పాపం పెరుగుతూ ఉంటే
సోమరితనం, బద్ధకం కూడా పెరుగుతాయి. ఉపయుక్తమైన పనులు చేసే విషయంలో శరీరం
ఏ మాత్రం సన్నద్ధంగా ఉత్సాహంగా ఉండదు. నిరుపయోగకరమైన మరియు కాలాన్ని వ్యర్థం చేసే విషయాల్లో ఉత్సాహం, సన్నద్ధత పెరుగుతాయి.

ఈ విషయంలో కూడా పాపం అంటే తెలియని శిశువులనూ,
పాపరహితులైన మహాత్ములను గమనించండీ?
వారు బద్ధకంగా వ్యవహరించింది ఎప్పుడూ కనిపించదు.

ఇ) స్థూల శరీరం పవిత్రంగా ఉంటే నియతిబద్ధంగా, క్రమశిక్షణతో వ్యవహరించడం జరుగుతోంది. పాపంతో అపవిత్రమైనకొద్దీ క్రమశిక్షణ లోపిస్తుంది.

ఈ)  స్థూల శరీరంలో పాపం పెరిగి అపవిత్రమైనకొద్దీ అనవసర ఆహారం, దోష భూయిష్టమైన ఆహారమే తీసుకోవాలనిపిస్తుంది.
లేదా అలా తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. పవిత్రత పెరిగిన కొద్దీ మితాహారం,
ఆరోగ్యాన్ని పవిత్రతను ఇచ్చే ఆహారం తీసుకోవడం జరుగుతుంది.

ఉ)  స్థూలశరీరం అపవిత్రమైనకొద్దీ
అవసరానికి మించి నిద్రించడం జరుగుతుంది. పవిత్రమైనకొద్దీ ఎంత అవసరమో అంతే నిద్రించడం ఉంటుంది.

ఊ) స్థూల శరీరం పవిత్రంగా ఉంటే నిద్ర లేచిన క్షణంలో వెంటనే (కాన్సియస్‌) స్పృహలోకి వచ్చి ఉత్సాహంగా ఉంటారు.
లేదా ఉత్సాహంగా నిద్రలేస్తారు.
నిద్ర లేచిన తర్వాత వారి ముఖం మబ్బు లేకుండా ఫ్రెష్‌గా ఉంటుంది.

పాపంతో అపవిత్రమౌతున్న కొద్దీ నిద్ర లేచిన 10, 15 నిమిషాల వరకు (కాన్సియస్‌) స్పృహలోకి రాలేకపోతారు.
కారణమేమిటంటే ఆత్మతో శరీరానికి బంధం ఎక్కువౌతుంది.

ఇలా స్థూల శరీర లక్షణాలను బట్టి పాప పుణ్యాల నిలువను గుర్తించవచ్చు.

దుర్గంథాన్ని బట్టివాతావరణంలో అపవిత్రతను కలుగజేస్తున్న చచ్చిన ఎలుకను గుర్తించినట్లు
స్థూల శరీర లక్షణాలను బట్టి జీవితంలో వ్యాపించిన అపవిత్రతనూ, పాపాన్ని గుర్తించాలి. దీని వల్లనే శుభాలు వాయిదా పడుతున్నాయని, భవిష్యత్తులో కష్టాలు రావడం వల్ల పాపం ప్రక్షాళన కావలసి వస్తుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి వెంటనే జాగ్రత్తపడి కఠినమైన సాధన వల్ల స్థూల శరీరాన్ని సరియైన విధంగా ఉంచుకోవాలి.
సర్వే జనాసుఖినోభవంతు.

    మహనీయుని మాట
మనం జీవించే దానికి సంపాదించాలి కానీ.....
సంపాదించేందుకు
జీవించకూడదు"...!! మోక్షంగుండం విశ్వేశ్వరయ్య

నేటి మంచిమాట 
మనిషి ఆశ అనే పెనంమీద దోశలేస్తూ ఉంటాడు..
ఒక్క దోశ మాడిందని,
పిండి పారేసుకుంటాడా లేక
 పెనం పగల గొడతాడా..?
రెండూ చెయ్యడు..పెనం
బాగా తుడిచి  మళ్ళీ వేస్తాడు.. అదే విధంగా..
అపజయాలు మాడిన
దోశ లాంటివి....!!! 🙏వేమన

Sunday, September 9, 2018

Role of Arjuna and Karna in Mahabharatham




మహాభారతంలోని రెండు పాత్రలైన కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది...

కర్ణుడు కృష్ణుడుని అడిగాడు...

నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది..

అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే..

ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు..ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో..

పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు..

పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు..

ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది..

ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే..

నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే..

అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు...

దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు...

నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను..

నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది..

నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను..

చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు..

నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను...

నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను..

నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా..

నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు..

మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ..

సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది..

నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు..

నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను..పైగా నన్ను వివాహం చేసుకున్నవారు..వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ..

జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది..

అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది..

సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది...

అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు...పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన...

ఒకటి గుర్తుంచుకో కర్ణా..

జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి..

జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు..

దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే..

ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు..

మనకు ఎంత అన్యాయం జరిగినా..

మనకు ఎన్ని పరాభవాలు జరిగిన..

మనకు రావల్సినది మనకు అందకపోయినా...

మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది..

జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో..అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు...ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు..అని కర్ణునికి క్రృష్ణుడు బోధించాడు..

Friday, September 7, 2018

Sri Krishna Mandir - Udipi

Sri Krishna Mandir - Udipi

Image result for Sri Krishna Mandir - Udupi

:blossom::herb:శ్రీ కృష్ణ మందిరం - ఉడిపి:blossom::herb:


*శ్రీ కృష్ణుని విషయానికి వస్తే నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు* ఇవి ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్ లోని మధుర,
గుజరాత్ రాష్ట్రంలో ద్వారక,
దక్షణ భారత దేశంలో కేరళలోని గురువాయూరు, కర్ణాటకలోని ఉడుపి.

ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు, త్రిమతాచార్యులలో ఒకరైన జ్ఞానజ్యోతి శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యులవారి జననం, జీవితం ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడిపితో సంబంధించి ఉన్నది.

ఒకరోజు శ్రీ మధ్వాచార్యులవారు వేకువ జామునే సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేసి ప్రాతః సంధ్యాదికాలు ముగించుకుని ఆ తీరంలోనే కూర్చుని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. ఒక దీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు ఏదో పర్వదినం కావటంతో అనేకమంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు. ప్రశాంతమైన ప్రాతఃకాలం, భక్తి ప్రపత్తులు ప్రసరించటానికి అనువైన సమయం.

అలాంటి నేపధ్యంలో శ్రీ మధ్వాచార్యులవారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రం లోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చెశారు. ఆరో అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఇంతలో.... సముద్రంలో ద్వారక నుంచి సరుకులు తీసుకు వస్తున్న ఒక నౌక తీరం వెంట వెళుతూండగా అకస్మాత్తుగా విపరీతంగా గాలులు ప్రారంభమయ్యాయి.

ఈ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకున్నది. దానిని రక్షించుకోవటానికి అందులోని నావికుల ప్రయత్నాలు ఫలించటంలేదు. క్రమంగా నౌక లోకి నీరు చేరటం ఆరంభమయింది.

ఇక ఏ క్షణాన్నైనా మునిపోవటానికి సిద్ధంగా ఉన్నది. నావికులందరూ భయాందోళనలకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ముఖ్య వ్యాపారి తీరం వైపు చూస్తూ రక్షించేవారి కోసం ప్రార్ధన చేయటం మొదలుపెట్టాడు. అంత దూరాన్నుంచి కూడా ఒడ్డుపై నిశ్చలంగా కూర్చుని రచన చేసుకుంటున్న తేజస్వి ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయనను ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్ధించ సాగాడు.

ద్వాదశ స్తోత్ర రచనలో లీనమై ఉన్నప్పటికీ, అంతటి హోరు గాలిలోనూ, అంత దూరాన్నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల చెవిని తాకింది. అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం ఒక కొసను పట్టుకుని గాలిలో నావ కేసి విసిరి వెనక్కు తీసుకున్నారు.

అంతే! ఆ క్షణం వరకూ సముద్రంలో మునిగిపోతుందా అన్నట్టున్న నౌక ఒక్కసారిగా స్తబ్ధతకు వచ్చింది. ఎవరో తాళ్ళు పట్టి లాగినట్టుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచింది. నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు.

అంతకు మునుపు ప్రార్ధన చేసిన వ్యాపారి వడివడిగా మధ్వాచార్యులవారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక విధాలుగా స్తుతించాడు.

అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి “స్వామీ, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరున్నదేదైనా సరే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి. అని అనేక విధాల ప్రాధేయ పడ్డాడు.

మధ్వాచార్యులవారు చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికను మన్నించారు. “అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్యమైన వస్తువు, నీ నౌకలో ఉన్న రెండు గోపీ చందనపు గడ్డలు ఈయగలవా?” అన్నారు. వ్యాపారి ఆశ్చర్య పోయాడు.

ఎందుకంటే, గోపీ చందనం ద్వారకలో ఎక్కడపడితే అక్కడ దొరికే మట్టి. పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడూ దించేటప్పుడూ బరువు సమతూకం తప్పిపోకుండా గోపీ చందనం గడ్డల సాయంతో నౌకలో సరుకును అటూ ఇటూ సర్దుతూ ఉంటారు.

అలాంటి గోపీ చందనం మట్టి గడ్డలు ఈ మహానుభావుడు కోరటం ఆ వ్యాపారికి సుతరామూ నచ్చలేదు. ఎంత ప్రార్ధించినా మధ్వాచార్యులవారు తాను కోరిన గోపీ చందనానికి మించి మరే బహుమతినీ తీసుకోవటానికి అంగీకరించలేదు. చివరికి ఆ వ్యాపారి, స్వామి కోరిన ఆ గోపీచందనం గడ్డలనే ఇవ్వటానికి సిద్ధపడి, అవే కోరటం లోని పరమార్ధమేమిటో, ఆ మట్టిగడ్డల మహిమా విశేషాలేమిటో కనీసం అవయినా తెలుపమని ప్రార్ధించాడు.

స్వామి మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ “నువ్వే చూడు” అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తూ ఉండగా నీటితో కరిగించారు.
అద్భుతం...
ఒక గడ్డ నుంచి బలరాముని విగ్రహం,
రెండవ దాని నుంచి శ్రీ కృష్ణుని విగ్రహం
బయట పడ్డాయి. అక్కడ ఉన్న వారందరూ సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు.

శ్రీకృష్ణ విగ్రహ దర్శనం తోనే మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రం లోని ఆరవ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు. ఇక బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్టించి శ్రీకృష్ణుని విగ్రహం తీసుకుని ఉడుపికిప్రయాణమయ్యారు.

శ్రీకృష్ణ ప్రాప్తి తరువాత ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు. అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. అమృతరూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి.

ఇంతకీ శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం ఏమిటి. వాస్తవానికి జరిగిందేమిటి? ఈ కథ మరింత ఆసక్తిగా ఉంటుంది. ఆ శ్రీకృష్ణుని విగ్రహం సామాన్యమైనది కాదు. ఒకసారి దేవకీదేవి “కృష్ణా నీ బాల్య లీలలు చూసే భాగ్యం యశోదకు కలిగినట్టుగా నాకు కలుగలేదు. వాటి గురించి వినీ వినీ ఎప్పటికైనా చూడాలని నా మనస్సు ఉవ్విళ్ళూరుతోం
ది. చూపించవా కృష్ణా” అని ప్రార్ధించిందట. కృష్ణుడు అనుగ్రహించాడు.

మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడుగా మారిపోయాడు. తప్పటడుగులు వేస్తూ నడిచాడు. దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్థన్యాన్ని త్రాగాడు. కేరింతలు కొట్టాడు. కుండ పగులగొట్టి వెన్న తిన్నాడు. వంటినిండా రాసుకున్నాడు. పామును తాడు లాగా పట్టుకుని మజ్జిగ చిలికినట్టు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు.

ఈ చేష్టలను చూసే దేవకీదేవి పరవశించి మైమరచిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుడి శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని బావించి వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో శైశవ కృష్ణుని, బలరాముల విగ్రహాలు చేయించింది.

ముందుగా తానే సకల వైభవాలతో ఆ విగ్రహాలను స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది. మరికొంత కాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమయింది. దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో స్థాపించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు.

కాలక్రమంలో అ వనం యావత్తూ గోపీ చందనం మట్టిలో కలిసి కనుమరుగై పోయింది. నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించటం కోసం గోపీచందనం గడ్డల్నిమోసుకెళ్ళే అలవాటు ప్రకారం, కాకతాళీయంగా ఈ విగ్రహాలున్న గోపీచందనం గడ్డల్ని కూడా నౌకలోకి చేర్చారు. వాటి విలువ తెలియకుండానే ఆ గడ్డల్ని తీసుకెళ్ళే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది.

ఆ విగ్రహం ఆ నౌకలో వస్తోందని మధ్వాచార్యుల దివ్య దృష్టికి ముందే తెలుసు. ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ ఆ విగ్రహాలను ఆహ్వానించటానికే ఆయన ఆరోజు ఆ తీరానికి వెళ్ళారు.

ఆ శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యులచేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు. తరువాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యులు అభిషేకించిన తరువాత ముప్ఫై మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు! ఎందుకంటే, మధ్వాచార్యుల అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది.

మంత్ర విధులతో మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ విగ్రహాన్ని విళంబి నామ సంవత్సరం మాఘ శుక్ల తదియ నాడు (క్రీ.శ.1236) ఉడుపిలో ప్రతిష్టింప జేశారు. ఆనాటి నుంచీ ఉడుపి ప్రాంత యాజ్ఞీకులందరూ మధ్వాచార్యులు అవలంబించిన విధానాలనే అనుసరిస్తున్నారు.

శ్రీ కృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా తన ఎనిమిది మంది శిష్యులచే నిర్వహింపబడేట్టుగా పెజావరు మఠం..
పుట్టిగే,
పాలిమరు,
ఆడమారు,
సోదే,
కాణియూరు,
శిరూర్,
కృష్ణపురా
అనే ఎనిమిది మఠాలనూ శ్రీ మధ్వాచార్యులు ఏర్పరచారు. వీటిని అష్ట పీఠాలు అంటారు. ఇవన్నీ ఉడుపి కేంద్రం గానే శ్రీ కృష్ణ మఠానికి చుట్టుప్రక్కలే ఉన్నాయి.

ఇదీ సూక్షంగా ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయ చరిత్ర..
:blossom::herb:లోకా సమస్తా..సుఖినో భవంతు..!!:blossom::herb:

Importance of Sri Krishnashtami


Related image


శ్రీ కృష్ణాష్టమి

శ్రావణమాస బహుళ ఆష్టమి వేళ రాత్రి 12 గంటల సమయంలో దేవకీవసుదేవుల 8 సంతానంగా మధురలో కారాగారంలో అవతరించారు శ్రీ కృష్ణ పరమాత్మ. శ్రీ కృష్ణ పరమాత్మ జాతక చక్రంలోని గ్రహగతులని ఆధారంగా చేసుకుని ఈనాటి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పుకోవలసి వస్తే క్రీస్తు పూర్వం 3228, 21 జూలైన అవతరించారు. ద్వాపరయుగాంతంలో ఈ భూమి పైన నడయాడిన యుగ పురుషుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి జీవితమే ఒక సందేశం.

నారయణుడు, నారాయణి(పార్వతీ దేవి) అన్నాచెళ్లెలు. ఇద్దరు ఎప్పుడూ కలిసే జన్మిస్తారు. కృష్ణుడు ఇక్కడ మధురలో దేవకివసుదేవులకు జన్మిస్తే, పార్వతీదేవి యోగమాయగా యశోదా నందులకు అదే సమయంలో జన్మించింది. తాత్వికంగా అర్దం చేసుకుంటే మధ్ర అంటే మంచి ఆలోచనలున్న మనసు. అటువంటి మంచి, పవిత్ర ఆలోచనలున్న మనసులు కలవారికి మాత్రమే పరమాత్మ దర్శనమిస్తాడని అర్దం. ఆయన పుట్టగానే వసుదేవుడు వసుదేవుడి కాళ్ళకు, చేతులకున్న సంకెళ్ళు తెగిపొయాయి. పరమాత్మ దర్శనం కలిగితే కర్మబంధాలు వాటంతట అవే తొలగిపోతాయని చెప్తుంది ఈ సంఘటన. కంసుడి కోటలో ఉన్న అందరిని మాయ కమ్మి స్పృహ కోల్పోయారు.

ఆయన్ను వసుదేవుడు యమున దాటించి రేపల్లెకు చేర్చాలి, కాని యమున ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ప్రవాహం ఆగదు.ఆగకూడదు. అందులోనా యమున యముడి చెల్లెలు.యముడు కాలానికి సంకేతం.యమున కూడా అంతే. అటువంటి యమున వసుదేవుడు పసి కందైన శ్రీ కృష్ణునితో పాటు దాటడానికి మార్గం ఇచ్చింది, తన ప్రవాగాన్ని ఆపివేసింది, అంటే కాలం కూడా ఆ పరమాత్మకు లొబడి ఉంటుందని,ఆయన కనుసన్నల్లో కాలం కూడా ఉంటుందని అర్దం చేసుకోవాలి. అంతేకాదు, నదిని సంసారానికి సంకేతంగా భావిస్తే, ఎవరు తమ నిత్య జీవితంలో పరమాత్ముడిని గుండేల్లో పెట్టుకుంటారో, వారు ఈ సంసారమనే మహాప్రవాహాన్ని సులువుగా దాటగలరని అర్దం. కృష్ణుడు రేపల్లెకు చేరాడు. రేపల్లేలో జనం అమాయకులు, భగవద్భక్తి కలవారు, శాంతస్వభావులు. ఎక్కడ పరజులు ధర్మ మార్గంలో జీవిస్తూ పరోపకార బుద్ధితో బ్రతుకుంతుంటారో అక్కడికి పరమాత్మ తానే వెళతాడని అందులో అంతరార్ధం. ఈ విధంగా కృష్ణకధలో ప్రతి సంఘటనలో ఎంతో తత్వం దాగి ఉంది.

Saturday, July 14, 2018

Secunderabad Bonalu Lasker Bonalu Bonala Panduga Mahankali Jatara Secunderabad


Secunderabad Bonalu
Lasker Bonalu
Bonala Panduga
Mahankali Jatara Secunderabad

బోనాలు

Image result for mahankali jatara

బోనాలు అమ్మవారు ని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది.
ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.

ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.

పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.

పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.

బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.

తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది.

బోనాల పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది

చరిత్ర History

కాకతీయుల కాలం నుంచే బోనాల వేడుకలు వున్నట్టు తెలుస్తోంది. కాకతి దేవత ఎదుట అన్నాన్ని కుంభంగా పోసి సమర్పించేవారు. అనంతరం గోల్కొండ నవాబుల కాలంలో ఈ ఉత్సవాలు ప్రసిద్ధి చెందాయి.హైదరాబాద్‌ నగరంలోని గోల్కోండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయంలో ఆషాఢమాసం మొదటి గురువారంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఆషాఢమాసమంతా ప్రతి గురు, ఆదివారాలు మహంకాళి ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు. ఏటా జరిగే బోనాల ఉత్సవాలు సమైక్య జీవనానికి ప్రతీకగా నిలుస్తాయి

పోతురాజు

Image result for పోతురాజు bonalu
.బోనాల సంధర్భంగా అమ్మవారి ఊరేగింపు. వనస్థలిపురం
దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.

అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.

విందు సంబరాల

బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది.

పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం విస్పష్టంగా ప్రస్ఫుటమౌతుంది.

రంగం

రంగం, లేక పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ విక్రుతమైన కొపాని తగ్గించెందుకు అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పొతరాజు తన దంతాలతో ఆ మేక పోతును కొరికి, తల, మోండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు(గావు పెట్టడం). ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది.

బోనం

Image result for bonam
బోనాలు : భోజనం ఫ్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నులపండువగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలుకట్టివ్యాధి నిరోధకశక్తిని
పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.

ఘటం

Image result for ఘటం bonalu
అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటి పై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు.

ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతోఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది.

లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.

ఓల్డ్‌సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న మాదన్న, లాల్‌దర్వాజా, ఉప్పుగూడ, మిరాలం మండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా మరియు సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం మరియు చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి.

ఆషాఢమాసం బోనాలు

ఆషాఢమాసం రోగాలకు నిలయం వైశాఖమాసం, జ్యేష్ఠమాసం పూర్తయ్యేసరికి మామిడిపంట పూర్తవుతుంది. ఆ మామిడి చెట్లల్లో తిరిగే ఈగలు పంట కాలం అయిపొయేసరికి, ఈగలు ఊర్లో స్వైరవిహారం చేస్తుంటాయి. వాటివలన నానా రోగాలు వస్తుంటాయి.
కలరా లాంటి అంటువ్యాధులు, తీవ్రజ్వర నివారణకు శీతలాదేవి పోచమ్మని గ్రామదేవతలని ఆరాధించడం మన సనాతన సంప్రదాయం.
బోనం అనగా నైవేద్యం అర్పింపబడేటువంటి నైవేద్యాన్ని ఘటములో వేసుకుని దానిపైన దీపం పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి వెళ్లి ఆరాధిస్తారు. కొన్ని వర్ణాల్లో బోనం ఎత్తుకోవడం సాంప్రదాయం లేకపోయినా, అమ్మని ఆరాధించి నైవేద్యం అర్పించి ఆశీస్సులు తీసుకోవడం ఆచారంగా వస్తున్నది.

ఆషాఢ మ్మరుదెంచ వచ్చితివి నిండౌ ప్రేమతో మాకు సం-
తోషమ్మీయగ పుట్టినింటికిని తోడ్తో దెచ్చుచున్ సంపదల్
శేషమ్మింతయు లేక మా యిడుమలన్ చీకట్ల పో ద్రోలవే
హే షట్పత్రసరోరుహస్థిత! పరా! హ్రీంకారి! బోనాలివే.

Secunderabad Bonalu
Lasker Bonalu
Bonala Panduga
Mahankali Jatara Secunderabad