Thursday, May 17, 2018

Arishadvargas అరిషడ్వర్గాలు..



Arishadvargas


అరిషడ్వర్గాలు..

Image result for అరిషడ్వర్గాలు

దాన గుణములు…అష్టవిధ పుష్పములు దుఃఖాలకు మూలమైన అరిషడ్వర్గాలు


1.కామము – ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము.
 2. క్రోధము – కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.
 3. లోభము – కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడము.
 4. మోహము – తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.
 5. మదము – తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.
 6. మాత్సర్యము – తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము.

 ఈ అరిషడ్వర్గాలు శరీరములో చేరి మంచితనాన్ని దొంగిలించి చెడు కర్మలను కలిగించడానికి కారకులగుచున్నారు. అరిషడ్వర్గాలనే దొంగలనుండి జాగ్రత్త వహించితే ముక్తికి మార్గము సులభమవుతుంది.

 దైవత్వము సిద్ధించే దాన గుణములు

1. రజోగుణ దానము – వచ్చినవారు చిన్నవారైననూ, పెద్దవారైననూ విసుగుకుంటు, పాత్రమెరుగక, నేను ధనవంతుడను నేను ఎంత ఇచ్చినా ఫర్వాలేదని తన అంతస్థుకు తక్కువగా ఎడమచేతితో పడవేయిట ఇది రజోగుణదానము. నిరర్ధకము.
2. తమోగుణదానము – పాత్రమెరుగకుండ, ఎవరు ఎంత దానము చేసినారో చూసి, ఎదో నల్గురు ఇచ్చినారు మనమివ్వకుంటే బాగుండదు అని ఎంతో కొంత ఇచ్చుట, ఇది తమోగుణదానము. నిష్ప్రయోజనము.
3. సత్వగుణదానము – వచ్చినవారు చిన్నవారైన,పెద్దవారైన సమానంగా చూసి, మాట్లాడి పాత్రమెరిగి తన అంతస్థుకు తగినట్లుగా, దానము చేయుట, ఇది సత్వగుణదానము మానవులకు శ్రేష్టము.

భగవంతుని అనుగ్రహముకై అష్టవిధ పుష్పములు

1. అహింస – (జీవహింస చేయకుండుట) ప్రధమ పుష్పము.
2. ఇంద్రియ నిగ్రహము – (మాట్లాడకుండ, వినకుండ, కళ్ళతో చూడకుండ ఉండడము) పరమత్మునికి రెండవ పుష్పము.
3. సర్వభూతదయ – (పేదవారిని, రోగులను, నిస్సహాయులను ఆదరించుట, ఆకలిగొన్నవారికి అన్నం పెట్టుట మొదలగునవి) మూడవ పుష్పము.
4. శాంతము – (అపకారము చేసిన వారికి ఉపకారము చేయడము, జరిగినది మన కర్మానుసారముగా వచ్చినదని భావించడము) నాల్గవ పుష్పము.
5. క్షమ – (తాను చేసిన తప్పులకు క్షమాపణ కోరడము, ఇతరులు చేసిన తప్పులను క్షమించడము) ఐదవ పుష్పము.
6. జ్ఞానము – (తెలియనిది తెలుసుకోవడము) ఆరవ పుష్పము.
7. తపము – (సదాదేవుని తలంచుటయే తపస్సు అనెడి) ఏడవ పుష్పము. 8 సత్యము (సత్యమును తెలుసుకొనుట) ఎనిమిదవ పుష్పము.

No comments:

Post a Comment