Thursday, April 6, 2017

Ramayanam రామాయణం


Ramayanam
*🕉రామాయణం🕉*


*ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ*

*ఒక కొడుకుకి తండ్రి మీద ఉన్న గౌరవం*

*ఒక భర్తకి భార్య మీద ఉన్న బాధ్యత*

*ఒక భార్యకి భర్త మీద ఉన్న నమ్మకం*

*ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం*
*ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం*

*ఒక మనిషిలోని బలం,*

*మరో మనిషి లోని స్వార్ధం,*

*ఇంకో మనిషి లోని కామం.....*

*ఒకరి ఎదురు చూపులు,*

*మరొకరి వెతుకులాటలు,*

*అండగా నిలిచిన మనుషులు,*

*అన్ని కలిపి మనిషి మనిషి గా బ్రతకడానికి అవసరమైన ఒక నిఘంటువు.*



Ramayanam రామాయణం

శ్రీరామ నామం జగత్కళ్యాణ కారకం,
శ్రీరామ నామం సర్వ శుభకరం..

రామా అని పలికినంతనే సర్వ పాపాలు దూరమవుతాయట,
రామా అని పిలిచిన పలికే కారుణ్య మూర్తి రామచంద్రుడు.

రామా అన్న తారక నామం పలికినంతనే కిరాతుడు వాల్మీకి అయ్యి రామాయణ దివ్య చరితామృతాన్ని లోకానికి అందించారు..

సాక్ష్యాత్తు శ్రీమన్నారాయణుడి అంశ అయ్యుండి కూడా కేవలం ఒక మానవ మాతృడి వలే వున్నాడు..

మనిషి అంటే హేళనగా చూసే రావణుడితోనే చేతులెత్తి మొక్కించుకుని, మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించాడు...

ధర్మాన్ని తూచా తప్పకుండా ఆచరించి #రామో_విగ్రహవాన్_ధర్మః అని ఆ ధర్మానికే నిలువెత్తు రూపం అయ్యాడు...

కొడుకు అంటే తల్లిదండ్రుల ఆస్తునే కాదు వారి ఆదర్శాలను కూడా స్వీకరించాలి అని చెప్పిన ఆదర్శమూర్తి...

అన్నిటికీ మించి స్వర్ణ,రత్న,మణి భూషితమైన లంకను చూసి #జననీ_జన్మభూమిశ్చ_స్వర్గాదపి_గరీయసి అని, ఇది గొప్పదైనా నా జన్మభూమి గొటికి సరితూగదు అన్న దేశ భక్తుడు..

*******************************************

ప్రజాక్షేమమే తన క్షేమం అని తన భార్యను సైతం వదిలేసిన రాముడి దక్షత డబ్బు కోసం అధికారం ఆశించే వారికి అర్థం కాదు..

అయోధ్యకి రాజైనా తల్లికి బిడ్డే అన్న రాముడి మాతృభక్తి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వారికి ఏం అర్థం అవుతుంది...

పర స్త్రీని తల్లీ అని సంభోదించే రాముడి సంస్కారం కనపడ్డ ప్రతీ అమ్మాయినీ వంకరగా చూసే వారికి ఏం అర్థమవుతుంది..

తాను ఎంత పరాక్రమ శాలియైనా అంతా తన గురువులు నేర్పిన విద్య అనే రాముడి విధేయత మిడిమిడి జ్ఞానంతో ఉపాద్యాయుడినే హేళన చేసే వారికి ఏం అర్థమవుతుంది...

తాను ఏమైపోయినా సరే కానీ తన వంశం, తన పూర్వీకులకు చెడ్డ పేరు రావద్దు అని వనవాసంకేగిన రాముడి త్యాగం
నేను బాగుంటే చాలు నాకోసం కష్టపడ్డ తల్లిదండ్రులు, వారి పరువు మర్యాదలు ఏమైపోతే నాకేంటి అని వారికి నచ్చిన వారితో వెళ్లిపోయే వారికి ఏం అర్థం అవుతుంది ...

మాతృమూర్తి, మాతృదేశం స్వర్గం కంటే గొప్పవి అన్న రాముడి దేశభక్తి ఈ దేశంలో పుట్టి ఈ నేల తిండి తిని, ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం అనే వారికి ఏం అర్థమవుతుంది...

మాకేం అర్థమవుతుంది రామా... ఏం అవుతుంది..

చూసే మనసుంటే నీ సంస్కారం, నీ విధేయత, నీ వినయం,నీ సౌశీల్యం అర్థమవుతాయి..
మనలోనూ మార్పు వస్తుంది..

పిల్లలకి వీలైతే రాముడి గొప్పతనం చెప్పండి,ఆయన విలువలు, సుగుణాలు నేర్పండి..
ప్రతి ఇంటా రామాయణం వుండాలి...
ప్రతి భారతీయుడు చదవాల్సిన గ్రంథం "రామాయణం"

జై శ్రీరామ.. సకల సద్గుణ రామ..
సుందర సమనోహర రామా..

No comments:

Post a Comment