Friday, June 27, 2025

రోజుకు మూడు సార్లు రంగులు మారే శివలింగం..!

 



రోజుకు మూడు సార్లు రంగులు మారే శివలింగం..!


ఈ ఆలయ రహస్యం నేటికీ శాస్త్రవేత్తలు కూడా చేదించలేకపోయారు...

భారతదేశం అంటే భక్తి, శ్రద్ధ, రహస్యాలతో నిండిన పుణ్యభూమి.
ఇందులో ఎంతో మంది తెలిసిన తెలియని దేవాలయాలున్నాయి...
కానీ రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో ఉన్న "అచలేశ్వర మహాదేవ ఆలయం" అనేది ఒక అసాధారణమైన ఆధ్యాత్మిక చిహ్నం.
ఇక్కడ గర్భగుడిలో వున్న శివలింగం రోజుకు మూడు సార్లు రంగులు మారుతుంది!

🕉️ ఉదయం — ఎరుపు రంగు
🕉️ మధ్యాహ్నం — కాషాయ రంగు
🕉️ సాయంత్రం — నలుపు రంగు

ఈ అద్భుతాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుండి భక్తులు పోటెత్తుతారు.
ఇది శివుడి లీలా అని భక్తులు నమ్ముతారు, కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఇప్పటికీ దీని మర్మాన్ని తెలియజేయలేకపోయారు!

📜 ఈ ఆలయం చరిత్రనుసారం 2500 సంవత్సరాల పూర్వం నాటిది అని చెబుతారు.
ఇక్కడి శాంతమైన వాతావరణం, ఆలయ ఆరాధనలు భక్తుల్లో అపూర్వమైన భక్తిభావాన్ని కలిగిస్తాయి.
ముఖ్యంగా సోమవారం రోజున భక్తుల రద్దీ తారాస్థాయికి చేరుతుంది.

🔍 ఈ ఆలయ రహస్యం శివుని మహిమా..? లేక శాస్త్రీయ వాస్తవం..?

🙏 శివుడు అన్నింటికీ సమాధానం!

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు🚩_

 ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు🚩_




🌾🚩ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకువస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకొని తీరమంటూ పెద్దలు చెపుతూ ఉంటారు🌴🚩. 


🚩ఎందుకంటే🚩

 

🚩🌴జ్యేష్ఠ మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి.  అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునేవారు , ఏరు దాటాల్సి వచ్చేవారు... ఈ కాలంలో కాళ్లూ , చేతులను తడపకుండా రోజుని దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం , గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి.

 

🚩🌴ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది.  అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాలబారిన పడకుండా చేస్తుంది గోరింట.


🌾🌴ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింట , వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు , మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నదరుగానే కాకుండా గోళ్లు పెళుసుబారిపోకుండా , గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

 

🌴🚩ఆయుర్వేదం ప్రకారం గోరింటి ఆకులే కాదు పూలు , వేళ్లు , బెరడు , విత్తనాలు... అన్నీ ఔషధయుక్తాలే !  గోరింట పొడిని మందుగా తీసుకోవడం , గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కావైద్యంలో ఉన్నదే ! కేవలం ఆషాఢంలోనే కాదు... అట్లతద్దినాడూ , శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు.

 

🌸ఆషాఢంలో గోరింట పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో , కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటివల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలెర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి.

🚩🌴🚩🌴🚩🌴🚩🌴

Thursday, June 26, 2025

🎻యముడికీ ఓ గుడి..

 🎻🌹🙏యముడికీ ఓ గుడి...!!



🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿మన ప్రాణాలను హరిస్తాడు అని నమ్మే  యమధర్మరాజుకి కూడా ఎంతో భక్తితో పూజలు చేసే గుడి  ఉంది అంటే నమ్మగలరా ?

🌸  అది కూడా  మన తెలుగు రాష్ట్రంలో ఉంది. అక్కడ ఎన్నో విశేష పూజలు అందుకుంటాడు యముడు అంటే ఆశ్చర్యం గా అనిపించినా ...

🌿ఆ ఆలయం విశేషాలు మాత్రం ఆసక్తి కరంగా వుంటాయి.  కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ఉంది ఈ గుడి. 

🌸తమ జాతకాలు బాలేవని,  ఏం చేసిన కలిసి రావట్లేదని, లేదా జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని,

🌿 మానసిక ప్రశాంతత కరువయిందని ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వారు  ఈ ఆలయం లోని యముని దర్శిస్తే ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అని భక్తుల నమ్మకం.

🌸అలాగే శని గ్రహ దోషాలు, జాతక దోషాలు వున్న వారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే ఆ భాధలు నుంచి ఉపశమనం లభిస్తుందిట.

🌿ఇక్కడ మండపంలో గల గండ దీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దణ్ణం పెట్టుకుంటే గండాలన్ని  తొలగిపోతాయి అని కూడా భక్తుల నమ్మకం.

🌸ప్రతి  నెల భరణి  నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ .

🌿అంతేకాదు దీపావళికి రెండు రోజుల తరువాత వచ్చే 'యమ ద్వితీయ' రోజున యముడు తన చెల్లి అయిన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లి,

🌸తిరిగి యమలోకం వెళ్ళే ముందు ఈ రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని ప్రతీతి కదా !

🌿ఆ  రోజున ఇక్కడ  యమునికి విశేష పూజలు నిర్వహిస్తారు . యముని  దర్శించే వారు ముందుగా  గోదావరీ  నదిలో స్నానం చేసి, యమునికి పూజలు నిర్వహిస్తారు.

🌸ఇలా పేరు తలచుకోవటానికే భయపడే యముని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించటం విశేషం గా చెప్పుకోవచ్చు.

🌿పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడికి కార్తికంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

🌸మార్కండేయుడికి,మహా పతివ్రత  సావిత్రికే  కాదు మనకీ వరాలు ఇవ్వటానికి కొలువుతీరి ఉన్నాడు ధర్మపురిలో ఉన్న యముడు ...స్వస్తి...🚩🌞🙏🌹🎻

Tuesday, June 3, 2025

భగవద్గీత ఎందుకు చదవాలి? Why one should read Bhagavad Geetha?

 🙏భగవద్గీత ఎందుకు చదవాలి?🙏
Why one should read Bhagavad Geetha?

🌺కృష్ణం వందే జగద్గురుమ్🌺



 

సంతోషంగా ఉన్నావా ... >>>

భగవద్గీత చదువు.


బాధలో ఉన్నావా ... >>>

భగవద్గీత చదువు.


ఏమీ తోచని స్థితి లో ఉన్నావా ... >>> 

భగవద్గీత చదువు.


ఏదో గెలిచినావా ... >>>

భగవద్గీత చదువు.


ఏదో ఓడిపోయినావా ... 

భగవద్గీత చదువు.


నువ్వు మంచి చేసినావా ... >>> 

భగవద్గీత చదువు.


నువ్వు చెడు చేసినావా ... >>>

భగవద్గీత చదువు.


నువ్వు ఏదో సాధించాలి అనుకుంటున్నావా... >>>

భగవద్గీత చదువు.


నువ్వు ఏది సాధించ లేక పోతున్నావా... >>> 

భగవద్గీత చదువు.


నువ్వు చాలా ధనవంతుడవా... >>> 

భగవద్గీత చదువు.


నువ్వు చాలా బీద వాడివా ... >>> 

భగవద్గీత విను.


నువ్వు సమాజాన్ని బ్రతికించాలని అనుకుంటున్నావా... >>> 

భగవద్గీత చదువు.


నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నావా... >>>

భగవద్గీత చదువు.


నువ్వు మోసం చేసినావా ... >>>

భగవద్గీత చదువు.


నువ్వు మోసపోయినావా... >>> 

భగవద్గీత చదువు.


నీకు అందరూ ఉన్నారా... >>> 

భగవద్గీత చదువు.


నీవు ఒంటరివా.... >>>

భగవద్గీత చదువు.


నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా... >>>

భగవద్గీత చదువు.


నీవు వ్యాధిగ్రస్తుడవయ్యావా... >>>

భగవద్గీత చదువు.


నీవు చాలా విద్యావంతుడవా... >>> 

భగవద్గీత చదువు.


నీవు విద్యా హీనుడవా ... >>> 

భగవద్గీత చదువు.


నీవు పురుషుడవా... >>>

భగవద్గీత చదువు.


నీవు మహిళవా... >>>

భగవద్గీత చదువు.


నీవు ముసలివాడివా ...>>>

భగవద్గీత చదువు.


నీవు యవ్వనస్తుడివా ... >>>

భగవద్గీత చదువు.


దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా ... >>> 

భగవద్గీత చదువు.


దేవుడు లేడు అని అనుకుంటున్నావా .... >>>

భగవద్గీత చదువు.


ఆత్మ అంటే ఏమిటి? తెలుసుకోవాలని అనుకుంటున్నావా... >>>

భగవద్గీత చదువు.


పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నావా...>>>

భగవద్గీత చదువు.


మనిషి జీవితం ఎందుకో తెలుసుకోవాలని అనుకుంటున్నావా ... >>>

భగవద్గీత చదువు.


కర్మ అంటే ఏమిటో  తెలుసుకోవాలని ఉందా... >>>

భగవద్గీత చదువు.


ఈ సృష్టి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని వుందా... >>>

భగవద్గీత చదువు.


పుట్టకముందు మనం ఎవరో తెలుసుకోవాలని వుందా... >>>

భగవద్గీత చదువు.


చనిపోయిన తర్వాత మనం ఏమవుతామో  తెలుసుకోవాలని వుందా... >>>

భగవద్గీత చదువు.


దేవుడంటే అసలు ఎవరో తెలుసుకోవాలని వుందా... >>>

భగవద్గీత చదువు.


నీలో కామం, క్రోధం, లోభం, మొహం, మధం, మాత్సర్యము వంటి అరిషడ్వర్గాలు ఉన్నాయా... >>>

భగవద్గీత చదువు.


నీవు ప్రేమిస్తున్నావా... >>> 

భగవద్గీత చదువు.


నీవు ద్వేషిస్తున్నావా... >>>

భగవద్గీత చదువు.


నీలో వైరాగ్యం ఉందా... >>>

భగవద్గీత చదువు.


జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలని వుందా...>>>

భగవద్గీత చదువు.


బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలని వుందా... >>> 

భగవద్గీత చదువు.


ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలని వుందా... 

భగవద్గీత చదువు.


మోక్షం అంటే ఏమిటో, స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉంటే ...>>>

భగవద్గీత చదువు.


పంచ భూతాలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉన్నాయి? తెలుసుకోవాలంటే.... >>>

భగవద్గీత చదువు.


ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే... 

భగవద్గీత చదువు.


ఇక చివరగా... 

నీవు ఎవరు, 

ఎక్కడ నుండి వచ్చావు, 

ఎక్కడికి పోతావు, 

నీవారు ఎవరు, 

నీ అసలు గమ్యం ఏమిటి 

అని తెలుసుకోవాలి అంటే....

భగవద్గీత చదువు.

Monday, June 2, 2025

తిరుమలలోని ఏడు కొండల పేర్లు

 తిరుమలలోని ఏడు కొండల పేర్లు




1. శ్రీవారి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు తెచ్చిన కొండపేరు 'గరుడాద్రి:



2. శ్రీమహవిష్ణువు చేతిలో హతమైన వృషభరాసుడి పేరుతో ‘వృషభాద్రి:




3. హనుమంతుని తల్లి అంజనీ దేవి 。" తప్పమాచరించిన కొండ 'అంజనాద్రి:


4. కొండపై తొలిసారి తలనీలాలు ఇచ్చిన భక్తురాలు నీలాంబారి పేరిట 'నీలాద్రి:


5. ఆడిశేషుడి పేరిట శేషాద్రి:


   6. పుష్కరిణ్ణి తీరాన తపస్సు చేసిన భక్తుడు నారాయణుడి పేరిట ‘నారాయణాద్రి:


7. పాపాలను దహించే (వేం:పాపాలను కట= దహించునది) కొండగా 'వేంకటాద్రి: