Wednesday, February 12, 2025

మనం భస్మం ఎందుకు ధారణ చేయాలి?🙏

 


మనం భస్మం ఎందుకు ధారణ చేయాలి?🙏




🌸భస్మం శివారాధన చేసేవాళ్ళో, లేక శైవులో పరమేశ్వరుడికి ఇష్టం కాబట్టి పెట్టుకుంటారంటే చాలా పొరపాటు పడినట్లే.. ఐశ్వర్యం గోషు సంపన్నం (మహాభారతం ) లో చెప్పబడినది.


🌿అంటే ఐశ్వర్యం గోవు తో పోల్చారు గోవు ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది అని అర్ధం. కొంతమంది అడగవచ్చు. ఏమని?,


🌸గోవు ఉంటే ఐశ్వర్యం ఉండటం ఏమిటి అని,(మహాభారతం గో మాహాత్మ్యం పర్వం ) లో చెప్పబడినది గోమయం లో లక్ష్మీదేవి ఉంటుంది అని. ఆ గోమయాన్ని మనం ముఠాలు అనగా గుండ్రముగా తయారుచేసి దానిని హుతం చేసి అనగా కాల్చి వచ్చినటువంటి బూడిదని (భస్మాన్ని) మనం ధారణ చేస్తున్నాము.


🌿అంటే మనము సాక్షాత్తు లక్ష్మిదేవిని ధారణ చేస్తున్నాము. అందుకనే భస్మాన్ని (విభూతిర్భూతిరైస్వర్యం) అన్నారు భస్మము ధారణ చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది అని పండితులు, పెద్దలు, చెప్తూ ఉంటారు. 


🌿కొన్ని పురాణాలలో (త్రి పుమ్డ్రేన వినదానం త్రి పుమ్డ్రేన వినా జపం త్రి పుమ్డ్రేన వినా శ్రాద్ధం తోయం నిష్ఫలదాయకం )అన్నారు. భస్మం లేకుండా చేసిన దానం ,భస్మం లేకుండా చేసిన జపం, భస్మం లేకుండా చేసిన శ్రాద్ధం ఫలితం ఇవ్వవు అని.


🌸భస్మం ఎవ్వరైనా ధారణ చేయవచ్చు ,భస్మ ధారణ చేసి మహాలక్ష్మి ,పరమేశ్వర అనుగ్రహము పొంది అష్ట ఐశ్వర్యాలు పొందవచ్చు, ఏ మాత్రము సందేహము లేదు..


🌹భస్మ ధారణ శ్లోకం :🌹


🌷శ్రీకరంచ  పవిత్రంచ శోకరోగ 

నివారణమ్!

లోకే వశికరణం 

పుంసాం భస్మ త్రైలోక్య పావనమ్!!.🙏

గోవుతో గృహప్రవేశం ఎందుకు?

 గోవుతో గృహప్రవేశం ఎందుకు?



మనందరికీ సొంతింట్లో నివసించాలనిపిస్తుంది. ఆ స్వగృహ కల నెరవేరినప్పుడు బంధుమిత్రుల్ని పిలిచి గృహప్రవేశ వేడుక చేసుకుంటాం.


ఆ వేడుకలో మొదటి ఆచారం దూడతో సహా గోమాతను నూతన గృహంలోకి తీసుకెళ్లి మంత్రం జపిస్తూ ఇల్లంతా తిప్పడం. ఆ తర్వాతే ఇంటి యజమాని, ఇతర కుటుంబ సభ్యులు లోనికి వెళ్తారు. ఈ ఆచారం వెనుక ఉన్న ఆంతర్య మేమిటో చూద్దాం...


పురాణాలూ ఇతిహాసాలూ గోవును సకలదేవతా స్వరూపంగా వర్ణించాయి. గోవు ఉన్నచోట సకల దేవతలూ ఉంటారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. అందువల్ల ఆవును తీసుకెళ్తే.. దేవతలూ గృహంలో ప్రవేశిస్తారన్నమాట. అందుకే కొత్తింట్లో గోవును తిప్పటం ఆచారమయ్యింది. ఆ సమయంలో గోవు మూత్రం పోసినా, పేడ వేసినా మరింత శుభకరంగా భావిస్తారు. ప్రస్తుత కాలంలో బహుళ అంతస్తుల్లో గోవును తిప్పటం కుదరదు కనుక ఆ ప్రాంగణంలో ఆవూదూడలను అలంకరించి పూజిస్తారు. గోమయాన్ని, గోమూత్రాన్ని ఇంట్లో చిలకరిస్తారు.

అరుణాచలం గిరి ప్రదక్షిణ 14కి.మీ. నడవలేని వాళ్ళు ఎం చెయ్యాలి?

 ప్రశ్న:అరుణాచలం గిరి ప్రదక్షిణ 14కి.మీ. నడవలేని వాళ్ళు ఎం చెయ్యాలి?




 నేను 1కి.మీ. అయితే నడవగలను అంతకు మించి మా వల్ల కాదు అండీ మా ఆరోగ్యరీత్యా అంత దూరం ప్రయాణం చేయలేము మాకు ఆ ప్రదక్షిణ ఫలితం దక్కదా అని బాధపడేవాళ్ళు ఏం చెయ్యాలి?


సమాధానం:అరుణాచలం ప్రదక్షిణ కాలికి ఆపరేషన్ చేసి మీరు నడవలేరు ఎక్కువ దూరం అన్నవాళ్ళు కూడా 14కి.మీ. ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహముతో గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఇప్పటికీ కూడా చేస్తుంటారు.శతవిధాలా ప్రదక్షిణ చెయ్యడానికి ప్రయత్నించండి.


 ఇంకా ఆరోగ్యరీత్యా నా వల్ల అవ్వదు అనుకునేవాళ్ళు అరుణాచలం ప్రధాన దేవాలయం అదే అగ్ని లింగం ఉండే ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు అరుణాచలేశ్వరుడి నామ స్మరణ చేస్తూ చేసినా అదే ఫలితం వస్తుంది అని భగవాన్ రమణ మహర్షి చెప్పారు. ఇది శాస్త్రంలో కూడా చెప్పబడింది.


లేదండీ ఇది కూడా మా వల్ల అవ్వదు అనుకుంటే అరుణాచలం గర్భాలయం వెనుక వైపు పేయి గోపురం ఉంటుంది దానిలో నుంచి వస్తుంటే మీకు కుడి వైపు ఒక గేట్ కనిపిస్తుంది(ఇది గర్భాలయం వెనుక పేయి గోపురం మధ్యలో ఉంటుంది) ఆ గేట్ తీసి లోపలికి వెళ్తే ఒక చిన్న మండపంలో ఈ క్రింది ఫొటోలో ఉన్న పాదాలు కనిపిస్తాయి.అవి సాక్షాత్తు అరుణాచలేశ్వరుడి పాదాలు వాటికి నమస్కారం చేసుకుని నామ స్మరణ చేసుకుంటూ మూడు ప్రదక్షిణలు చేస్తే అరుణాచలం గిరి ప్రదక్షిణ ఫలితం వస్తుందని పెద్దలు చెప్తారు.ఇవి ప్రదక్షిణ ఫలితం కావాలి అనుకునే వారికోసం మాత్రమే.


 అరుణగిరికి ప్రదక్షిణ చెయ్యలేని వాళ్ళు వీటికి చేసుకోవడం ఉత్తమం.


కానీ జీవితంలో ఒక్కసారైనా అరుణగిరికి పాదచారియై ప్రదక్షిణ చేస్తుంటే అస్సలు ఆ ప్రశాంతత,ఆనందం(ప్రదక్షిణ ఫలితం దేవుడెరుగు) వర్ణించడం ఎవ్వరికీ సాధ్యం కాదు.మనస్సు చిందులేస్తుంది అంతే.ఈ ఆనందం,ప్రశాంతత కోసమే చాలామంది ప్రదక్షిణ ఖచ్చితంగా నియమం పెట్టుకుని చేస్తుంటారు.అందుకే విశ్వ ప్రయత్నం చేసైనా సరే అరుణగిరికి ఒక్క ప్రదక్షిణ చెయ్యాలి అంటారు అంత అద్భుతంగా ఉంటుంది. చాలామంది ఈ ప్రదక్షిణ కోసం జీవితాలు జీవితాలు ఇచ్చేస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు.


ఆ ప్రదక్షిణ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే

 అది అమోఘం,

అపూర్వం, 

అనంతం,

చిత్ ప్రకాశం, 

సచ్చిదానందం,

సకల మంత్ర స్వరూపం,

సకల మంగళ దాయకం,

సర్వ సమ్మోహనం,

సకలము మోక్షసిద్ది.


☘️🔱🕉️🔱☘️ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః☘️🔱🕉️🔱☘️