Wednesday, May 28, 2025

విష్ణువుకి ప్రియమైన పుష్పాలు ఏమిటి..?

 విష్ణువుకి ప్రియమైన పుష్పాలు ఏమిటి..?


1. అహింసా పుష్పం

ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమే దేవునికి సమర్పించే ప్రధమ పుష్పం.

2. ఇంద్రియ నిగ్రహం

చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవునికి అందించాల్సిన రెండో పుష్పం.

3.దయ

కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ. ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.

4.క్షమ

ఎవరైనా మనకి అపకారం చేసినా, ఓర్పుతో సహించడమే క్షమ. ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.

5. ధ్యానం

ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం. ఇది దేవునికి అందించే ఐదో పుష్పం.

6. తపస్సు

మానసిక (మనస్సు), వాచిక (మాట), కాయక (శరీరం)లకు నియమాలు ఉండడం తపస్సు. ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం
.
7. జ్ఞానం

పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం. ఇది దేవునికి అర్చించాల్సిన ఏడవ పుష్పం
.
8. సత్యం

ఇతరులకు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం. ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.
అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహః

విశేషత
శ్రీ భూత దయా పుప్పం క్షమా పుష్ప
జ్ఞాన పుష్పం తప: పుష్పం శాంతి పుష్పం తథైవ చ సత్యం అష్ట విధం పుష్పా: పెద్ద హో ప్రీతి కరం

అంతర్వేది పుణ్యక్షేత్రం* *వేయి మందితో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమం.

 *అంతర్వేది పుణ్యక్షేత్రం*


*వేయి మందితో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమం.*
తేదీ 09.10.25 ఆదివారం - 02.00 గం-04.00 గం వరకు.

అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం - అద్భుతమైన అవకాశం.

* *ఉచిత బస్సు ఏర్పాటు* ఏ ప్రాంతం నుంచయినా 30-50 మంది ఉంటే , ఆ సంఖ్యకు అనుగుణంగా దేవస్థానం వారు ఆ ప్రాంతం నుంచి రాను పోను బస్సు ఏర్పాటు చేస్తారు.
* *ఉచిత దర్శనం* ఆయా బస్సుల్లో చేరుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు ఉంటుంది.
* *భోజనం ఏర్పాటు:* దర్శనానంతరం భక్తులకు ఉచిత అన్న ప్రసాద ఏర్పాటు ఉంటుంది.
* *సహస్ర గళ నామ పారాయణం:* రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పారాయణ. పారాయణ చేయలేని వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరించగలరు.
* *తిరుగు ప్రయాణం* పారాయణ అనంతరం, అవే బస్సుల్లో తిరిగి వారి వారి ఊర్లలో ఉచితంగా చేరవేస్తారు.
కావున ఈ అద్భుతమైన అవకాశం భక్తులు వినియోగించుకుని తరించగలరు.

వివరాలకు, ప్రయాణ ఏర్పాటుకు సంప్రదించండి.

*గమనిక:* ఉచిత బస్సు ఏర్పాటుకు కనీసంగా 30 మంది ఉండాలి

*వేంకట రామయ్య మిర్తిపాటి*
9492547187

స్త్రీలు సోమవారంనాడు తలస్నానం చేయకూడదు అని అంటారు కొందరు. ఇది నిజమా? ఎందుకు చేయకూడదు?*

 *స్త్రీలు సోమవారంనాడు తలస్నానం చేయకూడదు అని అంటారు కొందరు. ఇది నిజమా? ఎందుకు చేయకూడదు?*


స్త్రీలు సోమవారం తలస్నానం చేయకూడదు అని కొన్ని ప్రాంతీయ సంప్రదాయాల్లో లేదా వృద్ధులు చెప్పే ఆచారాల్లో కనిపించే మాట. అయితే దీని గురించి శాస్త్రీయంగా చెప్పబడిన స్పష్టమైన మంత్రాలు లేక ఆధారాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయినప్పటికీ, దీనికి కొన్ని సంప్రదాయిక మరియు ఆచారాత్మక కారణాలు ఉన్నాయి. 


1. శివుని వ్రత దినం కావడం:

సోమవారం పరమశివుని ఉపాసన దినంగా పరిగణించబడుతుంది. శివుని వ్రతం చేస్తూ నిండుగా భక్తితో ఉపవాసం, జపం, పూజలు చేయడం అనేకమంది చేస్తారు. ఈ రోజు తలస్నానం చేయకుండా, శుద్ధతతో పూజలో పాల్గొనాలని భావించే సంప్రదాయం ఉంది. కానీ ఇందులో తలస్నానం మానివేయాలన్న నిబంధన ఖచ్చితంగా లేదు.


2. ఋతుకాల సమయంలో నిషేధం:

కొన్ని సంప్రదాయాల ప్రకారం, సోమవారం తలస్నానం చేయడం వల్ల “శీతలత” ఎక్కువగా వచ్చి, స్త్రీల హార్మోనల్ వ్యవస్థపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయం ఉంది. ఇది ఎక్కువగా ఆరోగ్యపరమైన ఆచారంగా భావించవచ్చు.


కొన్ని సోమవార వ్రతాలలో (ప్రముఖంగా సౌమ్య వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటివి) తలస్నానం చేయకుండా ఉండటం వ్రత నియమాలలో భాగంగా చెప్పబడింది. కానీ ఇది అన్ని వ్రతాలకూ వర్తించదు.


ధర్మశాస్త్రాలలో కానీ, వ్రతచంద్రిక, నీలమత పురాణం, గృహ్య సూత్రాలలో మాత్రం “స్త్రీలు సోమవారం తలస్నానం చేయరాదు” అనే నిబంధన కనిపించదు. అలాంటి స్పష్టమైన నిషేధం లేదు.గ

మీరు శివుని వ్రతం చేస్తుంటే, ఏవైనా నియమాలు ఆ వ్రతకై ప్రామాణిక గ్రంథంలో ఉన్నాయా అనేది చూడండి.

ఆరోగ్యపరంగా సమస్యలేమీ లేకపోతే తలస్నానం చేయవచ్చు.

వృద్ధుల మాట వినడం మంచిదే, కానీ దాని వెనుక ఆధారాలు తెలుసుకుని ఆచరించడమే ఉత్తమం.


“స్త్రీలు సోమవారం తలస్నానం చేయకూడదు” అనే మాట సంప్రదాయానికి సంబంధించినది, కానీ అది శాస్త్రీయంగా ఖచ్చితమైన నిషేధం కాదు. వ్రత నియమాల ప్రకారం మాత్రమే కొన్ని సందర్భాల్లో పాటించవచ్చు.”హరే కృష్ణ 🙏

Friday, May 16, 2025

సరస్వతి నది పుష్కరాలు

 సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం🚩 



భారతదేశ చరిత్ర , పురాణాలలో సరస్వతి నదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. త్రివేణి సంగమంలో సరస్వతి నది కూడా ఓ భాగం. పురాణాలు , చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సరస్వతి నది ప్రస్తుతం కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక త్వరలోనే ఈ నది పుష్కరాలు రాబోతున్నాయి. 


భారతదేశం ఎన్నో పవిత్ర నదులకు పుట్టిల్లు. పంచభూతాల్లో ఒకటైన నీటిని మన దేశంలో పరమ పవిత్రంగా భావిస్తాం. అందుకే ఆ నీరు ప్రవహించే నదులను కూడా పూజిస్తాం.. వాటిల్లో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని.. సమస్యలు తీరుతాయని నమ్ముతాం. మన దేశంలో చాలా నదులకు పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. వాటిల్లో ఒకటి సరస్వతి నది. రుగ్వేదంలో దీని గురించి ప్రస్తావన ఉంది. సరస్వతి నది గురించి రుగ్వేదంలో "అంబితమే, నదీతమే, దేవీతమే" (ఉత్తమ తల్లి, ఉత్తమ నది, ఉత్తమ దేవత)గా కీర్తించారు. సరస్వతి నది ఒకప్పుడు భారతదేశంలోని వాయవ్య ప్రాంతంలో ప్రవహించిందని చెబుతారు.


సరస్వతీ నది జన్మస్థలం ప్రవాహ తీరం 


సరస్వతీ నది హిమాలయాల నుంచి ప్రారంభమై  భారతదేశంలోని అనేక రాష్ట్రాల గుండా ప్రవహించి.. చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుందని పురాతన గ్రంథాలు, భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనాలు సూచిస్తున్నాయి. రుగ్వేదంలో సరస్వతి నది యమునా, సట్లెజ్ నదుల మధ్య ప్రవహించినట్లు పేర్కొనబడింది. దీని ఆధారంగా.. సరస్వతీ నదిని ఆధునిక కాలంలో గగ్గర్-హక్రా నది వ్యవస్థగా గుర్తించారు. ఈ నది హిమాచల్ ప్రదేశ్‌లోని శివాలిక్ కొండల నుంచి ప్రారంభమై, పంజాబ్, హర్యానా, రాజస్తాన్ రాష్ట్రాల గుండా ప్రవహించి,.. గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్‌ వద్ద సముద్రంలో కలిసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నది మనకు కనిపిస్తుందా అంటే లేదు. సుమారు 4000-5000 సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న భౌగోళిక, వాతావరణ మార్పుల వల్ల ఈ నది ఎడారిలో.. తన ఆనవాళ్లను వదిలి అదృశ్యమైందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.


ప్రస్తుతం, సరస్వతీ నది భూగర్భంలో ప్రవహిస్తుందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపరితలంపై కనిపిస్తుందని నమ్మకం. ఉత్తరాఖండ్‌లోని మన గ్రామం (మానా విలేజ్) సమీపంలో, బదరీనాథ్ వద్ద అలకనంద నదితో కలిసే సరస్వతీ నదిని ఒక ఉపనదిగా గుర్తిస్తారు. దీని ప్రకారం.. సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో చారిత్రక సంబంధం కలిగి ఉంది.


 ప్రారంభం ఎక్కడంటే.. 


సరస్వతీ నది ఆరంభం గురించి ప్రధానంగా రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వీటిల్లో ఒకటి పురాతనమైనది కాగా.. మరోకటి శాస్త్రీయమైనది. ఇక పురాణాల ప్రకారం చూసుకుంటే.. సరస్వతీ నది బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించి, హిమాలయాల్లోని ప్లక్ష వృక్షం వద్ద ప్రారంభమైందని చెబుతారు. అలానే శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం చూసుకుంటే.. సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్‌లోని శివాలిక్ కొండల్లోని హర్-కీ-దూన్ హిమానీనదం (గ్లేసియర్) నుంచి ఉద్భవించిందని కొన్ని కొందరు చెబుతుండగా.. గర్వాల్ ప్రాంతంలోని బందర్‌పూంచ్ మాసిఫ్ వద్ద ప్రారంభమైందని మరొక అభిప్రాయం ఉంది.


ఈ నది సట్లెజ్, యమునా నదులతో సంబంధం కలిగి ఉండేదని, తర్వాత భూకంపాల వల్ల దాని మార్గం మారిపోయిందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని మన గ్రామంలో సరస్వతీ నది ఉపరితలంపై కనిపించి, అలకనందలో కలుస్తుంది. కనుక మానా గ్రామం సరస్వతి నది ఆధునిక ఆరంభ స్థానంగా పరిగణిస్తున్నారు.


 చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత.. 


సరస్వతీ నది ఒకప్పుడు హరప్పా నాగరికతకు జీవనాధారంగా ఉండేదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాలు సూచిస్తున్నాయి. నాటి ప్రజలు ఈ నదిని జ్ఞాన దేవతగా పూజించారు. సరస్వతి నది పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని, మోక్షాన్ని అందిస్తాయని నమ్మకం. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు.


మిగతా నదుల మాదిరే 12 సంవత్సరాలకు ఒకసారి సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి. ఇది బృహస్పతి (గురు గ్రహం) మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుగుతుంది. ఈ సారి 2025, మే 15 నుంచి మే 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి.


నదీస్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు హిందువుల సాంప్రదాయం. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని పురాణాల ద్వారా తెలుస్తోంది. జీవరాశులకు నీటి ఆవస్యకత.. ప్రాముఖ్యతను పుష్కరాలు గుర్తు చేస్తాయి.


ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజులపాటు సరస్వతీనది పుష్కరాలు వైభవంగి జరుగనున్నాయి . ఈ సమయంలో సరస్వతి నదితీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఏ నదిలో పుష్కరాలు జరుగుతున్నాయో ఆ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని సరస్వతి నది పుష్కరాలకు సిద్ధమవుతుంది. తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతినదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తులు సిద్దమవుతున్నారు.


తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి - ప్రాణహితలతో పాటుగా సరస్వతి కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తోందని నమ్మకం అందువల్ల కాళేశ్వరంలో పుష్కరాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

Friday, April 11, 2025

Thursday, March 13, 2025

గోమతి చక్రాల విశిష్టత

 


గోమతి చక్రాల విశిష్టత 🏵️



గోమతి చక్రాలు అరుదైన సహజసిద్ధంగా లభ్యమయ్యే సముద్రపు ఉత్పత్తి. 

చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో 

సోడియం లేదా, కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతో రూపుదిద్దికుంటాయి. 


వీటి ఆకారం శ్రీమహావిష్ణువు చేతిలోని చక్రాన్ని 

పోలి ఉంటుంది. 

అందుకే 'నాగ చక్రం', 'విష్ణు చక్రం' అని పిలుస్తారు. గోమతిచక్రం నత్తగుళ్ళని పోలి ఉంటుంది కాబట్టి 

వీటిని 'నత్త గుళ్ళ' స్టోన్ అని కూడా అంటారు. 


గోమతి చక్రాలు వెనుకభాగం ఉబ్బెత్తు గాను, ముందుభాగం చదరం (ఫ్లాట్) గాను ఉంటుంది. 

వృషభ రాశి, రోహిణి రాశులు శుక్రగ్రహానికి చెందినవి, శుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీదేవికి సోదరుడు కావడం వల్ల ఈ చక్రాల ఉపయోగం అనేకం, 

అనంతం, అత్యంత శ్రేష్ఠం అని చెప్పవచ్చు. 


జ్యోతిష్యశాస్త్ర రీత్యా శుక్రుడు లైంగిక సామర్థ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు కారణం కావడం వలన గోమతి చక్రాన్ని ధరించడం వల్ల అనేక శ్రేష్టమైన ఉపయోగాలు ఉన్నాయి. 

ఈ గోమతి చక్రాలు గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలోని గోమతి నదిలో లభిస్తాయి. 

గోమతిచక్రలు రెండు రంగులలో లభిస్తాయి 

తెల్లనివి, ఎరుపువి. 


తెలుపురంగు గోమతిచక్రాలను అన్ని రకాల పూజా కార్యక్రమాలకి, సకల కార్యసిద్ధికి, ఆరోగ్య సమస్యలకి ధరించడానికి ఉపయోగపడతాయి. 

ఎరుపురంగు గోమతి చక్రాలు వశీకరణం, శత్రునాశనం, క్షుద్రపూజలకు, తాంత్రిక ప్రయోగాలకు మాత్రమే ఉపయోగించాలి. 


గోమతి చక్రాలలో ఆరు, తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉంటాయి. 

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఆరు శుక్ర గ్రహానికి, 

తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి. 

జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో విఫలం కావడం, 

వివాహం అయిన తరువాత రతికి ఆసక్తిని కనబరచకపోవడం వంటి 

దోషాలు సైతం గోమతిచక్ర ధారణ వల్ల నివారింపబడతాయి.


గోమతి చక్రాల పూజా విధానం.......

గోమతి చక్రాలను సిద్ధం చేసుకుని వాటిని ముందుగా గంగాజలం లేదా పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుని పరిశుభ్రమైన పొడి బట్టతో తుడుచుకోవాలి, గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా 

అష్టలక్ష్మీ యంత్రంతో పీఠంపై అమర్చుకోవాలి. 

గోమతి చక్రాల పూజను శుక్రవారం రోజు, 

దీపావళి రోజు లేదా వరలక్ష్మీవ్రతం రోజు చేసుకుని 

మనకు కావలసిన సమయాలలో తీసుకుని ఉపయోగించవచ్చు. 


గోమతి చక్రాలను లలితా సహస్ర నామాలను జపిస్తూ కుంకుమతో లేదా హనుమాన్ సింధూరంతో గాని 

అర్చన చేయాలి. 

పూజ పూర్తయిన తరువాత గోమతి చక్రాలను 

ఎఱ్ఱని బట్టలో కాని, హనుమాన్ సింధూరంలో కానీ పెట్టుకోవాలి. 

గోమతి చక్రాలను పిరమిడ్ లో గాని వెండి బాక్స్ లోగాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా 

కుంకుమతో పాటు బీరువాలో భద్రపరచుకోవాలి.


గోమతి చక్రాల ఉపయోగాలు.....

1. ఒక గోమతిచక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి 

ఆ నీటిని త్రాగటం వల్ల మనుషులలోని రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి లభిస్తుంది.


2. గోమతిచక్రాన్ని లాకెట్ రూపంలో ధరిస్తే 

నరదృష్టి బాధలనుండి విముక్తి కలుగుతుంది, 

బాలారిష్ట దోషాలు కూడా సమసిపోతాయి.


3. రెండు గోమతిచక్రాలను బీరువాలో కాని పర్సులో కాని ఉంచినట్లయితే ధనాభివృద్ధి కలిగి ఎప్పుడూ ధనానికి లోటు ఉండడు.


4. రెండు గోమతి చక్రాలను భార్యాభర్తలు నిద్రించే' 

పరుపు క్రింద కాని దిండు క్రింద కాని ఉంచినట్లయితే వారిద్దరి మధ్యా ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.


5. మూడు గోమతి చక్రాలను బ్రాస్ లెట్ లా చేసుకుని చేతికి ధరిస్తే జనాకర్షణ, కమ్యూనికేషన్, 

సహకారం లభిస్తుంది.


6. మూడు గోమతి చక్రాలను మన దగ్గర అప్పుగా తీసుకుని డబ్బులు తిరిగి ఇవ్వని వారి పేరు 

మూడు గోమతిచక్రాల మీద వ్రాసి నీటిలో వేయటం కాని వాటిని వెంట పెటుకుని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా యిచ్చే అవకాశం ఉంటుంది. 

(ఈ ప్రయోగాన్ని మంగళవారం చేస్తే ప్రయోజనం కలుగుతుంది)


7. నాలుగు గోమతి చక్రాలను పంట భూమిలో పొడిచేసి కాని మామూలుగా కాని చల్లటం వలన పంట బాగా పండుతుంది.


8. నాలుగు గోమతి చక్రాలను గృహ నిర్మాణ సమయంలో గర్భస్థానంలో భూమిలో స్థాపించడం వలన 

ఆ ఇళ్ళు త్వరగా పూర్తయి అందులో నివశించేవారు 

సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉంటారు.


9. నాలుగు గోమతి చక్రాలను వాహనానికి కట్టడం వలన వాహన నియంత్రణ కలిగి వాహన ప్రమాదాల నుండి నివారింప బడతారు.


10. ఐదు గోమతి చక్రాలను తరచూ గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకి కట్టడం వలన 

గర్భం నిలుస్తుంది.


11. ఐదు గోమతి చక్రాలను చదువుకునే పిల్లల పుస్తకాల దగ్గర ఉంచడం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది. తరచూ ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి.


12. ఐదు గోమతి చక్రాలను నదిలో కాని జలాశయంలో కాని విసర్జన చేస్తే పుత్రప్రాప్తి కలుగుతుంది.


13. ఆరు గోమతి చక్రాలను అనారోగ్యం కలిగిన 

రోగి మంచానికి కట్టడం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది.


14. ఆరు గోమతి చక్రాలు ఇంట్లో ఉంచుకుంటే శత్రువులపై విజయం సాధించవచ్చు, 

కోర్టు గొడవలు ఉండవు, 

ఉన్నా విజయం సాధిస్తారు.


15. ఏడు గోమతి చక్రాలు ఇంటిలో ఉండడం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. 

ఇతరులతో సామాజిక సంబంధాలు బాగుంటాయి.


16. ఏడు గోమతిచక్రాలను నదిలో విసర్జన చేసిన.. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు మటుమాయం అవుతాయి.


17. ఎనిమిది గోమతిచక్రాలు అష్టలక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు.


18. తొమ్మిది గోమతిచక్రాలు ఇంటిలో ఉండడం వలన మన ఆలోచనలని ఆచరణలో పెట్టవచ్చు. 

ఆధ్యాత్మిక చింతన కలుగుతాయి. 

ఆ ఇంట్లోని వ్యక్తులు సమాజంలో గౌరవించబడతారు.


19. పది గోమతి చక్రాలు ఆఫీసులో ఉండడం వలన 

ఆ సంస్థకి అమితమైన గుర్తింపు లభించడంతో పాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి, 

వారు సమాజంలో గొప్ప పేరుప్రఖ్యాతలతో గుర్తింపబడతారు.


20. పదకొండు గోమతి చక్రాలు లాభ లక్ష్మీస్వరూపంగా పూజిస్తారు.

భవన నిర్మాణ సమయంలో పునాదిలో పదకొండు గోమతిచక్రాలను ఉంచడం వలన ఎటువంటి 

వాస్తుదోషా, శల్యదోషాలు ఉండవు.


21. పదమూడు గోమతి చక్రాలను శివాలయంలో 

దానం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.


22. 27 గోమతిచక్రాలను వ్యాపార సముదాయంలో ద్వారబంధానికి కట్టి రాకపోకలు ఆ ద్వారం ద్వారా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి అవుతుంది.


23. జాతకంలో నాగదోషం, కాలసర్ప దోషం ఉన్నవారు పంచమస్థానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాల దృష్టి కాని, సాంగత్యం కాని ఉన్న సంతాన దోషం ఉంటుంది.

 దీనినే నాగదోషం అంటారు. 

జాతకంలో రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్ప దోషం అంటారు. 

ఈ రెండు దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలను పూజించడం గాని, దానం చేయడం గాని, 

గోమతి చక్రాన్ని మెడలో లాకెట్ లాగా ధరించడం చేయాలి.