Wednesday, August 13, 2025

కలశము అంటే ఏమిటి?

 🕉️🌹🌷కలశము అంటే ఏమిటి?🌷🌹🕉️




🌻నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది. తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది. అటువంటి పాత్ర ‘కలశం’ అనబడుతుంది. 


ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు “పూర్ణకుంభము” అనబడుతుంది.


 అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది. ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది. 


సంప్రదాయ బద్ధమైన గృహ ప్రవేశము, వివాహము, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో కలశం ఏర్పాటు చేయబడుతుంది. 


స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది. 


ఇది మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది.


మనము కలశాన్ని ఎందుకు పూజిస్తాము అంటే..?

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻


🌻సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రములో తన శేషశయ్య పై పవ్వళించి ఉన్నాడు. అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. కలశంలొని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రథమ జాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది అన్నింటికీ జీవన దాత. లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్థాల మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త. ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగానున్న శక్తి నుంచి వచ్చినది, శుభప్రదమైనది. ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే 'ప్రేమ'ను సూచిస్తుంది. అందువల్లనే 'కలశం' శుభసూచకంగా పరిగణింపబడి పూజింపబడుతున్నది.


🌻అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తరువాత అందులోని నీరు "అభిషేకము''తో సహా అన్ని వైదికక్రియలకి వినియోగింప బడుతుంది. దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశజలముల అభిషేకాలతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు. 


పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. 


కాబట్టి 'కలశం' అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది. పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు. 


వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా మరియు వారిపట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణకుంభంతో హృదయ పూర్వకంగా స్వాగతమిస్తాము.

Friday, August 8, 2025

శ్రావణ పౌర్ణమి: తెలుగువారికి రాఖీ, జంధ్యాల పౌర్ణమి....

 శ్రావణ పౌర్ణమి: తెలుగువారికి రాఖీ, జంధ్యాల పౌర్ణమి....



ఖీ పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ ఇలా ఎన్నో రకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. దేవతలు, ప్రకృతి ఆరాధన, ఆత్మీయత అనురాగబంధాలు, సకల పూజారాధనలు అందుకునేది ఈ శ్రావణ పౌర్ణమి.


రాఖీ పౌర్ణమి.....

‘ఏదో బద్దో బలీరాజా దానవేంద్రో మహాబలా:తేనత్వం అనుబంధామి రక్షమాంచమాంచలం’ అంటూ రక్షకోరిన తన సోదరిని బలి చక్రవర్తి రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి నిలిచాడు. అటువంటి మహావీరునితో తన సోదరుడిని పోలుస్తూ సోదరి తనకి రక్షణ నివ్వమని కోరుతుంది. ఈ రాఖీ కట్టిన సోదరికి తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వదిస్తాడు. రాఖీ పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ ఇలా ఎన్నో రకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. దేవతలు, ప్రకృతి ఆరాధన, ఆత్మీయత అనురాగబంధాలు, సకల పూజారాధనలు అందుకునేది ఈ శ్రావణ పౌర్ణమి. కారణాలు, చరిత్రలు ఏవైనప్పటికీ ఉన్మాదం, విచక్షణ లాంటి వెకిలి చేష్టలతో మానవతా విలువులు మంటగలుస్తున్న ప్రస్తుత కాలంలో రాఖీ పౌర్ణమి తన విశిష్టతను చాటిచెబుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తమ సోదరులకు సోదరి రాఖీ కట్టి, మిఠాయిలు తినిపిస్తారు. మనం రాఖీ పండుగను ఇలానే చేసు కుంటాం.


ఏడాదికి వచ్చే ద్వాదశ పౌర్ణమిల్లో శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. దీనినే ఉపాకర్మ అంటారు. ఉపాకర్మను యఙ్ఞోప‌వీతం పేరుతో పిలుస్తారు. దీనికి అంటే యాగ కర్మతో పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమనాథుడు దీనిని నూలి పౌర్ణమి అన్నాడు. ఎందుకంటే నూలుతో తయారుచేసిన జంధ్యాన్ని ధరించడమే దీనికి కారణం. వేద్యాధ్యయనానికి ప్రతీకైన ఉపాకర్మను ఆచరించాలి. దీనికి ముందు ఉపనయనం జరిపించి జంధ్యాన్ని వేయడం ఆచారం.


యఙ్ఞోప‌వీతం ధరించినవారు ద్విజులు. ద్విజులు అంటే రెండు జన్మలు కలవారని అర్థం. తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం అనంతరం గురువు నుంచి ఙ్ఞానాన్ని పొందడం రెండోది. ఉపనయం సమయంలో యఙ్ఞోపవీతానికి జింక చర్మాన్ని కడతారు.దీనిని ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు వదిలిపెడతారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరించి పాతది విసర్జించాలి. పరిపక్వతకు, పరిశుద్ధతకు యఙ్ఞోపవీతం దివ్యౌషధం. ఇది ఉపనయన సంస్కారం ఉన్నవారికే పరిమితమైనా మిగతావారు కూడా అష్టోత్తరాలతో గాయత్రీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు.

Wednesday, August 6, 2025

Ekasila Awakens: Bhadra Deepotsavam Illuminates Warangal’s Spiritual Heart

 

Ekasila Awakens: Bhadra Deepotsavam Illuminates Warangal’s Spiritual Heart

The ancient city of Warangal, steeped in cultural and historical legacy, is once again embracing its spiritual roots through the Bhadra Deepotsavam—a grand event at the sacred Sri Bhadrakali Temple. Held amidst divine chants and a sea of lit lamps, this celebration is not just a festival but a deep spiritual awakening for the devotees of Telangana.

A Temple of Historical Grandeur

Located atop the historic Ekasila (single rock) hillock, the Sri Bhadrakali Temple stands as a symbol of devotion and architectural brilliance. With a history that dates back over 150 years, this shrine holds immense cultural significance. The temple has undergone several renovations over time, but what’s remarkable today is the new energy being infused into the premises through structured development and spiritual rejuvenation.

Reviving Traditions with a Modern Touch

As part of the spiritual upliftment, the temple authorities and community members have initiated the construction of a majestic new stone mandapam. Designed with traditional architecture, this 16-pillared stone structure is being rebuilt as part of a broader plan to enhance the sanctity and visual appeal of the temple complex.

Alongside, the priests and devotees are preparing for the massive Deepotsavam (festival of lights) —a visual and spiritual spectacle where thousands of lamps will be lit, symbolizing the victory of divine energy over darkness. The festival is a powerful blend of faith, community spirit, and age-old Vedic traditions.

Highlights of the Deepotsavam

  • Over 150 traditional stone lamps will be used for the grand lighting ceremony.

  • Priests and temple staff are orchestrating special rituals and homams (fire ceremonies).

  • The temple surroundings will resonate with Vedic chants, devotional music, and festive cheer.

  • Thousands of devotees are expected to participate, transforming the temple grounds into a glowing ocean of faith.

More Than a Festival: A Spiritual Movement

This initiative is not just about celebration but about reviving ancient heritage and instilling pride among the locals about their rich cultural past. It also encourages younger generations to connect with their roots and understand the importance of preserving temples as centers of spiritual and social harmony.

Looking Ahead

The new additions to the temple, including the impressive stone structure and upcoming renovations, are expected to enhance the temple’s status as a major spiritual destination in Telangana. Devotees and tourists alike will soon witness a space that combines devotion with artistic and architectural excellence.


🕉️ When light shines on tradition, it becomes legacy.

Warangal’s Bhadrakali Temple stands not only as a place of worship but also as a beacon of cultural resurgence. The Ekasila city is glowing once again—with the divine light of Bhadra Deepotsavam.

కరవును ఎదుర్కొన్న భద్రాద్రి రామయ్య క్షేత్రం - ఏకశిల నుండి పునరుజ్జీవం వరకు!

 కరవును ఎదుర్కొన్న భద్రాద్రి రామయ్య క్షేత్రం - ఏకశిల నుండి పునరుజ్జీవం వరకు!

పూర్వం భద్రాద్రిలో నీటి కొరత తీవ్రంగా ఉండేది. స్వయంగా శ్రీరాముడే కొలువై ఉన్న ఈ పవిత్ర క్షేత్రం కరువు కాటకాలతో కళావిహీనమైంది. 16వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయం తొలుత ఏకశిలపై వెలిసింది. కాలక్రమేణా నీరు లేక నిర్మానుష్యంగా మారిన ఈ దివ్య స్థలాన్ని భక్తులు మరచిపోయే స్థితికి చేరుకున్నారు.

సుమారు 150 ఏళ్ల క్రితం, గోదావరి వరదలు పోటెత్తడంతో మళ్లీ ఈ ప్రాంతానికి పూర్వ వైభవం వచ్చింది. ఊహించని విధంగా వరద నీరు రామాలయానికి చేరుకుని, స్వామివారి మూలవిరాట్ పాదాలను తాకింది. ఇది స్థానికులకు ఒక దివ్య సంకేతంగా అనిపించింది. అప్పటినుండి భక్తులు మళ్లీ రావడం మొదలుపెట్టారు.

నల్లరాతితో చెక్కిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నిత్య పూజలు, ఉత్సవాలతో భద్రాద్రి మళ్లీ కళకళలాడుతోంది. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి. భద్రాద్రి రాముని కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుందాం.




Thursday, July 31, 2025

వరలక్ష్మీ వ్రతకల్పము*

 *వరలక్ష్మీ వ్రతకల్పము* 



 *పూజా సామగ్రి:* 


పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ).


అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము


పంచామృతములు: ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార


తోరము: తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు.


పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలెను. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభంలో (వెండి/ఇత్తడి/రాగి/కంచు చెంబులో) కొత్త బియ్యము వేసి, మర్రియిగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి దొరకకపోతే తమలపాకులు గానీ వేసి, ఆ కుంభం మీద కొత్త రవికల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి, పూజకు సిద్ధం చేయాలి.


పూజావిధానం:


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!!


దీపము వెలిగించాలి.


ఆచమ్య:


కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోరాయనమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః..


శ్లో!! ఉత్తిష్ఠిన్తు భూతపిశాచాః యేతేభూమి భారకాః!

ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే!!


(అని అక్షతలు వాసన చూచి తమ యెడమప్రక్కన పడవేయవలెను.)

మమ ఉపాత్త దురితయక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరీ ముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగాగోదావర్యోర్మధ్య ప్రదేశే...సమస దేవతా బ్రాహ్మణ హరిహ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన .......సంవత్సరే ....ఆయనే.....ఋతౌ...మాసే.....పక్షే....తిథౌ.....వాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిధ్యార్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్ధం, సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ ప్రీత్యర్థం యావచ్ఛక్తి, ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే! తదంగత్వేన కలశపూజాం కరిష్యే!


అని సంకల్పము చేసి కలశమునకు గంధాక్షతలు పెట్టి, పుష్పమును కలశములో నుంచి, చేతితో కలశమును మూసి ఈ క్రింది శ్లోకమును చదువవలెను.


శ్లో!!కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రః సమాశ్రితః

మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణాః స్మృతాః!!

కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా!

ఋగ్వేదోధయజుర్వేదః, సామవేదోహ్యధర్వణః!

అజ్గైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః!

ఆయాంతు శ్రీ వరలక్ష్మీ పూజార్థం దురితక్షయకారకాః

గంగేచ, యమునేచైవ గోదావరి సరస్వతీ!

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు!!

కలశోదకేన దేవమాత్మానాం, పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య!!


(కలశములోని ఉదకమును పుష్పముతో దేవునిపైన, తమ పైన, పూజాద్రవ్యములపైన చల్లవలెను.)


కళ్యాణీ కమలనిలయే కామితార్థ ప్రదాయినీ!

యావత్త్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరోభవ!!


(అని ప్రార్థిమ్చి దేవునిపై పుష్పము నుంచవలెను)


అథ ధ్యానమ్:


పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే!

నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా!!

క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే!

సుస్థిరో భవమే గేహే సురాసుర నమస్కృతే!!

లక్ష్మీంక్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం!

దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం!

శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం!

త్వామ్ త్రైలోక్య కుటుంబినీం సరసిజామ్ వందే ముకుంద ప్రియామ్!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధ్యాయామి!


ఆవాహనం:


సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే!

ఆవాహయామి దేవీత్వామ్ సుప్రీతా భవసర్వదా!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ఆవాహయామి!


ఆసనమ్:


సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే!

సింహాసనమిదం దేవీ గృహ్యతాం సురపూజితే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, రత్నఖచిత సింహాసనం సమర్పయామి.


పాద్యమ్:


సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవమ్!

పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పాదయోః పాద్యం సమర్పయామి!


అర్ఘ్యమ్:


శుద్ధోదకమ్ చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితమ్!

అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,హస్తయోః అర్ఘ్యం సమర్పయామి!


ఆచమనీయం:


సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతమ్!

గృహానాచమనం దేవీ మయాదత్తం శుభప్రదే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ముఖే ఆచమనీయం సమర్పయామి


పంచామృత స్నానం:


పయోదధి ఘృతోపేతం శర్కరా మధుసంయుతమ్!

పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పంచామృత స్నానం సమర్పయామి


శుద్ధోదక స్నానం:


గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితమ్!

శుద్ధోదక స్నానమిదం గృహాన హరివల్లభే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, శుద్ధోదక స్నానం సమర్పయామి


వస్త్రం:


సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే!

వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన భువనేశ్వరీ!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, వస్త్రయుగ్మం సమర్పయామి


యజ్ఞోపవీతం:


తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితమ్!

ఉపవీతమిదం దేవీ గృహాణ త్వం శుభంకరీ!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, యజ్ఞోపవీతం సమర్పయామి


గంధం:


కర్పూరాగరు కస్తూరీ రోచనాదిభిరన్వితమ్!

గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, గంధం విలేపయామి


అక్షతలు:


అక్షతాన్ ధవళాన్ దేవీ శాలీయాన్ తండులాన్ శుభాన్!

హరిద్రాకుంకుమోపేతం గృహ్యతామబ్ధిపుత్రికే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అక్షతాన్ సమర్పయామి


ఆభరణం:


కేయూర కంకణే దివ్యే హారనూపుర మేఖలాః!

విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ఆభరణాని సమర్పయామి


పుష్పం:


మల్లికాజాజి కుసుమైః చంపకైర్వకుళైస్తథా!

శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, పుష్పైః పూజయామి


అథాంగపూజా!

ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి

ఓం చపలాయై నమః జానునీ పూజయామి

ఓం పీతాంబదధరాయై నమః ఊరుం పూజయామి

ఓం కమలవసిన్యై నమః కటిం పూజయామి

ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి

ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి

ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి

ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి

ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి

ఓం సుముఖ్యై నమః ముఖం పూజయామి

ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి

ఓం సునేత్రే నమః నేత్రం పూజయామి

ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి

ఓం కమలాయై నమః శిరః పూజయామి

ఓం వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి

శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం అష్టోత్తర శతనామ పూజాం కరిష్యే

అని సంకల్పము చేసి అష్టోత్తర నామపూజ పసుపు కుంకుమలతో గాని, పుష్పములతో గానీ చేయవలెను.


శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః


ఓం ప్రకృత్యై నమః

ఓం వికృత్యై నమః

ఓం విద్యాయై నమః

ఓం సర్వభూతహితప్రదాయై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం విభూత్యై నమః

ఓం సురభ్యై నమః

ఓం పరమాత్మికాయై నమః

ఓం వాచే నమః

ఓం పద్మాలయాయై నమః (10)


ఓం పద్మాయై నమః

ఓం శుచ్యై నమః

ఓం స్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం సుధాయై నమః

ఓం ధన్యాయై నమః

ఓం హిరణ్మయ్యై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం నిత్యపుష్టాయై నమః

ఓం విభావర్యై నమః (20)


ఓం అదిత్యై నమః

ఓం దిత్యై నమః

ఓం దీప్తాయై నమః

ఓం వసుధాయై నమః

ఓం వసుధారిణ్యై నమః

ఓం కమలాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం క్రోధసంభవాయై నమః

ఓం అనుగ్రహపరాయై నమః (30)


ఓం ఋద్ధయే నమః

ఓం అనఘాయై నమః

ఓం హరివల్లభాయై నమః

ఓం అశోకాయై నమః

ఓం అమృతాయై నమః

ఓం దీప్తాయై నమః

ఓం లోకశోక వినాశిన్యై నమః

ఓం ధర్మనిలయాయై నమః

ఓం కరుణాయై నమః

ఓం లోకమాత్రే నమః (40)


ఓం పద్మప్రియాయై నమః

ఓం పద్మహస్తాయై నమః

ఓం పద్మాక్ష్యై నమః

ఓం పద్మసుందర్యై నమః

ఓం పద్మోద్భవాయై నమః

ఓం పద్మముఖ్యై నమః

ఓం పద్మనాభప్రియాయై నమః

ఓం రమాయై నమః

ఓం పద్మమాలాధరాయై నమః

ఓం దేవ్యై నమః (50)


ఓం పద్మిన్యై నమః

ఓం పద్మగంథిన్యై నమః

ఓం పుణ్యగంధాయై నమః

ఓం సుప్రసన్నాయై నమః

ఓం ప్రసాదాభిముఖ్యై నమః

ఓం ప్రభాయై నమః

ఓం చంద్రవదనాయై నమః

ఓం చంద్రాయై నమః

ఓం చంద్రసహోదర్యై నమః

ఓం చతుర్భుజాయై నమః (60)


ఓం చంద్రరూపాయై నమః

ఓం ఇందిరాయై నమః

ఓం ఇందుశీతులాయై నమః

ఓం ఆహ్లోదజనన్యై నమః

ఓం పుష్ట్యై నమః

ఓం శివాయై నమః

ఓం శివకర్యై నమః

ఓం సత్యై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వజనన్యై నమః (70)


ఓం తుష్ట్యై నమః

ఓం దారిద్ర్య నాశిన్యై నమః

ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః

ఓం శాంతాయై నమః

ఓం శుక్లమాల్యాంబరాయై నమః

ఓం శ్రియై నమః

ఓం భాస్కర్యై నమః

ఓం బిల్వనిలయాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం యశస్విన్యై నమః (80)


ఓం వసుంధరాయై నమః

ఓం ఉదారాంగాయై నమః

ఓం హరిణ్యై నమః

ఓం హేమమాలిన్యై నమః

ఓం ధనధాన్య కర్యై నమః

ఓం సిద్ధయే నమః

ఓం స్త్రైణ సౌమ్యాయై నమః

ఓం శుభప్రదాయై నమః

ఓం నృపవేశ్మ గతానందాయై నమః

ఓం వరలక్ష్మ్యై నమః (90)


ఓం వసుప్రదాయై నమః

ఓం శుభాయై నమః

ఓం హిరణ్యప్రాకారాయై నమః

ఓం సముద్ర తనయాయై నమః

ఓం జయాయై నమః

ఓం మంగళాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః

ఓం విష్ణుపత్న్యై నమః

ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)


ఓం నారాయణ సమాశ్రితాయై నమః

ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః

ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః

ఓం నవదుర్గాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః

ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః

ఓం భువనేశ్వర్యై నమః (108)


శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి


దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరమ్!

ధూపం దాస్యామి దేవేశీ గృహ్యతాం పుణ్యగంధినీ!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ధూపమాఘ్రాపయామి


అగరువత్తి వెలిగించి ధూపము చూపవలెను


ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకమ్!

దీపం దాస్యామి తేదేవీ గృహాణ ముదితోభవ!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, దీపం దర్శయామి


(దీపము చూపవలెను)


నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్య సంయుతం!

నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే!!


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నైవేద్యం సమర్పయామి


నివేదనము చేసి నీటిని వదలవలెను.


పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్!

కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్!!

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, తాంబూలం సమర్పయామి

నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితమ్!

తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే!!


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, అనందమంగళ నీరాజనం సందర్శయామి


నీరాజనానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే

నారాయణ ప్రియే దేవీ సుప్రీతో భవసర్వదా!!


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః,మంత్రపుష్పాణి సమర్పయామి

పుష్పము అక్షతలు ఉంచవలెను


యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ!

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, ప్రదక్షిణం సమర్పయామి


పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ

త్రాహిమాం కృపయాదేవీ శరణాగత వత్సలే!!

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణమ్ మమ!

తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దనీ!!

నమస్త్రైలోక్య జననీ నమస్తే విష్ణు వల్లభే

పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమోనమః!!


శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః, నమస్కారాన్ సమర్పయామి


తోరగ్రంథి పూజా!


ఓం కమలాయై నమః - ప్రథమ గ్రంథిం పూజయామి

రమాయై నమః - ద్వితీయ గ్రంథిం పూజయామి

లోకమాత్రే నమః - తృతీయ గ్రంథిం పూజయామి

విశ్వజనన్యై నమః - చతుర్థ గ్రంథిం పూజయామి

వరలక్ష్మీ నమః - పంచమ గ్రంథిం పూజయామి

క్షీరాబ్ధి తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి

విశ్వసాక్షిణ్యై నమః - సప్తమ గ్రంథిం పూజయామి

చంద్ర సహోదర్యై నమః - అష్టమగ్రంథిం పూజయామి

వరలక్ష్మ్యై నమః - నవమ గ్రంథిం పూజయామి


ఈ క్రింది శ్లోకము చదువుతూ తోరము కట్టుకొనవలెను.


శ్లో!! బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం

పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే


వరలక్ష్మీ వ్రత కథ

సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను జూచి యిట్లనియె – మునివర్యులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు గలుగునట్టి యొక వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి జెప్పె దానిం చెప్పెద వినుండు, కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిమయ ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండి యుండ పార్వతి పరమేశ్వరునకు నమస్కరించి దేవా! లోకమున స్త్రీలు యే వ్రతం బొనర్చిన సర్వ సౌభాగ్యంబులు, పుత్ర పౌత్రాదులం గలిగి సుఖంబుగ నుందురో అట్టి వ్రతం నా కానతీయవలయు” ననిన పరమేశ్వరుండిట్లనియె. ఓ మనోహరీ! స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు గలుగంజేయం వరలక్ష్మీ వ్రతంబను నొక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారము నాడు జేయవలయుననిన పార్వతీదేవి యిట్లనియె. ఓ లోకారాధ్యా! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు నెట్లు చేయవలెను? ఆ వ్రతంబునకు విధియేమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం బెవ్వరిచే నీ వ్రతంబాచరింపబడియె? దీనినెల్ల వివరంబుగా వివరింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగ జెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను నొక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారముల తోడను, బంగారు గోడలు గల యిండ్లతోనూ గూడియుండెను. అట్టి పట్టణము నందు చారుమతి యనునొక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగ దలచి ప్రతి దినంబును ఉదయంబున మేల్కాంచి స్నానంబుచేసి పుష్పంబులచే భర్తకు పూజచేసి పిదప అత్తమామలకు ననేక విధంబులైన యుపచారంబులను చేసియు ఇంటి పనులను జేసికొని మితముగా ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ అమ్మహా పతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము గలిగి యొకనాడు స్వప్నంబున ప్రసన్నమై “ఓ చారుమతీ, నేను వరలక్ష్మీ దేవిని. నీయందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. –శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు నిచ్చెదనని వచించిన చారుమతీ దేవి స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి ‘నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే!

శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే!! అని అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగెనేని జనులు ధన్యులుగను, విద్వాంసులుగను సకల సంపన్నులు గను నయ్యెదరు. నేను జన్మాంతరంబున జేసిన పుణ్య విశేషమున మీ పాదదర్శనము నాకు గలిగినదని జెప్పిన వరలక్ష్మీ సంతోషంబు జెంది, చారుమతికి ననేక వరములిచ్చి యంతర్థానంబు నొంద చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని యింటికి నాలుగు ప్రక్కలం జూచి వరలక్ష్మీ దేవిని గానక ఓహో! మనము కలగంటిమని స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలయిన వాండ్రతో జెప్పగా వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమయినదని శ్రావణ మాసంబు వచ్చినతోడనే వరలక్ష్మీ వ్రతం బావశ్యంబుగ జేయవలసిందని జెప్పిరి.


చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరును ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని యుదయంబుననే మేల్కాంచి స్నానాదుల జేసి చిత్ర వస్త్రంబులను గట్టుకొని చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరచి యందొక ఆసనంబువైచి దానిపై కొత్తబియ్యం బోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచేత కలశంబేర్పరచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే! నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవసర్వదా!!” అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రములు గల తోరంబును దక్షిణహస్తమునకు గట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన జేసి ప్రదక్షిణము జేసిరి. ఇట్లొక ప్రదక్షిణము జేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళకు జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఓహో! వరలక్ష్మీదేవి కటాక్షం వలన గల్గినవని పరమానందంబు నొంది మరియొక్క ప్రదక్షిణంబు జేయగా హస్తములందు దగద్ధగాయమానంబుగా మెరయుచుండ నవరత్న ఖచితంబులైన నాభరణములుండుట గనిరి. ఇంక చెప్పనేల మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనములతో నిండియుండెను. అంత నా స్త్రీలను దోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి యిండ్లనుండి గుర్రములు, ఏనుగులు, రథములు బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించి స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్తప్రకారముగా పూజచేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు వాయన దానం ఇచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరను భుజించి తమకొరకు వచ్చి కాచుకొని యుండు వాహనములపై యిండ్లకు బోవుచు ఒకరితో నొకరు ఓహో! చారుమతీదేవి భాగ్యంబేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయెను. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్యం, సంపత్తులు గలిగెనని చారుమతీ దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ యిండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబును నీ వ్రతంబును చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి గలిగి, ధనకనక వస్తు వాహనములతోడ గూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతీ! యీ యుత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యంబులను గలిగి సుఖంబుగ నుందురు. ఈ కథను వినువారలకును, చదువు వారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును.


వాయన దానము:


శ్లో!! ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః!

దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే!!


శ్లో!! ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాతిచ

ఇందిరా తారకో బాభ్యాం ఇందిరాయై నమోనమః!!


--- శుభమ్ -

Monday, July 28, 2025

నాగ పంచమి ప్రాముఖ్యత*

 _*🚩రేపు నాగ పంచమి🚩*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*నాగ పంచమి ప్రాముఖ్యత*


శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును *నాగ పంచమి* అంటారు. బ్రహ్మదేవుడు , ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. *''నాగులచవితి''* మాదిరిగానే *''నాగ పంచమి''* నాడు నాగ దేవతను పూజించి , పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి , సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా , అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.


చలి చీమ నుండి  చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు - చేమ , వాగు - వరద , నీరు - నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది . హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పాన్పు. వాసుకి పమేస్వరుడి కంఠాభరణం. వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు


*నాగ జాతి జననం :*


కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు అనంతుడు , తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు.


దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై *" మమ్మల్ని మీరే సృస్తించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా "* అని వేడుకున్నారు .


*"విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హింసించరాడు. గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి. దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి. మీ నాగులంతా ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి"* అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు.


దాంతో దెవతలంతా నాగులను ప్రశంసించారు. భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు. దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు.


వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది. పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు.


పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలలో చెప్పడం జరిగినది. ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగ పంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి , కర్రతోగానీ , లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు , చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి , సంపెంగ , గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము , పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.


శ్రావణమాసం , శుక్ల పక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా *కార్తీక మాసంలో వచ్చే శుక్ల పంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.*


అందుచేత శ్రావణమాసమున వచ్చే *నాగపంచమి* రోజున నాగదేవతను పూజించాలి. *నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి.*  *గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి* రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి , ఇంటిని శుభ్రం చేసుకోవాలి.


ఇంటి గడప , పూజగదిని పసుపు , కుంకుమలు , పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ , పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం , పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం , సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.


*నాగ పంచమి వ్రత కథ*


పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది  ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుండేవి , దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు.  విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం *నాగపంచమి నోము* నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను. ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి.

ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు .. ఎవరి విస్వాశము వారిది.


మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి.. ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం , కదలిక , నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల , పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శరీరం పరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది , అలాగే ‘శక్తి’ పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి పాములు ఆకర్షింపబడతాయి. అలాగే పాములు గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.


స్వభావం , కదలిక , నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల , పామును కుండలినికి సంకేతంగా చూస్తారు.  


అందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపడం నిషిద్ధం. భారతదేశంలో ఒక పాముని చంపినా , ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ. జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర సంబంధం ఉండటం వల్ల , ఈ సంస్కృతిలో పాము కూడా మనిషిలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. అందువల్ల ఒక పాముని చంపడం అంటే అది హత్యతో సమానమే.


నాకు తెలిసినంత వరకూ పాము లేని గుడి అంటూ ఉండదు. ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది. అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములున్నాయి.  క్రొత్తగా , షాపింగు కాంప్లెక్సులలా కట్టిన కొన్ని దేవాలయాల్లో పాములు ఉండకపోవచ్చు. కాని మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. అంతేకాకుండా , ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం అదే.


కాలసర్ప దోషం ఉన్నవారు , ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు , నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి , కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ జరిగి , సుఖసంతోషాలు అనుభూతికి వస్తాయి.

Sunday, July 27, 2025

నాగ చతుర్థి (నాగుల చవితి)

 *🌻రేపు నాగ చతుర్థి🌻*



🍃🌹నాగ చతుర్థి (నాగుల చవితి) గా జరుపుకుంటారు , మరియు ఇది నాగ పంచమికి ముందు రోజు నాగా అంటే పాము మరియు చతుర్థి అంటే చంద్ర మాసంలో 4 వ రోజు కొందరు దీపావళి తరువాత వచ్చే తమిళ మాసం కార్తీగై (నవంబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్య) లో వాక్సింగ్ చంద్రుని 4 వ రోజున కొన్ని రాష్ట్రాలు నాగ చతుర్తిని పాటిస్తాయి.


*🌻నాగ చతుర్థి యొక్క ప్రాముఖ్యత🌻*


🍃🌹వారి జీవిత భాగస్వామి మరియు పిల్లల శ్రేయస్సు మరియు దీర్ఘాయువు కోసం నాగ చతుర్తిని మహిళలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున పాము దేవుళ్ళను ఆరాధించడం కూడా జన్మ పట్టికలో పాము గ్రహాలు , రాహు మరియు కేతు వలన కలిగే ఏవైనా బాధలను తగ్గించగలదు కుటుంబ సంక్షేమం , శ్రేయస్సు మరియు సంపద కోసం ప్రజలు నాగ దేవతల ఆశీర్వాదం కోరుతూ ప్రార్థనలు కూడా చేస్తారు.


*🌻నాగ చతుర్థి🌻*


🍃🌹నాగ చతుర్తి ఆచారాలు

నాగ చతుర్థి పండుగ సందర్భంగా , భక్తులు పాములను , పాము దేవుళ్ళను పూజిస్తారు , మరియు పాము పుట్టలలో పాలు అర్పిస్తారు మరియు పాము పుట్టల దగ్గర గుడ్లు ఉంచుతారు. మహిళలు తమ ప్రార్థనలను అర్పించడానికి భక్తితో ఒక రోజు ఉపవాసం చేస్తారు. మహిళలు దేవాలయాలకు వెళతారు , ఇక్కడ పాము విగ్రహాలు ఉంటాయి , విగ్రహాలకు నీరు మరియు పాలతో స్నానం చేస్తారు , విగ్రహాలకు పసుపు పొడి వేసి కుంకుమ్ (ఎర్ర సింధూరం పొడి) చుక్కలు పెట్టి , ధూపం  మరియు ప్రసాదం ఇస్తారు , ఆర్తి (లైట్ నైవేద్యం) మరియు పాము దేవతలను లేదా నాగ దేవతలను ఆరాధిస్తారు.


🍃🌹చాలామంది మంత్రాలు మరియు *సర్ప సూక్తం* (పాము దేవతలను స్తుతించే శ్లోకం) కూడా జపిస్తారు. అనంత , వాసుకి , శేష , పద్మనాభ , కంబల , ధృతరాష్ట్ర , శంఖపాల , తక్షక , కలియా అనే తొమ్మిది ముఖ్యమైన పాము దేవుళ్ళ ఆశీర్వచనం కోసం ఈ శ్లోకాలు పాడతారు.


*🌻నాగ చతుర్థి వల్ల కలిగే ప్రయోజనాలు🌻*


🍃🌹నాగ చతుర్థిపై రాహువు, కేతువులను ఆరాధించడం జనన పటంలో వారి ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది. ఈ రోజున రాహువును పరిపాలించే దుర్గాదేవిని తిరిగి మార్చడం పాము బాధలను కరిగించగలదు.


🍃🌹పాము దేవుళ్లకు ప్రార్థనలు చేయడం వల్ల మీపై లేదా మీ పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన పాము శాపాల ప్రభావాలను తొలగించవచ్చు. ఆరోగ్యం , సంపద , సంతానం మరియు అనారోగ్యాల నుండి ఉపశమనం యొక్క ఆశీర్వాదాలు.


🍃🌹పెళ్లికాని మహిళలు మంచి జీవిత భాగస్వామిని పుట్టడానికి వేగంగా ఉండి పాములకు ఆహారం ఇస్తారు. పాము దేవుళ్ళను ఆరాధించిన తరువాత నాగ చతుర్థిపై మహాభారతం చదివిన వారు మీ జన్మ పట్టికలో సర్పా దోష ప్రభావాలను తగ్గించవచ్చని నమ్ముతారు.



☘️☘️🌻🌻🌻🌹🌻🌻🌻☘️☘️

శ్రావణ సోమవార వ్రతాన్ని ఎలా పాటించాలి ?*

 *🌻రేపు శ్రావణ సోమవారం🌻*


*శ్రావణ సోమవార వ్రతాన్ని ఎలా పాటించాలి ?*


🍃🌹శ్రావణ సోమవార వ్రతంలో ఆదిదంపతులైన శివపార్వతులను పూజిస్తారు. పురాణాలననుసరించి సోమవారపు వ్రతాలు మూడు రకాలుగా ఉన్నాయి.


🍃🌹సోమవారం , పదహారు సోమవారాలు , సౌమ్య ప్రదోష్. అన్ని వ్రతాలలాగే ఈ సోమవారపు వ్రతం పాటించాలి. శ్రావణ మాసంలో ఈ సోమవారపు వ్రతాన్ని పాటిస్తే చాలా శుభాలు కలుగుతాయని పురాణాలు చెపుతున్నాయి. 


🍃🌹శ్రావణ సోమవారపు వ్రతాన్ని సూర్యోదయానికి ముందు ప్రారంభించి సాయంత్రం వరకు పాటిస్తుంటారు. శివుని పూజ చేసిన తర్వాత సోమవారపు కథను వినడం తప్పనిసరి. వ్రతాన్ని పాటించేవారు రోజుకు ఒకపూట మాత్రమే భోజనం చేయాల్సి ఉంటుంది. 


🍃🌹శ్రావణ సోమవారపు వ్రతాన్ని పాటించే వారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రనుపక్రమించి స్నానపానాదులు పూర్తి చేసుకోవాలి. ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని గంగాజలాన్ని లేదా పవిత్రమైన నీటిని ఇంట్లో చల్లాలి. ఇంట్లోనే మీకు నచ్చిన చోట లేదా పూజగదిలో శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేయండి లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోండి. 


🍃🌹పూజాదికార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ మంత్రం పఠిస్తూ సంకల్పం చేసుకోండి. 


*'మమ క్షేమస్థైర్యవిజయారోగ్యైశ్వర్యాభివృద్ధయర్థం సోమవ్రతం కరిష్యే '*


ఆ తర్వాత క్రింది మంత్రాన్ని ధ్యానించండి...


*"ధ్యాయేన్నిత్యంమహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నాకల్పోజ్జవలాంగ పరశుమృగవరాభీతిహస్తం ప్రశన్నం I*


*పద్మాసీనం సమంతాత్స్తుతమమరగణైర్వ్యాఘ్రకృతిం వసానం విశ్వాద్యం విశ్వవంద్యం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రమ్ II "* 


ధ్యానం తర్వాత *"ఓం నమఃశివాయ"* తో శివునికి మరియు *"ఓం నమఃశివాయై"* తో పార్వతీదేవిని షోఢశోపచారాలతో పూజించండి. పూజ పూర్తయిన తర్వాత వ్రతానికి సంబంధించి కథను వినండి. ఆ తర్వాత భోజనం లేదా ఫలహారం సేవించండి.


🍃🌹శ్రావణ సోమవారపు వ్రతాన్ని నియమానుసారం పాటిస్తే ఆదిదంపతులైన శివపార్వతుల కృపాకటాక్షాలు లభిస్తాయి. జీవితం ధన్యమవుతుంది. ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుంటాయి. భక్తుల కష్టాలు హరింపబడుతాయని పురాణాలు చెపుతున్నాయి.


☘️☘️🌻🌻🌻🌹🌻🌻🌻☘️☘️

Friday, July 11, 2025

ఆర్టీసీ ఆధ్యాత్మిక యాత్రలు: వారాంతంలో ప్రముఖ ఆలయాలకు ప్రత్యేక సర్వీసులు!

 ఆర్టీసీ ఆధ్యాత్మిక యాత్రలు: వారాంతంలో ప్రముఖ ఆలయాలకు ప్రత్యేక సర్వీసులు!

 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఆధ్యాత్మిక యాత్రలను నిర్వహిస్తోంది. వారాంతాల్లో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సందర్శనకు ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఆధ్యాత్మిక యాత్రల షెడ్యూల్ జూన్ 27న ప్రారంభమైంది.

ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా ప్రయాణికులను అరువాచలం, భద్రాచలం, కాణిపాకం, శ్రీశైలం, వేములవాడ గీతా టెంపుల్, భోగీరాలయం, కాశీశ్వరం, యాదగిరిగుట్ట, భద్రాద్రి ఆలయం, వేయన్నసెంపల గుడి, కొండగట్టు, వేములవాడ, మంత్రాలయం వంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు సందర్శించుకోవచ్చు.

ప్రస్తుతం ఆర్టీసీ వారాంతాల్లో ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. గురుపౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు సర్వీసులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఆధ్యాత్మిక యాత్రలకు ఆర్టీసీ సేవలు ప్రత్యేక సర్వీసులే కాకుండా, 30-40 మందితో కూడిన బృందంతో ముందుగా బుక్ చేసుకుంటే ఈ సేవల్ని ఎప్పుడైనా పొందవచ్చు.

మీరు కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ టీఎస్‌ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోండి!

Thursday, July 10, 2025

నైవేద్యం! వివిద ఫలాల నైవేద్యం ఫలితాలు*

 


*నైవేద్యం!*
*వివిద ఫలాల నైవేద్యం ఫలితాలు*


**కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ):* *భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.*
Coconut for Babies - First Foods for ... **అరటి పండు:* *భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.*Bananas | Love Food Hate Waste **నేరెడు పండు:* *శనీశ్వరునికి నేరేడు పండు నైవేద్యం గా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరోగ్య వంతులు అవుతారు.*

నేరేడు పండ్లను ఇలా తింటే.. విషంతో సమానం..! – TV9 Telugu **ద్రాక్ష పండు:* *భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.* Eating Grapes Everyday : రోజూ ద్రాక్ష పండ్లు తింటే ఏమవుతుంది? ఎన్ని  తినాలి?-if you eat grapes everyday what happens to your body ,లైఫ్‌స్టైల్  న్యూస్ **మామిడి పండు:* *మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.* మామిడి పండు తింటే 6 ఉపయోగాలు... ఏమిటో తెలుసా? **అంజూర పండు:* *భగవంతుడికి నైవేద్యం పెట్టిన అంజూరాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి అనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరోగ్య వంతులు అవుతారు.* Fig | Description, History, Cultivation, & Types | Britannica **సపోట పండు:* *సపోట పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.* ఈ సపోటా పండ్లు తీసుకుంటే ప్రయోజనాలు ఏమిటంటే...? **యాపిల్ పండు:* *భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.* ఆపిల్ - వికీపీడియా **కమలా పండు:* *భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.* My Health - నా ఆరోగ్యం - కమలా పండు తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కమలా  ఫలంలో సిట్రస్ లిమినోయిడ్స్ ఉంటాయి, కమలా పండులో మాంసకృత్తులు, పిండి ... **పనసపండు:* *పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.*

Jackfruit Benefits: వేసవిలో పనసపండు తినడం వల్ల వ్యాధులు దూరం.. ఎన్నో అద్భుత  ప్రయోజనాలు.. - Telugu News | Know these are the benefits on eating  jackfruit in summer | TV9 Telugu

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏