Saturday, July 14, 2018

Secunderabad Bonalu Lasker Bonalu Bonala Panduga Mahankali Jatara Secunderabad


Secunderabad Bonalu
Lasker Bonalu
Bonala Panduga
Mahankali Jatara Secunderabad

బోనాలు

Image result for mahankali jatara

బోనాలు అమ్మవారు ని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు మరియు తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకోబడుతుంది.
ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుపుకుంటారు. పండుగ మొదటి మరియు చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు.

భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు)తో అలంకరించి, దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.

ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.

పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.

పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.

బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవీ అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసము; మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించు సమయములో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.

తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెలను (కాగితమూ, కర్రలతో కూర్చబడిన చిన్న రంగుల పరికరము) సమర్పించడం ఆచారంగా ఉంది.

బోనాల పండుగ సందోహం గోల్కొండ కోట లోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది

చరిత్ర History

కాకతీయుల కాలం నుంచే బోనాల వేడుకలు వున్నట్టు తెలుస్తోంది. కాకతి దేవత ఎదుట అన్నాన్ని కుంభంగా పోసి సమర్పించేవారు. అనంతరం గోల్కొండ నవాబుల కాలంలో ఈ ఉత్సవాలు ప్రసిద్ధి చెందాయి.హైదరాబాద్‌ నగరంలోని గోల్కోండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయంలో ఆషాఢమాసం మొదటి గురువారంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఆషాఢమాసమంతా ప్రతి గురు, ఆదివారాలు మహంకాళి ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు. ఏటా జరిగే బోనాల ఉత్సవాలు సమైక్య జీవనానికి ప్రతీకగా నిలుస్తాయి

పోతురాజు

Image result for పోతురాజు bonalu
.బోనాల సంధర్భంగా అమ్మవారి ఊరేగింపు. వనస్థలిపురం
దేవీ అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటాడు; ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జెలు కలిగి, చిన్న ఎర్రని ధోతీని ధరించి డప్పువాయిద్యానికి అనుగుణంగా ఆడతాడు.

అతను భక్త సమూహము ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తాడు. అతను పుజాకార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడాతాడు. కొరడాతో బాదుకొంటూ, వేపాకులను నడుముకు చుట్టుకుని, అమ్మవారి పూనకములో ఉన్న భక్తురాండ్రను ఆలయములోని అమ్మవారి సమక్షానికి తీసుకెళతాడు.

విందు సంబరాల

బోనాలు పండుగ దేవికి నైవేద్యము సమర్పించు పండుగ కావడం చేత, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలౌతుంది.

పండుగ జరిగే ప్రాంతాలలో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైకుసెట్ల హోరులో పండుగ వాతావణం విస్పష్టంగా ప్రస్ఫుటమౌతుంది.

రంగం

రంగం, లేక పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఆ విక్రుతమైన కొపాని తగ్గించెందుకు అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పొతరాజు తన దంతాలతో ఆ మేక పోతును కొరికి, తల, మోండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు(గావు పెట్టడం). ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది.

బోనం

Image result for bonam
బోనాలు : భోజనం ఫ్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నులపండువగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలుకట్టివ్యాధి నిరోధకశక్తిని
పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవతల ఆలయాలకు తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.

ఘటం

Image result for ఘటం bonalu
అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటి పై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు. పండుగ మొదటి రోజు నుండి, చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పుల మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు.

ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయము వారి ఘటముతోఏనుగు అంబారీపై, అశ్వాల మధ్య, అక్కన్న, మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలయ్యి సాయంత్రానికి కన్నుల పండుగగా నయాపుల్ వద్ద ఘటముల నిమజ్జనతో ముగుస్తుంది.

లాల్‌దర్వాజా నుండి నయాపుల్ వరకు వీధుల వెంబడి వేలాదిమంది ప్రజలు నిలుచుని రంగ రంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు, వివిధ పౌరాణిక వేషధారణలలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపదగీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు.

ఓల్డ్‌సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిబౌలి అక్కన్న మాదన్న, లాల్‌దర్వాజా, ఉప్పుగూడ, మిరాలం మండీ, కాసరట్టలలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్‌షాహీలోని జగదాంబాలయం, షాలిబండ, అలీజా కోట్లా, గౌలీపురా మరియు సుల్తాన్‌షాహీలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, ఆలియాబాదులోని దర్బారు మైసమ్మ మందిరం మరియు చందూలాల్ బేలాలోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి.

ఆషాఢమాసం బోనాలు

ఆషాఢమాసం రోగాలకు నిలయం వైశాఖమాసం, జ్యేష్ఠమాసం పూర్తయ్యేసరికి మామిడిపంట పూర్తవుతుంది. ఆ మామిడి చెట్లల్లో తిరిగే ఈగలు పంట కాలం అయిపొయేసరికి, ఈగలు ఊర్లో స్వైరవిహారం చేస్తుంటాయి. వాటివలన నానా రోగాలు వస్తుంటాయి.
కలరా లాంటి అంటువ్యాధులు, తీవ్రజ్వర నివారణకు శీతలాదేవి పోచమ్మని గ్రామదేవతలని ఆరాధించడం మన సనాతన సంప్రదాయం.
బోనం అనగా నైవేద్యం అర్పింపబడేటువంటి నైవేద్యాన్ని ఘటములో వేసుకుని దానిపైన దీపం పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి వెళ్లి ఆరాధిస్తారు. కొన్ని వర్ణాల్లో బోనం ఎత్తుకోవడం సాంప్రదాయం లేకపోయినా, అమ్మని ఆరాధించి నైవేద్యం అర్పించి ఆశీస్సులు తీసుకోవడం ఆచారంగా వస్తున్నది.

ఆషాఢ మ్మరుదెంచ వచ్చితివి నిండౌ ప్రేమతో మాకు సం-
తోషమ్మీయగ పుట్టినింటికిని తోడ్తో దెచ్చుచున్ సంపదల్
శేషమ్మింతయు లేక మా యిడుమలన్ చీకట్ల పో ద్రోలవే
హే షట్పత్రసరోరుహస్థిత! పరా! హ్రీంకారి! బోనాలివే.

Secunderabad Bonalu
Lasker Bonalu
Bonala Panduga
Mahankali Jatara Secunderabad


పంచపునీతులు Pancapunitulu





పంచపునీతులు

:star: వాక్ శుద్ధి
:star: దేహ శుద్ధి
:star: భాండ శుద్ధి
:star: కర్మ శుద్ధి
:star: మన శుద్ధి

:diamond_shape_with_a_dot_inside: వాక్ శుద్ధి :
వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు .... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు .... మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి .... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి ....

:diamond_shape_with_a_dot_inside: దేహ శుద్ధి :
మన శరీరం దేవుని ఆలయం వంటిది .... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి .... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు ....

:diamond_shape_with_a_dot_inside: భాండ శుద్ధి :
శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి .... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది ....

:diamond_shape_with_a_dot_inside: కర్మ శుద్ధి :
అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు .... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ....

:diamond_shape_with_a_dot_inside: మనశ్శుద్ధి :
మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది .... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది .... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి .... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది .... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...

:fast_forward: ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!
:fast_forward: ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!
:fast_forward: నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!
:fast_forward: యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!
:fast_forward: సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!
:fast_forward: గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!
:fast_forward: సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!
:fast_forward: పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!
:fast_forward: మనిషిలో భక్తి ప్రవేశిస్తే మనిషి మాధవుడు అవుతాడు !!

Thursday, July 5, 2018

An Interesting Story

An Interesting Story



ఓ వ్యక్తి నెలల తరబడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు భగవంతుడిని ఇలా ప్రార్ధిస్తుంటాడు.. “భగవంతుడా. నాకోసం ఒక్క సహాయం చెయ్యి, కేవలం ఒకే ఒక్కటి, ఈ సహాయం తప్ప నాకు ఇంకేమి వద్దు.. నా పూర్తి జీవితంలో ఇక ఎప్పుడు నిన్ను ఏ కోరికా కోరను, ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు”. “ఈ లోకంలో నాకున్న కష్టాలు ఇంకెవ్వరికి లేవు, నా కష్టాలు ఒకే వరంతో తీర్చమని అడిగే అత్యాశ నాకు లేదు, కాని నా కష్టాలను మార్చుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి నా కష్టాలు ఇంకొకరికి ఇచ్చి అతని కష్టాలు నాకివ్వు చాలు (ఎందుకంటే తన కష్టాల కన్నా మిగిలిన వారివి చాలా తక్కువ కష్టాలు అని అతని భ్రమ)..” నాకు ఇంకేమి వద్దు.. ఈ ఒక్క కోరిక తీర్చు..! అని ఆ వ్యక్తి ప్రతిరోజు వేడుకుంటాడు.

నెలల తరబడి ఆ వ్యక్తి అడుగుతున్న కోరిక భగవంతునికి చేరింది.. ఆరోజు రాత్రి భగవంతుడు అతని కలలోకి వచ్చి ఇలా చెప్పాడు. “కుమారా.. నువ్వు ప్రతిరోజు నాకు చెబుతున్న సమస్యకు రేపటితో అంతిమ పరిష్కారం ఇవ్వబోతున్నా.. అందుకోసం ముందుగా నువ్వు ఒక పని చెయ్యాలి.. నీ కష్టాల చిట్టా అంతా ఒక కాగితం మీద రాసి దానిని రేపు నా దేవాలయానికి తీసుకురా” అని చెప్పాడు. ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.. ఎంతో ఆనందంతో తన జీవితంలో బాధాకర కష్టాలన్ని ఒక పేపర్ మీద రాయడం మొదలుపెట్టాడు.. ఆ కష్టాలు ఒక్క కాగితంలో సరిపోలేదు.. అతనికున్న కష్టాలన్ని రాసేసరికి ముందుగా అనుకున్న ఒక్క కాగితం కాస్త చాలా కాగితాలయ్యాయి.. ఆ కాగితాలన్ని ఒక కట్టగా కట్టి మరుసటిరోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు.

ఆనందంతో దేవాలయానికి వెళుతున్న ఆ వ్యక్తికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది.. అదే దారిలో తన లాగే పేపర్ల కట్టలు కట్టుకుని తోటి గ్రామస్తులంతా గుడికి వస్తున్నారు. ఆ వ్యక్తికి అప్పుడే అర్ధమయ్యింది, “నా ఒక్కడికే కాదు నాతో పాటు భగవంతుడు వీరందరి కలలోకి వచ్చి నాకు చెప్పిందే చెప్పాడన్నమాట” అని. అక్కడున్న మిగిలిన వారి పేపరు కట్టలన్ని తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి. అంతకు ముందు తనతో పరిచయమున్న వారందరు ఆ కట్టలతో వచ్చేస్తున్నారు.. ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలుగుతుంది “వీరందరికి నాకన్నా మంచి బట్టలున్నాయి, డబ్బులున్నాయి.. ప్రతిరోజు పైకి అందరితో నవ్వుతు మాట్లాడతారు.. కాని తన కన్నా వారి దగ్గరున్న కష్టాల కట్టలు ఎక్కువ ఉండేసరికి అతనికి నెమ్మదిగా నిజం తెలుస్తుంది. గుడి తలుపులు సమీపిస్తున్న కొద్ది ఆ వ్యక్తిలో భయంతో కూడుకున్న అలజడి మొదలయ్యింది. ఈ అలజడి ఆ వ్యక్తికి మాత్రమే కాదు అక్కడున్న గ్రామస్తులందరికి పాకింది.

అనుకున్న సమయం రానే వచ్చేసింది.. గ్రామస్తులంతా ఆ గుడిలోనికి ప్రవేశించారు. అప్పుడే భగవంతుడు అదృశ్యవాణిగా ఇలా చెప్పాడు.. “మీ కష్టాలు రాసిన ఆ కాగితపు కట్టలన్ని కింద పెట్టండి”. చెప్పినట్టుగానే అందరు వారి కట్టలన్ని కింద పెట్టారు. అప్పుడు భగవంతుడు.. “ఇప్పుడు ప్రతి ఒక్కరు అక్కడున్న ఏదో ఒక కట్టను తీసుకోండి, మీరు కోరుకున్నట్టుగానే ఆ కట్టలో రాసివున్న కష్టాలన్ని మీకు బదిలి చేయబడతాయి” అని అన్నాడు. అక్కడున్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది. “అదే భయంలో అందరు ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే అక్కడున్న వారంత ఎవరి కట్టను వారు తీసుకోడానికి ప్రయత్నించారు”. ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరి ఊహించని కష్టాలు వస్తాయో, మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు కాని మనం జీవితంలో ఊహించని కష్టాలు వస్తే..? అని అందరు ఆలోచిస్తూ ప్రాణ భయంతో వారి కట్టలను వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా అదే ప్రయత్నిస్తున్నాడు.. ఒక్కసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్టుగా ఉంది అక్కడి దృశ్యం.

అక్కడున్న వారంత ఎదుటి వ్యక్తిలోని ఎంతటి ఊహించని కష్టాలు ఉన్నాయో అవి ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. కొద్దిసేపటికి చూస్తే ఎవరి కట్టను వారే తీసుకోగలిగారు.. అప్పటివరకు ఏదో మృత్యువు తరుముతున్నట్టుగా ఉన్న వారంత తమ కష్టాల కట్ట తాము తీసుకోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోసాగారు. అందరు చాలా ఆనందంగా ఉన్నారు.. ఆ వ్యక్తి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. వారందరికి స్పష్టంగా ఒక విషయం అర్ధమయ్యింది. “తమ కష్టాలే చిన్నవి, అనవసరంగా భయపడ్డాము..” వీటికి పరిష్కార మార్గాలను వెతకాలి, పోరాడాలి, విజయం సాధించాలి అని ధృడ సంకల్పంతో ముందుకు కదిలారు.