"However many holy words you read, And however many you speak, What good will they do you If you do not act upon them?" - Buddha
Sunday, February 26, 2017
Saturday, February 25, 2017
Wednesday, February 22, 2017
Sri Lakshmi Narasimha Swamy Temple Dharmapuri Karimnagar
Sri Lakshmi Narasimha Swamy Temple Dharmapuri Karimnagar
Sri Lakshmi Narasimha Swamy Temple Dharmapuri Karimnagar
Komrelly Mallanna Swamy Temple
Komrelly (Komuravelli)
Mallanna Swamy Temple
కొమురెల్లి మల్లన్నకు..కోటి దండాలు!
నడుముకు గజ్జెలు, తలపై బోనం, చేతిలో వీరగల్లు...పరమశివుడే అణువణువూ నిండిపోయిన పారవశ్యంతో వూగిపోయే శివసత్తుల సందడి...ముగ్గుపట్నం వేసి, ముడుపులు చెల్లించి కోర్కెలు తీర్చమంటూ చేతులు జోడించే శివభక్తుల కోలాహలం...మార్గశిరం మొదలు ఫాల్గుణ మాసం దాకా... మూడు నెలల మహాజాతరకు వరంగల్ జిల్లాలోని కొమురవెల్లి ముస్తాబైంది.
వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో వెలసిన కొమురవెల్లి మల్లికార్జునుడు కొమురెల్లి మల్లన్నగా సుప్రసిద్ధుడు. ఒక్క తెలంగాణకే కాదు ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అటు కర్ణాటక, ఒడిషా రాష్ట్రాల ప్రజలకూ కొంగుబంగారమై అలరారుతున్నాడు. మార్గశిర మాసపు మొదటి ఆదివారం నుంచి దక్షిణభారత దేశంలోనే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన కొమురవెల్లి జాతర ఆరంభమౌతుంది. ఆ మాసపు చివరి ఆదివారం (జనవరి 3) మల్లికార్జునుడి కళ్యాణం మహా వైభవంగా జరుపుతారు. వేలకొద్దీ భక్తులు ఆ రోజు స్వామివారిని దర్శించుకుంటారు. గతేడాది తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున స్వామి వార్లకు పట్టుబట్టలు సమర్పించడంతో వేడుక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Komrelly (Komuravelli)
Mallanna Swamy Temple
అది కుమారవెలి
కొమురవెల్లి గ్రామాన్ని ఒకప్పుడు కుమారవెల్లిగా పిలిచేవారట. ఆ పేరు రాను రానూ ‘కొమురవెల్లి’గా మారిందని స్థానికులు చెబుతారు. ఈ ఆలయం దాదాపు 600 సంవత్సరాలకు పూర్వం నుంచే ఉంది. పాతికేళ్ల క్రితం ఆలయ సమీపంలో మొఘల్ చక్రవర్తి హుమయూన్ కాలంలోని నాణేలు దొరికాయి. దీన్ని బట్టి హుమయూన్ కాలం కంటే ముందు నుంచే ఈ ఆలయం ప్రసిద్ధమన్న విషయం తెలుస్తోంది. ఈ ఆలయాన్ని ఏ రాజులూ నిర్మించలేదనీ, అక్కడ ధ్వజ స్తంభం, రాజ శాసనాలూ లేకపోవడమే స్వామి ఇక్కడ స్వయంగా వెలిశాడనటానికి నిదర్శనాలనీ పూజారులు చెబుతారు. ‘ఖండోబా’ ఆలయ పూజారికి స్వామి కలలో కనిపించి కొమురవెల్లిలోని పర్వత గుహలో వెలిశానని చెప్పడంతో, ఆ పూజారి ఇక్కడికి వచ్చాడనీ, అక్కడ నిజంగానే శివలింగం ఉండటంతో పూజలు చేయడం మొదలు పెట్టాడనీ కథనం. కొన్నాళ్లకు ఆ శివలింగంపై పుట్ట పెరిగిందనీ, ఆ పుట్ట మట్టితోనే ఖండోబా స్వామి రూపంలోని విగ్రహాన్ని తయారు చేశారనీ ఆలయ అర్చకులు చెబుతారు. త్రిపురాసుర సంహారానికి ప్రతీకగా స్వామివారి పాదాల దగ్గర ముగ్గురు రాక్షసుల తలలుంటాయి. శివుడికి గంగా, పార్వతుల్లా ఇక్కడి స్వామికి బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ అనే ఇద్దరు భార్యలున్నారు.
పట్నం అంటే...
ముగ్గూ ఐదు రకాల ప్రకృతి సిద్ధమైన రంగులతో వేసే రంగవల్లికనే ఇక్కడ పట్నంగా పిలుస్తారు. మామూలుగా అయితే ఒక చెక్క అచ్చు మీద ముగ్గుపోసి కదిపితే రంగవల్లికలా పడుతుంది. వాటిని చిన్న పట్నాలుగా పిలుస్తారు. దాన్ని స్వామివారికి పట్నం వేయడం అని అంటారు. కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న ప్రతి భక్తుడూ శివుడికి ఇలా పట్నం సమర్పించడం ఆనవాయితీ. పట్నం తరహాలో పెద్దగా వేసే ముగ్గూ అందులో స్వామివారి ఉత్సవ మూర్తుల పూజ నిర్వహించే తంతునంతా కలిపి పెద్దపట్నంగా పిలుస్తారు. దీనికోసం దాదాపు 50 గజాల వైశాల్యంతో వివిధ ఆకారాలలో 42 వరుసలతో ముగ్గు వేస్తారు. శివరాత్రి రోజు వేల మంది భక్తులూ శివసత్తుల మధ్య నిర్వహించే పెద్ద వేడుక ఇది.
వైవిధ్యంగా పూజ
దాదాపు మూడు నెలల పాటు సాగే ఈ జాతరలో మొదటి ఆదివారాన్ని ‘పట్టణం వారం’ (హైదరాబాద్ నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారని)గా పిలుస్తారు. ఆ వారం ఇక్కడికి వచ్చిన భక్తులు తమ సొంత ఖర్చులతో మరుసటిరోజు ‘పట్నం’ వైభవంగా నిర్వహిస్తారు. రెండో ఆదివారం ‘లష్కర్ వారం’ గా ప్రసిద్ధి. ఈ వారం సికింద్రాబాద్ లష్కర్ ప్రాంతం నుంచి భక్తులు ఎక్కువగా తరలివచ్చి స్వామికి బోనాల నైవేద్యం సమర్పించి, పట్నాలు వేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇక మార్గశిర మాసపు చివరి ఆదివారం జరిగే కల్యాణం ఓ ప్రత్యేక ఘట్టం. భక్తసందోహం నడుమ అచ్చంగా మనుషుల పెళ్లి జరిగినట్టే శివకల్యాణమూ జరుగుతుంది. ఇక్కడ స్వామి వారి కల్యాణం చేసే అర్చకులు రెండు వంశాలకు చెందిన వారున్నారు. మహదేవుని వంశంవారు అమ్మవార్ల తరఫున కన్యాదానం చేయగా, పడిగన్న వంశంవారు స్వామి తరఫు వారిగా ఉండి కల్యాణ క్రతువును సందడిగా నిర్వహిస్తారు. మూడునెలల పాటూ ఆది, బుధ వారాల్లో శివసత్తుల సందడి ఉంటుంది. చివరి రోజు అగ్ని గుండం తొక్కడంతో వేడుకలు ముగుస్తాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచీ దాదాపు 300 మంది శివసత్తులు జాతర సమయంలో స్వామిని దర్శించుకుంటారు. దేవస్థానం తరఫున వీరికి చెల్ల, గంట, చీర, త్రిశూలం ఇచ్చి సన్మానించడం ఆనవాయితీ.
Komrelly (Komuravelli)
Mallanna Swamy Temple
ప్రత్యేకతలు...
ఇక్కడి ఒళ్లు బండమీద చేతులు ఆన్చి మొక్కుకుంటే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. చుక్కలాది పర్వతం సూర్మాను గుండుగా పిలిచే రెండు పెద్ద రాళ్లను ఎక్కడం శుభప్రదంగా భావిస్తారు. ఆలయానికి సమీపంలో ఆంజనేయ, వీరభద్ర, రేణుక ఎల్లమ్మ, కొండపోచమ్మ దేవాలయాలున్నాయి. దేవాలయ ప్రాంగణంలో ఉండే గంగరేణి చెట్టునూ భక్తితో పూజిస్తారు.- శీలం చంద్రమౌళి, న్యూస్‌టుడే, చేర్యాల
Komrelly (Komuravelli)
Mallanna Swamy Temple
Source: Eenadu websiteVinayaka Temple, Kanipakam
Vinayaka Temple, Kanipakam
కాణిపాకం-వినాయకుడు
For more information visit www.kanipakam.com/home.html
సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.
క్షేత్రచరిత్ర/ స్థలపురాణం: సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.
ఈ బొజ్జ గణపయ్య.. ప్రమాణాల దేవుడయ్య!
కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..!
నిత్యం పెరిగే స్వామి: వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు.
కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.
బ్రహ్మహత్యా పాతక నివారణార్థం: స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు: మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు.
సర్పదోష పరిహారార్థం.. వరదరాజస్వామి ఆలయ నిర్మాణం
స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు.
వసతి.. రవాణా సౌకర్యాలు: కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు.. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా.. అటు తిరుమల.. శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు కనుక.. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి.
తిరుపతి నుంచి.. చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలూ విస్తృతంగా లభిస్తాయి. దగ్గరలోని రైలు.. విమాన మార్గ సదుపాయం అంటే.. తిరుపతినే ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాలి.
Source: Eenadu website
Subscribe to:
Posts (Atom)