Friday, April 17, 2020

అక్షర సత్యాలు



అక్షర సత్యాలు🧚‍♂


🙋గెలుపు వెనుక పరిగెత్తకుండా జ్ఞానం వెనుక పరుగెడితే అపుడు గెలుపు మన వెనుక పరుగెడుతుంది..!!

🙋వంద మంది వందరకాలుగా చెప్తారు... అవన్నీ పట్టించు కొని ప్రశాంతతను కోల్పోవద్దు.. నీ అంత రాత్మ చెప్పిందే చెయ్యి. ఎందుకంటే అది ఎప్పుడూ నిన్ను మోసం చేయదు..!!

🙋గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందని బాధ పడే లోపలే అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్చగా ఎగిరిపోతుంది...

🙋మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినపుడు కాస్త ఓర్పుగా ఉంటే సరికొత్త జీవితం మొదలవుతుంది..!!

🙋మానవత్వం లేని మనిషికి దైవత్వం ఎన్నడూ దక్కదు..!!

🙋సమాజ సేవకు గంధం చెట్టులా ఉపయోగ పడాలి కాని  తుప్పు పట్టిన ఇనుప ముక్కలా అడ్డం పడకూడదు..!!

🙋ఇల్లు అనేది ఆకలితీర్చే భోజన శాలకాదు. సుఖాల నిచ్చే వసతి కాదు... అది ధర్మాన్ని
 నేర్పించే  పాఠశాల...
అంతః శక్తినిచ్చే ధ్యాన మందిరం...తానెవరో తెలిపే జ్ఞాన మందిరం.. నిన్ను రక్షించే అమ్మ ఒడి..  మోక్షాన్నిచ్చే  గర్భ గుడి...అందుకే గృహస్తుడే ఒక మహాఋషి..!!

🙋నిర్మలమైన మనస్సు...!
నిశ్చలమైన భక్తి...!
నిరంతర సాధన...!
సడలని నమ్మకం..!

🙋ఆభగవంతుని కూడా పసివానిగా మార్చి పరవసింప జేస్తాయి. మోక్షాన్ని ప్రసాధిస్తాయి..!!


🐸గుడ్డు తనకు తాను పగిలితే జననం. మనం  పగలగొడితే మరణం.. అలాగే ఏమార్పు అయినా మనలో నుండే రావాలి..  ప్రపంచం మనకు ప్రేరణ మాత్రమే ఇస్తుంది..!!

🐸విజయవంత మయిన వ్యక్తి ఇతరులు తన మీద విసిరిన రాళ్లనే పునాదులుగా చేసుకుని విజయం సాధిస్తారు..!!

🐸జీవితం లో నమ్మకపోతే పూర్తిగా నమ్మ కూడదు..నమ్మితే ఇక సందేహ పడరాదు..!!

🐸అన్నం లేకపోవడమే పేదరికం కాదు.కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం..!!

🐸పడిపోతే పగిలి పోయే ఫోన్ కే ఎంతో విలువ ఇస్తున్నాం. అలాంటిది జీవితాంతము మనతో వుండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి. చిన్న చిన్న  కారణాలతో బంధాలను దూరం చేసుకోవద్దు..!!

🐸దేనికైతే నీవు  నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో.. అదే నిన్ను మళ్లీ మళ్లీ వెంటాడుతుంది..  ఒకసారి ఎదురెళ్లి చూడు భయమే
నీకు భయపడుతుంది..!!

🐸ఎవరికో నచ్చినట్లు గా బ్రతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది.. అదే నీకు నచ్చినట్లు బ్రతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది..!!

🐸అన్నింటికీ గొడవపడి అలిగే వాళ్ళ మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకుంటే ఆ బంధం అద్భుతంగా ఉంటుంది..!!


⛑ఆలోచిస్తూ ఆలోచిస్తూ కూర్చుంటే అనారోగ్యం రాక తప్పదు.. అనవసరంగా ఆలోచించడడం మానేయాలి..అపుడే ఆరోగ్యం మన సొంతం..!!

⛑ఎక్కువగా ఆలోచించడం మానేస్తే ఎక్కువ సమస్యలు ఇట్టే పోతాయి...!!

⛑ఎన్ని సమస్యలు ఎన్ని సార్లు తీర్చినా ఆలోచనలు మారనంత వరకు ఏ సమస్యా పూర్తిగా తీరదు.. అది రూపం మార్చి తిరిగి వస్తూనే ఉంటుంది...!!

⛑అసంతృప్తికి మూలం ఉన్నదాన్ని వదలి రాబోయేదాని గురించి ఎదురుచూడటం. దానిగురించే ఆలోచించడం...!!

⛑అదుపు లేని , ఆశాస్త్రీయ ఆలోచనలే "మనోవ్యాధి"

⛑"గతం గురించి ఎక్కువ చింతిస్తూ కూర్చుంటే మన స్థితి మరింత తారు మారు అవుతుంది...!!

⛑శక్తి వంతంగా ఉండాలి అంటే ఏ పని చేసేటపుడు ఆపనిలో ఉండాలి. అంటే తినేటప్పుడు తిండి మీదే దృష్టి, నడిచేతపుడు నడక మీదే దృష్టి. అలాగా...!!

⛑ఇప్పుడున్న దాన్ని ఆనందంగా స్వీకరించి, భవిష్యత్తు కు తగిన అడుగులు వేయడం ఒకానొక గొప్ప జ్ఞానం...!!


No comments:

Post a Comment