Tuesday, September 1, 2020

*వినాయకుడిని తల లేకుండా పూజించే ఆలయం గురించి* *మీరు విన్నారా?* 🤔🤔

 *వినాయకుడిని తల లేకుండా పూజించే ఆలయం గురించి* *మీరు విన్నారా?* 🤔🤔


:maple_leaf::maple_leaf::maple_leaf:
వినాయకుని గురించి తెలుసుకోవలసిన ఆసక్తికర నిజాలు | Interesting Facts About  Lord Ganesha - Telugu BoldSky


అవును, మీరు సరిగ్గానే విన్నారు! తల లేని వినాయకుడిని పూజించే ఆలయం మన దేశంలో ఉంది.

మంత్రముగ్ధులను చేసే కేదార్ లోయ ఒడిలో ఉన్న ఈ ఆలయం ముండ్కటియా ఆలయం.

గణేష్ ని తల లేకుండా పూజించే ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం ఇది.

ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సోన్‌ప్రయాగ్ నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశాన్ని దేవభూమి అని కూడా అంటారు.

శివ పురాణం ప్రకారం, శివుడు తన కొడుకు గణేశుడి తలను నరికివేసిన ఖచ్చితమైన ప్రదేశం ఇది.

గణేశుని మొండెం మీద ఏనుగు తల స్థిరపడిన ప్రదేశం అదే.

ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే....
ముండ్కటియా అనే పేరు ముండా (తల) మరియు కటియా (తెగిపోయిన) అనే రెండు పదాల కలయిక.

పాత మార్గంలో కేదార్‌నాథ్‌కు ట్రెక్కింగ్ చేసే భక్తులు వినాయక దర్శనం కోసం ఈ ఆలయానికి వెళ్తారు.

కొత్త మార్గం సుపరిచితమైనప్పటి నుండి, కేదార్ లోయ యొక్క అడవి ఒడిలో ఉన్న ఈ ఆలయాన్ని అతి తక్కువ మంది సందర్శిస్తున్నారు. .

సోన్ ప్రయాగ్ వరకు బస్సు, జీప్ సౌకర్యం కలదు. అక్కడ నుంచి నడిచి వెళ్ళి, స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు.

పూజ‌కు….కొబ్బ‌రికాయ‌, అర‌టి పండ్లే ఎక్కువగా వాడ‌తారెందుకో మీకు తెలుసా ??

 


పూజ‌కు….కొబ్బ‌రికాయ‌, అర‌టి పండ్లే ఎక్కువగా వాడ‌తారెందుకో మీకు తెలుసా ??

Coconut And Banana Ritual At Temple - Telugu Devotional Bhakthi(తెలుగు  భక్తి )-TeluguStop

హిందూ దేవాలయాల్లో మాత్రమే కొబ్బరికాయ, అరటిపండ్లు పవిత్రంగా  సమర్పిస్తారెందుకు? | Why only Coconut and Bananas are considered as sacred  offerings in Hindu temples? - Telugu BoldSky

General News,Humanity,Mythology,Psychology,Health, Employment,Biographies:  Banana fruit is a healthy fruit that everyone needs

సాధార‌ణంగా పూజా కార్య‌క్ర‌మాల‌కు కొబ్బ‌రికాయ‌ల‌ను, అర‌టి పండ్ల‌నే ఎక్కువ‌గా వాడ‌డాన్ని మీరు గ‌మ‌నించుంటారు. నాకూ ఇదే విష‌యంపై డౌట్ వ‌చ్చి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశాను. అప్పుడో విభిన్న‌మైన విష‌యం తెల‌సింది. లాజిక్ కూడా క‌రెక్టే అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాను.


కొబ్బ‌రికాయ‌, అర‌టి పండ్లకు ప‌విత్ర‌మైన ఫ‌లాలుగా పేరు..పూర్వ‌కాలం నుండి వీటినే పూజా కార్య‌క్ర‌మాల్లో ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. ఎందుకంటే ఈ రెండూ ఎంగిలికాని పండ్ల కేట‌గిరీలోకి వ‌స్తాయి. కాయ‌ల నుండి చెట్లుగా మారే క్ర‌మంలో మిగితా వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది.


కొబ్బ‌రి కాయ :

ఇత‌ర పండ్లు తిని గింజ‌ను నాటితే అవి మ‌ళ్లీ చెట్లుగా మార‌తాయి. ..కానీ కొబ్బ‌రి మాత్రం మొత్తంగా నాటితేనే మ‌రో చెట్టును ఇస్తుంది.. ఎంగిలి ప‌డ‌ని పండు మాత్ర‌మే కొత్త చెట్టును ఇస్తుంద‌న్న‌మాట‌!


అర‌టి:

అర‌టి కూడా అంతే పండు తిని కేవ‌లం తొక్క‌తో కొత్త చెట్టును పుట్టించ‌లేము…మొత్తంగా నాటితేనే కొత్త అర‌టి వ‌స్తుంది.

కాబ‌ట్టి ఎంగిలి ప‌డ‌ని ఈ పండ్ల‌ను ప‌విత్ర‌ఫ‌లాలుగా భావించి దేవుడికి స‌మ‌ర్పిస్తార‌ట‌!.


కొన్ని ప్రాంతాల్లో సీజ‌న‌ల్ పండ్ల‌ను కూడా దేవుడికి స‌మ‌ర్పించిన‌ప్ప‌టికీ..చాలా వ‌ర‌కు ఈ పండ్ల‌నే మ‌నం పూజాకార్య‌క్ర‌మాల్లో చూస్తుంటాం.