Wednesday, August 14, 2019

What is the name of Lord Hanuman's Wife? ఆంజనేయ స్వామి వారు ఎవరిని వివాహం చేసుకున్నారు ?




 What is the name of Lord Hanuman's Wife?

ఆంజనేయ స్వామి వారు ఎవరిని వివాహం చేసుకున్నారు ?

Image result for What is the name of Lord Hanuman Wife?


దీనికి సంబంధించిన కధ దయచేసి అందరికీ షేర్ చేయండి

హ‌నుమంతుడు ఎంత శ‌క్తివంత‌మైన దేవుడో భ‌క్తుల‌కు బాగా తెలుసు. ఆయ‌న‌ను పూజిస్తే దుష్ట‌శ‌క్తుల నుంచి విముక్తి క‌లుగుతుంద‌ని భ‌క్తులు న‌మ్ముతారు. అయితే ఆంజ‌నేయ స్వామి బ్ర‌హ్మ‌చారి అని కూడా అంద‌రికీ తెలుసు. ఆయ‌న అస్సలు పెళ్లి చేసుకోలేద‌ని, జీవితాంతం బ్ర‌హ్మ‌చారిగానే ఉన్నాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. అయితే మీకు తెలుసా..?

నిజానికి ఆంజ‌నేయ స్వామికి పెళ్ల‌యింది.
ఆయ‌న భార్య పేరు సువ‌ర్చ‌ల‌.

అయితే హ‌నుమంతుడు అనుకోకుండా కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమెను వివాహం చేసుకోవాల్సి వ‌చ్చిందట‌.

దీని వెనుక ఉన్న అస‌లు క‌థేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హ‌నుమంతుడు సూర్య భ‌గ‌వానుడిని గురువుగా చేసుకుని ఆయ‌న వ‌ద్దే అనేక విద్య‌ల‌ను అభ్య‌సించాడు. అయితే న‌వ వ్యాక‌ర‌ణాలు అనే విద్య‌ను మాత్రం హ‌నుమంతుడు నేర్చుకోలేక‌పోతాడు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే క‌చ్చితంగా వివాహం అయి ఉండాల్సిందే. దీంతో హ‌నుమంతుడు ఏం చేయాలో తెలియ‌క అలా ఉండిపోతాడు. ఇది గ‌మ‌నించిన సూర్యుడు త‌న తేజ‌స్సుతో సువ‌ర్చ‌ల అనే యువ‌తిని సృష్టిస్తాడు. ఆమె అయోనిజ‌గా పుడుతుంది. అంటే సూర్యుని తేజ‌స్సుతో పుడుతుంది. దీంతో ఆమె సూర్యుని కూతురుగా ఉంటుంది. ఈ క్ర‌మంలో సువ‌ర్చ‌ల‌ను పెళ్లి చేసుకోవాల‌ని సూర్యుడు హ‌నుమంతున్ని కోరుతాడు. అయితే బ్ర‌హ్మచారిగా ఉండాల‌న్న త‌న కోరిక‌కు అది ఆటంకం క‌లిగిస్తుంద‌ని పెళ్లి చేసుకోనంటాడు.

దీంతో సూర్యుడు గురు ద‌క్షిణగా అయినా సువ‌ర్చ‌లను పెళ్లి చేసుకోమంటాడు. అందుకు కూడా హ‌నుమ అంగీకరించ‌డు. ఇక చివ‌రిగా సూర్యుడు అంటాడు, పెళ్లి చేసుకున్నప్పటికీ నువ్వు బ్ర‌హ్మ‌చారిగానే కీర్తించ‌బ‌డ‌తావ‌ని, ఆ పెళ్లి లోక క‌ల్యాణం కోస‌మే గానీ నువ్వు గృహ‌స్థుడిగా ఉండిపోవ‌డానికి కాద‌ని, పెళ్లి చేసుకుంటే ఆ విద్య‌ను అభ్య‌సించ‌వ‌చ్చ‌ని, లోక క‌ల్యాణం జ‌రుగుతుంద‌ని, అంటాడు. దీంతో హ‌నుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి కాగానే సువ‌ర్చ‌ల మారు మాట్లాడ‌కుండా త‌పస్సుకు వెళ్లిపోతుంది. ఆ త‌రువాత ఆమె క‌నిపించ‌దు. ఈ క్ర‌మంలో హ‌నుమ ఆ విద్య‌ను అభ్య‌సించి స‌క‌ల శాస్త్ర పారంగ‌తుడు అవుతాడు. ఇదీ… హ‌నుమంతుని పెళ్లి వెనుక ఉన్న అస‌లు క‌థ‌. దీని గురించి మ‌హ‌ర్షి ప‌రాశ‌రుడు రాసిన ప‌రాశ‌ర సంహిత‌లో మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు.

History of Rakhi/ Raksha Bandhan రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు


History of Rakhi/ Raksha Bandhan

Image result for History of Rakhi/ Raksha Bandhan రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 

రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

 

Image result for History of Rakhi/ Raksha Bandhan రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు


'రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.అది చాలా ఉత్సాహంతో జరుపుకుం‌టూరు .

⚛ రక్షాబంధనము  ఎలా ప్రారంభమైందంటే ⚛

పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.

✡ రాఖీపౌర్ణమి చరిత్ర ✡
🔯 ద్రౌపది -శ్రీకృష్ణుని బంధం 🔯

ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి వస్త్రాలు ఇచ్చి ఆమెను కాపాడుతాడు.

☸ మహావిష్ణువు - బలిచక్రవర్తి ☸

శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది.

🥀 రాఖీ కడుతూ చదవాల్సిన శ్లోకం 🥀

యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేన త్వామభిబధ్నామి రక్షే మా చల మా చల"

Saturday, August 3, 2019

Miracles of Bramarambha Bramarambha Temple Srisailam

Miracles of Bramarambha 


Bramarambha Temple Srisailam 

#శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనకాతల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువ అని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.

పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు. పైన శక్తి రూపంతో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆనాదం వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.

 శ్రీశైలంలో  ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణా నది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షినమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే త్రిఫల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు బ్రతికింది. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు/ ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామీ నెమలితో ఉంటారు.

శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద యిప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

Importance of Sravana Shanivaram


Importance of Sravana Shanivaram


శ్రావణ శనివార వేంకటేశ్వర దీపారాధన

Importance of Sravana Shanivaram



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
Image result for sravan shanivaram

శ్రావణమాసంలో వచ్చే శనివారం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధనకు చాలా విశేషమైనది. సాధారణంగా శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధన చేస్తారు.
 శ్రావణ శనివారం రోజున ప్రత్యేకంగా వేంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు. భక్తులపాలిట కల్పవృక్షం, కలియుగం దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. పిలిచిన వెంటనే పలికే దైవం ఆయన. అటువంటి స్వామిని శ్రావణమాసంలో శనివారం నాడు దీపారాధన చేసి ఆరాధించే ఓ విశేషపూజ ఉంది.

పూజాగదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి, దాని మీద కుంకుమతో శ్రీ వేంకటేశ్వర స్వామి నామం (తిరు నామం) దిద్దాలి. ఆ అవకాశం లేనప్పుడు ఏదైనా వేంకటేశ్వరుని ఫొటో తీసుకోవాలి. నీరు ఉపయోగించకుండా, ఆవుపాలు, బెల్లం, బియ్యపుపిండితో చలివిడి కలిపి, దాన్ని ప్రమిద ఆకారంలో తయారు చేయాలి. అందులో ఆవునెయ్యి వేసి, దీపం వెలిగించాలి. వెలుగుతున్న ఆ జ్యోతినే వేంకటేశ్వరునిగా భావన చేసి, ఆ జ్యోతి స్వరుపుడైన వేంకటేశ్వరునికి గంధం, పుష్పం, ధూపం, దీపం సమర్పించి, అష్టొత్తరశతనామవాళి (108 నామాలు)తో పూజించి, పానకం, వడపప్పు (నానబెట్టిన పెసరపప్పు) నైవేధ్యం పెట్టాలి (అవి కాక ఇతర పదార్ధాలు పెట్టడమనేది మన ఇష్టం, శ్రద్ద), మనసులో ఉన్న కోరికను స్వామికి విన్నవించాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ చలివిడిని కూడా నైవేధ్యంగా స్వీకరించాలి. ఇది శ్రావణ శనివార వేంకటేశ్వర దీపారాధన. ఈ పూజ చేయడం వల్ల ఎంతోమందికి కోరిన కోరికలన్నీ స్వామి అనుగ్రహంతో నేరవేరాయి.

Importance of Sravana Shanivaram

Significance of Nagapanchami Procedure of Nagapanchami Pooja


Significance of Nagapanchami

Procedure of Nagapanchami Pooja

నాగపంచమి విశిష్టత మరియు పూజావిధానం

Image result for Significance of Nag Panchami Procedure of Nag Panchami Pooja




 
సాక్షాత్తు పరమేశ్వరుడే "నాగపంచమి" నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీ దేవికి వివరించినట్లుగా స్కాందపురాణం చెబుతోంది. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హిందువుల ఆచారం . నాగ పంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, పాయసము నివేదించాలని ముక్కంటి.. శక్తిమాతకు వివరించినట్లు ఆ పురాణం పేర్కొంటుంది.

ముఖ్యంగా నాగపంచమి రోజున నాగేంద్రేనికి పాలు, మిర్యాలు, పూలు పెట్టి పూజిస్తారు. ఇంట్లో వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగ పడిగెలకు భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం కలిగించే పుత్రదైకాదని సంతానం లేని భార్యభర్తలు భక్తి శ్రద్దలతో శ్రావణ శుక్ల 11వరోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్లైతే సంతానభాగ్యం కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం వంటివి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి.

నాగ పంచమి విశిష్టత

పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమెకు ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యా వినయంగల సౌజన్యురాలు. పెద్దలపట్ల వినయవిదేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుబూతిగల సద్గుణ సంపన్నురాలు . ఈ సుగుణ వతికి ఒక తీరని బాధ వుండేది. చెవిలో చీము కారుతుండేది. రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది. అందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది.

ఎన్ని పూజలు చేసినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు. తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సాధువు వాళ్ళ ఊరుకు వచ్చాడు. ఆ సాధువు త్రికాలజ్ఞానుడని విని అతనివద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది. అతిధి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని, ఇవి తొలగే మార్గామేమిటని వినయపూర్వకముగా వేడుకున్నది.

అందుకు ఆ సాధువు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోషంవల్ల సంభవించింది. ఏమిచేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తొలగాలన్నదే నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్దని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం అని తెలిపెను.

నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మినవారిని ఉద్దరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగ పంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి. చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానము దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయెను. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్దలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళన లు తొలగి సంతోషముగా వున్నది.

ఉద్యాపన:
శ్రావణ మాసంలో శుక్ల పంచమినాడు చేయవలసిన నోము ఇది. అభ్యంగన స్నానం చేసి శుచిగా ఏకాగ్రతతో ఉంది నాగేంద్రుడిని ఆరాధించాలి. నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల పహ్ల పుష్పాదులు నారికేళం సమర్పించాలి. నాడు ఉపవాసం వుండాలి. నిరాహారం జాగరణ మరింత శ్రేయస్కరం.


పూజా విధానం

నాగపంచమి రోజున సూర్యోదయమునకు ముందే ఐదు గంటలకే లేవాలి. శుచిగా తలస్నానము చేసి, ఎరుపురంగు బట్టలు ధరించాలి. పూజామందిరమును, ఇల్లును శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ, గుమ్మాన్ని తోరణాలతో అలంకరించుకోవాలి. పూజామందిరము, ఇంటిముందు ముగ్గులు పెట్టాలి.

పూజకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి, పాముపడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి పువ్వులు (కనకాంబరాలు), మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్లు, వడపప్పు, అరటిపండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేగాకుండా రెండు ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకుని దూదితో 7 వత్తులలో నేతితో దీపమెలిగించాలి.

నాగపంచమి రోజున ఉదయం 9 గంటల లోపు పూజను పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమను ధరించి, పడమర దిక్కున తిరిగి పూజించాలి. 'ఓం నాగరాజాయనమః' అనే మంత్రమును 108 మార్లు జపించి, పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేదా నాగేంద్ర స్వామి చిత్రపటమునకు కర్పూర హారతులిచ్చి, నైవేద్యం సమర్పించుకోవాలి.

Image result for Significance of Nag Panchami Procedure of Nag Panchami Pooja

వీలైతే కర్పూర హారతులిచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరము, నాగ స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామములలో ఏదైనా ఒక దానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు నాగేంద్ర నిత్యపూజ, నాగదోష-పరిహారము వంటి పుస్తకములను తాంబూలము, పసుపు, కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్య ఫలం సిద్ధిస్తుంది.


అలాగే.. నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు. దేవాలయములో నాగా అష్టోత్తరములు, పంచామృతములతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.




Significance of Nagapanchami

Procedure of Nagapanchami Pooja

Wednesday, July 31, 2019

How to overcome our problems

How to overcome our problems


ఒక పాము చాలా హుషారుగా పాకుతూ,దొర్లుతూ అటువైపుగా వెళ్తోంది.దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది...ఆ పాము కోతిని కాటు వేయబోయింది...భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది... గట్టిగా అరవసాగింది కోతి.. చుట్టుకున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి.
ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే...మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి...
Image result for How to overcome our problems

తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన
కోతికి నిరాశే ఎదురయ్యింది...అలాగే భయంతో కూర్చుంది.అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని
అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు..
' నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది..వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు.దాన్ని వదిలేయి" అన్నారు ముని...కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది...ఇందులోని నీతి ఏంటంటే...

నీకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం నిన్ను వదిలి పోదు...కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వెతకాలి.
అలాగే నువ్వు ఇబ్బందిలో ఉంటే నీ బంధువులు,ఎవ్వరూ నిన్ను రక్షించడానికి నీ కష్టం తీర్చడానికి ముందుకు రారు.
ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోతారు... నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎవరిసహాయం కోసం చూడకూడదు..కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు...కష్టాన్ని మంచి పరిష్కారంలో తరిమికొట్టాలి అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు..
How to overcome our problems
Image result for How to overcome our problems

Tuesday, July 30, 2019

What is Money? డబ్బు

What is Money?

        డబ్బు

Image result for What is Money? డబ్బు

            🌻🌸🌻
లక్ష్మినే మనము వాడుకలో
"డబ్బు" అంటాము. కాని లక్ష్మి ఎప్పుడూ నారాయణునితో ఉంటుంది.అనగా ఎక్కడైతే
నారాయణుని(దేవుని)
కార్యక్రములు అనగా! పూజ,జపము, నామస్మరణ, సేవ, కార్యములు జరుగునో అచట లక్ష్మి యుండును.
ఇవి లేని నిలయములలో
అలక్ష్మి యుండును.

డబ్బు, లక్ష్మి 4 (నాలుగు) విధములు...

1) ధనము:-
      మన వ్యవహారమునకు వాడుకొనునది.
2)లక్ష్మి:-
    ఇతరులకు సహాయము
      చేయునటువంటిది.
3) మహాలక్ష్మి:-
      భగవంతుని కార్యములలో, సత్కార్యములలో ఉపయోగించునది.
4) అలక్ష్మి:-
    చెడు అలవాట్లకు, చెడు
కార్యములలో ఉపయోగించునది.
   
      కావున ఒకే డబ్బు దాని
వాడకమును బట్టి దాని నామ, రూపములు మారుచున్నవి. కావున ఏవిధమైన దానికి వాడితే
ఆవిధమైన ఫలితము
వస్తుంది. మానవుడు ఆవిధముగా మారుతాడు.
కావున డబ్బును సన్మార్గములో సంపాదించాలి. సద్వినియోగము చేయాలి.
అపుడే లక్ష్మి తన వద్ద నిలుస్తుంది.