Friday, June 27, 2025

రోజుకు మూడు సార్లు రంగులు మారే శివలింగం..!

 



రోజుకు మూడు సార్లు రంగులు మారే శివలింగం..!


ఈ ఆలయ రహస్యం నేటికీ శాస్త్రవేత్తలు కూడా చేదించలేకపోయారు...

భారతదేశం అంటే భక్తి, శ్రద్ధ, రహస్యాలతో నిండిన పుణ్యభూమి.
ఇందులో ఎంతో మంది తెలిసిన తెలియని దేవాలయాలున్నాయి...
కానీ రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో ఉన్న "అచలేశ్వర మహాదేవ ఆలయం" అనేది ఒక అసాధారణమైన ఆధ్యాత్మిక చిహ్నం.
ఇక్కడ గర్భగుడిలో వున్న శివలింగం రోజుకు మూడు సార్లు రంగులు మారుతుంది!

🕉️ ఉదయం — ఎరుపు రంగు
🕉️ మధ్యాహ్నం — కాషాయ రంగు
🕉️ సాయంత్రం — నలుపు రంగు

ఈ అద్భుతాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుండి భక్తులు పోటెత్తుతారు.
ఇది శివుడి లీలా అని భక్తులు నమ్ముతారు, కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఇప్పటికీ దీని మర్మాన్ని తెలియజేయలేకపోయారు!

📜 ఈ ఆలయం చరిత్రనుసారం 2500 సంవత్సరాల పూర్వం నాటిది అని చెబుతారు.
ఇక్కడి శాంతమైన వాతావరణం, ఆలయ ఆరాధనలు భక్తుల్లో అపూర్వమైన భక్తిభావాన్ని కలిగిస్తాయి.
ముఖ్యంగా సోమవారం రోజున భక్తుల రద్దీ తారాస్థాయికి చేరుతుంది.

🔍 ఈ ఆలయ రహస్యం శివుని మహిమా..? లేక శాస్త్రీయ వాస్తవం..?

🙏 శివుడు అన్నింటికీ సమాధానం!

No comments:

Post a Comment