Monday, April 27, 2026

ఇంటికి అదృష్టాన్ని తెచ్చే 5 మంచి మొక్కలు!

 ఇంటికి అదృష్టాన్ని తెచ్చే 5 మంచి మొక్కలు!


నేటి రోజుల్లో ఇంటి అలంకరణ వివిధ రీతుల్లో సాగుతోంది. అదృష్టాన్నిచ్చే మొక్కలను సైతం అలంకరణలో భాగంగా చేస్తున్నారు. 


ఈ మొక్కలు సంపదను తెచ్చిపెడతాయి. గతంలో అందరూ పవిత్రంగా భావించే తులసి మొక్క మాత్రమే ప్రతి ఇంటా వుండేది. 


ఇంటికి మంచి ఎనర్జీని కలిగిస్తుందని పవిత్రతను చేకూరుస్తుందని ఈ తులసి మొక్కను పెరటిలో వుంచి పూజలు కూడా చేస్తారు. 


అయితే సమాచార వ్యవస్ధ బాగా అభివృధ్ధి చెందటంతో ఇంటర్నెట్ లు చూసేవారంతా ప్రపంచ వ్యాప్తంగా ఇపుడు లక్కీ బాంబూ మొక్కలను తమ ఇండ్లలో పెడుతున్నారు. మన ప్రాంతాలలో కూడా ఇండ్లలో ఈ మొక్కలు పెంచుతున్నారు.

దిగువ పేర్కొన్న 5 మొక్కలు ప్రపంచ వ్యాప్తంగా లక్కీ మొక్కలుగా పరిగణించబడుతున్నాయి. అవేమిటో, వాటికి కారణమేమిటో పరిశీలిద్దాం!


1. లక్కీ బాంబూ ప్లాంట్స్ -

Uploading: 264769 of 264769 bytes uploaded.


 ఇవి చైనాలో పుట్టినవైనప్పటికి ఇండియాలో ఫెంగ్ షూ ఇ లో భాగంగా అతిగా పెంచుతున్నారు. లక్కీ బాంబూ ప్లాంట్ అంటే నాలుగు వెదురు బద్దలు ఒక ఎర్ర రిబ్బన్ తో కట్టి వుంటాయి. 

ఇది కుటుంబంలో ఐకమత్యానికి చిహ్నంగా భావిస్తారు. 

దీనినే అలంకరణగా కూడా పరిగణిస్తారు.


2. ఫోర్ లీఫ్ క్లోవర్ - 


ఇది అమెరికాలో బాగా ప్రసిద్ధి చెందినది. ఇది ఒక అరుదైన మొక్క. 

నాలుగే ఆకులుంటాయి. 

ఈ మొక్క కనపడితే చాలు మంచి జరుగుతుందనే నమ్మకం 17వ శతాబ్దంనుండి వుంది.


3. తులసి మొక్క - 




తులసి మొక్క ప్రాధాన్యత హిందువులకందరకూ తెలిసినదే. 

దీనిని లక్ష్మీ దేవిగా భావించి హిందువులు పూజలు చేస్తారు. 

ఆకులు ఆహారాన్ని, దుస్తులను మొదలైనవాటిని శుభ్రం చేయటానకి ఉపయోగిస్తారు. నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తుందని హిందువులు భావిస్తారు.


4. స్నేక్ ప్లాంట్ - 



ఈ మొక్క గాలిలో వున్న విషవాయువులను పీలుస్తుందని చెపుతారు. మంచితేమను కలిగి వుండి దాని పరిసరాలలో సహజమైన తేమను ఏర్పరుస్తుంది. 

ఇది లక్ మాత్రమే కాక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.


5. మనీ ప్లాంట్ - 




అదృష్టాన్నిచ్చే మొక్కలలో ఇది పురాతన మొక్క. శీటిని ఒక బాటిల్ లోని నీటితో కూడా పెంచుతారు. 

ఇవి ఎక్కడపడితే అక్కడ దొరుకుతూనే వుంటాయి. 

వేగంగా పెరుగుతాయి. వీటిని కొంతమంది పైనుండి కిందకు పాకేలా చేస్తారు. కాని ఇది సరికాదు. 

మొక్క కిందనుండి పైకి పాకుతూ వుంటేనే ఐశ్వర్యం వస్తుంది.


శుభమస్తు 🕉️