Wednesday, August 2, 2017

ప్రకృతి అందించిన గురువులు Group of Five Basic Elements


Group of Five Basic Elements


ప్రకృతి అందించిన గురువులు

పంచభూతాల


సద్గురువులు కావాలని ఈరోజుల్లో ఎందరో ఎదురుచూస్తున్నారుకాని మనం పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు నిత్యం క్షణకాలం పాటు మనల్ని విడువకుండా ఉండే గురువులును ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
ప్రకృతి ఇచ్చిన గురువులు: నేల, నింగి, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు. ప్రకృతి లో ఉన్న ఈ పంచభూతాలతో నిర్మితమైనదే మానవదేహం.

నేల :
ఎందరు ఎన్నిరకాలుగా వాడుకున్నా సహిస్తుంది. నేలకు సహనం సహజగుణం. పుట్టిన దగ్గర నుండి నిన్ను మోసి, చివరికి తనలో కలుపుకుంటుంది. ఇలాంటి నేలను చూసి మీరు ఏమి నేర్చుకున్నారు?


నీరు :
ఎన్ని మలినాలు చేసినా సహజంగా శుద్ధి చేసుకుంటుంది. అలానే కాక శుబ్రం చేసే గుణం కలిగి ఉంది. మనషి ఎల్లప్పుడూ శుచిగా ఉండాలనే జ్ఞానాన్ని సూచిస్తుంది. దీనిని చూసి ఏమి నేర్చుకున్నావు?



నిప్పు :
మలినాలను పోగొడుతుంది. దేవతలకు మనం చేసే యజ్ఞంయాగాది క్రతువుల నుండి ఆహారాన్ని అందిస్తుంది. లోకాలకే వెలుగులు ప్రసాదిస్తుంది. నిప్పులో నిర్మలత్వం ఉంది. దీని వలన ఏమి నేర్చుకున్నావు?


గాలి :
ఎప్పుడూ నిరాపేక్షంగా ఉపకారం చేస్తుంది. పువ్వులలో ఉండే పుప్పొడిని తీసుకెళ్ళి పరపరాగ సంపర్కం గావించి వృక్ష సంపదను వృద్ది పొందిస్తుంది. మనిషికి నిరంతరం చెట్లనుండి ఆక్సిజన్ అందిస్తుంది. ఇలా గాలిని పరోపకార బుద్ది నేర్పుతుంది. దేనిలో ఉన్న పరోపకార బుద్దిని అలవరచుకున్నారా?


ఆకాశం :
ఎన్ని కారుమబ్బులు కమ్ముకున్నా ఆకాశం ఎప్పటికీ నిర్మలంగానే ఉంటుంది. మనిషి జీవితం మాయ ప్రపంచం చుట్టూ తిరుగుతూ మనస్సుకు అనేక మాయలు కల్పిస్తుంది. ఈ మాయల మబ్బుల నుండి వివడటానికి నిర్మలత్వాన్ని చూపిస్తున్న ఆకాశం నుండి ఏమి తెల్సుకున్నారు?




తుమ్మెద పువ్వులలో ఉన్న తేనెను మాత్రమే ఆస్వాదిస్తుంది. మనిషికూడా విషయంలో ఉన్న సారాన్ని మాత్రమే గ్రహించాలి. కాని మనిషి మాత్రం విషయాన్నే వక్రీకరణ బుద్దితో ఆలోచిస్తున్నాడు.
చేపను చూసి జిహ్వ చాపల్యం చంపుకోవాలి. ఎరను చూసి పట్టుకోవాలని ప్రయత్నించి చివరికి చనిపోతుంది. మనిషి కోరికల ఎరకు చిక్కి ఆయుష్షుని తగ్గించేసుకున్తున్నాడు.
చివరికి అమ్మాయి చేతికి ఉన్న గాజు కూడా గురువే. ఒక్కగాజు నిశబ్దంగా ఉంటే నాలుగు గాజులు గోలచేస్తాయి. ఒంటితనం తోనే మనిషి ఏదైనా సాధించడానికి అవకాశం కలిగిస్తుంది. నలుగురిలో ఉంటే విషయం మీద ధ్యాస తగ్గిపోతుంది.
ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటీ మనకు అనేకరకాలుగా భోదిస్తుంటే మనం మాత్రం పట్టించుకోవడం లేదు. మరి గురువులు చెప్పే విషయాలు వింటారా?

శివాలయ దర్శన విధానం Shiva Temple Dharshan


శివాలయ దర్శన విధానం

Shiva Temple Dharshan



సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చెసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందుకే,శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్సించినట్లే అని చెప్పబడింది.
శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు, నాలుగు దిక్కులని చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ద్వముఖమై (పైకి చూస్తు/ఆకాశం వైపు చూస్తూ) ఉంటుంది.
5 ముఖాలకి, 5 పేర్లు న నిర్దేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చొని అయినా,పూజ చేయోచ్చు అంటారు.


శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది, కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది, పశ్చిమాభి ముఖమైన శివాలయం. అంటే, మీరు,గుడిలోకి వెల్లగానే, శివలింగం పశ్చిమం వైపు చూస్థూ ఉంటుంది.. అలా శివలింగంకి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమం వైపు ఉన్నా, లేదా, శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా, దానిని, సద్యోజాతజాత శివలింగం అని అంటారు. అప్పుడు మనం తప్పకుండా,అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని అనాలి.శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం, సద్యోజాత శివలింగం.

శివలింగం, తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటువంటి శివలింగాన్ని, తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది.. తిరోదానము అంటే చీకటిలో ఉంచటం. అది, మనల్ని మాయ చేత కప్పబడిస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది..
ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాం.. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం.సద్యోజాత ముఖం పూజించ తగినదే,ఏ మాత్రం అనుమానం లేదు.. మనల్ని రక్షించినా,శిక్షించినా, అన్ని ఆ పరమేశ్వరుడేగా.
తూర్పుని చూస్తూ ఉండె శివలింగం, వాయువు (గాలి) మీద అదిష్టానం కలిగి ఉంటాడు.. ...
మనకు ప్రతీ శివాలయంలోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి.. శైవాగమనంలో చెప్పినట్లుగా, మనం తప్పకుండా, శివాలయంలో, ఏ దిక్కు వైపు వెలితే,ఆ శివలింగం పేరుని స్మరించాలి.
5ముఖాలు, మనకు 5 ఫలితాలని కలుగచేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే, స్ర్రుష్టి, స్థితి, లయ,తిరోదానము,అనుగ్రహము(మొక్షము) ఇవ్వబడతాయి.. అన్ని ముఖాలు,పూజనీయమైనవే.. అన్ని ముఖాలని మనం పుజించి తీరాల్సిందే.శివలింగం, దక్షిణం వైపు చూస్తూ ఉంటే, అటువంటి ముఖం, దక్షిణామూర్తి స్వరూపం. మనకు, శివాలయంలో, దక్షిణం ని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉంది తీరాలి. అసలు, దక్షిణామూర్తి విగ్రహం లేకుండా, శివాలయాలు కట్టకూడదు.

శివలింగం, దక్షిణానికి చూసే ముఖాన్ని, దక్షిణామూర్తి స్వరూపంగా, చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే, అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం , అగ్నిహోత్రానికి అంతటికీ, అధిష్టానం అయ్యి ఉంటుందిఈ సమస్త ప్రపంచాన్ని,లయం చేసే స్వరూపమే,ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే, సమస్త ప్రపంచాన్ని లయం చేసి,మళ్ళీ,మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువు పట్ల,భయం పొగొట్టేది,మనకి ఙ్ఞానం ఇచ్చేది ఇదే.మీరు జాగ్రత్తగా గమనిస్తే, చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మొక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.
ప్రతీరోజూ, ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ద్యానం చేస్తే, మొక్షము కరతళామలకము. వారి,అంత్యమునందు, సాక్షాత్తు, ఈశ్వరుడే, గుర్తుపెట్టుకొని, మొక్షముని ప్రసాదిస్తాడు.
ద్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.
ఉత్తరం వైపు చూసే ముఖంని, "వామదేవ" ముఖం అని అంటారు.
ఇప్పటిదాక, 4 దిక్కులని చూస్తున్న, 4ముఖాల గురుంచి తెలుసుకోగలిగాం కదా!..
ఇక చివరి ముఖం, శివలింగం పైన (అంటే, ఆకాశం వైపు చూస్తూ ఉండే ముఖం) ఉండే ముఖం, ఆ ముఖంని "ఈశాన ముఖం" అంటారు. మనం, లింగం పైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః. అని అనాలి.
ఈశాన ముఖ దర్సనం, మనం మిగిలిన 4 ముఖాలని దర్సించిన తర్వతనే దర్సించాలి.. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం, అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చొని, దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది.
ఉత్తరం వైపు చూసే "వామదేవ ముఖం" నీటి మీద అధిష్టానం అయి ఉంటుంది. ఈ వామదేవ ముఖమే మనకు సమస్త మంగళమును ఇచ్చే ముఖం.
వామదేవ ముఖం అంటే ఎమిటి అనేది మనకు శివపురణంలో చెప్పబడింది. యదార్ధమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే, విష్ణువు శివుడు ఒకరే.. రెండు లేనే లేవు...
శివపురణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికి సంసయం ఉంటే, ఒకటి గమనించండి.
శివఫురణం ని రాసినది, వేదవ్యాసుడు.. వ్యాసుడే విష్ణువు. విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ,వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే.. రెండు కాదు.. చాలా మంది, వేరుగా చూస్తూ,పొరపడుతున్నారు..
క్రిష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను.
ఈ వామదేవ ముఖం ని, ఓం వామదేవాయ నమః అని అంటే, మనకు అనారోగ్యం కలగకుండా,చూస్తాడు...

అంతే కాక, ఈ వామదేవ ముఖంని ఓం వామదేవాయ నమః అని అంటే,మనకు 3 ఫలితాలని కూడ ఇస్తుంది..అవి, 1) మీ దగ్గర ఏదైతో ఉందో, అది మీ చేయి జారి పోకుండ,మీత
ోనే ఉంచుతాడు. ఉదా: మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి (లేదా) ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ,మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. 2) మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని అయనే ఇస్తారు. 3) మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యమ్ని ప్రసాదిస్తాడు. ఉదా: ఇప్పుడు, తీపి పదార్దాలని కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్దితిలో (షుగర్ ఉందనుకోండి.) ఉంటే, అప్పుడు, ఉన్న దానిని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండ కాపడతాడు.
తదుపరి,ఈశాన ముఖము. శివాలయలో లింగ దర్శనం అయ్యాక, ఒక్కసారి, పైకి చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని అనాలి. ఆ ఈశాన ముఖమే మనకు మొక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్టానం అయ్యి ఉంటుంది.
శివలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెల్లినప్పుడు, మనలో ఉండే, అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకోని ముందుకు సాగాలి.
శివాలయలో పురుషులకి, ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేసించబడింది. పురుషులు కేవలం పంచ మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్యం ని, నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో, వారి పట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నమవుతాడు. ముందుగా చెప్పినట్లు, పదఘట్టన వినపడకూడదు జాగ్రత్త.

మీరు శివాలయంలో, ఎట్టి పరిస్థితులలోను, విభూధిని కాని, బిల్వ పత్రాలనికాని, కుంకుమ కాని,ప్రసాదం కాని ఎట్టి పరిస్థితులలోను, నందీశ్వరుడి మీద పెట్టరాదు. సాధారణంగా, చాలా మంది, నంది మీద విభూధిని, బిల్వ ఆకులని వేస్తూ ఉంటారు. అది చాలా మహా పాపంగా పరిగణించబడింది. వీలైతే, అందరూ, శివరాత్రి రోజు, శివమహిమ్నా స్తోత్రం చదవండి.. శివస్తొత్రాలు అన్నింటిలోకి, చాలా ప్రాముఖ్యమైనది "శివమహిమ్నా స్తోత్రం"
హర హర మహా దేవ శంభో శంకర !

Tuesday, July 11, 2017

WHAT IS A PRAYER?


WHAT IS A PRAYER?


Prayer is talking to GOD. It's thanking Him & asking for help. A prayer is useless unless recited with FEELINGS. Every word we utter should come from our heart. We should thank God for all that He has blessed us with. Not that He needs our thanks but we owe Him a lot & can never repay but at least we can do is to be GRATEFUL TO HIM.

Another thing to understand is that prayer is a tool to create HUMILITY.
Prayer means to say I BOW TO THEE.
PRAYER = TALKING + FEELINGS+ THANKING + BEING HUMBLE.

Even during our darkest & most painful hours we should pray to help find the strength, confidence & courage to continue each day & do what we must do.

We must always remember that we are an expression of the ALMIGHTY & His spirit resides & moves through us.

SO let's OPEN Our HEART & speak to that spirit & it will heal & EMPOWER Us.


Source: Whatsup group

Wednesday, May 24, 2017

Jogulamba Temple Alampur, Jogulamba Gadwal

Jogulamba Temple Alampur, Jogulamba Gadwal 

Alampur, Jogulamba Gadwal 
అలంపూర్

Jogulamba Temple 

Jogulamba Temple Alampur: Jogulamba temple is situated in Alampur in the district of Jogulamba Gadwal of Telangana. It is one of the Ashtadasa Sakthi Peethams (18 holy abodes of Mother Goddess) and one of the famous spiritual places in the state.
The word "Jogulamba" is derived from "Joginula Amma" (Mother of Joginis). Jogini (also called as Yogini) means a female person, who has given up all the earthly attachments. Jogini also has another meaning which implies a dancer (female) whose life is dedicated to God. Hence, the goddess is also known as Yogulamba or Yogamba.
Description of Alampur Jogulamba temple:
The temple of Jogulamba Devi is built magnificently near the banks of Tungabhadra River. The idol of the goddess is in a sitting posture with abundant hair which has a lizard, scorpion, bat and human skull adorned in it. Also, idols of Saptamatrikas ( a group of Hindu goddesses), Ganapathi and Veerabhadra are installed in conjunction of the main idol. The temple has a Yagnasala (where Yagnas are performed), a rest house and a pond. The temple covers a large portion of land, built magnificently with several carvings on the black stone and flooring is made of marble stone. 
The prominence of Jogulamba Temple:Jogulamba can be understood as "Gruha Chandi" (protector of our homes). As we noticed, the idol shows that the goddess has a lizard, scorpion, bat and human skull in her hair. These are the indications of evil and signs of deterioration of a house. Lizard is the primary indication that a house starting to lose its life. Gradually, the number of lizards shall increase which result in the welcoming of scorpions which is even worse. The next level would be the entrance of bats which may result in a death of humans living in that house. People believe that Jogulamba protects them and their shelters from all kinds of evils. She is also worshipped to be freed from Vastu Doshas (faults in constructions). The temple attracts a large number of pilgrims from various parts for the country and major festivals like Dussera, Maha Shivaratri are celebrated with pomp.
Legend of Renuka Mata:
Besides being a religious hub, Alampur is also famous for being a home to the Ashram of Maharshi Jamadagni. According to a legend, Maharshi Jamadagni stayed in Alampur with his wife Renuka and four sons. They were making their livelihood and worshipping Bala Brahmeswara and Jogulamba Devi. Renuka Mata, with her power, regularly used to make a pot with sand and bring water from the Tungabhadra River. One day, she noticed a king of Gandharvas bathing in the river with his wives. On seeing this, she formed a prejudice that happiness comes from materialistic wealth but not by worship. 
At this thought, she lost all her powers and could not make the pot. She went home without water and on being asked the reason by Jamadagni, Renuka told about the incident and admitted her sinful thoughts. Then, Jamadagni got angry on her and ordered his sons to kill her. Three of them refused to do so but the fourth son, Parasurama, obeyed the order of his father and killed his mother by cutting her head off with his axe. Jamadagni was pleased and offered him a boon. Parasurama asked him to give back life to his mother. Then Jamadagni revived her life.
Legends say that the head of Renuka Mata became Ekaveera Devi, a symbol of Maya rupa; (materialistic thoughts) and the headless body became Bhudevi, a symbol of Matru rupa (mother). Many people say that Ekaveera Devi manifested herself as Goddess Yellamma in Undavelli village near Alampur, while the shrine of Bhudevi is present in the premises of Bala Brahmeswara temple.

(adapted from the website of hopaoundindia.com)

Jogulamba Temple Alampur, Jogulamba Gadwal 


(Sakshi News Paper)

Jogulamba Temple Alampur, Jogulamba Gadwal 

Tuesday, May 23, 2017

పంచమూర్తులు పంచశక్తులు పంచభూతములు


పంచమూర్తులు
1. బ్రహ్మ
2. విష్ణు
3. మహేశ్వరుడు
4. ఇంద్రుడు
5.సూర్యుడు

 

పంచశక్తులు
1. ఆదిశక్తి
2. పరాశక్తి
3. ఇచశక్తి
4. క్రియాశక్తి
5. జ్ఞానశక్తి


పంచభూతములు
1. గాలి
2. నీరు
3. ఆకాశము
4. భూమి
5. అగ్ని