Wednesday, August 7, 2024

శ్రావణ మాసం విశిష్టత

 శ్రావణ మాసం విశిష్టత





శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్ధం.


ఈ నెలలో వచ్చే..._ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్ర మైనవి. 

 ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు.శ్రావణ నక్షత్రం విష్ణుమూర్తి జన్మనక్షత్రం కూడా...


‘శ్రవం నయ తీతి శ్రేణ నీయత ఇతివా శ్రవణం’ వేద వాఙ్మయం


హయ గ్రీవుడనే రాక్షసుడు  వేదాలను అపహరిస్తే విష్ణుమూర్తి హయగ్రీవుడిగా వచ్చి వేదాలను సంరక్షించాడు.  హయగ్రీవుడు అవత రించింది శ్రావణ మాసం.


శ్రావణ శుద్ధ పౌర్ణమి


 జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి,  పోలాల అమావాస్య, నాగ చతుర్థి , నాగ పంచమి  పుత్రదా ఏకాదశి , దామోదర ద్వాదశి ,వరాహ జయన్తి  ఇలా అనేక పండుగలు వస్తాయి.


శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనః కారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము... ఈ...మాసం...


ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగ బోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది.


మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొంద డానికి, ప్రకృతి వలన కలిగే అస్త వ్యస్త అనారోగ్యముల నుండి తప్పించు కొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం...

శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశ మైనది.


శ్రావణమాసం-లక్ష్మీ కటాక్షం


ప్రకృతి సంపూర్ణ కళలతో సౌందర్యం చిందే కాలం శ్రావణ మాసం. ఇది ప్రకృతి మాత యవ్వన దశ అనవచ్చు.


పూర్తిగా సౌభాగ్యానికే ప్రత్యేకంగా కేటాయించబడిన ఉత్తమ నోములు శ్రావణ మంగళవారాల నోములు, దివ్యమైన శుభకరమైన పండుగలతో, పర్వదినాలలో అలరారుతూ భక్తుల పాలిట సౌభాగ్యదాయినిగా నిలిచిన మాసం శ్రావణం. 


చాంద్రమానం ప్రకారం సంవత్సరంలో అయిదవ దివ్యమైన మాసం శ్రావణం. వర్షఋతువు ప్రారంభమయ్యేమాసం. ఈ మాసంలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్ర సమీపంలో ఉండటం చేత ఈ మాసానికి శ్రావణమాస మనే పేరొచ్చింది. 


 ‘శ్రవణం’ విష్ణుమూర్తి జన్మనక్షత్రం. 

శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతి కరమైన వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడంవల్ల విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణమాసం.


 శ్రావణమాసంలో  - -

మంగళవారాలు శ్రీ గౌరీదేవి పూజకు, 

శుక్రవారాలు శ్రీ లక్ష్మీదేవి పూజకు, 

శనివారాలు శ్రీ మహావిష్ణువు పూజకు ఉత్కృష్ట మైనవి. 


శ్రావణమాసంలో సోమవారంనాడు పరమశివుడిని పూజించడం విశేష ఫలితాల నిస్తుంది. 


సోమవారంనాడు శివాలయంలో గానీ, ఇంటిలోగానీ అభిషేకం చేయడంతోపాటు బిళ్వదళముల తో అర్చన చేయవచ్చు. 


భగవాన్ శ్రీకృష్ణుని జననం శ్రావణమాసంలోనే జరిగింది. 

హయగ్రీవుడు, అరవిందయోగి వంటి పుణ్యపురుషులు జన్మించింది ఈనెలలోనే. 

వర్షఋతువు, ఓషధులు, పంటలు, ధనధాన్యాలకు శుభకరమైనది ఈ మాసం. 


ఈ కాలంలో దాడిచేసే రోగాలను దూరంగా పెట్టడానికి ఆహార నియమాలు పాటిస్తూ ఉపవాసాలకూ ప్రాధాన్యత ఇస్తారు.


అంతేగాక దక్షిణాయనంలో దేవతల అనుహ్రం భూమిపై ప్రసరిస్తూ ఉంటుంది. ఈమాసంలో మంగళ గౌరీ, వరలక్ష్మీ వ్రతాలతోపాటు అందరిమదిలో మెదిలేది శ్రావణపూర్ణిమ.


శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మరియు శ్రీకృష్ణాష్టమి. శ్రీకృష్ణుడు భువిపై అవతరించిన పుణ్యదినమే శ్రావణ బహుళ అష్టమి. 


శ్రావణంలో గృహ నిర్మాణాన్ని ఆరంభించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని మత్స్యపురాణం చెబుతున్నది. 


శ్రావణ శుద్ధ చవితిని నాగుల చవితి అని, పంచమిని నాగ పంచమి అంటారు. నాగచతుర్థి నాడు ఉపవాసం ఉండి పుట్టలో పాలుపోసి నాగదేవతను పూజించాలి. 


నాగపంచమినే గరుడ పంచమని కూడా అంటారు. నాగులకు పాలు, పాయసం, నువ్వుల పిండి, చలిమిడి నైవేద్యంగాసమర్పించాలి. దీనివల్ల సర్పదోషం తొలగుతుంది. 


కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలు తమ అయిదోతనం కలకాలంనిలవాలంటే ఈమాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని చేస్తారు. 

పెళ్లయిన సంవత్సరంనుంచి వరుసగా అయిదు సంవత్సరాల పాటు నోము నోచి చివరి సంవత్సరం ఉద్యాపన చేస్తారు. 


 శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము  స్త్రీలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడంవల్ల లక్ష్మీదేవి కృప కల్గి, సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం. 


ఈ వ్రతాన్ని గురించి పార్వతీదేవికి శివుడు ఉపదేశించాడు. శ్రావణ పూర్ణిమను భారతావని మొత్తం ఎంతో పవిత్రంగా భావిస్తారు. 

ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు గల విశిష్టత ఇంతింతని చెప్పనలవికాదు. 


ఈ రోజున చేసే హయగ్రీవ ఆరాధన ఉన్నత విద్యను ప్రసాదిస్తుంది.

చదువుల తల్లి సరస్వతికి గురువు హయగ్రీవుడని దేవీభాగవతం చెబుతోంది. 


శ్రావణపూర్ణిమనే ‘రాఖీపూర్ణిమ’.శ్రావణ బహుళ విదియ శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన తిథిగా చెప్పబడింది.


ఈ తిథి రోజు మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రులు సశరీరంగా సజీవంగా బృందావన ప్రవేశాన్ని పొందారు. లోకానికి భగవద్గీతను ప్రబోధించిన శ్రీకృష్ణ భగవానుడి జన్మదినమే బహుళ అష్టమి. 


బహుళ ఏకాదశి కామ్య ఏకాదశి, శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటారు.

No comments:

Post a Comment