What is Money?
డబ్బు
🌻🌸🌻
లక్ష్మినే మనము వాడుకలో"డబ్బు" అంటాము. కాని లక్ష్మి ఎప్పుడూ నారాయణునితో ఉంటుంది.అనగా ఎక్కడైతే
నారాయణుని(దేవుని)
కార్యక్రములు అనగా! పూజ,జపము, నామస్మరణ, సేవ, కార్యములు జరుగునో అచట లక్ష్మి యుండును.
ఇవి లేని నిలయములలో
అలక్ష్మి యుండును.
డబ్బు, లక్ష్మి 4 (నాలుగు) విధములు...
1) ధనము:-
మన వ్యవహారమునకు వాడుకొనునది.
2)లక్ష్మి:-
ఇతరులకు సహాయము
చేయునటువంటిది.
3) మహాలక్ష్మి:-
భగవంతుని కార్యములలో, సత్కార్యములలో ఉపయోగించునది.
4) అలక్ష్మి:-
చెడు అలవాట్లకు, చెడు
కార్యములలో ఉపయోగించునది.
కావున ఒకే డబ్బు దాని
వాడకమును బట్టి దాని నామ, రూపములు మారుచున్నవి. కావున ఏవిధమైన దానికి వాడితే
ఆవిధమైన ఫలితము
వస్తుంది. మానవుడు ఆవిధముగా మారుతాడు.
కావున డబ్బును సన్మార్గములో సంపాదించాలి. సద్వినియోగము చేయాలి.
అపుడే లక్ష్మి తన వద్ద నిలుస్తుంది.
No comments:
Post a Comment