Sunday, August 30, 2020

దీపం ఏ నూనెతో వెలిగించాలి

 

Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.: దీపాన్ని ఏ నూనెతో  వెలిగించాలి?,Which oil good to lit the Lamp at God

:pray: దీపం ఏ నూనెతో వెలిగించాలి

మనం ఇంట్లో దేవునికి దీపారాధన చేసినా కొంత మంది విషయం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరికి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ? ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటివి ఇప్పుడు తెలుసుకుందాం
పంచలోహాలు,వెండి,మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయష్కరం అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు.తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి

తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు,విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణంవైపు దీపారాధన చేయరాదు దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు,కష్టాలు, దుఖం బాధ కలుగుతాయి
దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్ర్తం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి భాదలు తొలగించుకునుటకు మంచిది
.
ఎట్టి పరిస్థితులలో కూడా పల్లి (వేరుశనగ ) నూనెతో దీపారాధన చేయరాదు. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. లేదంటే నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది విప్ప, వేప నూనెలు ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభము అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 41 రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
దీపాన్ని క్రింద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు,లేదా ఎదైనా ప్లేట్ ఉపయోగించి దీపారాదన చేయాలి. తప్పనిసరిగా ప్రతిరోజు దీపారాధన చేయాలి.

దీపారాధన - నియ‌మాలు | jyothishyam, deeparadana, rules - Telugu Oneindia

ఎన్ని దీపాలు పెట్టాలి

ఒకే ప్రమిదలో మూడువత్తులు వేసి దీపాన్ని వెలిగించవచ్చు. అవకాశం ఉంటే దేవుని రూపాలు/ప్రతిమలకు రెండు పక్కల రెండు దీపాలను పెట్టవచ్చు. ప్రతి దాంటో మూడు వత్తులను కలపి ఒకటిగా చేసి లేదా ఒక్కొక్కటి చొప్పునైనా వెలింగచవచ్చు
– దీపం ఏ దిశకు పెట్టాలి అనేది మరో సందేహం. దీపం దేవునికి ఎదురుగా కుడిపక్కకు అంటే మన కుడిపక్కకు లేదా దేవుని మంటపంలో ఆగ్నేయ భాగంలో పెట్టాలి. బొడ్డుత్తులైతే ఏ సమస్య ఉండదు.
– దీపపు సెమ్మలో మధ్యలో వత్తి పైకి చూసే విధంగా ఉంటే దిక్కులతో ఎటువంటి ఇబ్బంది ఉండదు.
– రెండు దీపాలు పెడితే ఒకదానిని మరొకటి చూసే విధంగా పెట్టాలి.
– ఒక్కటే పెడితే తూర్పు లేదా ఉత్తరం లేదా పశ్చిమం చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి.
– నాలుగు పక్కలా నాలుగు దీపాలు పెడితే మరీ శ్రేష్ఠం. కానీ ఇంట్లో స్థలం, నూనె, ఆర్థిక పరిస్థితులను చూసుకుని పెట్టాలి. అందుబాటులో ఉన్న ఏదైనా నూనెతో వెలిగించండి. భక్తి, శ్రద్ధతో ఏ విధమైన దీపాన్ని పెట్టినా శుభమే.

No comments:

Post a Comment