పూజకు….కొబ్బరికాయ, అరటి పండ్లే ఎక్కువగా వాడతారెందుకో మీకు తెలుసా ??
సాధారణంగా పూజా కార్యక్రమాలకు కొబ్బరికాయలను, అరటి పండ్లనే ఎక్కువగా వాడడాన్ని మీరు గమనించుంటారు. నాకూ ఇదే విషయంపై డౌట్ వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేశాను. అప్పుడో విభిన్నమైన విషయం తెలసింది. లాజిక్ కూడా కరెక్టే అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను.
కొబ్బరికాయ, అరటి పండ్లకు పవిత్రమైన ఫలాలుగా పేరు..పూర్వకాలం నుండి వీటినే పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ రెండూ ఎంగిలికాని పండ్ల కేటగిరీలోకి వస్తాయి. కాయల నుండి చెట్లుగా మారే క్రమంలో మిగితా వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది.
కొబ్బరి కాయ :
ఇతర పండ్లు తిని గింజను నాటితే అవి మళ్లీ చెట్లుగా మారతాయి. ..కానీ కొబ్బరి మాత్రం మొత్తంగా నాటితేనే మరో చెట్టును ఇస్తుంది.. ఎంగిలి పడని పండు మాత్రమే కొత్త చెట్టును ఇస్తుందన్నమాట!
అరటి:
అరటి కూడా అంతే పండు తిని కేవలం తొక్కతో కొత్త చెట్టును పుట్టించలేము…మొత్తంగా నాటితేనే కొత్త అరటి వస్తుంది.
కాబట్టి ఎంగిలి పడని ఈ పండ్లను పవిత్రఫలాలుగా భావించి దేవుడికి సమర్పిస్తారట!.
కొన్ని ప్రాంతాల్లో సీజనల్ పండ్లను కూడా దేవుడికి సమర్పించినప్పటికీ..చాలా వరకు ఈ పండ్లనే మనం పూజాకార్యక్రమాల్లో చూస్తుంటాం.
No comments:
Post a Comment