Tuesday, April 25, 2017

‘అష్టాదశ పురాణాలు’ 18 Maha Puranas

‘అష్టాదశ పురాణాలు’

18 Maha Puranas


మనం అనేక సందర్భాల్లో ‘అష్టాదశ పురాణాలు’ అని వింటూ ఉంటాం. అయితే ఆ పద్ధెనిమిది పురాణాల పేర్లూ ఒకపట్టాన గుర్తుకు రావు. ఒకవేళ అన్నింటిపేర్లూ తెలిసినా, ఏ పురాణంలో ఏముందో తెలియదు. అనంతంగా ఉన్న ఈ పౌరాణిక విజ్ఞానాన్ని, అపారమైన వేదరాశిని వేదవ్యాసుడే అంశాల వారీగా విభజించాడు. వేదవ్యాసుడు శ్రీ మహావిష్ణువు అంశ. అందుకే విష్ణుసహస్రనామంలో వ్యాసాయ విష్ణురూపాయ.. వ్యాసరూపాయ విష్ణవే అని ఉంటుంది. వేదవ్యాసుడు పురాణాలను రచిస్తే, వాటిని మహాపౌరాణికుడు సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. వారిద్వారా ఇవి లోకానికి వె ల్లడి అయ్యాయి. ఎంతో విస్తారమైన ఈ పురాణాలను మనం చదవలేకపోయినప్పటికీ, అసలు ఆ పురాణాలేమిటి, ఏ పురాణంలో ఏముందో రేఖామాత్రంగా అయినా తెలుసుకోగలిగితే అవకాశం ఉన్నప్పుడు విపులంగా తెలుసుకోవచ్చు.

18 పురాణాల పేర్లు ...
1. మత్స్యపురాణం
2. కూర్మపురాణం
3. వామన పురాణం
4. వరాహ పురాణం
5. గరుడ పురాణం
6. వాయు పురాణం
7. నారద పురాణం
8. స్కాంద పురాణం
9. విష్ణుపురాణం
10. భాగవత పురాణం
11.అగ్నిపురాణం
12. బ్రహ్మపురాణం
13. పద్మపురాణం
14. మార్కండేయ పురాణం
15. బ్రహ్మవైవర్త పురాణం
16.లింగపురాణం
17.బ్రహ్మాండ పురాణం
18. భవిష్యపురాణం

ఈ పురాణాలన్నీ శ్లోకాల రూపంలో ఉంటాయి. అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.
*మత్స్యపురాణం*: మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.
*కూర్మపురాణం*: కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలోఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.

*వామన పురాణం*: పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.

*వరాహపురాణం*: వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.

*గరుడ పురాణం*: గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలుంటాయి.

*వాయుపురాణం*: వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.
*అగ్నిపురాణం*: అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను తెలుసుకోవచ్చు.

*స్కాందపురాణం*: కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.

*లింగపురాణం*: లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.
*నారద పురాణం*: బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.

*పద్మపురాణం*: ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.

*విష్ణుపురాణం*: పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.

*మార్కండేయ పురాణం:* శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం వుంటాయి.

*బ్రహ్మపురాణం*: బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.

*భాగవత పురాణం*: విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.

*బ్రహ్మాండ పురాణం*: బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది. *భవిష్యపురాణం:* సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.
*బ్రహ్మాపవైపర్తపురాణము*
ఇందులో గోలోకప్రశంస . భోజననియమాలు.రోగనివృత్తిసాధనాలు.తులసీ, సాలగ్రామమహత్త్వాలు.హోమములోస్వాహకార ప్రాధాన్యము మొ. విషయాలు ఇందువివరించబడ్డాయి.

Wednesday, April 19, 2017

ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి?




ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి?


 

తెల్లవారు జామున  మూడు గంటలకు  శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంటవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.

సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ.

ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును.

మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని  పూజించిన  హనుమ కృపకు మరింత పాత్రులగుదురు.

రాహువునకు సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది.

సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున  శివపూజకు దివ్యమైన వేల.

రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షములు ఎక్కువగా ఉంటాయి.


తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?



తీర్థాన్ని  మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?


తొలితీర్థము  శరీర శుద్ధికి, శుచికి…రెండవ తీర్ధం ధర్మ, న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు.



తీర్థ మంత్రం:

          అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం

          సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం .

Thursday, April 13, 2017

గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు

Going to Temple is not a Routine thing


గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. 


గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.
దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.
దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.
ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.
గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.
మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.
గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.
తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.
లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది. కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి

Monday, April 10, 2017

Hanuman Jayanthi

Hanuman Jayanthi

'' హనుమాన్ జయంతి ''



చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున '' హనుమాన్ జయంతి ''

తేది :11 ఏప్రిల్ 2017 మంగళవారం

ఆంజనేయుని పూజకు పర్వదినాలు

పూర్వాభద్ర నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం. అదియును పర్వదినము. ప్రతి శనివారము స్వామివారికి పూజలు చేయుట విధి. అమావాస్యతో కూడిన సోమవారము, ప్రతి మంగ ళవారం స్వామి వారి పూజకు ప్రీతి దినములు.

శ్రీహనుమత్ స్వామికి అరటి తోటలంటే ఎక్కువ యిష్టం. కాబట్టి స్వామిని కదళీవనములలో పూజిస్తే శుభం చేకూరుతుంది. మంగళకరుడగు స్వామికి తమలపాకుల పూజ పరమ ప్రీతికరం. అలాగే పారిజాతాలు, మందారాలు, నందివర్ధనం, మల్లెలు, గన్నేరు మొదలైన పుష్పాలు స్వామికి ఆనందము కలిగిస్తాయి. తులసీ, మారేడు, మామిడి, మాచీపత్రము, ఉత్తరేణి పత్రములు ప్రీతికరములు. అరటి, మామిడి, నిమ్మ, కొబ్బరి, పనస, నేరేడు మొదలైన ఫలాలు స్వామి వారికి అత్యంత ప్రీతికరం.

సింధూరము, సింధూరాక్షతలు, పసుపు అక్షతలు, కుంకుమ, సాంబ్రాణి, గుగ్గిలము, కర్జూరము మొదలైన పూజాద్రవ్యాలు, పాయసం, పొంగలి, అప్పాలు, వడలు, వడపప్పు, పానకం, పాలు మొదలైన నివేదన ద్రవ్యాలు స్వామికి నివేదిస్తే, స్వామి సంతుష్టుడు అవుతారు. ఆవు నేతితో చేసిన దీపారాధన శ్రేష్ఠం. ఇలా స్వామిని నిత్యం ధాన్యం చేయాలి.

ప్రభాకరాత్మజాం సుమేరు చారువర్ణ శోబితాం
విరాజమాన పంకజద్వయాత్తహస్తవైభవాం
ధరాత్మజాపతి ప్రసాదప్రాప్త ధన్యజీవితాం
నమామితాంవరప్రదాంరమాకళాం సువర్చలాం

: ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక దిನములు - శనివారం, మంగళవారం ఇంకా గురువారం. పురాణకధ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకొనవచ్చు.

చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు.

శ్రీ హనుమాన్ జయంతి (తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారు.) హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు.

ఈ రోజు హనుమాన్ జయంతి. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.
ఈ రోజున స్వామివారిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
ఇలాగే హనుమంతుని నైజము ఈ ప్రార్ధనా శ్లోకములో ఇలా చెప్పబడినది

"యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్"

"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో,
చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును" అని అర్థం.

అందుచేత చైత్ర శుక్ల పూర్ణిమ నాడు మాత్రమే గాకుండా ఆంజనేయ స్వామిని శనివారం, మంగళవారం ఇంకా గురువారాల్లో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి.

"స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:"

తమలపాకుల దండ:

ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేసారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.

మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.

పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.

తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది

కలువలు:
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పూలు. భరతుని ఉన్న ఒక్క కోవెల ఇరింజలకుడ, కేరళలో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవ
ారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.

Om Namah Shivaya


:leaves: :rose: Om Namah Shivaya

ఓం నమః శివాయ !!:rose::leaves:
:herb: మంత్ర జపం ఎలాచేయాలి ?:herb:
:leaves: దాని వలన పొందే ఫలితాలేంటి?:leaves:
:herb::herb::herb::herb::herb::herb::herb::herb::herb::herb::herb::herb::herb::herb:

 

ఓం నమః శివాయ..! ఇది మహా శివుడిని
స్మరించే గొప్ప మంత్రం. సృష్టిలో ముఖ్యమైన దేవుళ్లైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహా శివుడు. "ఓం నమః శివాయ " అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది. హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు. శివ భక్తులు ఎప్పుడూ
ఆ పరమేశ్వరుడిని ఓం నమః శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూ ఉంటారు.
ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల.. శారీరక, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని.. ఆధ్యాత్మికవేత్తలుసూచిస్తున్నారు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత, మానసిక సంతోషం కలుగుతుంది. అంతేకాదు శివ భక్తులు వీలైనప్పుడల్లా " ఓం నమః శివాయ " అని స్మరించుకుంటూ ఉంటే.. అద్భుతమైన ఫలితాలు, మార్పులు చూడవచ్చట. మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..
:monkey:వాస్తవాలు :monkey:
ఓం నమః శివాయ అనే మంత్రంలో న, మ, శి, వా, య అనే ఐదు అక్షరాలున్నాయి. ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి, నీళ్లు, అగ్ని, గాలి, విశ్వాన్ని సూచిస్తాయి.
స్మరణయజుర్వేదం ప్రకారం ఈ మంత్రాన్ని
శ్రీ రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు.
:monkey:ప్రయోజనాలు :monkey:
ఓం నమః శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధా భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది.
:monkey:పాజిటివ్ వైబ్రేషన్స్:monkey:
ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఎనలేని శక్తిని ప్రసాదిస్తాయి. దుష్టశక్తులు దరిచేరకుండా కాపాడుతుంది.
:monkey:డిప్రెషన్ :monkey:
ఈ మంత్రాన్ని క్రమంతప్పకుండా స్మరించడం వల్ల మెదడు, శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే డిప్రెషన్, నిద్రలేమి, మానసిక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఒత్తిడి తగ్గించి, ప్రశాంతత కలిగిస్తుంది.
ప్రతి రోజూ ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు స్మరించడం వల్ల కోపం, ఆవేశం తగ్గుతాయి. జీవితంలో ప్రశాంతత పొందుతారు.
ఎప్పుడు స్మరించాలి ?
ఓం నమః శివాయ మంత్రం స్మరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. వేకుజామున స్నానం చేసి, కాళ్లు ముదురుకుని, నిటారుగా కూర్చోవాలి. కళ్లు మూసుకుని జప మాల తీసుకుని ఓం నమః శివాయ మంత్ర జపం మొదలుపెట్టాలి. ఒకవేళ జపమాల లేకపోతే.. వేళ్లతో లెక్కపెట్టుకోవచ్చు.
108 సార్లు మంత్ర జపం పూర్తి అయిన తర్వాత అలాగే.. కొన్ని నిమిషాలు కళ్లు మూసుకుని ప్రశాంతంగా కూర్చోవాలి. దీనివల్ల మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మీ శరీరం గ్రహిస్తుంది.

Saleshwaram


Saleshwaram

:christmas_tree::evergreen_tree:సలేశ్వరం:evergreen_tree::christmas_tree:


శ్రీశైలం అన్ని సార్లు వెళ్ళారు . కానీ ప్రక్కన ఉన్న అత్బుతమైన సలేశ్యరం చూసారా.

సలేశ్వరం (Saleshwaram) ఇది శ్రీశైలం లొని ఒక యత్రా స్థలము.ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యత్రస్థలమ. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ జాతరజరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలిపౌర్ణమికి మొదలగుతుంది. శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరం లో వుంటుంది. అడవిలో నుండి 25 కిలొమిటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు.. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలోవున్నా గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవచ్చరం లో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్షకు లు అందరు ముగ్డులు అవుతారు.


ఉనికి: -

ఇది మన రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా లోని అమ్రాబాద్ మండలం లోని మన్నానూర్ నల్లమల అడవులలో వుంది. హైదరాబాద్-- శ్రీశైలం --- హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే రహదారిలొ 150 కిలోమీటర్ రాయి నుండి 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవుల్లో వుంది. ఆటవీ శాఖ వారి అనుమతితో ఆ దారెంబడి పది కిలోమీటర్ల దూరం వెళ్ల గానె రోడ్డు ప్రక్కన నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనబడుతుంది.

చరిత్ర: -

అక్కడి పకృతి అందాలకు ముగ్దుడైన నిజాం వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అదిప్పుడు శిధిలావస్తలో వుంది. ఆ ప్రదేశానికి ఫరాహబాద్ అనిపేరు. అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం. అంతకు ముందు దాని పేరు' పుల్ల చెలమల'. 1973 లో 'ప్రాజెక్ట్ టైగర్' పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. అది మన దేశంలోనె అతి పెద్ద పలుల సరక్షణా కేంద్రం. నిజాంవిడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి. అక్కడ రెండు పొడవైన ఎత్తైన రెండు గుట్టలు ఒకదాని కొకటి సమాంతరంగా వుంటాయి. మధ్యలో ఒక లోతైన లోయ లోనికి ఆ జలదార పడుతుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా అర కిలోమీటరు దిగి తరువాత దక్షిణం వైపుకి తిరిగి పశ్చిమ వైపున వున్న గుట్టపైన కిలో మీటరు దూరమ్ నడవాలి. ఆ గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టాల మధ్య లోయ లోనికి దిగాల ఆ దారిలొ ఎన్నే గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం. గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్చంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి వున్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనె ప్రధాన దైవ మైనలింగమయ్య స్వామి లింగం వున్నది. స్థానిక చెంచులేఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడ లింగమే వున్నది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, -గంగమ్మవిగ్రహాలున్నాయి.

జాతర: -

సలేశ్వరం జాతర సంవత్సరాని కొక సారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు "వత్తన్నం వత్తన్నం లింగమయ్యో" అంటు వస్తారు. వెళ్లేటప్పుడు "పోతున్నం పోతున్నం లింగమయ్యొ" అని అరుస్తూ నడుస్తుంటారు.

చారిత్రల ఆదారాలు: -

నాగార్జున కొండలో బయట పడిన ఇక్ష్యాకుల నాటి అనగా క్రీ.శ. 260 నాటి శాసనాలలోమూస:చుళధమ్మగిరి గురించిన ప్రస్తావన ఉన్నది. ఆ గిరిపై అనాడు [[ శ్రీ లంక నుండి వచ్చిన బౌద్ద బిక్షవులుకొరకు అరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ దమ్మగిరి ఈ సలేశ్వరమే నని నమ్మకం. కారణం అక్కడ ఇక్ష్యాకుల కాలపు కట్టడాలు వున్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16"/10"/3" గా వున్నాయి. అలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనె ఉండేది. . "సుళ" తెలుగులో "సుల" అవుతుంది కాబట్టి బౌద్ద క్షేత్రం శైవ క్షేత్ర్తంగా మార్పు చెందాక సులేస్వరం గా ......చివరగా సులేశ్వరంగా మారి వుంటుంది. ఇక్ష్యాకుల నిర్మాణాలకు అధనంగా విష్ణు కుండినుల క్రీ.శ.. 360 ---370 కాలపు నిర్మాణాలు కూడ వున్నాయి. వీరి ఇటుకల పరిమాణసం 10'"/ 10"/3" . దిగువ గుహలోని గర్బగుడి ముఖ ద్వారం పైన విష్ణు కుండినుల చిహ్నమగు పూలకుండి శిలాఫలకం వున్నది. ద్వార బందంపై గడప మధ్యన గంగమ్మ విగ్రహం వున్నది. ద్వారం ముందర క
ుడి పక్కన సుమారు రెండున్నర అడుగుల ఎత్తున నల్లసరపు మీసాల వీరభద్రుని విగ్రహం నాలుగు చేతులలలో నాలుగు ఆయుదాలు వున్నాయి. కుడి చేతిలో గొడ్డలి, కత్తి, ఒక ఎడమ చేతిలో ఢమరుకం ఎడమ చేయి కిందికి వాలి ఒక ఆయుదాన్ని పట్టుకుని వున్నది. బీరభద్రుని కింద కుడి వైపున పబ్బతి పట్టు కున్న కిరీటం లేని వినాయాకుని ప్రతిమ ఉండగా ఎడమ వైపున స్త్రీమూర్తి వున్నది. ద్వారానికి ఎడమ వైపున విడిగా రెండు గంగమ్మ విగ్రహాలున్నాయి. ఇవే పాతవిగా కనబడుతున్నాయి. ఈ విగ్రహాల ముందు ఒకనాటి స్థిర నివాసాన్ని సూచించె విసురు రాయి వున్నది. గుడికి ఎడమ వై పున గల అరాతి గోడకి బ్రంహీ లిపిలో ఒక శాసనం చెక్కబడి వుంది. కుడివైపున గల గోడమీద ఒక ప్రాచీన తెలుగు శాసనం కూడ వున్నది. ఈ రెండూ విష్ణు కుండినుల శాసనాలుగా తోస్తున్నాయి. వీటిని చరిత్ర కారులు చదివి వివరిస్తే విక్ష్ణుకుండినుల జన్మస్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించ వచ్చు. స్థల మహాత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహాత్యం కావ్యాలలో సలేశ్వరాన్ని రుద్ర కుండంగా, దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణు కుండంగా, పశ్చిమాన గల లొద్దిఅనగా గుండాన్ని బ్రంహ కుండంగా పేరొన్నారు. పిష్ణు కుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్ర కారుడు బ్.ఎన్ శాస్త్రి నిరూపించారు. క్రీ.శ. పదమూడవ శతాబ్దాంత కాలం నాటి మల్లికార్హ్జున పండితారాద్య చరిత్ర లో శ్రీపర్వత క్షేత్ర మహాత్యంలోకూడ ఈ సలేశ్వర విశేషాలను పాల్కురి సోమనాధుడు విశేషంగా వర్ణించాడు. 17 వ శతాబ్దాంతంలో మహారాష్ట్రకు చెందిన చత్రపతి శివాజి కూడ ఇక్కడ అశ్రయం పొందినట్లు స్థానిక చరిత్ర వలన తెలుస్తున్నది.

ప్రకృతి: -

సలేశ్వరం లోయ సుమారు రెండు కిలో మీటర్ల పొడవుండి మనకు అమెరికా లోని గ్రాండ్ క్యానన్ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ కానన్ అందాలను చాలమందిమెకన్నాస్ గోల్డ్ సినిమాలో చూసి వుంటారు. సలేశ్వరంలోని తూర్పు గుట్ట పొడువునా స్పష్టమైన దారులు వున్నాయి. అవి జంతువులు నీటి కోశం వెళ్లే మార్గాలని స్థానిక గిరిజనులు చెప్తారు. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ కాలానుగుణంగా ఒకప్పుడు ఆది మానవులకు, ఆ తరువాత అబౌద్ద బిక్షవులకు, ఆపైన మునులకు, ఋషులకు స్థావరాలుగా వుండేవని అక్కడి ఆదారాలను బట్టి తెలుస్తుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, చరిత్ర పరిశొధకులకు చాల బాగ నచ్చే ప్రదేశం ఇది...

Secret of Sri Krishna


Secret of Sri Krishna
ఈ శ్రీకృష్ణ రహస్యం
--------------------------

మహాభారతంలో శ్రీకృష్ణుని మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు. మహాభారతం చదివినవారికి అలాంటి శ్రీకృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి. కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు ? ద్రౌపది పిలిస్తే కాని కృష్ణుడు రాకూడదా ? ధర్మరాజుని జూదానికి వెళ్ళకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా ? సుయోధనుడు శకునితో ఆడించినట్టు, ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా ? ఇవన్నీ ఎందుకు జరగలేదు ? ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా ? ఇలాంటి ప్రలెన్నో సహజంగానే వస్తాయి.

వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు. మనకు కాదండోయ్.. శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్దవుడు.. మహాభారతం చివర్లో శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు పై ప్రశ్నలే అడిగాడు.. శ్రీకృష్ణుడు ఏం అడిగాడు.. ఉద్దవుడు ఏం చెప్పాడో.. చూద్దాం..

ఉద్ధవుడు : మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా.., ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు లేదా ధర్మరాజు తరుపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా ?

కృష్ణుడు : ఉద్దవా ! గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటె వేరేలా ఉండేది, కాని అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతను పిలవలేదు సరి కదా, నేను అటువైపు రాకూడదని ప్రార్ధించాడు. అతని ప్రార్ధన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కాని నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలిగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా.

ఉద్ధవుడు : అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా ?

కృష్ణుడు : జీవితంలో జరిగే ప్రతీది కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మని మార్చలేను, కాని మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను.

ఉద్ధవుడు : అంటే మా పక్కనే ఉండి, మేము కష్టాలలో, ఆపదల్లో , చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చేయవా ?

కృష్ణుడు : ఉద్దవా ! ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించడం లేదు. *నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవ్. కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి.. నాకు తెలీదు అనుకోని, ప్రతీది చేస్తుంటారు అందుకే ఇబ్బందుల్లో పడతారు.*

అదీ కృష్ణుడు చెప్పిన రహస్యం. *కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి ఉంటే చాలు. పూజలు ఏమీ అవసరం లేదు*. ఆయన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే.. మన జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇదే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన కీలకమైన రహస్యం.

హిందూ ధర్మ పరిరక్షణ...

Why should one sit in Temple after dharshan?


Why should one sit in Temple after dharshan?


*దైవ దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చోవాలి*.?


సాదారణంగా మనం దేవాలయంలో దైవ దర్శనం అయ్యాక కొంచెం సేపు కూర్చుంటాం. ఈ విధంగా ఎందుకు కుర్చుంటామో చాలా మందికి తెలియదు. అయితే కొంతమంది దైవ దర్శనం కాగానే హడావిడిగా వెళ్లి పోతూ ఉంటారు. నిజానికి దైవ దర్శనం అయ్యాక గుడిలో కొంచెం సేపు కూర్చోవాలని మన శాస్త్రాలు చెప్పుతున్నాయి. ఇప్పుడు దర్శనం అయ్యాక గుడిలో కూర్చోవటానికి గల శాస్త్రీయమైన కారణాలను తెలుసుకుందాం.

గుడి ప్రదేశాల్లో విధ్యుత్,అయస్కాంత శక్తీ క్షేత్రాల తరంగాల పరిది ఎక్కువుగా ఉంటుంది. ఇటువంటి పాజిటివ్ శక్తి విరివిరిగా లభ్యం అయ్యే ప్రదేశంలో దేవాలయాలను నిర్మిస్తారు.

ఈ ప్రదేశం యొక్క కేంద్ర స్థానంలో మూల విరాట్ ను ప్రతిష్ట చేస్తారు. ఈ ప్రదేశాన్ని మూల స్థానం అంటారు. ఈ మూల స్థానంలో భూమి యొక్క అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి.

మూల విరాట్ అడుగు బాగంలో వేద మంత్రాలను రాసిన రేగి రేకులను ఉంచుతారు. ఈ రాగి రేకులు భూమి యొక్క అయస్కాంత తరంగాలను గ్రహించి చుట్టూ పక్కలకు ప్రసారం చేస్తాయి.

రేకులు ప్రతి రోజు గుడికి వచ్చి సవ్య దిశలో ప్రదిక్షణలను చేస్తే, ఆ వ్యక్తి యొక్క శరీరం మూల విరాట్ అడుగున ఉన్న రాగి రేకులు ప్రసారం చేసే అయస్కాంత తరంగాలను గ్రహిస్తుంది.

ఈ ప్రక్రియ చాలా నిదానంగా జరుగుతుంది. అందువల్ల మన పెద్దవారు ప్రదిక్షణ చేసే సమయంలో నిదానంగా, ప్రశాంతంగా చేయాలనీ చెప్పుతూ ఉంటారు. ఈ ధనాత్మక శక్తి మనం ఆరోగ్యంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది.

గుడిలో దేవుని దర్శనం అయ్యాక మనస్సు,శరీరం ఉత్తేజితం అవుతుంది.

అవుతుంది. గుడిలో దేవుని మహిమ,మంత్రాలే కాకుండా ప్రత్యేకమైన ఆలయ నిర్మాణ శైలి కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచటానికి సహాయపడుతుంది.

అలాగే చెడు ఆలోచనలు కలగకుండా మంచి నిర్ణయాలు తీసుకొనే విధంగా ప్రోత్సాహం కలుగుతుంది.

దైవ సన్నిదిలో మంత్ర జపం లేదా ధ్యానం చేస్తే జ్ఞాపకశక్తి మెరుగు అయ్యి రెట్టింపు పలితాలను పొందుతాం.

అందువల్ల దైవ దర్శనం అయ్యాక దేవాలయంలో కొంచెం సేపు కూర్చుంటే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

Why should one sit in Temple after dharshan?

Friday, April 7, 2017

Gayathri Manthram

గాయత్రీ మంత్ర మహత్యం

Gayathri Manthram






అతి శక్తివంతమైన శ్రీ గాయత్రీ మహమంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారం. అనన్యం,సర్వసిద్ధిప్రదం.
1. త - అజ్ఞానాన్ని పోగొట్టునది
2. త్స - ఉపపాతకములను నివారించునది
3. వి - మహాపాతములను నివారించునది
4. తు - దుష్టగ్రహ దోషాలను నివారించునది.
5. ర్వ - భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేయునది
6. రే - తెలియక చేసిన పాపాలను పోగొట్టునది
7. ణి - తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించునది.
8. యం - బ్రహ్మహత్యా పాతకాన్ని నశింపచేయునది
9. భ - పురుష హత్యా పాతకాన్ని పోగొట్టునది.
10. ర్గో - గోహత్యా దోషాన్ని నివృత్తి చేయునది.
11. దే - స్త్రీహత్యా పాతకాన్ని పోగొట్టునది
12. వ - గురు హత్యాపాపాన్ని నివారించును.
13,. స్య - మానసిక దోషాలను నివారించును
14. ధీ - మాతృ, పితృ వధా పాతకాన్ని పరిహరించును.
15. మ - పూర్వ జన్మార్జిత పాపాల నుండి రక్షించును
16. హి - అనేక పాప సమూహాలను నశింపచేయును
17. ధి - ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడును
18. యోః - సర్వపాపాలను నివృత్తి చేయును.
19. యో - సర్వపాపాలను నివృత్తి చేయును
20. నః - ఈశ్వరప్రాప్తి నిచ్చును
21. ప్ర - విష్ణులోక ప్రాప్తి
22. చో - రుద్రలోక ప్రాప్తి
23. ద - బ్రహ్మలోక ప్రాప్తి
24. యాత్ - పరబ్రహ్మైక్య సిద్ధి ప్రసాదించును.
గాయత్రీ కవచంలో ఉన్న రూపాలు తానే అయిన దేవి ఇలా వర్ణించబడింది.
గాయత్రి - తూర్పు దిక్కును
సావిత్రి - దక్షిణ దిక్కును
సంధ్యాదేవి - పడమర దిక్కును
సరస్వతి - ఉత్తర దిక్కును
పార్వతి - ఆగ్నేయాన్ని
జలశాయని - నైరుతిని
పవమాన విలాసిని - వాయువ్య దిక్కును
రుద్రాణి - ఈశాన్య దిక్కును రక్షీంచుగాక
తుత్ - పాదాలను
సవితుః - జంఘలను
వరేణ్యం - కటిని
భర్గః - నాభిని
దేవస్య - హృదయాన్ని
ధీమహి - చెక్కిళ్ళను
ధియః - నేత్రాలను
యః - లలాటంను
నః - శిరస్సును
ప్రచోదయాత్ - శిఖా భాగాన్ని రక్షించుగాక.
ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతిభాగమ్ శ్రీ గాయత్రీ మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయి.
తత్ - శిరస్సు
సకారం - ఫాలం
వి - నేత్రాలు
తు - కపోలాలు
వ - నాసాపుటాలు
రే - ముఖం
ణి - పైపెదవి
యం - కింది పెదవి
భ - మద్య భాగం
ర్గో - చుబుకం
దే - కంఠం
వ - భుజాలు
స్య - కుడి చేయి
ధీ - ఎడమ చేయి
మ - హృదయం
హి - ఉదరం
ధి - నాభి
యో - కటి
యో - మర్మప్రదేశం
నః - తొడలు
ప్ర - జానువులు
చో - జంఘం
ద - గుల్ఫం
యా - పాదాలు
త్ - సర్వ అంగాలు
ఈ విధంగా మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ తల్లిని వేడుకుందాం.