"However many holy words you read, And however many you speak, What good will they do you If you do not act upon them?" - Buddha
Saturday, April 25, 2020
11 Inspiring Quotes from Bhagavad Gita - Quotes from Bhagavadgeeta
11 Inspiring Quotes from Bhagavad Gita - Quotes from Bhagavadgeeta
11 Inspiring Quotes from Bhagavad Gita - Quotes from Bhagavadgeeta
Friday, April 17, 2020
Interesting message to contemplate
Interesting message to contemplate
🌴" మీరు భగవంతుని కోసమని పూజలు చేస్తుంటారు. అయితే అవన్నీ మీ కోసమే చేసుకుంటున్నారు తప్ప భగవంతుని కోసం కాదు. నిజమునకు భగవంతునికి మీరు చేసేది ఏదీ లేదు. మీరు అనుభవిస్తున్న సమస్తమూ ఆయనిచ్చినదే. భగవంతుని కోసం ఏదైనా చేయాలంటే అది కేవలం దీనజన సేవయే. సేవల వలనే భగవంతుడు తృప్తి చెందుతాడు.
చాలామంది తిరుపతి కొండకు పోయి గుండు చెయించుకుంటారు. దేవునికి మ్రెుక్కు చెల్లించామని అంటుంటారు. ఏమిటి మీరు చెల్లించే మ్రెుక్కులు!? తల వెంట్రుకులా? అపరిశుభ్రతతో నిండిపోయిన మీ జుట్టును భగవంతుడు ఏమి చేసుకుంటాడు?
పోనీ పాప ప్రక్షాళనము కోసమా!? అలా అయితే మీరు చేసిన తప్పులే మరళా మరళా చేస్తున్నారు. ఇంకా ఎక్కడకి పోతాయి పాపాలు??
పుణ్య నదులలో స్నానములు చేస్తే పాపం పోతుందనుకుంటారు.
సొరకాయను ముంచి చూడండి! దాని చేదు పోతుందా??!
ఇవి కాదు, ముందు హృదయంలో పరివర్తన రావాలి. అది లేనిదే మీరు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రములు తిరిగినా, ఎన్ని పుణ్య నదులలో స్నానములు చేసినా ఫలితం గుండు సున్నయే. "🌴
Interesting message to contemplate
అక్షర సత్యాలు
అక్షర సత్యాలు🧚♂
🙋గెలుపు వెనుక పరిగెత్తకుండా జ్ఞానం వెనుక పరుగెడితే అపుడు గెలుపు మన వెనుక పరుగెడుతుంది..!!
🙋వంద మంది వందరకాలుగా చెప్తారు... అవన్నీ పట్టించు కొని ప్రశాంతతను కోల్పోవద్దు.. నీ అంత రాత్మ చెప్పిందే చెయ్యి. ఎందుకంటే అది ఎప్పుడూ నిన్ను మోసం చేయదు..!!
🙋గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందని బాధ పడే లోపలే అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్చగా ఎగిరిపోతుంది...
🙋మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినపుడు కాస్త ఓర్పుగా ఉంటే సరికొత్త జీవితం మొదలవుతుంది..!!
🙋మానవత్వం లేని మనిషికి దైవత్వం ఎన్నడూ దక్కదు..!!
🙋సమాజ సేవకు గంధం చెట్టులా ఉపయోగ పడాలి కాని తుప్పు పట్టిన ఇనుప ముక్కలా అడ్డం పడకూడదు..!!
🙋ఇల్లు అనేది ఆకలితీర్చే భోజన శాలకాదు. సుఖాల నిచ్చే వసతి కాదు... అది ధర్మాన్ని
నేర్పించే పాఠశాల...
అంతః శక్తినిచ్చే ధ్యాన మందిరం...తానెవరో తెలిపే జ్ఞాన మందిరం.. నిన్ను రక్షించే అమ్మ ఒడి.. మోక్షాన్నిచ్చే గర్భ గుడి...అందుకే గృహస్తుడే ఒక మహాఋషి..!!
🙋నిర్మలమైన మనస్సు...!
నిశ్చలమైన భక్తి...!
నిరంతర సాధన...!
సడలని నమ్మకం..!
🙋ఆభగవంతుని కూడా పసివానిగా మార్చి పరవసింప జేస్తాయి. మోక్షాన్ని ప్రసాధిస్తాయి..!!
🐸గుడ్డు తనకు తాను పగిలితే జననం. మనం పగలగొడితే మరణం.. అలాగే ఏమార్పు అయినా మనలో నుండే రావాలి.. ప్రపంచం మనకు ప్రేరణ మాత్రమే ఇస్తుంది..!!
🐸విజయవంత మయిన వ్యక్తి ఇతరులు తన మీద విసిరిన రాళ్లనే పునాదులుగా చేసుకుని విజయం సాధిస్తారు..!!
🐸జీవితం లో నమ్మకపోతే పూర్తిగా నమ్మ కూడదు..నమ్మితే ఇక సందేహ పడరాదు..!!
🐸అన్నం లేకపోవడమే పేదరికం కాదు.కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం..!!
🐸పడిపోతే పగిలి పోయే ఫోన్ కే ఎంతో విలువ ఇస్తున్నాం. అలాంటిది జీవితాంతము మనతో వుండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి. చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోవద్దు..!!
🐸దేనికైతే నీవు నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో.. అదే నిన్ను మళ్లీ మళ్లీ వెంటాడుతుంది.. ఒకసారి ఎదురెళ్లి చూడు భయమే
నీకు భయపడుతుంది..!!
🐸ఎవరికో నచ్చినట్లు గా బ్రతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది.. అదే నీకు నచ్చినట్లు బ్రతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది..!!
🐸అన్నింటికీ గొడవపడి అలిగే వాళ్ళ మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకుంటే ఆ బంధం అద్భుతంగా ఉంటుంది..!!
⛑ఆలోచిస్తూ ఆలోచిస్తూ కూర్చుంటే అనారోగ్యం రాక తప్పదు.. అనవసరంగా ఆలోచించడడం మానేయాలి..అపుడే ఆరోగ్యం మన సొంతం..!!
⛑ఎక్కువగా ఆలోచించడం మానేస్తే ఎక్కువ సమస్యలు ఇట్టే పోతాయి...!!
⛑ఎన్ని సమస్యలు ఎన్ని సార్లు తీర్చినా ఆలోచనలు మారనంత వరకు ఏ సమస్యా పూర్తిగా తీరదు.. అది రూపం మార్చి తిరిగి వస్తూనే ఉంటుంది...!!
⛑అసంతృప్తికి మూలం ఉన్నదాన్ని వదలి రాబోయేదాని గురించి ఎదురుచూడటం. దానిగురించే ఆలోచించడం...!!
⛑అదుపు లేని , ఆశాస్త్రీయ ఆలోచనలే "మనోవ్యాధి"
⛑"గతం గురించి ఎక్కువ చింతిస్తూ కూర్చుంటే మన స్థితి మరింత తారు మారు అవుతుంది...!!
⛑శక్తి వంతంగా ఉండాలి అంటే ఏ పని చేసేటపుడు ఆపనిలో ఉండాలి. అంటే తినేటప్పుడు తిండి మీదే దృష్టి, నడిచేతపుడు నడక మీదే దృష్టి. అలాగా...!!
⛑ఇప్పుడున్న దాన్ని ఆనందంగా స్వీకరించి, భవిష్యత్తు కు తగిన అడుగులు వేయడం ఒకానొక గొప్ప జ్ఞానం...!!
Dear Parents one moments please
అందరూ తల్లి తండ్రులు ఒక్క క్షణం ఇది చదవండి....మిత్రమా
👬ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లడు పొగ త్రాగడం నేర్చుకున్నాడు
15 ఏళ్లకే మందు తాగడం నేర్చుకున్నాడు
ఎలాగోలా స్కూల్ చదువు నుండి కాలేజీ కి వచ్చాడు
అక్కడ పేకాట పడుచుపిల్లల్తో ఆటలు నేర్చుకున్నాడు
దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరం అయింది
డబ్బుకోసం దొంగతనం నేర్చుకున్నాడు
అది సరిపోక హత్యలు చేయడము మొదలెట్టాడు
దొంగ ఎన్ని రోజులో దొరలాగా తిరగలేడు ఒకరోజు దొరికిపోయాడు
మూడేళ్ళ విచారణ తరువాత అతనికి ఉరిశిక్ష పడింది
మళ్ళీ ఎన్ని అప్పీళ్లు పెట్టుకున్న అవన్నీ కొట్టేసి ఉరిశిక్షకైనా రోజును చెప్పేసారు
చివరగా అతని కోరిక ఏమని అడగగా తన కన్నవారిని చూడాలని కోరాడు
అతని కోరిక మేరకు వారిని పిలిపించారు
కన్నవాళ్ళు కదా కన్నపిల్లలు రాక్షసులైన ప్రేమిస్తారు
పోలీసులు లాయర్లు సాక్షులు అందరూ మోసం చేసి నీ ఉరికి కారణమయ్యారని ఏడ్చారు
అప్పుడు అతను వారు కాదు నా మరణానికి కారణం
మీరే అని చెప్పాడు
ఐదేళ్ల వయసులో ఉపాధ్యాయుడు కొట్టడాడని చెప్పగానే బంధువులతో కలిసి వెళ్లి పోలీస్ కంప్లైంట్ చేసి మరి అతన్ని నిందించారు.
అక్కడ నుండి మొదలయింది నేను చెడిపోవడం ఈరోజు ఉరితాడు నా మెడకు రావడానికి కారణం మీరే అని కంటతడి పెట్టాడు
ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు
చిన్న తప్పులే కదా అని వెనుకేసుకురాకండి అవే రేపు క్షమించలేని పెద్ద నేరాలవుతాయి.మిత్రమా!!!

Subscribe to:
Posts (Atom)