Monday, April 10, 2017

Hanuman Jayanthi

Hanuman Jayanthi

'' హనుమాన్ జయంతి ''



చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున '' హనుమాన్ జయంతి ''

తేది :11 ఏప్రిల్ 2017 మంగళవారం

ఆంజనేయుని పూజకు పర్వదినాలు

పూర్వాభద్ర నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం. అదియును పర్వదినము. ప్రతి శనివారము స్వామివారికి పూజలు చేయుట విధి. అమావాస్యతో కూడిన సోమవారము, ప్రతి మంగ ళవారం స్వామి వారి పూజకు ప్రీతి దినములు.

శ్రీహనుమత్ స్వామికి అరటి తోటలంటే ఎక్కువ యిష్టం. కాబట్టి స్వామిని కదళీవనములలో పూజిస్తే శుభం చేకూరుతుంది. మంగళకరుడగు స్వామికి తమలపాకుల పూజ పరమ ప్రీతికరం. అలాగే పారిజాతాలు, మందారాలు, నందివర్ధనం, మల్లెలు, గన్నేరు మొదలైన పుష్పాలు స్వామికి ఆనందము కలిగిస్తాయి. తులసీ, మారేడు, మామిడి, మాచీపత్రము, ఉత్తరేణి పత్రములు ప్రీతికరములు. అరటి, మామిడి, నిమ్మ, కొబ్బరి, పనస, నేరేడు మొదలైన ఫలాలు స్వామి వారికి అత్యంత ప్రీతికరం.

సింధూరము, సింధూరాక్షతలు, పసుపు అక్షతలు, కుంకుమ, సాంబ్రాణి, గుగ్గిలము, కర్జూరము మొదలైన పూజాద్రవ్యాలు, పాయసం, పొంగలి, అప్పాలు, వడలు, వడపప్పు, పానకం, పాలు మొదలైన నివేదన ద్రవ్యాలు స్వామికి నివేదిస్తే, స్వామి సంతుష్టుడు అవుతారు. ఆవు నేతితో చేసిన దీపారాధన శ్రేష్ఠం. ఇలా స్వామిని నిత్యం ధాన్యం చేయాలి.

ప్రభాకరాత్మజాం సుమేరు చారువర్ణ శోబితాం
విరాజమాన పంకజద్వయాత్తహస్తవైభవాం
ధరాత్మజాపతి ప్రసాదప్రాప్త ధన్యజీవితాం
నమామితాంవరప్రదాంరమాకళాం సువర్చలాం

: ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక దిನములు - శనివారం, మంగళవారం ఇంకా గురువారం. పురాణకధ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, యెగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే యెడున్నర యేళ్ళ శని దోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకొనవచ్చు.

చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు.

శ్రీ హనుమాన్ జయంతి (తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారు.) హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు.

ఈ రోజు హనుమాన్ జయంతి. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.
ఈ రోజున స్వామివారిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.
ఇలాగే హనుమంతుని నైజము ఈ ప్రార్ధనా శ్లోకములో ఇలా చెప్పబడినది

"యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్"

"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో,
చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును" అని అర్థం.

అందుచేత చైత్ర శుక్ల పూర్ణిమ నాడు మాత్రమే గాకుండా ఆంజనేయ స్వామిని శనివారం, మంగళవారం ఇంకా గురువారాల్లో పూజిస్తే మంచి ఫలితాలుంటాయి.

"స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:"

తమలపాకుల దండ:

ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేసారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.

మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.

పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.

తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది

కలువలు:
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి యెంతో ఇష్టమైన పూలు. భరతుని ఉన్న ఒక్క కోవెల ఇరింజలకుడ, కేరళలో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవ
ారికి హనుమంతుడంటే భరతుడు మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.

No comments:

Post a Comment