Thursday, April 6, 2017

Manasa Sarovar మానస సరోవరం



Manasa Sarovar
మానస సరోవరం


సర్వజగత్తునూ నడిపించే లయకారుడు పరమ శివుడు. భక్తసులభుడిగా పేరు తెచ్చుకున్న ఆ భోళా శంకరుడు ఉండేది కైలాసంలో. హిమాలయాల్లోనే ఈ కైలాసం ఉందన్నది భక్తుల విశ్వాసం. ఆ పర్వతాన్ని దర్శించుకుంటే వచ్చే అనుభూతి మాటల్లో వర్ణించలేదని.. పదాలకు అంతుచిక్కనిది. ఒక్కసారి కైలాసగిరిని దర్శించుకుంటే.. సర్వపాపవిమోచనం కలుగుతుంది. అంత పవిత్రమైన స్థలం.. కైలాసపర్వతం. ఆ కైలాసం విశ్వాంతరాల్లోనో, పాతాళలోకంలోనే లేదు.. భూమిపైనే ఉంది. శివపార్వతులు అక్కడే కొలువై ఉన్నారు. ప్రమథగణాలతో ఈ లోకాన్ని పాలిస్తున్నారు. పరమపవిత్రమైన హిమాలయాల్లో.. దేవాదిదేవతలు కొలువైన మంచుకొండల మధ్యలో... ఈ భూలోక కైలాసం ఉంది. అదే.. హిమాలయ పర్వతాల్లోని కైలాస శిఖరం. కేవలం మహాశివుడు మాత్రమే కాదు.. అక్కడికి వెళితే మహాలక్ష్మితో సేవలందుకుంటూ పాలసముద్రంలో పవళించిన విష్ణుమూర్తి దర్శనమూ లభిస్తుంది. బ్రహ్మమనస్సు నుంచి ఉద్భవించిన పరమపవిత్రమైన సరోవరమూ ఇక్కడ ఉంది. దేవతలు స్నానమాచరించే, ఈ పవిత్ర జలాల్లో ఒక్క మునకేసినా... పాపలన్నీ నశించి.. ఎంతో పుణ్యాన్ని దక్కించుకున్నవారవుతారు. కైలాస పర్వతంపైనే మహాశివుడి నివాసం ఉందని పురాణాలు చెబుతున్నాయి. తరతరాలుగా భక్తుల నమ్మకం కూడా అదే. అందుకే, భోళాశంకరుడి దర్శనం కోసం ఎన్నో కష్టాలకు ఓర్చి మానససరోవర యాత్రను చేస్తుంటారు. ఈ యాత్ర చేయాలంటే, డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. అంతకు ముంచి ఆధ్యాత్మిక బలం, సంకల్పం ఉండాల్సిందే.

శివ భగవానుడే కాదు, ఆయన వాహనమైన నందీశ్వరుడు, విఘ్నాలకు అధిపతి గణపతి, దేవతల సేనాధిపతి కుమారస్వామి కైలాస పర్వతంపై దర్శనమిస్తారు. సూర్యభగవనాడు భక్తితో అర్పించే కిరణాలు... కైలాస శిఖరాన్ని తాకగానే... వెండికొండ కాస్తా బంగారు మయమై.. శోభిస్తుంది. ఆ దర్శనం జన్మజన్మల సుకృతం. సముద్ర మట్టానికి 22 వేల 778 అడుగుల ఎత్తులో ఉందీ భూలోక కైలాసం. ఇక్కడికి వెళ్లిన ప్రతీఒక్కరినీ శివరూపదర్శనం లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం. అడుగడుగునా ఆధ్యాత్మికత పరుచుకున్న ఈ అందమైన శిఖరాన్ని దర్శించుకుంటే దొరికే అనుభూతి.. దేన్ని చూసినా రాదంటారు శివభక్తులు. మౌంట్ కైలాస్‌ భూలోకంలో ఉన్న ఓ అద్భుతమనే చెప్పాలి. ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో రహస్యాలు ఈ పర్వతం చుట్టూ దాగిఉన్నాయి. నాలుగువైపులా నాలుగు రంగుల్లో కనిపించడం కైలాస పర్వతానికి ఉన్న మరో ప్రత్యేకత . అందుకే.. హిమాలయాల్లోనే అత్యంత అరుదైన పర్వతంగా పేరుగాంచింది.


Manasa Sarovar
మానస సరోవరం

No comments:

Post a Comment