Thursday, September 21, 2023

🪷భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమి గా వ్యవహరిస్తారుE

 🪷

🪷భాద్రపద శుద్ధ పంచమిని 

ఋషి పంచమి గా వ్యవహరిస్తారు

🪷 ఆరోజున అత్రి,  కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, జమదగ్ని,  విశ్వామిత్ర  మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు.


🪷 అరణ్యవాసం లో సీతారాములకు అభయమిచ్చిన వాడు అత్రి మహర్షి... సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు.    


🪷 సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి.  


🪷 తన భార్య అహల్య ద్వారా రామునికి తన తపఃఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. 


🪷 రాముని గురువు విశ్వామిత్రుడు. కుల గురువు వశిష్టుడు.


🪷విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. 


🪷. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యప మహర్షి.


🪷 ఋషి పంచమి నాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.


🪷 ఋషి పంచమి వైశిష్ట్యం: 🪷


🪷 ఋషి పంచమి వ్రతము ను స్త్రీలు తప్పక ఆచరించాలి. వినాయక చవితి మరుసటి రోజు వచ్చే పంచమిని "ఋషి పంచమి " అంటారు. 


🪷 సప్త ఋషులు ఆరోజు తూర్పున ఉదయిస్తారు.  


🪷 బ్రహ్మ విద్య నేర్వవలసిన రోజు. సప్తఋషుల కిరణాలు ఈ రోజు సాధకులపై ప్రసరిస్తాయి.  గనుక బ్రాహ్మీ ముహూర్తముననే లేచి ధ్యానం చేసుకోవాలి. 


🪷 సప్తఋషులే గాయత్రీ మంత్రానికి మూలగురువులు.  


🪷 మానవుని శరీరంలో ఏడు యోగచక్రాలు ఉంటాయి. వాటిని వికసింపజేసే వారే ఈ సప్తఋషులు.  


🪷 మొట్టమొదటి సారిగా వేదమంత్రాల్ని దర్శించి వైదిక ధర్మాన్ని  ప్రవర్తింపజేసిన ఆద్య హిందూ ఋషుల్ని స్మరించే శుభసందర్భం... భాద్రపద శుద్ద పంచమి.


🪷 ఆ రోజున ఉపవాసం ఉంటే ఆ తొలి గురువులు మిక్కిలి ప్రసన్నులయి మనం కోరిన కోరికలు తీరుస్తారు. ముఖ్యంగా స్త్రీలు రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉంటే వారికీ, వారి సంతానానికీ తరతరాల పాటు ఆయురారోగ్య సౌభాగ్యాల్ని అనుగ్రహిస్తారు. 


🪷 సంపూర్ణ ఉపవాసం అంటే రెండు పూటలు ఉపాహారము తీసుకోవచ్చు. 


🪷 అత్తలకి శక్తి లేకపోతే కోడళ్ళయినా ఉపవాసం చేయాలి. సర్పదోషాలతో బాధపడుతూ సంతానం లేక బాధపడేవారికి మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా చెయ్యడం వంశవృద్ధికరం. ఐశ్వర్యదాయకం.


🙏 కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వసిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్తఋషులు.


🪷 మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదు రుణాల్లో ఋషి రుణం కూడా ఒకటి.


🪷 ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్లే మరి. ఇంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కృతజ్ఞతగా వీరిని సతీ సమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కాదూ!


🪷 నిజానికీ పండుగ స్త్రీలకు సంబంధించింది. ఇంకా చెప్పాలంటే స్త్రీలు ఆచరించుకునే వ్రతం. దీన్ని భాద్రపద మాసం శుద్ధపంచమిరోజున ఆచరించాలని భవిష్యోత్తర పురాణం తెలియచేస్తోంది. 


🪷 ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే దోషాలన్నీ పరిహారమవుతాయని బ్రహ్మ దేవుడు శితాశ్వుడనే రాజుకు చెప్పాడని వ్రతకల్పం తెలియచేస్తోంది.


🪷 ఈ రోజుల్లో  సప్తఋషులు మనకు కనపడతారా? అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చును.


🪷 ఇంకా గట్టిగా చెప్పాలంటే...అందరికీ కనపడతారు, చూడగలిగితే ప్రతీరోజూ కనపడతారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ దంపతులూ సాయంత్రం పూట సప్త ఋషులకు, అరుంధతీ వశిష్ఠులకు నమస్కరించుకోవాలి కూడా.


🪷 ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? అనేది మన పెళ్ళిళ్ళలో  'అరుంధతీ దర్శనం' చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు.


🪷 సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతీరోజూ వారిని మనం దర్శించుకోవచ్చు.


🪷 ఇంతకీ సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? అంటే..


కశ్యప అత్రి భరద్వాజ

విశ్వామిత్రోథ గౌతమః!

వశిష్టో జమదగ్నిశ్చ

సప్తైతే ఋషయః స్మృతాః!!


🪷 భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూల పురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశాను క్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపం లో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.


🪷 ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.


1. కశ్యపుడు

2. అత్రి

3. భరద్వాజుడు

4. విశ్వామిత్రుడు

5. గౌతముడు

6. జమదగ్ని

7. వసిష్ఠుడు


🪷 వీరు ఏడుగురు పూజనీయులే.

రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు♪.


*1. కశ్యపమహర్షి:*_ 💐


🪷 సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు.


వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు♪.


*2. అత్రిమహర్షి:*_ 💐


🪷 సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి  

బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు♪. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన  సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి•.


3. భరద్వాజ మహర్షి: 💐


🪷 భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు♪. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు♪.


*4. విశ్వామిత్రమహర్షి:*_ 💐


🪷 విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రుని చే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూల పురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతల ల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు♪.


5. గౌతమ మహర్షి: 💐


🪷 తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు♪. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు♪. ఆ దోష పరిహారం కొరకు గోదావరి ని భూమిపైకి తెచ్చిన మహర్షి,..  తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే♪.


6. వశిష్ఠ మహర్షి: 💐


🪷 ఇతని భార్య అరుంధతి♪. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వంద మంది పుత్రులు గలవాడు♪. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు♪.


7. జమదగ్ని మహర్షి: 💐


🪷 జమదగ్ని ఋషి,  రుచిక ముని, సత్యవతుల కుమారుడు. 


🪷జమదగ్ని కుమారుడే పరశురాముడు♪.

జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్య పురుష వ్యామోహం వలన,

ఆమెను తన కొడుకైన పరశురాముని చే నరికించాడు. 


🪷ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు♪.


🪷 సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్ర నమ్మకం♪....


_ఓం నమో భగవతే వాసుదేవాయ-

భవానీ.. హరే కృష్ణ గోవిందా!!

సేకరణ

Tuesday, September 1, 2020

*వినాయకుడిని తల లేకుండా పూజించే ఆలయం గురించి* *మీరు విన్నారా?* 🤔🤔

 *వినాయకుడిని తల లేకుండా పూజించే ఆలయం గురించి* *మీరు విన్నారా?* 🤔🤔


:maple_leaf::maple_leaf::maple_leaf:
వినాయకుని గురించి తెలుసుకోవలసిన ఆసక్తికర నిజాలు | Interesting Facts About  Lord Ganesha - Telugu BoldSky


అవును, మీరు సరిగ్గానే విన్నారు! తల లేని వినాయకుడిని పూజించే ఆలయం మన దేశంలో ఉంది.

మంత్రముగ్ధులను చేసే కేదార్ లోయ ఒడిలో ఉన్న ఈ ఆలయం ముండ్కటియా ఆలయం.

గణేష్ ని తల లేకుండా పూజించే ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం ఇది.

ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సోన్‌ప్రయాగ్ నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశాన్ని దేవభూమి అని కూడా అంటారు.

శివ పురాణం ప్రకారం, శివుడు తన కొడుకు గణేశుడి తలను నరికివేసిన ఖచ్చితమైన ప్రదేశం ఇది.

గణేశుని మొండెం మీద ఏనుగు తల స్థిరపడిన ప్రదేశం అదే.

ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే....
ముండ్కటియా అనే పేరు ముండా (తల) మరియు కటియా (తెగిపోయిన) అనే రెండు పదాల కలయిక.

పాత మార్గంలో కేదార్‌నాథ్‌కు ట్రెక్కింగ్ చేసే భక్తులు వినాయక దర్శనం కోసం ఈ ఆలయానికి వెళ్తారు.

కొత్త మార్గం సుపరిచితమైనప్పటి నుండి, కేదార్ లోయ యొక్క అడవి ఒడిలో ఉన్న ఈ ఆలయాన్ని అతి తక్కువ మంది సందర్శిస్తున్నారు. .

సోన్ ప్రయాగ్ వరకు బస్సు, జీప్ సౌకర్యం కలదు. అక్కడ నుంచి నడిచి వెళ్ళి, స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు.

పూజ‌కు….కొబ్బ‌రికాయ‌, అర‌టి పండ్లే ఎక్కువగా వాడ‌తారెందుకో మీకు తెలుసా ??

 


పూజ‌కు….కొబ్బ‌రికాయ‌, అర‌టి పండ్లే ఎక్కువగా వాడ‌తారెందుకో మీకు తెలుసా ??

Coconut And Banana Ritual At Temple - Telugu Devotional Bhakthi(తెలుగు  భక్తి )-TeluguStop

హిందూ దేవాలయాల్లో మాత్రమే కొబ్బరికాయ, అరటిపండ్లు పవిత్రంగా  సమర్పిస్తారెందుకు? | Why only Coconut and Bananas are considered as sacred  offerings in Hindu temples? - Telugu BoldSky

General News,Humanity,Mythology,Psychology,Health, Employment,Biographies:  Banana fruit is a healthy fruit that everyone needs

సాధార‌ణంగా పూజా కార్య‌క్ర‌మాల‌కు కొబ్బ‌రికాయ‌ల‌ను, అర‌టి పండ్ల‌నే ఎక్కువ‌గా వాడ‌డాన్ని మీరు గ‌మ‌నించుంటారు. నాకూ ఇదే విష‌యంపై డౌట్ వ‌చ్చి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశాను. అప్పుడో విభిన్న‌మైన విష‌యం తెల‌సింది. లాజిక్ కూడా క‌రెక్టే అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాను.


కొబ్బ‌రికాయ‌, అర‌టి పండ్లకు ప‌విత్ర‌మైన ఫ‌లాలుగా పేరు..పూర్వ‌కాలం నుండి వీటినే పూజా కార్య‌క్ర‌మాల్లో ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. ఎందుకంటే ఈ రెండూ ఎంగిలికాని పండ్ల కేట‌గిరీలోకి వ‌స్తాయి. కాయ‌ల నుండి చెట్లుగా మారే క్ర‌మంలో మిగితా వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది.


కొబ్బ‌రి కాయ :

ఇత‌ర పండ్లు తిని గింజ‌ను నాటితే అవి మ‌ళ్లీ చెట్లుగా మార‌తాయి. ..కానీ కొబ్బ‌రి మాత్రం మొత్తంగా నాటితేనే మ‌రో చెట్టును ఇస్తుంది.. ఎంగిలి ప‌డ‌ని పండు మాత్ర‌మే కొత్త చెట్టును ఇస్తుంద‌న్న‌మాట‌!


అర‌టి:

అర‌టి కూడా అంతే పండు తిని కేవ‌లం తొక్క‌తో కొత్త చెట్టును పుట్టించ‌లేము…మొత్తంగా నాటితేనే కొత్త అర‌టి వ‌స్తుంది.

కాబ‌ట్టి ఎంగిలి ప‌డ‌ని ఈ పండ్ల‌ను ప‌విత్ర‌ఫ‌లాలుగా భావించి దేవుడికి స‌మ‌ర్పిస్తార‌ట‌!.


కొన్ని ప్రాంతాల్లో సీజ‌న‌ల్ పండ్ల‌ను కూడా దేవుడికి స‌మ‌ర్పించిన‌ప్ప‌టికీ..చాలా వ‌ర‌కు ఈ పండ్ల‌నే మ‌నం పూజాకార్య‌క్ర‌మాల్లో చూస్తుంటాం.

Sunday, August 30, 2020

ప్రపంచంలోనే ఎత్తైన విష్ణువు విగ్రహాo

 :violin::rose::pray:ముస్లిం దేశం 28 సంవత్సరాలలో 800 కోట్ల ప్రపంచంలోనే ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని నిర్మించింది

ప్రపంచంలోనే ఎత్తైన విష్ణువు విగ్రహాo

ఈ ముస్లిం దేశంలో విష్ణువు యొక్క ఎత్తైన విగ్రహం నిర్మించడానికి 26 సంవత్సరాలు  పట్టింది | News Track Live, NewsTrack Telugu 1
విష్ణువు యొక్క ఈ విగ్రహం ఇండోనేషియాలో ఉంది, ఇది సుమారు 122 అడుగుల ఎత్తు మరియు 64 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ విగ్రహం రాగి మరియు ఇత్తడితో తయారు చేయబడింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 28 సంవత్సరాలు పట్టింది. ఈ విగ్రహం 2018 సంవత్సరంలో పూర్తయింది.

హిందూ మతంలో, విష్ణువు శ్రేయస్సు మరియు శోభకు చిహ్నం. బ్రహ్మ అనే శంకర్ త్రయంలో విష్ణువు భూమిని అనుచరుడిగా భావిస్తారు. విష్ణువును వేర్వేరు పేర్లతో పూజించని భారతదేశంలో ఏ మూలలోనూ లేదు. కానీ ప్రపంచంలోనే ఎత్తైన విష్ణువు విగ్రహం భారతదేశంలో లేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముస్లిం జనాభా పరంగా ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశంలో ఇది ఉంది. విష్ణు విగ్రహం ఇండోనేషియాలో ఉంది, ఇది సుమారు 122 అడుగుల ఎత్తు మరియు 64 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ విగ్రహం రాగి మరియు ఇత్తడితో తయారు చేయబడింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 28 సంవత్సరాలు పట్టింది. ఈ విగ్రహం 2018 సంవత్సరంలో పూర్తయింది మరియు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు దీనిని చూడటానికి వస్తారు.

ఇది ఎలా ప్రారంభమైంది.. 1979 లో ఇండోనేషియాలో నివసించిన శిల్పి బప్పా న్యూమాన్ నుయార్టా, హిందూ చిహ్నం యొక్క భారీ విగ్రహాన్ని తయారు చేయాలని కలలు కన్నారు. కలలు కనేది చాలా సులభం, కాని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విగ్రహాన్ని తయారు చేయడం చాలా కష్టమైన పని. ఈ విగ్రహాన్ని తయారు చేయడం ప్రారంభించడానికి 1980 లలో ఒక సంస్థ ఏర్పడిందని చెబుతారు. ఆయన పర్యవేక్షణలో అన్ని పనులు చేయాలని నిర్ణయించారు. ఈ విగ్రహం యొక్క నిర్మాణంపై కృషి జరిగింది.
ఈ రోజు వరకు ప్రపంచంలో తయారు చేయని ఒక రచనను న్యూమాన్ నుయార్టా సృష్టించాల్సి వచ్చింది. ఎవరైతే చూసేవారు, చూస్తూ ఉండండి. సుదీర్ఘ ప్రణాళిక మరియు డబ్బు ఏర్పాట్ల తరువాత, ఈ విగ్రహం తయారీ 1994 లో సుమారు 15 సంవత్సరాల తరువాత ప్రారంభమైంది. ఈ విగ్రహం నిర్మాణానికి ఇండోనేషియాలోని అనేక ప్రభుత్వాలు సహాయపడ్డాయి. పెద్ద బడ్జెట్ కారణంగా చాలా సార్లు పని ఆగిపోయింది. 2007 నుండి 2013 వరకు, దీని నిర్మాణం సుమారు 6 సంవత్సరాలు ఆగిపోయింది. కానీ ఆ తర్వాత పని ప్రారంభమైంది మరియు దీనికి మరో ఐదేళ్ళు పట్టింది...స్వస్తి:pray::rose:

ఆదివారం అత్యంత శక్తి వంతమైన రోజు.............!!

 :violin::rose::pray: ఆదివారం అత్యంత శక్తి వంతమైన రోజు.............!!

:hibiscus::cherry_blossom::sun_with_face::hibiscus::cherry_blossom::sun_with_face::hibiscus::cherry_blossom::sun_with_face::hibiscus::cherry_blossom::sun_with_face:
సృష్టికి ఆద్యం ఆదివారం.
దీనికి తోడు సూర్యుణ్ణి ప్రత్యక్ష భగవానుడు అంటారు. ప్రస్తుతం మనం ఏవిషయాన్నైనా అన్వేషించాలంటే సూర్యుని నుంచే ప్రారంభమవుతుంది.
చివరకు సూర్యునితోనే అంతమవుతుంది...
సైన్స్ ప్రకారం చూసినా కూడా అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టే తిరుగుతున్నాయి.
అంటే ఈ విశ్వంలో జీవించే ప్రతీ ప్రాణీ ప్రత్యక్షంగా సూర్యునిపై ఆధారపడిందన్నది సుస్పష్టం.
వారంలోని ఇతర రోజుల్లో మాంసాహారం తిన్నా
ఇంత తప్పులేదు కానీ...ఒక్క ఆదివారం మాత్రం మాంసాహారం తినకండి..
ఆదివారం మాంసాహారం తిన్నవారు శక్తి హీనులవుతారని.
మన వేదాల్లో ఉంది.
ఉదాహరణకి ఈ రోజు నుంచి మీరు ఆదివారాన్ని గమనించండి.
ఆరోజున మిగిలిన రోజుల్లో లేని ఒక శక్తి ఉంటుంది.
ఈ శక్తిని మన శరీరంలోకి ఆహ్వానించేంత చైతన్యం మనలో ఉండాలి.
అందుకే ఆదివారం రోజున మాంసాహారాన్ని త్యజించిన వారు విజేతలు అవడం ఖాయం.
దానికి తోడు ఆ సూర్యభగవానుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు...
మన దేశానికి బ్రిటీష్ వారు వచ్చినపుడు భారతీయుల్లో ఉన్న మేధోశక్తికి...సంపూర్ణ ఆరోగ్యానికి అబ్బురపడ్డారు. ఎందుకు భారతీయులు ఉత్తేజంగా... ఉల్లాసంగా.. సిరిసంపదలతో తులతూగుతున్నారో అన్వేషించారు. చివరకు ఆదివారం నాడు మన పూర్వీకులు అవలంబిస్తున్న నియమాలే అందుకు
కారణమని తెలుసుకున్నారు...
భారతీయుల్ని ఇలాగే వదిలేస్తే ప్రపంచాన్ని జయించగలరని అనుమానం ఇంగ్లీషువాళ్లల్లో కలిగింది. ఎలాగైనా సరే భారతీయుల్ని శక్తిహీనుల్ని చేయాలని భావించారు.
దీంతో ఆదివారం రోజుని సెలవుదినంగా ప్రకటించడంతో పాటు ఆరోజున మద్యం మాంసంతో పాటు నియమాలు పాటించకుండా మానేసేలా చేశారు...
ప్రపంచంలోని చాలా భాగాన్ని ఇంగ్లీషువారే పాలించడంతో ఆనాటి నుంచి ఆదివారం సెలవు దినంగా వారు ప్రకటించారు.
కానీ తాము మాత్రం ఆదివారం నాడు ఖచ్చితంగా భగవంతుణ్ణి ఆరాధించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆరోజున కచ్చితంగా తమ ప్రార్ధనాస్ధలాలకి రావాలనే నియమాన్ని పెట్టు కున్నారు...
ఇలా మన ఆచారానికి మత రంగు అద్దుకుని ఆదివారం నాటి శక్తిని క్రిష్టియన్స్ పొందుతున్నారు.
కానీ నాటి నుంచి మనం మాత్రం ఆదివారం
'మందు ముక్క' అంటూ తమ తరతరాల ఆచారాన్ని పక్కదోవ పట్టించుకున్నాము...
కాబట్టి ఇప్పటికన్నా ఆదివారం నాటి శక్తిని
మనం గుర్తించాలి.
ఆదివారం రోజున మన చేతనైన నియమాలు పాటించాలి, మన భవిష్యత్ తరముల కొరకు -
మన పిల్లలు అందరూ పాటించేలా చేయాలి ...!
శ్రీ సూర్యనారాయణ అనుగ్రహ ప్రాప్తిరస్తు
సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు..!!
Srikala Bhakthi - ఆదివారం అత్యంత శక్తి వంతమైన... | Facebook
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి