శ్రీ పంచమి
అక్షరాలకు అధిదేవత, సకల విద్యల రాణి, జ్ఞాన ప్రదాయిని- సరస్వతీదేవి. ఆ వాగ్బుద్ధి వికాస స్వరూపిణి జన్మదినోత్సవమే శ్రీ పంచమి. నేటి మాఘ శుద్ధ పంచమి పర్వదినాన్ని ‘వసంత పంచమి’ లేదా ‘మదన పంచమి’ అని పిలుస్తారు. మానవజాతి మనుగడకు, అక్షయ సంపదకు మూలమైన ప్రణవ స్వరూపిణి సరస్వతి. ఆమె జ్ఞానానంద శక్తిగా, వేదజ్ఞాన మాతృకగా వెలుగొందుతోంది. గాయత్రిగా, లౌకిక-అలౌకిక విజ్ఞాన ప్రదాతగా భాసిస్తోంది. పరిపూర్ణ అనుగ్రహంతో స్వరాన్ని, వరాన్ని ఆ దేవి ప్రసాదిస్తోంది.
విజ్ఞాన నిధులు అనేకం. వాటిలో ప్రతిభ, మేధ, శ్రద్ధ, స్ఫురణ, ధారణ ఉంటాయి. చైతన్యం, కళా నైపుణ్యం, జ్ఞాన రహస్యం, సంస్కారం సైతం నెలకొంటాయి. వాటితో పాటు సత్కీర్తి, తర్కం, వ్యాకరణం, మీమాంస, వ్యాఖ్యానం, భాష్యం... ఇలా విభిన్న రీతుల్లో సాగిపోతుంటాయి. అన్ని విజ్ఞాన నిధులూ ఆ చల్లని తల్లి కటాక్ష వీక్షణ ఫలితాలే!
శుంభ, నిశుంభులను సంహరించిన వీర నారి ఆమె. మహా సరస్వతిగానే కాదు- సిద్ధ, నీల, ధారణ, అంతరిక్ష సరస్వతిగా ఆ దేవికి అనేక రూపాలున్నాయని ‘మంత్ర శాస్త్రం’ చెబుతోంది.
పరాశక్తిని శారద రూపంలో దర్శించాడు బ్రహ్మ. ఆమెనే ఆరాధించి, కృప పొంది, సృష్టి చేసే శక్తిని సాధించగలిగాడు. వాగ్దేవి ఉపాసన వల్లనే వాల్మీకి- రామాయణ రచన చేశాడన్నది పురాణ గాథ. ఆయన నుంచి శారదా దీక్షను స్వీకరించడం వల్లనే, వ్యాస మహర్షి వేద విభజన చేయగలిగాడంటారు. వేదాల్లో దేవీ సూక్తాలున్నాయి. ఆ శ్రీవాణిని శ్రుతులు కీర్తించాయి. సరస్వతి దయ వల్లనే ఆదిశంకరులు అపారమైన తత్వజ్ఞానాన్ని సముపార్జించారు. బృహస్పతి విద్యాసిద్ధి కోసం గీర్వాణిని ప్రార్థించాడని చెబుతారు.
ఆదిశేషుడికి మహా పండితుడిగా పేరుంది. అందుకే భూదేవి అతణ్ని జ్ఞాన రహస్యాలు బోధించాలని కోరింది. అతడు శారదను ఆరాధించి, శాస్త్రజ్ఞాన రహస్యాలు గ్రహించి, భూమాతకు ప్రబోధించాడంటాయి గ్రంథాలు.
శారదాంబను ప్రసన్నం చేసుకున్న వ్యాస భగవానుడు, గోదావరీ తీరాన సైకత మూర్తిగా ఆ దేవి విగ్రహాన్ని రూపొందిస్తాడు. ఆ మహాశక్తి అందులో సుప్రతిష్ఠితురాలై భక్తుల్ని అనుగ్రహించిందని, ఆ క్షేత్రమే వ్యాసపురి (బాసర)గా భాసిల్లుతోందని పెద్దలంటారు.
సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థముంది. ప్రవాహం చైతన్యానికి సంకేతం. వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. శుద్ధ సత్వ గుణ శోభిత సరస్వతి- శ్వేత వస్త్రాలతో అలంకృతయై, హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి ఉంటుంది. ఆమె అక్షరమాల, గ్రంథం ధరించడంతో పాటు వీణావాదనం చేస్తుంటుంది. వేదాలు సరస్వతి నుంచే ఆవిర్భవించాయని ‘గాయత్రీ హృదయం’ గ్రంథం పేర్కొంది. శ్రీ పంచమి పర్వదినాన వాణిని పలు రకాలుగా ఆరాధిస్తారు. బ్రాహ్మణి సన్నిధిలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేస్తారు.
‘సరః’ అంటే, కాంతి. జనజీవితాల్ని జ్ఞాన కాంతిమంతం చేసే మాతృశక్తి ఆమె. శరన్నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు అందుకుంటుంది. చండీ సప్తశతి, బ్రహ్మపురాణం, సరస్వతీ రహస్యోపనిషత్తు, శారదా తిలకం గ్రంథాలు పలుకుల తల్లి వ్రత-ఉద్యాపన విధానాల్ని వివరించాయి. గంగ, యమునలతో సరస్వతి కలిసి త్రివేణీ సంగమమైంది.
మార్కండేయ, స్కంద, మత్స్య పురాణాల్లో; ధర్మసింధు వంటి లాక్షణిక శిల్ప శాస్త్రాల్లోనూ వాణీవైభవం వర్ణితమైంది. ఆ వాగ్దేవి ఆలయాలు బాసరతో పాటు రాజస్థాన్, శ్రీనగర్, శృంగేరి, మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి.
సాహిత్య, సంగీతాలనే అమృత కలశాల్ని మానవాళికి ప్రసాదిస్తున్న జగన్మాత ఆమె. సకల కళారూపిణి. అక్షర సంపద అంతటినీ లోక కల్యాణానికి వినియోగించడమే సరస్వతీ దేవికి అసలైన సమర్చన!
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
Source: Eenadu.net
Vasant Panchami marks the beginning of the spring season. In eastern parts of India, particularly in West Bengal, it is celebrated as Saraswati Puja. Sates of Punjab and Bihar, celebrate it as a festival of kites. However, during the ancient times, the festival was celebrated in the royal palace of Kamadeva. Dancing girls and other celebrants danced on the beats of dhol. New clothes were designed to participate in the celebrations. The day was marked by singing love songs.
Although now the festival is dominated by the worship of the goddess Saraswati, a grand feast is prepared in the honour of Kamadeva. Also, love is still considered an integral part of the day, as it is auspicious to host a large number of weddings during the festival.

Vasant stands for spring, and Panchami means the fifth day. Thus, the festival is celebrated on the fifth day of the spring season. According to the Hindu calendar, it falls during the Purvahna Kaal on the Panchami Tithi. In other words, it occurs on the fifth day of Magha (which works out to early February).
Vasant Panchami, also called Saraswati Puja, or the Festival of Kites is celebrated by the Hindus as well as the Sikh community.
On this day, the goddess of knowledge, wisdom and art, Saraswati, is worshipped. Kamadeva and Vasant (the personification of spring) are also honoured on this festival.
The colour yellow has a great significance in the celebration of Vasant Panchami. It is believed to be the symbol of blossoming flowers of mustard. Yellow attire is therefore worn by the followers of Saraswati. Moreover, the sweets and dishes prepared for the festival are usually yellow and saffron in color.
Since the goddess is considered to be an epitome of wisdom, therefore the day is celebrated in educational institutions also. Statues of Saraswati are adorned with yellow sari and jewellery. These are then worshiped, prayers are offered, and musical events are organized to please the goddess.
In many parts of the country, the celebrants set up a grand pandal to welcome the goddess and worship her. In West Bengal, it is celebrated as Sri Panchami. Colourful processions are held to carry idols of Saraswati and immerse it in the holy water of river Ganga. In Firozpur, the day is celebrated by flying colourful kites. Thus the festival is also called as the Kite Festival.
The festival is also celebrated in Nepal. There temples of Saraswati are decorated a day before the festival to welcome the goddess for the special feast on Vasant Panchami.

No comments:
Post a Comment