Saturday, June 9, 2018

What is real Prayer?

What is real Prayer?


ఒక అద్భుతమైన కథ...!
""""""""""""""""""""""""""స్టీఫెన్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్, వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు.రెండూ గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.కాన్‌ఫరెన్సుకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒకా కారు అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు. మళ్ళి కొంతసేపు అయిన తరువాత, విపరీతమైన గాలివాన, వర్షం . . .దానితో ఈ వాతావరణంలో ముందుకు సాగలేకఆగిపోయాడు. భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే చికాకులతో ఉన్నాడు ఆ డాక్టరు, కొంతదూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అనుకున్న ఆ డాక్టరుకు ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు లేవు అని, బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమని, వెచ్చగా ఉండేందుకు టీ, కొంత ఆహారం తేబుల్ మీద పెట్టి తను ప్రార్ధన చేసుకోవడానికి వెళ్ళింది.
ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నా, ఆమె ప్రార్ధనలు ఎంతకీ పూర్తి అవటం లేదు. ఎట్టకేలకు ఆమె ప్రార్ధనలు ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు ఆమె చేసిన ప్రార్ధనలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు.
ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు ఒక్కటి తప్ప, ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది.ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని, తాను సాధ్యమైనంత సహాయపడతానని చెప్పాదు వైద్యుడు. ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది.
"ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు. అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది. ఎంతో మంది వైద్యులకు చూపించాము. ఎవ్వరూ నయం చేయలేకపోయారు. ఒక్క స్టీఫెన్ అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు, ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు. అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి, భగవత్ ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నాను అని చెప్పింది.వింటున్న డాక్టరు కళ్ళల్లో నీళ్ళు "భగవంతుడు దయామయుడు. ఆయన మీ ప్రార్ధనలు వినడమే కాదు, ఆ డాక్టరును మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా. విమానం పాడయ్యి గాలివానలో చిక్కుకుని నేను మీ ఇంటికి వచ్చాను. కాదు కాదు ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు. ఆ డాక్టర్ స్టీఫెన్ ను నేనే." అని బదులిచ్చాడు.
అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు.

ప్రార్ధన లోని మహత్యం అదే. మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే.
1.అడగడం, 2. నమ్మడం, 3.అందుకోవడం...ఇవే ప్రార్ధనకు కావలసిన అంశాలు.
భగవంతుని నమ్మి మనం ప్రార్ధిస్తే, మనకు కావలసినది ఆయన తప్పక మనకు లభింపచేస్తాడు.....


What is real Prayer?

Thursday, June 7, 2018

Kolkur Sada Shivalayam Temple


Kolkur Sada Shivalayam Temple
Kolkur, Sadasivapet

Kolkur Sada Shivalayam Temple

Friday, June 1, 2018

దేవుడున్నాడా?? – గౌతముడి అద్భుత సమాధానం…!!





దేవుడున్నాడా?? – గౌతముడి అద్భుత సమాధానం…!!

సద్గురు

దేవుడు ఉన్నాడా లేదా అన్న ప్రశ్నకి గౌతమ బుద్ధుడి సమాధానం మనల్ని ఆలోచించేలా చేస్తుంది. ఇంతకీ బుద్ధుడు సమాధానమేంటి? ఎందుకలా ఇచ్చాడో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

మీరు గౌతమ బుద్ధుడి గురించి విన్నారా..? ఒకసారి గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కూర్చొని ఉన్నాడు. అది తెల్లవారు ఝామున…సూర్యుడు ఇంకా ఉదయించలేదు. ఇంకా చీకటిగానే ఉంది. అక్కడికి ఒక మనిషి వచ్చి నిలుచున్నాడు. అలా మూలగా నీడ చాటుగా నిలుచున్నాడు. ఆయన రాముడికి గొప్ప భక్తుడు.
భక్తులు వాళ్ళు జీవితాల్లో ఏమి చేసినా సరే ప్రతిదానిని రాముడిగానే మార్చేస్తారు. వాళ్ళు భగవంతుడి నామం తప్ప మరొకటి ఉచ్చరించరు. మిమ్మల్ని రమ్మని చెప్పాలంటే రామ-రామ అంటారు. మిమ్మల్ని వెళ్ళమని చెప్పడానికి కూడా రామ-రామ అంటారు. వాళ్ళకి ఏమి కావాలన్నా సరే రామ-రామ అంటారు. వారు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలని అనుకుంటే రామ-రామ అంటారు. వాళ్ళు ఏమి చేసినా సరే, రాముడు మాత్రమే..! రాముడు తప్ప మరేదీ లేదు. వాళ్ళు భాగవన్నామం తప్ప ఇంకేదీ ఉచ్చరించరు. ఈ మనిషి భగవంతుడిని ఎంతో గంభీరంగా తీసుకున్నాడు. ఆయన జీవితంలో కేవలం రాముడే. మరొకటి లేదు.
అసలు భగవంతుడు ఉన్నాడా..? అని. గౌతముడు ఈ మనిషిని చూసి, “లేడు” అని నిక్కచ్చిగా చెప్పారు.
సరే..! వయసు మీద పడిపోతుంది. ఇప్పుడాయనకు ఒక సంశయం కలిగింది. ఒకవేళ భగవంతుడు లేడనుకో అప్పుడు నా జీవితమంతా రామ-రామ అని అంటూ వృధా అయిపోతుంది కదా….? ఆయనకి భగవంతుడు ఉన్నాడని తెలుసు. ఆయన ఆలయాలను కూడా నిర్మించారు. అయినా..ఎక్కడో ఒక చిన్న సంశయం. ఆయన దానిని తేల్చుకోవాలనుకున్నాడు. ఇప్పుడు, ఇక్కడ ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఉన్నారు. అందుకని ఈయనని, ఆ విషయం అడగడం కోసం ఇక్కడికి వచ్చి అలా చాటుగా నిలుచుని ఈ ప్రశ్న అడిగాడు. అసలు భగవంతుడు ఉన్నాడా..? అని. గౌతముడు ఈ మనిషిని చూసి, “లేడు” అని నిక్కచ్చిగా చెప్పారు. ఈ మాట వినేసరికి శిష్యులందరూ కూడా “ష్..హమ్మయ్య.. ఎంత పెద్ద ఉపశమనం” అనుకున్నారు. నిజంగానే ఎంతో పెద్ద ఉపశమనం కదా..? మొట్టమొదటి సారి బుద్ధుడు ఖచ్చితంగా భగవంతుడు లేడని చెప్పారు. అంతటా సంతోషం నిండిపోయింది. ఒకసారి ఊహించుకోండి, భగవంతుడు లేడు అంటే ఎంత స్వేచ్చ..! మీ జీవితమంతా మీదే. అంతా సంతోషంతో నిండిపోయింది. సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు. సరే, సాయంత్రం అందరూ మళ్ళీ గొప్ప ఆనందంతో సమావేశం అయ్యారు.
మరో మనిషి ఇలా వచ్చి మూలలో వెళ్ళి నిలుచున్నాడు. ఇతను ఒక చార్వాకుడు. మీరు, చార్వాకులగురించి విన్నారా..? చార్వాకులంటే పూర్తిగా లౌకికవాదులు. వాళ్ళు దేనినీ పూర్తిగా చూస్తే తప్ప నమ్మరు. ఈ చార్వాకుడు ఎంత గొప్ప నిపుణుడు అంటే, మీరు ఏ నమ్మకానికి చెందినవారైనా, మీరాయనతో కనుక పది నిముషాలు మాట్లాడితే, ఆయన మీకు, “భగవంతుడు లేడు” అని నిరూపించగలడు. ఎన్నో వేల మంది ప్రజలకు ఈయన “దేవుడు లేడు..దేవుడు లేడు….” అని నిరూపించాడు. ఆయనికి వయసు మీద పడుతోంది. ఒక సంకోచం వచ్చింది. “ఒకవేళ దేవుడు ఉంటే..” అనే సంశయం కలిగింది..! ఒకవేళ దేవుడు ఉంటే, ఈ దేవుడిని నమ్మేవాళ్ళందరూ – ఒక నరకం ఉంటుంది, అక్కడ చాలా హింసలు పెడతారు అని చెబుతారు. ఒకవేళ నేను గనక అక్కడికి వెళితే, నేను దేవుడు లేడు..అని చెబుతున్నాను కాబట్టి, ఆయన నన్ను ఊరికే వదిలేస్తాడా..? అన్న ఒక చిన్న సంశయం వచ్చింది. దానిని నిర్ధారణ చేసుకోవాలనుకున్నాడు.
నేను భగవంతుడు ఉన్నాడని నమ్మవచ్చు లేదా లేడనీ నమ్మవచ్చు.
సరే..! ఇక్కడ ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఉండడంతో ఈయన వచ్చి బుద్ధుడిని ఆ ప్రశ్న అడిగాడు, “అసలు భగవంతుడు ఉన్నాడా..? “ అని. గౌతముడు ఆయనని చూసి “ఔను ” అన్నాడు. మళ్ళీ శిష్యులందరూ ఒక రకమైన అయోమయంలో పడిపోయారు. పొద్దున్న ఈయన లేరు – అని చెప్పారు. అప్పుడు ఎంతో ఆనందం నిండిపోయింది. ఇప్పుడు ఉన్నాడు అంటున్నారు. ఈయన ఏమైనా ఆట ఆడుతున్నాడా..? అనుకున్నారు. నిజానికి మీరు ఒక విషయాన్ని నమ్మినా, నమ్మకపోయినా….నేను నమ్మవచ్చు. నేను భగవంతుడు ఉన్నాడని నమ్మవచ్చు లేదా లేడనీ నమ్మవచ్చు. ఈ రెండూ, రెండు ప్రత్యేకమైన స్థానాలు కావు. రెండిటిలోనూ మీరు, దేనినో నమ్ముతున్నారు. మీకు నిజమేమిటో తెలియదు. మీ సమస్య ఏమిటంటే మీకు తెలియనిది, “నాకు తెలియదు” అని ఒప్పుకునేంత నిజాయతీ మీలో లేకపోడమే..!! అదే మీ సమస్య. ఔనా..? కాదా..?
మీరు నిజంగా ఏదైనా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, మొట్టమొదటి అడుగు ఏమిటంటే, మీకు తెలియనిది మీకు తెలియదు అని చూడగలగడం. ఒకసారి మీరు నాకు తెలియదు అని చూడగలిగిన తరువాత మీకు తెలుసుకోవాలి అని ఆకాంక్ష కలుగుతుంది. ఈ తృష్ణ వచ్చిన తర్వాత, నిజంగా మీకు తెలియనిది ఏదో తెలుసుకోవడం – అన్నది జరగవచ్చు. ఔనా ..? కాదా ..? మీకు ఏదైతే తెలియదో, దానిని మీరు నమ్మారనుకోండి..మీరు ఆ తృష్ణని పాడు చేసుకుంటున్నట్లే..! “నాకు తెలియదు” అనే విషయాన్ని తెలుసుకోవడం ఎంత శక్తివంతమైనదో, ఎంత గొప్పదో మీకు తెలియడం లేదు. మీ సమస్య అంతా అదే..! దీని గురించి మంచి విశ్లేషణ మంచి సత్సంగం చేయాలని కోరుచున్నాను గురుభ్యోనమః గురుభ్యోనమః:pray::pray::pray::pray::pray:

11 Wonders of Jharkhand


11 Wonders of Jharkhand


11 Wonders of Jharkhand

11 Wonders of Jharkhand

Tanuvu Shubram Manasu Bhadram

Tanuvu Shubram Manasu Bhadram


Tanuvu Shubram Manasu Bhadram

Every one Makes Mistakes


Every one Makes Mistakes

Every one Makes Mistakes