Wednesday, January 16, 2019

సంక్రాంతి ఆచారాలు - వైదిక రహస్యాలు




🌼🌿సంక్రాంతి ఆచారాలు - వైదిక రహస్యాలు🌼🌿


హైందవ సంప్రదాయంలో ప్రతి పండుగలోనూ ఆధ్యాత్మిక రహస్యంతో పాటు వైద్య విశేషం, విజ్ఞానశాస్త్ర దృక్పథం, సామాజిక స్పృహ... ఇలా ఎన్నో దాగుంటాయి ఆయా పండుగ వచ్చిన కాలాన్ని బట్టీ - ఆ పండుగకి ఏర్పాటు చేయబడిన ఆచారాలని బట్టీ. ఆ దృక్కోణంలో చూస్తే సాధారణమైన పండుగల్లోనే ఇన్ని విశేషాలు కన్పిస్తూంటే, ఈ సంక్రాంతిని ‘పెద్ద పండుగ’ అని వ్యవహరించారంటే దీన్లో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నట్లే. సంక్రాంతిని కొన్ని ప్రాంతాలలో పతంగుల పండుగగా జరుపుకుంటారు. దృష్టాదృష్టాలకుప్రతీకగా ఈ  సంప్రదాయాన్ని పేర్కొంటారు.
 
 యోగం అంటే రెంటి కలయిక అని అర్థం. శరీరం- మనసూ అనేవే ఆ రెండూ . శరీరానికి స్నానాన్ని చేయించినా మనసు అపవిత్రంగానూ దురాచనలతోనూ ఉంటే అది ‘యోగం’ (రెంటి కలయిక) కా(లే)దు. అదే తీరుగా మనసెంతో పరిశుభ్రంగా ఉన్నా శరీరం స్వేదమయంగానూ అలసటతోనూ సహకరించ(లే)ని స్థితిలోనూ ఉన్నట్లయితే అది కూడా ‘యోగం’ అయ్యే వీల్లేదన్నారు పెద్దలు. ఆ కారణంగా శరీరమూ మనస్సూ అనే రెండూ పవిత్రంగా ఉండేందుకు స్నానాలని చేయాలని ఓ నియమాన్ని చేశారు పెద్దలు.
 
  కార్తీకం నెలపొడుగునా స్నానాలని చేసినట్లే ఈ మార్గశీర్ష పుష్యమాసాల్లో కూడా  ప్రతిరోజూ స్నానాలని చేయాలన్నారు. దీనికి మరో రహస్యాన్ని కూడా జోడించవచ్చు. చంద్రుని పుట్టు నక్షత్రం మృగశిర. మృగశిర + పూర్ణిమ చంద్రుడు కలిస్తే అది మార్గశీర్ష మాసం అవుతుంది. చంద్రునికి ఇష్టురాలైన భార్య ‘రోహిణి’ (రోహిణి శశినం యథా). ఈ రోహిణి, మృగశిర అనే రెండు నక్షత్రాలూ ఉండే రాశి ‘వృషభం’.
 
  కాబట్టి ఈ మార్గశీర్షం నెలపొడుగునా స్నానాలని చేస్తే తన జన్మ నక్షత్రానికి సంబంధించిన మాసంలో స్నానాలని చేస్తూన్న మనకి చంద్రుడు మనశ్శాంతిని (చంద్రమా మనసో జాతః) అందిస్తాడు. చలీ మంచూ బాగా ఉన్న కాలంలో తెల్లవారుజామున స్నానాలని చేయగలిగిన స్థితిలో గనుక మన శరీరమే ఉన్నట్లయితే యోగ దర్శనానికి భౌతికంగా సిద్ధమైనట్టేననేది సత్యం.

 రంగవల్లికలు

  రంగమంటే హృదయం అనే వేదిక అని అర్థం. ‘వల్లిక’ అంటే తీగ అని అర్థం. ప్రతి వ్యక్తికీ తన బుద్ధి అనే దాని ఆధారంగా అనేకమైన వల్లికలు (ఆలోచనలు) వస్తూ ఉంటాయి. ఆ అన్నిటికీ కేంద్రం (ముగ్గులో మధ్యగా ఉన్న గడి లేదా గదిలాంటి భాగం) సూర్యుని గడి కాబట్టి అక్కడ కుంకుమని వేస్తారు మహిళలు. కాబట్టి ఏ సూర్యుడు బుద్ధికి అధిష్ఠాతో ఆ బుద్ధి సక్రమమైన వేళ ఆ సక్రమ బుద్ధికి అనుగుణంగానే ఈ వల్లికలన్నీ ఉంటాయనేది యోగదృష్టి.ఆ సక్రమాలోచనలకి అనుగుణంగానే మనసు ఆదేశాలనిస్తూంటే శరీరం తన అవయవాలైన చేయి కాలు కన్ను... అనే వీటితో ఆయా పనులని చేయిస్తూంటుందన్నమాట.
Image result for రంగవల్లికలు
 
 గొబ్బెమ్మలు

 స్నానాలనేవి పురుషులకే కాదు. స్త్రీలకి కూడా నిర్దేశింపబడినవే. అందుకే వారికి సరిపడిన తీరులో వాళ్లని కూడా యోగమార్గంలోకి ప్రవేశింపజేసి వారిక్కూడా యోగదర్శనానుభూతిని కల్పించాలనే ఉద్దేశ్యంతో స్త్రీలకి గోపి+బొమ్మలని (గొబ్బెమ్మ) ఏర్పాటు చేశారు. నడుమ కన్పించే పెద్ద గొబ్బెమ్మ ఆండాళ్ తల్లి అంటే గోదాదేవి. చుట్టూరా ఉండే చిన్న చిన్న గొబ్బెమ్మలనీ కృష్ణ భక్తురాండ్రకి సంకేతాలు. ఈ అన్నిటికీ చుట్టూరా కృష్ణ సంకీర్తనని చేస్తూ (నృత్యాభినయంతో కూడా) స్త్రీలు పాటలని పాడుతూ ప్రదక్షిణలని చేస్తారు. నడుమ ఉన్న ఆ నిర్వ్యాజ భక్తికి (కోరికలు ఏమీలేని భక్తి) తార్కాణమైన గోదాదేవిలా చిత్తాన్ని భగవంతుని చుట్టూ ప్రదక్షిణాకారంగా తిప్పుతూ ఉండాలనేది దీనిలోని రహస్యమన్నమాట.
Image result for గొబ్బెమ్మలు
 
 మొదటిరోజు ‘భోగి’

 భోగము అంటే పాము పడగ అని అర్థం. భోగి అంటే అలా పడగ కలిగినది ‘పాము’ అని అర్థం. అలా ఎత్తిన పడగతో పాము ఎలా ఉంటుందో అదే తీరుగా వ్యక్తి కూడా శరీరంలోని వెన్నెముకని లాగి పట్టి స్థిరాసనంలో (బాసింపెట్టు) ఉంటూ, ముక్కు మీదుగా దృష్టిని ప్రసరింపజేస్తూ కళ్లని మూసుకుని తన ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే అదే ‘యోగ దర్శన’మౌతుందని చెప్పడానికీ, ఆ యోగ ప్రారంభానికి సరైన రోజు నేడే అని తెలియజేయడానికీ సంకేతంగా పండుగలోని మూడు రోజుల్లోనూ మొదటి రోజుని ‘భోగి’ అని పిలిచారు. యోగ ధ్యానాన్ని చేస్తూన్న వేళ బుద్ధి సక్రమంగా ఉండాలని చెప్పడానికీ, దాన్ని బాల్యం నుండీ అలవాటు చేయాలని చెప్పడానికీ సంకేతంగానే - పిల్లలకి రేగుపళ్లని  పోస్తూ వాటిని ‘భోగిపళ్లు’గా వ్యవహరించారు.
 

 సంక్రాంతి

 సూర్యుడు ఈ రోజున ధనూ రాశి నుండి మకర రాశిలోకి జరుగుతాడు కాబట్టే దీన్ని ‘మకర సంక్రమణం’ అన్నారు.ఇప్పటివరకూ ఉన్న బుద్ధి కంటే వేరైన తీరులో బుద్ధిని సక్రమంగా ఉంచుకోవడమే ‘మకర సంక్రాంతి’లోని రహస్యం. ఇది నిజం కాబట్టే ఈ రోజున బుద్ధికి అధిష్ఠాత అయిన సూర్యుణ్ని ఆరాధించవలసిన రోజుగా నిర్ణయించారు పెద్దలు. అంతేకాదు. మన బుద్ధిని సక్రమంగా ఉండేలా - ఉంచేలా ఆశీర్వదించగల శక్తి ఉన్న పితృదేవతలని ఆరాధించవలసిన రోజుగా కూడా తెల్పారు పెద్దలు. పెద్దలకి (పితృదేవతలకి) పెట్టుకోవలసిన (నైవేద్యాలని) పండుగ అయిన కారణంగానూ దీన్ని ‘పెద్ద పండుగ’ అన్నారు - అలాగే వ్యవహరిస్తున్నారు కూడా.
 

Importance of Makara Sankranti

Importance of Makara Sankranti


Image result for Importance of Makar Sankranti
సంక్రాంతి అంటే ఏమిటి?
మనం ఎందుకు సంక్రాంతి చేసుకుంటున్నాము?
మొత్తం సంవత్సరంలో ఎన్ని సంక్రాంతులు వస్తాయి?
ప్రపంచ యోగాడే గా జూన్ ఇరవై ఒకటినే ఎందుకు నిర్థారించారు?

🤔 మన సాంప్రదాయంలో చాలా వరకు పండుగలు చంద్రగమనం ప్రకారం వస్తాయి.. కానీ ముక్కోటి ఏకాదశి, సంక్రాంతులు మాత్రం సూర్యగమనం ప్రకారంవస్తాయి.. అందుకే మన పంచాగంలో ఖచ్చితత్వం ఉంటుంది.. 
సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు...అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు..... 
అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి కదా.. ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి.... సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు...
ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది...
వీటిలో సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది.. అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు.. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు..
మనకు ఒక సంవత్సరం = దేవుళ్ళకు ఒక రోజు...
అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం.. రాత్రి అనేది దక్షిణాయణం.. ఈ ఉత్తరాయణమనేది అందుకే మనకు అంత ముఖ్యం.. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే పరమపదించారు.. 
కొన్ని ముఖ్యమైన సంక్రాంతులు..

*1. ఆయన సంక్రాంతి* -
ఇవి ఒకటి ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభానికి (మకర సంక్రాంతి)
రెండవది దక్షిణాయన పుణ్యకాల ప్రారంభానికి సంకేతములు(కర్క సంక్రాంతి) 
 *ఈ రోజే :: జూన్ ఇరవై ఒకటి.. కర్క సంక్రాంతి.. ఇదే ప్రపంచ యోగాడే..*
 
*2. వైషువ సంక్రాంతి* - 
ఇవి రెండు ఋతువుల మధ్య వచ్చే సంధి కాలం.. 
మొదటిది శీతాకాలం , వేసవి కాలం మధ్య వచ్చే సంధి కాల ప్రారంభం - మేష సంక్రాంతి (వసంతఋతువు లో వచ్చేది))
మరియు వేసవి కాలం వర్షాకాలముల మధ్య వచ్చే సంధి కాలం - తుల సంక్రాంతి (శరత్ ఋతువు లో వచ్చేది)). 
సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు ఖచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి...
అంటే సూర్యోదయం, సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట.

*3. విష్ణు పది సంక్రాంతి* -
సింహ సంక్రాంతి , కుంభ సంక్రాంతి , వ్రుషభ సంక్రాంతి మరియు వ్రుశ్చిక సంక్రాంతి.

*4. షద్శితిముఖి సంక్రాంతి*
 - మీన సంక్రాంతి, కన్య సంక్రాంతి, మిథున సంక్రాంతి మరియు ధను సంక్రాంతి.
మిథున సంక్రాంతి రోజు అతి దీర్ఘ పగలు(అంటే పగటి సమయం ఎక్కువగా) ఉంటుంది...
ధనుస్సంక్రాంతి రోజు అతి దీర్ఘ రాత్రి (అంటే రాత్రి సమయం ఎక్కువగా) ఉంటుంది...
ఇప్పటి దాకా రాత్రి పగలు సమ కాలం అనుకునే వాడిని...
కానీ మొత్తానికి చూస్తే సంవత్సరం లో కేవలం కొన్ని రోజులు మాత్రమే రేయింబగళ్ళు సమానంగా ఉన్నాయి... 
ఎంత అద్భుతం... ఒక సంవత్సరంలో ఏ రోజు ఎంత సేపుంటుంది.. సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలను.. పౌర్ణమి అమావాస్యలను ఘడియ విఘడియలతో సహా ముందుగానే లెక్కవేసుకుని చెప్పేంత పరిజ్ఞానం మన పూర్వీకులకు ఉంది.
 
అందుకే జ్యోతిష్యం కేవలం మంచి చెడులను మాత్రం చెప్పేది.. భవిష్యత్ ను ఊహించేది మాత్రమే కాదు... అది ఒక శాస్త్రం.. అందుకే ప్రపంచం మొత్తం మన కర్క సంక్రాతికి విలువనిచ్చి ప్రపంచ యోగాడే గా పరిగణించారు.. 
చిత్రంలో మకర సంక్రాంతి నాడు సూర్యగమనం, కర్క సంక్రాంతి(ప్రపంచ యోగా దినోత్సవం)నాడు సూర్య గమనమును ఉంచాము.. దీనిలో భారతదేశమ్యాపు మన దేశంఉన్న దిశ చూడండి తేడా మీకు అర్థమవుతుంది.. 


Tuesday, November 27, 2018

Self-Purity Debendranath Tagore

Self-Purity 

Debendranath Tagore


Image result for maharshi debendranath

*ఆత్మ స్వచ్ఛత*:blossom::fallen_leaf:°°°°°°°°°°°°°°°°°°°°°°


మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ ధ్యానం చేసేటపుడు వందలకొద్దీ పక్షులు ఆయన సమీపంలోను, ఆయన మీద వాలుతూ ,తుల్లుతూ ఆడుకుంటూ ఉండేవి.... ఆయన యొక్క ఆత్మ స్వచ్ఛత పక్షులు, ఉడుతలు లాంటి జీవులను ఆయనవైపుకు ఆకర్షించేది.
ఒకరోజు ఒక చిన్న బాలుడు ఆయన దగ్గరకొచ్చి తాతగారూ.. నాకు ఒక పక్షిని పట్టి ఇవ్వండి...అని కోరాడు. అందుకు ఆయన " ఉండు నాయనా....నేను ధ్యానం చేసే సమయంలో చాలా పక్షులు వస్తాయి....అప్పుడు నీకొక పక్షిని పట్టిస్తాను అని చెప్పి.. ధ్యానానికి వెళ్ళాడు. ఆశ్చర్యంగా ఒక పక్షి కూడా ఆయన దగ్గర వాలలేదు....ఆ రోజు నుండీ... ఏ పక్షీ ఆయన సమీపంలో వాలకపోవడం గమనించిన ఆయన ఒక పెద్ద పాఠం నేర్చుకున్నాడు.
మనచుట్టూ ఉన్న ప్రకృతికి మనం అనుసంధానం కావాలంటే.....ఆ ప్రకృతి కల్మషం లేకుండా ఎలా స్వచ్చంగా ఉంటుందో...మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీ స్థాయికి ఆత్మ స్వచ్ఛత కల్గి ఉండాలి. ఆయన స్వచంగా ఉన్నంత కాలం పక్షులు ఆయన సమీపంలోకి వచ్చాయి....ఎప్పుడైతే పక్షిని పట్టుకోవాలన్న ఒక చిన్న కల్మషం మనసులో పుట్టిందో....ఆ రోజునుండీ ఆయన ప్రకృతి నుండీ అనుసంధానం తొలగించ బడ్డాడు.
అందుకే ...ఒక్క పక్షీ ఆయన చెంతకు రాలేదు.
*మిత్రమా...సృష్టిలో.. అత్యంత శక్తివంతమైనది ఏమిటంటే.... స్వచ్ఛత. స్వచ్ఛతకు శక్తి ఎక్కువ.*
మనం మన హృదయాలను దివ్యత్వపు ఆలయాలుగా మార్చుకోవడమే స్వచ్ఛతను పొందే మార్గం. మనం ఆత్మ స్వచ్ఛతను పొందిన క్షణం....ఈ సమస్త ప్రకృతిలోని ఎన్నో రహస్యాలు అవగతం అవుతాయి.మనం ప్రకృతితో స్నేహం చెయ్యాలంటే....దాని స్థాయికి చేరుకోగల్గాలి.
*నీవు నీలో దేన్ని కల్గి ఉంటావో....దానినే బయట చూడగలవు.*
*నటించడం... తాత్కాలికం జీవించడం... శాశ్వతం*

Sunday, November 25, 2018

మనం చేసింది పాపమా.. పుణ్యమా..!!

మనం చేసింది పాపమా.. పుణ్యమా..!!

మనం పాపాలు చేసామా..?
పుణ్యాల చేసామా..?

మనలో పాపం ఎక్కువ నిలువ ఉందా? లేదా పుణ్యం ఎక్కువ నిలువ ఉందా? అన్న విషయం ఎలా తెలుస్తుంది? అన్న సందేహం మనకురావచ్చు!

శరీరాలు మూడు రకాలుగా ఉంటాయి.
1. స్థూల శరీరం (సాధారణ భౌతిక శరీరం)
2. సూక్ష్మ శరీరం (కేవలం మనస్సు, బుద్ధిలతో కూడినది)
3. కారణ శరీరం (పాప పుణ్యాల శేష ఫలితాలు బీజరూపకంగా ఉన్న శరీరం)ఇలా మనం చేసిన పాపం ఈ మూడు శరీరాల్లో నిలువ ఉంటుందని శాస్త్రం చెబుతుంది.

మనలో పాపం ఎక్కువ నిలువ ఉందా?
లేదా పుణ్యం ఎక్కువ నిలువ ఉందా?
అన్న విషయం ఎలా తెలుస్తుంది? అన్న సందేహం మనకు రావచ్చు!

దుర్గంధాన్ని బట్టి చెడువస్తువులనూ,
సుగంధాన్ని బట్టి మంచి వస్తువులను అంచనా వేసినట్లు ఈ మూడు శరీర లక్షణాలను బట్టి మనలో నిలువ ఉన్న పాప పుణ్యాలను కూడా అంచనా వేయవచ్చు !

1. స్థూల శరీర లక్షణాలు :
సాధారణంగా స్థూల శరీరలక్షణాలు ఎక్కువగా ఈ జన్మలో చేసిన పాప పుణ్యాలమీద ఆధారపడి ఉంటాయి.

అ) స్థూల శరీరం పాపరహితంగా పవిత్రంగా ఉంటే తెల్లవారు జామునే మేల్కొంటుంది.
(లేదా తెల్లవారు జామున మేలొన్నా పవిత్రమౌతుంది)

పాపం పెరిగిన కొద్దీ సరిగ్గా బ్రాహ్మీ ముహూర్తంలోనే గాఢ నిద్ర పట్టడం,
ఆలస్యంగా నిద్రలేవడం ఎక్కువౌతుంది.

ఉదా : ఈ ప్రపంచంలో పాపం అంటే తెలియని స్థితిలో ఉన్న శిశువులు కానీ,
పాప రహితులైన మహాత్ములుగాని తెల్లవారు జామునే మేల్కొటాంరు.
గమనించండీ!

ఆ) స్థూల శరీరం పాప రహితంగా పవిత్రంగా ఉంటే
ఏ మాత్రం బద్ధకం, సోమరితనం లేకుండా ఉపయుక్తమైన ఏ పని చేయడానికైనా సన్నద్ధంగా, ఉత్సాహంగా ఉంటుంది.

ఒకవేళ పాపం పెరుగుతూ ఉంటే
సోమరితనం, బద్ధకం కూడా పెరుగుతాయి. ఉపయుక్తమైన పనులు చేసే విషయంలో శరీరం
ఏ మాత్రం సన్నద్ధంగా ఉత్సాహంగా ఉండదు. నిరుపయోగకరమైన మరియు కాలాన్ని వ్యర్థం చేసే విషయాల్లో ఉత్సాహం, సన్నద్ధత పెరుగుతాయి.

ఈ విషయంలో కూడా పాపం అంటే తెలియని శిశువులనూ,
పాపరహితులైన మహాత్ములను గమనించండీ?
వారు బద్ధకంగా వ్యవహరించింది ఎప్పుడూ కనిపించదు.

ఇ) స్థూల శరీరం పవిత్రంగా ఉంటే నియతిబద్ధంగా, క్రమశిక్షణతో వ్యవహరించడం జరుగుతోంది. పాపంతో అపవిత్రమైనకొద్దీ క్రమశిక్షణ లోపిస్తుంది.

ఈ)  స్థూల శరీరంలో పాపం పెరిగి అపవిత్రమైనకొద్దీ అనవసర ఆహారం, దోష భూయిష్టమైన ఆహారమే తీసుకోవాలనిపిస్తుంది.
లేదా అలా తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. పవిత్రత పెరిగిన కొద్దీ మితాహారం,
ఆరోగ్యాన్ని పవిత్రతను ఇచ్చే ఆహారం తీసుకోవడం జరుగుతుంది.

ఉ)  స్థూలశరీరం అపవిత్రమైనకొద్దీ
అవసరానికి మించి నిద్రించడం జరుగుతుంది. పవిత్రమైనకొద్దీ ఎంత అవసరమో అంతే నిద్రించడం ఉంటుంది.

ఊ) స్థూల శరీరం పవిత్రంగా ఉంటే నిద్ర లేచిన క్షణంలో వెంటనే (కాన్సియస్‌) స్పృహలోకి వచ్చి ఉత్సాహంగా ఉంటారు.
లేదా ఉత్సాహంగా నిద్రలేస్తారు.
నిద్ర లేచిన తర్వాత వారి ముఖం మబ్బు లేకుండా ఫ్రెష్‌గా ఉంటుంది.

పాపంతో అపవిత్రమౌతున్న కొద్దీ నిద్ర లేచిన 10, 15 నిమిషాల వరకు (కాన్సియస్‌) స్పృహలోకి రాలేకపోతారు.
కారణమేమిటంటే ఆత్మతో శరీరానికి బంధం ఎక్కువౌతుంది.

ఇలా స్థూల శరీర లక్షణాలను బట్టి పాప పుణ్యాల నిలువను గుర్తించవచ్చు.

దుర్గంథాన్ని బట్టివాతావరణంలో అపవిత్రతను కలుగజేస్తున్న చచ్చిన ఎలుకను గుర్తించినట్లు
స్థూల శరీర లక్షణాలను బట్టి జీవితంలో వ్యాపించిన అపవిత్రతనూ, పాపాన్ని గుర్తించాలి. దీని వల్లనే శుభాలు వాయిదా పడుతున్నాయని, భవిష్యత్తులో కష్టాలు రావడం వల్ల పాపం ప్రక్షాళన కావలసి వస్తుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి వెంటనే జాగ్రత్తపడి కఠినమైన సాధన వల్ల స్థూల శరీరాన్ని సరియైన విధంగా ఉంచుకోవాలి.
సర్వే జనాసుఖినోభవంతు.

    మహనీయుని మాట
మనం జీవించే దానికి సంపాదించాలి కానీ.....
సంపాదించేందుకు
జీవించకూడదు"...!! మోక్షంగుండం విశ్వేశ్వరయ్య

నేటి మంచిమాట 
మనిషి ఆశ అనే పెనంమీద దోశలేస్తూ ఉంటాడు..
ఒక్క దోశ మాడిందని,
పిండి పారేసుకుంటాడా లేక
 పెనం పగల గొడతాడా..?
రెండూ చెయ్యడు..పెనం
బాగా తుడిచి  మళ్ళీ వేస్తాడు.. అదే విధంగా..
అపజయాలు మాడిన
దోశ లాంటివి....!!! 🙏వేమన

Sunday, September 9, 2018

Role of Arjuna and Karna in Mahabharatham




మహాభారతంలోని రెండు పాత్రలైన కృష్ణుడు, కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది...

కర్ణుడు కృష్ణుడుని అడిగాడు...

నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది..

అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే..

ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు..ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో..

పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు..

పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు..

ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది..

ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే..

నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే..

అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు...

దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు...

నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను..

నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది..

నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను..

చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు..

నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను...

నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను..

నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా..

నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు..

మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ..

సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది..

నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు..

నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను..పైగా నన్ను వివాహం చేసుకున్నవారు..వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ..

జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది..

అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది..

సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది...

అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు...పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన...

ఒకటి గుర్తుంచుకో కర్ణా..

జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి..

జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు..

దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే..

ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు..

మనకు ఎంత అన్యాయం జరిగినా..

మనకు ఎన్ని పరాభవాలు జరిగిన..

మనకు రావల్సినది మనకు అందకపోయినా...

మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది..

జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో..అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు...ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు..అని కర్ణునికి క్రృష్ణుడు బోధించాడు..