Friday, April 17, 2020

Interesting message to contemplate

Interesting message to contemplate


 🌴" మీరు భగవంతుని కోసమని పూజలు చేస్తుంటారు. అయితే అవన్నీ మీ కోసమే చేసుకుంటున్నారు తప్ప భగవంతుని కోసం కాదు. నిజమునకు భగవంతునికి మీరు చేసేది ఏదీ లేదు. మీరు అనుభవిస్తున్న సమస్తమూ ఆయనిచ్చినదే. భగవంతుని కోసం ఏదైనా చేయాలంటే అది కేవలం దీనజన సేవయే. సేవల వలనే భగవంతుడు తృప్తి చెందుతాడు.

చాలామంది తిరుపతి కొండకు పోయి గుండు చెయించుకుంటారు. దేవునికి మ్రెుక్కు చెల్లించామని అంటుంటారు. ఏమిటి మీరు చెల్లించే మ్రెుక్కులు!? తల వెంట్రుకులా?  అపరిశుభ్రతతో నిండిపోయిన మీ జుట్టును భగవంతుడు ఏమి చేసుకుంటాడు?
పోనీ పాప ప్రక్షాళనము కోసమా!? అలా అయితే మీరు చేసిన తప్పులే మరళా మరళా చేస్తున్నారు. ఇంకా ఎక్కడకి పోతాయి పాపాలు??

పుణ్య నదులలో స్నానములు చేస్తే పాపం పోతుందనుకుంటారు.

సొరకాయను ముంచి చూడండి!  దాని చేదు పోతుందా??!

 ఇవి కాదు, ముందు హృదయంలో పరివర్తన రావాలి. అది లేనిదే మీరు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రములు తిరిగినా, ఎన్ని పుణ్య నదులలో స్నానములు చేసినా ఫలితం గుండు సున్నయే. "🌴

Interesting message to contemplate

No comments:

Post a Comment