Friday, January 25, 2019

Vagkupada Maharshi

వ్యాఘ్రపాద మహర్షి
Image result for వ్యాఘ్రపాద మహర్షి

వ్యాఘ్రపాద లేదా వ్యాఘ్రపాద మహర్షి లేదా వ్యాఘ్రపాదుడు అనగా వ్యాఘ్రము వలె చరించువాడు అని అర్ధము. పాదములు వ్యాఘ్రము యొక్క పాదములు వలె ఉండును కాన వ్యాఘ్రపాదుడు అని, వ్యాఘ్రము వాలె చరించు వాడు అని అర్ధము.
కృతయుగములో ధర్మ ప్రవచన దక్షుడు, వేద వేదంగ విదుడు, జంతువుల యెడల భయంకరముగా చరించు వాడు, అయిన ఒక మహా ముని పేరు వ్యాఘ్రపాద లేదా వ్యాఘ్రపాదుడు.
పురాణము మందు వ్యాఘ్రపాదుడు అనే ఒక ఋషి ఉన్నట్లు చెపుతుంది మరియు వ్యాఘ్రపాదునకు, భారతదేశం యొక్క తమిళనాడు లోని చిదంబరంలో ఆలయ ప్రాంగణంలో ఉన్నతన అభిమతంలో నటరాజుగా ఉన్న శివుడు యొక్క నిత్య పూజ అందించటం కోసం, తేనెటీగ చే తాకబడని తాజా పుష్పాలు సేకరించే యొక్క పని అప్పగించబడుతుంది. అయితే, పువ్వులు కోసి సేకరించే సమయములో వ్యాఘ్రపాదుడు ముళ్ళు మరియు కఠినమైన ఉపరితలాలపై గాయపడిన సందర్భాలు ఉంటాయి. అందువల్ల ఈ సందర్భములో శివుడు అతనికి పులుల పాదాలను ప్రదానం చేయడంతో ఆ విధంగా ఈ ముని దుఃఖం ముగిసింది.

పూర్వకాలవర్ణన

తన చిత్రం మరియు చిత్రకథ మానవుడు, కానీ ఒక పులి కాళ్ళుతో ఉన్నఅతనిని వర్ణిస్తుంది. అతను కూడా ఒక పులి వలె ఉన్న తోక కలిగి ఉన్నట్లు చూపించారు. సాధారణంగా, అతను పతంజలి లతో కలిసి ఉన్నట్లు చూపినారు, మరియు ఇద్దరూ కలిసి తన మనసులో నటరాజు రూపంలో ఉన్న శివుడును మర్యాదగా ఆరాధిస్తున్నట్లు చిత్రీకరిస్తున్నారు.

వివాహము

వ్యాఘ్రపాద మహర్షి ఒక మునికన్యను వివాహము చేసుకొని గృహస్థ ఆశ్రమ ధర్మములు ఆచరించెను.

పిల్లలు

వ్యాఘ్రపాదునకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు ఉపమన్యుడు, రెండావ కుమారుడు ధౌమ్యుడు. ఉపమన్యుడు, ధౌమ్యుడు తల్లి అనుమతితో శివుడు యొక్క అనుగ్రహంతో ఉపమన్యువు మహాజ్ఞాని, మహాయోగి అయ్యాడు. అలాగే ధౌమ్యుడు మహర్షి అయ్యి, పాండవులకు పురోహితుడు అయ్యాడు.

Vagkupada Maharshi

Vagkupada Maharshi

Vagkupada Maharshi

భగీరథప్రయత్నం

భగీరథప్రయత్నం

వెండికొండమీద అర్ధనిమీలిత నేత్రాలతో ధ్యాననిమగ్నుడై ఉన్నాడు పార్వతీపతి. ఇంతలో తననెవరో ఆర్తితో పిలుస్తున్నట్లుగా అనిపించింది. ఎవరా ఆ పిలుస్తున్నది అని తరచి చూశాడు. భూలోకంలో భగీరథుడనే మహారాజు తనకోసం తీవ్రమైన తపస్సు చేస్తూ, కనిపించాడు. అతని తపస్సులోని నిస్వార్థాన్ని తెలుసుకున్న ముక్కంటి క్షణం కూడా ఆలసించకుండా వెంటనే వెళ్లి భగీరథుడి ముందు నిలిచాడు.

‘‘వత్సా! నీ తపస్సు నన్ను మెప్పించింది. ఏమి కావాలో కోరుకో’’ అన్నాడు మేఘగంభీరమైన స్వరంతో పరమేశ్వరుడు.
ఉలిక్కిపడి కన్నులు తెరిచాడు భగీరథుడు. ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ, అభయ హస్తంతో సాక్షాత్కరించిన ముక్కంటిని చూడగానే సంభ్రమాశ్చర్యాలతో  నోటమాట రాలేదు భగీరథునికి.

భక్తిపారవశ్యం నుంచి తేరుకున్న తర్వాత తానెందుకోసం తపస్సు చేసిందీ శివుడితో చెప్పసాగాడిలా ‘‘సర్వజ్ఞులైన మీరు ఎరుగనిది కాదు నా గాథ. అయినా, చెప్పడం నా ధర్మం.  సుమారు లక్షసంవత్సరాల క్రితం సగరుడనే చక్రవర్తి లోకకల్యాణం కోసం అశ్వమేధ యాగం యాగం చేశాడు. చివరలో యాగాశ్వాన్ని వదిలిపెట్టాడు. దానిని అనుసరించి, ఆ రాజుకు జన్మించిన 60 వేలమంది కుమారులూ వెళ్లేవారు. అది అన్ని రాజ్యాలకూ వెళ్లి, యథేచ్ఛగా సంచరించేది. ఆయా రాజులందరూ దాని రాకను గౌరవించి, సగరుడికి సామంతులుగా మారి పోయేవారు. చివరికో రోజున ఆ అశ్వం రాజపుత్రులందరి కళ్లూ కప్పి, ఎవరికీ కనిపించకుండా ఎటో వెళ్లింది. రాజుకీవిషయం తెలిసి, దాన్ని వెతుక్కురమ్మని కుమారులను పంపాడు. అశ్వం లేకుండా రాజ్యంలోకి అడుగుపెట్టనివ్వనని చెప్పాడు.

రాజకుమారులు యాగాశ్వం కోసం భూమండలమంతా వెదికినా ప్రయోజనం లేకపోవడంతో పాతాళంలో వెదకాలని నిశ్చయించుకుని ఒక్కొక్కరు ఒక్కో యోజనం చొప్పున భూమిని తవ్వుతూ పాతాళంలోకి ప్రవేశించారు. ఆశ్చర్యం! వారికి పాతాళంలో వారి అశ్వం ఒక బయలులో పచ్చిక మేస్తూ కనిపించింది. దాని చెంతనే కపిలముని తపస్సులో నిమగ్నమై ఉండటం చూసి, ఆయనే తమ అశ్వాన్ని బంధించాడేమోనని భావించి, ఆయన గడ్డం పట్టుకుని లాగారు. తపోభంగం కావడంతో కళ్లు తెరిచి వారి వంక చుర్రున చూశాడు కపిలముని. ఆ కన్నుల నుండి అగ్నికీలలు వెలువడి వారందరూ బూడిద కుప్పలుగా మారిపోయారు. సగరపుత్రులు ఎంతకాలానికీ రాజ్యానికి చేరుకోకపోవడంతో వారికోసం అన్వేషిస్తూ వారి వారసుడైన అంశుమంతుడు పాతాళ లోకానికిళ్లాడు. అక్కడ బూడిద కుప్పలుగా మారిన పితరుల భస్మరాశులను, పక్కనే తపోధాన్యంలో లీనమై ఉన్న కపిలమునిని చూసి, విషయం గ్రహించి, మునిని ప్రార్థించాడు.

అప్పుడు ముని, శివుని శిరస్సుపై ఉన్న గంగ వచ్చి, వీరి భస్మరాసులపై ప్రవహిస్తే వీరికి మోక్షం కలుగుతుందని చెప్పాడు. నాటి నుంచి మా వంశంలోని వారందరూ గంగను భువికి రప్పించేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తూ వచ్చారు. చివరికి నేను ఎలాగైనా సాధించాలని మిమ్ములను ప్రార్థించాను స్వామీ, కాబట్టి దయచేసి మా పితరులకు సద్గతులు కలగడంతోపాటు, అందరి పాపాలనూ ప్రక్షాళన చేయగల పరమ పావనమైన గంగను దయచేసి నాతో పంపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను’’ అని కోరాడు. 

అతని వినయానికి, పట్టుదలకు ముగ్ధుడైన శివుడు ‘‘భక్తా! గంగను నీ వెంట పంపడానికి నాకెటువంటి అభ్యంతరమూ లేదు కానీ, దివి నుంచి జాలువారే గంగాప్రవాహ ఉద్ధృతిని తట్టుకోవడం ఎవరి తరమూ కాదు, గంగా ప్రవాహంతో భూమిలో ఎన్నో విధ్వంసాలు జరుగుతాయి. అందువల్ల నేను ఇక్కడే కూర్చుని, గంగాప్రవాహ వేగాన్ని నా జటాజూటాలతో నిలువరిస్తాను’’ అని వరమిచ్చాడు.

మాట మేరకు శివుడు దివి నుంచి మహోద్ధృతవేగంతో దుముకుతున్న గంగను తన జటాజూటాలతో బంధించి, ఏడు పాయలుగా చేసి, భూమి మీదకు వదిలాడు. అయినప్పటికీ గంగాప్రవాహ వేగానికి జహ్నుమహర్షి ఆశ్రమం మునిగిపోవడంతో ఆయన కోపించి, గంగను ఒక్క గుక్కలో ఔపోసన పట్టేశాడు. భగీరథుని ప్రార్థనకు తన చెవి నుంచి వదిలిపెట్టాడు. జాహ్నవిగా మారిన గంగ అనేక దేశాలు, రాజ్యాలు, నగరాలు దాటుకుంటూ వచ్చి, చివరికి భగీరథుడి ముత్తాతల భస్మరాశుల మీద ప్రవహించి, వారికి ఉత్తమ గతులు కల్పించింది. అలా దివి నుంచి గంగను భువికి రప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి నందువల్ల భగీరథ ప్రయత్నమనే నానుడి ఏర్పడింది. అలాగే భగీరథుని అనుసరించి వచ్చింది కనుక గంగకు భాగీరథి అనే పేరు స్థిరపడింది. పరమశివుని భక్తవత్సలతను, ఒక మంచి ప్రయత్నం చేయడానికి ఎన్నో ఆటంకాలను, అవరోధాలను అధిగమించాలని ఈ ఉదంతం నిరూపిస్తోంది.

Who are Ashiwini Gods?

Who are Ashiwini Gods?

అశ్వినీ దేవతలు

అశ్వినీ దేవతలు పురాణ పురుషులు మరియు కవలలు. వీరు సూర్యునికి, ఛాయాదేవికి అశ్వ రూపంలో ఉండగా సంభోగించుట మూలంగా జన్మించారు. మహాభారతంలో పాండురాజు పత్ని మాద్రికి మంత్ర ప్రభావము వలన నకులుడు మరియు సహదేవుడు జన్మించారు. వీరు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుండి నేర్చుకొని ఇంద్రునికి నేర్పినట్లు చెబుతారు.
Who are Ashiwini Gods?

పురాణ కథనం

అశ్వినీ దేవతలు సూర్యపుత్రులు వీరు కవలలు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుందట. ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పుదిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్యవర్తం. అది హిరణ్యయానమనే దోవలో వాయువేగ మనోవేగాలతో ప్రయాణిస్తుంది. ఆ రథం చాలా బృహత్తరమైనది. అది హిరణ్యంతో నిర్మించబడింది. ఆ రథానిని మూడు గుర్రాలు నడుపుతుంటాయి. అద్వరాశ్వాలనే ఆగుర్రాలు తెల్లగా నున్నగా ఎల్లప్పుడూ యవ్వనంతోత్యంత ఉత్సాహంతో ఉంటాయి. చిత్రమైన ఈ రథానికి చక్రాలూ మూడే. సారధి కూర్చోవడానికి త్రిఫలకాలు మరియు త్రిబంధురాలు అనే పేర్లు కలిగిన మూడు ఆసనాలు ఉంటాయి. ఆరథంలో ఓకవైపు ధనం మరొకవైపు తేనె, సోమరసం మరొకవైపు ఆయుధాలు ఉంటాయి. రథం పైభాగంలో వేయిపతాకాలు సుందరంగా రెపరెపలాడుతూ ఉంటాయి. అశ్వినీ దేవతల కంఠద్వని శంఖనాదంలా మధురంగా ఉంటుంది. ఈ దేవతలను అంతా వేదమంత్రాలతో ఆహ్వానిస్తుంటారు. ఉపాసకుల మంత్రాలలోని సత్యాన్ని మాత్రమే గ్రహించి వారిని అనుగ్రహిస్తుంటారు. వీరి చేతిలో తేనె, సోమరసం మరియు మంచుతో అద్దిన బెత్తంతో యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో సుతిమెత్తగా తాకి వారిని అనుగ్రహిస్తుంటారు. వేదాలలో అశ్వినీ దేవతల వర్ణన ఉంది. వేదాలలో వీరి గురించి నూరు దాదాపు సూక్తాల వరకు ఉంది. వీరిని ఆది వైద్యులుగా పురాణాలు వర్ణించాయి. ఈ దేవతలు దయార్ధ హృదయులు, ధర్మపరులు మరియు సత్యసంధులు. వీరి ఆయుధాలలో అత్యంత ప్రభావితమైన మహా ఔషధాలు ఉంటాయి. వీరు ఆరోగ్యసమస్యలు ఉన్నవాళ్ళను అనేక సమయాలలో ఆహ్వానంపై వచ్చి శస్త్రచికిత్సలు సైతం చేసినట్లు పురాణ వర్ణన. వైద్యశాస్త్రానికి అధిపతులైన ఈ దేవతలు కుడిచేతిలో అభయముద్ర ఎడమచేతిలో ఆయుర్వేద గ్రంథం కుడిపక్కన మృతసంజీవిని విశల్యకరణి లాంటి ఔషధీ లతలు ఎడమవైపు అమృతకలశాన్ని పట్టుకున్న ధన్వంతరీ కలిగి ఉంటారని పురాణాలలో వర్ణించబడింది. ఈ దేవతలు విరాట్పురుషుని నాశికాభాగంలో ఉంటారు.
Who are Ashiwini Gods?

Image result for అశ్వినీ దేవతలు
Who are Ashiwini Gods?

Wednesday, January 16, 2019

Makara Sankranti Celebrations

Makara Sankranti Celebrations

Importance of Makara Sankranti

*🙏🏼సంక్రాంతి సంబరాలు🙏🏼*

తెలుగు వారి పెద్దపండుగ సంక్రాంతి.
నెల రోజులపాటు జరుపుకునే పండగ సంక్రాంతి. మనం జరుపుకునే పండుగలన్నీ ఏదో దైవానికి సంబంధించినవే.!
కానీ సంక్రాంతి పండుగ మాత్రం పంటల పండుగ. రైతుల పండుగ. కళాకారుల పండుగ. ఈ పండుగ కు మూలపురుషుడు రైతన్న.ఆరుగాలం పంటపొలాలలో శ్రమించే రైతన్న చేసుకునే పండుగ ఇది.
తన పంట కోతకొచ్చినప్పుడు ఉదయం నుంచీ అర్ధరాత్రి వరకు పొలంలో కష్టపడిన రైతన్నకు కళాకారులు అందరూ అండగా నిలబడతారు.వాళ్ళ వివరాలు తెలుసుకుందాం.
       
బుడబుక్కలవాడు:
ఈ పండుగ కళారూపాలలో తొలి తాంబూలం బుడబుక్కలవానిది.
పగలంతా కష్టపడిన రైతన్న రాత్రికి నడుం వాలిస్తే కళ్ళంలోని ధాన్యాన్ని దొంగలు తరలించుకు పోకుండా తొలిఝూములో ఊరి పొలిమేరలలో సంచరిస్తూ క్రొత్తవాళ్ళను గ్రామంలోకి చొరబడనీకుండా 'కట్టు' కట్టి కట్టడి చేసేవాడు బుడబుక్కలవాడు.ఇతను తొలిఝామంతా పంటకు కాపలా కాసి రెండోఝాము ప్రవేశిస్తుండగా జంగం దేవరకు ఆ పని అప్పచెబుతాడు
Image result for బుడబుక్కలవాడు:

        జంగందేవర:

సాక్షాత్తూ శివుని అవతార అంశలుగా భావించే ఈ జంగందేవరలు శంఖనాదాలతో ఢమరుక శబ్దాలతో రైతుల కళ్ళాలకు ఊరి ప్రజానీకానికి శుభం పలుకుతూ పరమశివుని ఆశీస్సులను అందించే కాపాలికుడు ఈ జంగందేవర!
 
Image result for జంగందేవర:

           హరిదాసు:
'హరిలో రంగ హరి'అంటూ శ్రీకృష్ణుని గాధలను కీర్తిస్తూ ఇంటింటి ముంగిటికీ వచ్చి పొలం వెళ్ళిన రైతుల క్షేమసమాచారాలను వాళ్ళ ఇళ్ళలో తెలుపుతూ హరినామసంకీర్తనామృతాన్ని దోసిళ్ళతో అందించి దోసెడు బియ్యాన్ని కృష్ణార్పణమంటూ స్వీకరిస్తాడు.ఆ యదుకులేశుని ఆశీస్సులను తన ద్వారా మనకు అందిస్తాడు.
Image result for హరిదాసు:

                 గంగిరెడ్లు:

హరిదాసు ఇంటిలోని వారిని పలకరించి ఇంటి ఆడపడుచులు వేసిన రంగవల్లులపై కృష్ణపరమాత్మ ఆశీస్సులు కురిపించాక 
 'అయ్యగారికి దండం పెట్టు
 అమ్మగారికి దండం పెట్టు
 బాబుగారికి దండంపెట్టు
 పాపగారికి దండం పెట్టూ'
అంటూ బసవన్నల చేత దండాలు పెట్టించి,రైతు బ్రతుకుకు అంతా తానై నడిపే ఎడ్లను అలంకరించి ఇంటి ముంగిట్లో ఎడ్ల ఆట ఆడించి ఇంట్లోని చిన్నా పెద్ద అందరినీ అలరించిన గంగిరెద్దుల వాళ్ళు సన్నాయి ఊదుకుంటూ వెళ్ళిపోతారు
Image result for గంగిరెడ్లు:

            పిట్టలదొరలు:

గంగిరెడ్లు, డూడూ బసవన్నలు వెళ్ళాక మనలను నవ్వులలో ముంచెత్తే కబుర్ల పోగు,కోతలరాయుడు పిట్టలదొర వస్తాడు. తనకు ఆరేబియా సముద్రంలో ఆరువేల ఎకరాల భూమి ఉందని,బంగాళాఖాతంలో బంగ్లాలున్నాయని ఆ బంగ్లాలకు వెళ్ళడానికి సరైన దారిలేక ఈమధ్యనే బొప్పాయి కలపతో బ్రహ్మాండమైన బ్రిడ్జి కట్టించాననీ అవన్నీ పిల్లలు అడిగితే ఇచ్చేస్తానని డంబాలు పోతాడు.పిల్లలందరికీ నవ్వుల పువ్వులు పంచుతాడు

                  సోదెమ్మ

  సోదెమ్మ వెళ్ళిన తరువాత మన భవిష్యత్ ఫలాలను చెబుతానంటూ
'సోదె చెబుతానమ్మా సోదె చెబుతాను
ఉన్నదున్నట్టు చెబుతాను లేనీదేమీ చెప్పను తల్లీ'అంటూ మన భావిలో జరగబోయే వాటి గురించి తనకు తోచింది చెప్పి ఇంత ధాన్యం, పాతచీర,రవికల గుడ్డ పెట్టించుకుని పోతుంది.

                   భట్రాజులు:

ఆరు నెలల కష్టానికి ఫలితం వచ్చేవేళలో ధాన్యాన్ని ఇంటికి తరలించే సమయంలో రైతుల కళ్ళాలలోకి వెళ్ళి రైతుని ఆతని వంశాన్ని ఆతని పెద్దలనూ పొగడుతూ ఆ రైతు కుటుంబం నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవిస్తూ పద్యాలల్లి ఆశీస్సులను వెదజల్లి ఓ కుంచెడో రెండు కుంచాలో ధాన్యాన్ని కొలిపించుకుని భుజాలకెత్తుకుంటారీ భట్రాజులు.

                   కొమ్మదాసర్లు:

అన్ని పనులు పూర్తి చేసుకున్న తరువాత కాస్త నడుం వాల్చి విశ్రాంతి తీసుకుందామనుకుంటే ఈ కొమ్మదాసరోడు వచ్చి పెరట్లో చెట్టుకొమ్మనెక్కి 'అప్పయ్య గోరో పడతా పడతా నే పప్పుదాకలో పడతా,పడతా పడతా నే పాతరగోతిలో పడతా'అంటూ అల్లరి చేస్తాడు.అమ్మలక్కలు,పిల్లలు చెట్ల క్రింద జేరి క్రిందకు దిగమని బ్రతిమాలతారు.ఆ పాతరగోతి మీద పాతబట్టలు పరచమని చెప్పి వాటిని పట్టుకెడతాడు.
ఇక్కడ పాతరగోతి గురించి చెప్పాలి.పూర్వం పండిన పంటను ఇంటికి తెచ్చి పెరట్లో గొయ్యి తవ్వి ఆ గోతిలో తాటాకులు కొబ్బరాకులు పరిచి వాటీపైన గడ్డి పరిచి మెత్తను తయారుచేసి ఆపైన ధాన్యం పోసి నిలవచేసే వారు.
దీనినే పాతరగొయ్యి అంటారు.పొద్దన్నుంచి పని చేసి చేసి అలసి సొలసి నిద్రపోతారేమో ఇదే సందని దొంగలు ఆ గోతిని తవ్వి పండిన పంటనంతా దోచుకుపోవచ్చు.మీ పాతరగొయ్యి సరిగా ఉందో లేదో ఓ సారి చూసుకోండి అని చెప్పడానికి ఈ కొమ్మదాసరి వస్తాడు.
ఈవిధంగా ఇంతమంది కళాకారులు నెలరోజుల పాటు రైతుల పంటలకు కాపలా కాస్తూ రైతుల క్షేమాన్ని కాంక్షిస్తూ మన పొలాలకు పహారా ఇస్తారు.
మనకింత సాయం చేసిన వాళ్ళకు మనమేమిస్తున్నాము???
నాలుగు గుప్పెళ్ళ బియ్యం,నాలుగు పాత గుడ్డపీలికలు.
ఇంటిల్లిపాది మంచిని కోరుకుంటూ మన ముంగిటికొచ్చే కళాకారులను ఆదరించండి!!!
వెండితెరపై, బుల్లితెరపై ఓ సారి కనబడిన వాళ్ళందరికీ వేలు,లక్షలు పోసి వాళ్ళ వెకిలి చేష్టలను ఆనందించేకన్నా మన సౌఖ్యాన్ని,మన సౌభాగ్యాన్ని కోరుకునే ఈ పల్లె కళాకారులను అక్కున జేర్చుకుందాం!!!!!!

ఈ పండుగను కేవలం మత సంబంధమైనదిగా కాక సాంప్రదాయాల, అనురాగ ఆప్యాయతల,పల్లెటూరుల వైభవాల, రైతుల ఆనందాల పండుగగా చెప్పాలి. ఈ మూడు రోజుల పండుగ గురించి క్లుప్తంగా..,

సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం  సంక్రాంతి.  సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరిమాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.
 
ఆంధ్రులకు పెద్ద పండుగ సంక్రాంతి. కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు  అనగా భోగి, మకర సంక్రమణం, కనుమ  కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు నాలుగోరోజు ముక్కనుమ గా జరుపుతారు. కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో  రైతులు ఈ పండుగ జరుపు కుంటారు  కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.

నిజానికి ధనుర్మాసారంభంతో నెల రోజులు ముందుగానే సంక్రాంతి వాతావరణంతెలుగునాటప్రారంభమవుతుంది. ఈ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతాయి. బుడబుక్కలవాళ్లు, పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు. స్త్రీలు  ఈ పండుగ నెలరోజులు  - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను  రంగవల్లులు,  గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి. భోగినాడు  భోగిమంట విధిగా వేయవలసిందే. ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్లు ఇస్తారు. ఈ పెద్ద పండుగకు కొత్త అల్లుడు  తప్పనిసరిగా అత్తవారింటికి వస్తాడు.  మరదళ్ల ఎకసెక్కాలకు ఉడుక్కుంటాడు. కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుగుతాయి. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.
మొదటి రోజు  భోగి
ఇది సాధారణంగా జనవరి 14న జరుపుతారు. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని  ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక  ఇంట్లో ఉండే పాత చీపుర్లూ,  తట్టలూ, విరిగిపోయిన బల్లలూ వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా వాటిని ఈ రోజున భోగి మంటలు లో వేసి వెలిగిస్తారు.
సాయంత్రం పూట చాలా ఇళ్ళలో స్త్రీలు, చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను  ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు,పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టితొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో  పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ.

రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో  అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. 
 సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు.  చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు,  సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టుఅంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు.కొత్త దాన్యము వచ్చిన సంతోషంతో మనము వారికి దాన్యమ్ ఇస్తాము.      హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.
మూడవ రోజు కనుమ... రైతులు వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్న పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి ఈ పండుగ జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం  నిషేధించింది. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. 
కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశం లోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. 
మూడురోజులపాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నడనే సంకేతం. దక్షణాయంలో ఉండే నిద్ర బద్దకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే బోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలపసామానులు, వస్తువులు, ఎండుకొమ్మలు లాంటివి బోగి మంటలో వేసి తగులబెడుతారు. వీటన్నిటినీ దారిద్ర్య చిహ్నాలుగా బావించి తగులబెట్టాలంటారు. వేసవిలో వేడికి తగులబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగిఉంది.
భోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.♦

*కనుమ ఇలా...* 

రైతన్నకీ వ్యవసాయానికీ వెన్నుదన్నుగా నిలిచే వృషభరాజాల పట్లా, పాడిపశువుల పట్లా కృతజ్ఞత తెలిపే రోజు కనుమ. దీన్నే కొన్ని ప్రాంతాల్లో పశువుల పండగగా వ్యవహరిస్తారు. ఆ రోజు పశువులకూ, జోడెడ్లకూ బొట్టుపెట్టి పసుపురాసి దండం పెడతారు. పశువుల కొట్టంలో పొంగలి చేసి, మూగజీవాలకు వడ్డిస్తారు. ఆ పొంగలిలోనే కొద్దిగా పసుపూ కుంకుమా కలిపి పొలాల్లో చల్లుకుంటారు. దీన్నే పొంగలి చల్లడం అంటారు. కనుమనాడు మినుము తినాలన్నది పెద్దలు చెప్పేమాట. అందుకే ఆ రోజు మినపగారెలూ, ఆవడలూ తప్పక చేస్తారు. పెద్దపండగకు చేసే పిండి వంటలు శరీరానికి పుష్టినిస్తాయి. రంగవల్లులూ, గొబ్బెమ్మలూ ఇంటికి కొత్త కళను తీసుకువస్తాయి. గొబ్బిపాటలూ, హరినామ సంకీర్తనలూ పల్లెకు సందడిని తీసుకువస్తాయి... ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండగలో జరిగే ప్రతి ఆచారం మనిషిని ప్రకృతితో జతచేసేదే. బంధుత్వాలని కలుపుతూ ఆనందాలని పంచుతూ మనుషులందరినీ ఒక్కటి చేసేదే ఈ పండగ.!