Wednesday, July 31, 2024

కామిక ఏకాదశీ

 𝕝𝕝 ॐ 𝕝𝕝 31/07/2024 - కామిక ఏకాదశీ 𝕝𝕝 卐 𝕝𝕝

≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈



ఆషాఢ మాసములో కృష్ణ పక్ష ఏకాదశిని  కామిక ఏకాదశిగా జరుపుకుంటారు.

ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని భావిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే తొలి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు. శ్రీహరిని ఆరాధించటం, తులసీ దళాలతో పూజ చేయటం, వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి  ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి.

 

కామిక ఏకాదశి మహత్యం - వ్రత కథ


ధర్మవర్తనుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణున్ని " ఆషాఢ మాసములో కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని" కోరగా, దానికి ఆ వాసుదేవుడు సంతోషించినవాడై "ఓ రాజా! ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్య కార్యమే, ఒకసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మ దేవుడిని ఇలా అడిగాడు. " ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజునకు అధిదేవత ఎవరు, వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయయుంచి తెలపండి" అని కోరాడు. 

 

దానికి బ్రహ్మ బదులిస్తూ " నా ప్రియమైన కుమారుడా! మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించెద. ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి  మహిమ విన్నంతనే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. శంఖ, చక్ర గదాధరుడు, తామర పాదములు కలిగి ఉన్నవాడు, శ్రీధరుడు, హరి, విష్ణు, మాధవుడు మరియు మధుసూధనుడు అనే పేర్లతో పిలవబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు. 

 

కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గురు గ్రహం సింహ రాశిలో ఉన్న పౌర్ణమి రోజు-సోమవారం, గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. 

 

కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును, దూడ మరియు గ్రాసములతో  కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతములో చేసిన పాపములకు భయపడేవారు, పాపమయమైన జీవితంలో కూరుకపోయినవారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. ఏకాదశి రోజులు స్వచ్చమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి. 

 

నారదా! ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు." కామిక ఏకాదశి రోజు ఉపవసించినవారు,సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారి కన్నా గొప్పవారు." ఈ రోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు. కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు, అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. 

 

ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము, బంగారం, వెండి దానం చేస్తే వచ్చే దాని కన్నా ఎక్కువ. తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి, ముత్యాలు, కెంపులు, పుష్పరాగములు, వజ్రాలు, నీలం మరియు గోమధికములతో పూజించినదానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు. లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించివేస్తుంది. 


కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ల పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు. ఈ రోజున శ్రీకృష్ణుని నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో, వారు శాశ్వతముగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామిక ఏకాదశికి బ్రహ్మ హత్యా పాతకాన్ని, భ్రూణ హత్యా పాపమును కూడా తొలగించే శక్తి ఉంది. " అని బ్రహ్మ నారదునితో చెప్పినట్లుగా" శ్రీకృష్ణుడు ధర్మరాజు తో చెప్పెను.


𝕝𝕝 ॐ 𝕝𝕝 శ్రీమన్నారాయణాయ చరణౌ శరణం ప్రపద్యే 𝕝𝕝 卐 𝕝𝕝


𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝

Saraswathi Temple Basra జ్ఞాన సరస్వతీ ఆలయం – బాసర ...!!

 జ్ఞాన సరస్వతీ ఆలయం – బాసర ...!!



ఇది తెలంగాణ రాష్ట్రం లోని ఆదిలాబాదు జిల్లా, ముధోల్ మండలం బాసరలో ప్రఖ్యాతిచెందిన జ్ఞానసరస్వతి ఆలయం ఉంది.. ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి 35 కి.మీ దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది. హైదరాబాదుకు సుమారు 200 కి.మీ. దూరం. 


భారత దేశంలో గల రెండే రెండు సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదే. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. 


ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. 

బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. 


ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసము చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు.  


ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె వంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం చెబుతోంది. 


కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. 


వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్ఠించాడు.  


వ్యాసుడు ఇక్కడ కొంత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి, వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వలన ‘బాసర’ గా నామాంతరాన్ని సంతరించుకున్నది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు. 


ఈ పసుపును ఒక్క రవ్వంత తినినా అత్యంత విజ్ఞానం, జ్ఞానము లభిస్తుందని గాఢంగా విశ్వసిస్తారు. ఆది కవి వాల్మికి ఇక్కడ సరస్వతీ దేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాసాడని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి పాలరాతి శిల ఉన్నాయి. మంజీరా, గోదావరి తీరాన రాష్ట్రకూటుల చేత నిర్మించబడిన మూడు దేవాలయాలలో ఇది కూడా ఒకటి.


ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః

Tuesday, July 16, 2024

తొలి ఏకా దశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి

 తొలి ఏకా దశి అంటే ఏమిటి , ఎందుకు చేసుకుంటారు , దీని విశిష్టత ఏంటి ? సంపూర్ణ వివరణ!!!



హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది.  తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటపెట్టుకోచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం.


తొలి ఏకాదశి అంటే ఏమిటి

ఆషాడ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి.


తొలి ఏకాదశి – విశిష్టత

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి.


తొలి ఏకాదశి జరుపుకొను విధానం , నియమాలు


మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు.


ఉపవాస ఫలితాలు:


ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 


అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. 


ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. 


అన్నదానం చేయడం చాలా మంచిది. 


ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు.


ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.


ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు ,  మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ , ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.


ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. 


తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే..


ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు.

ప్రాశస్త్యం

 ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి , రాత్రికి జాగారం చేసి , మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు.


 దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.

Wednesday, July 10, 2024

ఆషాడమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?

 ఆషాడమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?





ఆషాడ మాసం ప్రారంభం అయింది. ప్రస్తుత కాలంలో మనం నెలలను ఒకటవ తేది నుండి ప్రారంభం అవుతున్నాయి అని అనుకుంటున్నాము. ఒకటవ తేది నుండి పిలుచుకునే నెలలు అవి మన తెలుగు నెలలు కాదు. అవి ఆంగ్ల నెలలు వాటికి ప్రామాణికం అంటూ ఏమి లేదు. అదే మన తెలుగు మాసాలకు ప్రామాణికత ఉంది. తెలుగు మరియు ఇంగ్లీష్ నెలలు ఎలా ఏర్పడ్డాయి, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. 


మాసాలు ఎలా ఏర్పడతాయి:- చాంద్రమానాన్ని అనుసరించి భారతీయ జ్యోతిష పండితులు మాసాల ( నెలల ) కు ప్రత్యేకమైన వైజ్ఞానిక  ధర్మాల ఆధారంగా ప్రతి నెలలోనూ పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసానికి పేరు పెట్టడం తెలుగు సాంప్రదాయ మాసాల ప్రత్యేకత. ఈ మాసం ఎలా ఏర్పడినదో గమనిద్దాం. పూర్వాషాడ లేక ఉత్తరాషాడ నక్షత్రం పౌర్ణమి రోజున వచ్చిన మాసానికి ఆషాడ మాసం అని పేరుతో పిలుస్తారు. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఇంగ్లీష్ నెలలు జనవరి, పిబ్రవరి మొదలైన నెలల విషయంలో ఒక శాస్త్రీయ ప్రామాణికత లేనివి. అవి కేవలం రాజుల పేర్లతోనూ, కొన్ని ఇతర అంశాలతో కూడుకున్న అంశాల వలన వాటిని నెలల పేర్లుగా వారు పిలవడం మొదలు పెట్టారు. 


ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. ఈ నెలలో వివాహాది శుభకార్యాలు ఏమి చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిధి, దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ఇక ప్రతి వారానికి ప్రతి 15 రోజుల కొకసారైనా ఏదో ఒక పండుగ, వ్రతం, పూజ ఉంటుంది. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. దక్షిణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. 


ఆషాడమాసంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తారు. ఆషాఢ పూర్ణిమే గురుపూర్ణిమ. వ్యక్తికి జ్ఞాన జ్యోతిని చూపినవాడు గురువైతే, లోకానికి జ్ఞానరాశిని అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. గురు పూర్ణిమ రోజున వేదవ్యాస మహర్షిని తమ గురువులలో చూసి వారిని ఆరాధిస్తారు.


తెలంగాణలో గ్రామదేవతలకు ప్రతి ఇంటి నుంచి వైభవంగా నివేదన (బోనం) తీసుకెళ్ళి అమ్మవారికి అర్పించి బోనాలు మొదలయ్యేది ఆషాఢంలోనే. సమస్త జగత్తుకు పరిపాలకుడైన పూరీ జగన్నాధుడి రథ యాత్ర జరిగేది కూడా ఈ మాసంలోనే. అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మ మూలపుటమ్మ జగజ్జననీ సకల జీవులకు ఆహారం అందించిన శాకంబరీ దేవిగా దేశమంతటా దర్శనమిచ్చేది ఆషాఢంలోనే. ఈ మాసంలో శాకంబరీ నవరాత్రులు కూడా చేస్తారు. వైఖానస సంహిత ప్రకారం ఈ మాసంలో సప్త మాతృకలు, మహిషాసుర మర్దిని, దుర్గా దేవిని, భైరవ, వరహా, నారసింహుల యొక్క ఆరాధన తప్పక చేయాలి. 


కొత్తగా పెళ్ళైన వధువును పుట్టింటికి తీసుకువెళ్ళేది ఆషాఢ మాసంలోనే. ఆషాఢమాసంలో కొత్తగా పెళ్ళైన దంపతులను దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళతారు. ఆషాఢమాసంలో స్త్రీ నెలతప్పితే, 9 నెలల తరువాత అంటే వేసవి కాలంలో అంటే మార్చి నుంచి మే మధ్య కాలంలో ప్రసవం జరుగుతుంది. సాధారణంగానే మన దేశంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత విజృంభిస్తాయి. అప్పుడే పుట్టిన శిశువుకు ఈ వేడివాతావరణం బాగా ఇబ్బంది కలిగిస్తుంది. శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. తల్లి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఆషాఢమాసంలో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారు. మాతశిశు సంక్షేమమే దేశ సంక్షేమానికి తొలి మెట్టు అన్నది మన పూర్వీకులు ఆలోచన, అందుకే ఈ సంప్రదాయం.


ఆషాఢమాసంలో తొలకరి మొదలై వర్షాలు పడతాయి. ఇంట్లో అందరు వ్యవసాయ పనుల మీద పొలానికి వెళ్ళినా, కొత్తగా పెళ్ళైన జంట కలిసి గడపటానికి ఇష్టపడతారు. వ్యవసాయ కుటుంబాల్లో అందరు కలిసి పని చేయకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చింది.

శూన్యమాసం అంటే భయాలను కలిగించేందుకు వచ్చింది కాదు, శాస్త్రీయ కారణాల వల్ల ఆషాడాన్ని శూన్యమాసంగా నిర్ణయించారు పెద్దలు.


ఆషాడ మాస ఫలము:- ఈ మాసంలో ఐదు సోమవారాలు వచ్చాయి. పంచాంగా ఫలితంగా ఈ నెలలో ధాన్యానికి సమార్ఘత్యము "వర్షాలు" కలుగును. చంద్రునికి మిధునోదయం కలిగినందున దూది సూత్ర దాన్యాలు అధిక ధరలు ఉంటాయి. వస్త్రాలు, గోధుమలు, కందులు, నువ్వులు, మినుములు, ఉలవలు, బఠాణీలు, అవిసేలు, పిండి వస్తువులు, సుగంధ ద్రవ్యాలు, కస్తూరి, కుంకుమ పువ్వు, కర్పూరం, తేనె, చక్కర, కంబళ్ళు, వాహనాలు, పెయింటింగులు, బంగారం, వెండి ధరలు అధికంగా ఉండును. శనగలు, లవంగాలు, బాదం, పొగాకు, తేయాకు, గంధం, తమలపాకులు, ఉన్ని, ఇత్తడి, రాగి, కంచు లోహ ధరలు ఎక్కువగా ఉండును. పెసలు, ఖాజు, ద్రాక్ష, ఏలాకులు,పోకలు, ఖర్జూరం, ఉప్పు, నెయ్యి, నునే, ప్రత్తి, పూలు, ముదలగునవి ధరలు నిలకడలేక ఎగుడు దిగుడుగా ఉండును.

Tuesday, July 9, 2024

బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం

 బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం


బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం : హైదరాబాదులోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఆషాఢ బోనాల సందర్భంగానే మహోత్సవంగా నిర్వహిస్తారు. హైదరాబాదులోని బల్కంపేటలో రేణుక ఎల్లమ్మ భక్తజనుల ఆరాధనలందుకుంటోంది. ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయంలో ఎల్లమ్మ జలాధివాసిని, స్వయంవ్యక్తమైన తల్లి. అమ్మవారి ఆలయంలో క్షేత్రపాలకురాలిగా ఆరోగ్య ప్రదాయినియైన శీతలాదేవిని స్థాపించారు. జలాధివాసినిగా అమ్మవారు ఆవిర్భవించిన కారణంగా ఆమెను జలదుర్గా స్వరూపంగా ఆర్చిస్తారు. ప్రస్తుతం ఆలయం ఏర్పడి, అర్చామూర్తులు వెలసినా, మూలస్వరూపమైన అమ్మవారిని జలాధివాసినిగా దర్శించవచ్చు. క్షేత్రపాలకురాలు శీతలాదేవి (పోచమ్మ) కూడా ఆలయంలోనే దర్శనమిస్తుంది. కొత్త దంపతులు పసుపుబట్టలతో అమ్మవారిని దర్శించుకుంటే సంసారం ఏ కష్టాలు, చింతలు లేకుండా సాగుతుందని నమ్మకం. ఆలయంలో మూలమూర్తి శిరస్సు వెనుక భాగంలో ఉన్న బావి నుంచి వచ్చే ఊటనీటినే భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఈ నీటిని స్నానం చేసే నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే కలరా, మశూచి, గజ్జి, తామర వంటి వ్యాధులు సమసిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ నీటితో ఇళ్లను శుద్ధిచేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని వారి నమ్మకం. ప్రతి ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం నాడు ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడురోజుల పాటు జరిగే ఈ కల్యాణోత్సవాలుంటాయి. ఎదుర్కోలు, కల్యాణం, రథోత్సవం అనే మూడు దశలుగా సాగే ఈ కార్యక్రమంలో రథోత్సవం నేత్రపర్వంగా సాగుతుంది.

Wednesday, July 3, 2024

గోవు మరియు గేదె లల్లోని తేడాలు

 *గోవు మరియు గేదె లల్లోని తేడాలు*




🐃 గేదె కు బురద అంటే చాలా ఇష్టం.

🐂 గోవుకు స్వచ్ఛత అంటే చాలా ఇష్టం. తన పేడ లో కూడా తను కూర్చోదు.

*--*

🐃 గేదెను 10 kms దూరం తీసుకు వెళ్లి వదిలేస్తే.. ఇంటికి తిరిగి రాలేదు. దానికి జ్ఞాపక శక్తి గోవు తో పోలిస్తే చాలా తక్కువ .

🐂 ఆవు ను 10 kms దూరం తీసుకు వెళ్లి వదిలేసినా, ఇంటి దారి మర్చిపోకుండా తిరిగి వచ్చేస్తుంది. అందుకే గోవు పాలల్లో స్మరణ శక్తి ఉంటుందంట్టారు.

*--*

🐃 పది గేదెలను కట్టి, వాటి పిల్లలను విడిచిపెడితే ఒక్క పిల్ల కూడా దాని తల్లిని గుర్తించలేదు.

🐂  తన తల్లి కొన్ని వందల ఆవుల మధ్య లో ఉన్నా ఆవు దూడ గుర్తించగలదు.

*--*

🐃 పాలను తీసేటప్పుడు గేదె తన పాలను మొత్తం ఇచ్చేస్తుంది.

🐂 గోవు తన పిల్ల కోసం పొదుగు లో కొంచం పాలను దాచిపెడుతుంది. అది పిల్ల త్రాగేటప్పుడు మాత్రమే వదులుతుంది. అందుకే ఆవు పాలల్లో వాత్సల్య గుణం ఉంటుంది.

*--*

🐃 గేదె ఎండ లేదా వేడిమి ని తట్టుకోలేదు.

🐂 ఆవు మే- జూన్ ఎండలను సైతం తట్టుకోగలదు.

*--*

🐃 గేదె పాలు చిక్కగా ఉండి తొందరగా అరగవు. దాని వల్ల చలాకి తనం ఉండదు. పాలను తీసే సమయం లో దూడను యజమాని దానిని లేపుతాడు.

🐂 ఆవు దూడ తాడు ఇప్పడం చాలా కష్టం గా ఉంటుంది. పాలు తీసాక కూడ దూడను మనం కంట్రోల్ చేయలేము.

*--*

🐂 ఆవు పాలు వేడి చేయవు, చలువ చేస్తాయి.

🐃 గేదె పాలు చిక్కగా ఉండడం వల్ల, మనకి షుగర్ వస్తుంది. అలాగే షుగర్ ఉంటే కూడా తగ్గదు.

*--*

🐂 ఫ్యాట్ తక్కువ ఉన్న అవు పాలను వదిలి,,

🐃 గేదె పాలల్లో ఎంత ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ వున్నా ఎక్కువ డబ్బులు చెల్లించి మరీ ఇంటికి తెచ్చుకుంటాము,

*--*

🐂 ఆవు పాలు ఎంత వేడి చేసి మరిగించి- మరిగించి కోవా లా చేసినా అందులో ఉండే పోషక తత్త్వాలు నశించవు.

🐃 గేదె పాలల్లో మూడో నాలుగో ఉండే పోషక తత్త్వాలు మనం పొయ్యి మీద పెట్టి కొంచం వేడి చెయ్యగానే ఆవిరైపోతాయి.
*--*

*చివరిగా,,,,,,,,*

🐂 ఆవు వీపు పైన ఉండే *"సూర్య కేతు నాడి"* ఎండ లో ఉన్నప్పుడు జాగృతమై ఆవు లో బంగారు లవణాలు తయ్యారవుతాయి. ఈ నాడి సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు మరియు విశ్వం నుండి *"కాస్మిక్ ఎనర్జీ"* ని గ్రహించుకుంటుంది. అందుకే ఆవు పాలకు రోగాలను హరించే శక్తి వస్తుంది. ఈ విశ్వం లో ఏ జీవికి ఇటువంటి శక్తి లేదు.

కోనసీమకు ఆ పేరు రావడానికి కారణమేమిటంటే.

 కోనసీమకు ఆ పేరు రావడానికి కారణమేమిటంటే.





.........................................

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమ అందమైన ప్రాంతం, ఆహ్లాదకరమైన ప్రదేశము, అతిథి మర్యాదలకు అప్యాతలకు మారుపేరు.గౌతమి వశిష్ఠనదుల మధ్యగల చివరి భూభాగానికే కోనసీమ అని పేరు.కోణమనగా మూల, అంచు, చివరి భాగమనిపేరు.గౌతమీ,వశిష్ఠనదుల అంచున ఈ ప్రదేశమున్నందువలన కోణసీమగా ప్రసిద్ధి చెందింది. కోణ అనే పదం ప్రజల నోళ్ళలో నాని అర్థవిపరిణామం చెంది కోనసీమ అయింది.

గోదావరి ప్రాంతములో సముద్రతీర ప్రాంతానికి కడలునాడు అనే పేరుండేది. కడలునాడు (కడలి) అంటే సముద్రతీర ప్రాంతమని అర్ధము పూర్వం పరిపాలనా విభాగాలకు, రాజ్యమని, విషయ, సీమ, నాడులని పేర్లుండేవి.

కోనసీమ శాసనాలలో సింధు యుగ్మాంతర దేశమనే వ్యవహారంలో
 వుండేది. యుగ్మాంతర దేశమనగా గౌతమి - వశిష్ఠ నదుల మధ్య ప్రాంతము.

మల్లిదేవుని పీఠాపుర శాసనములో
ముమ్మడి భీముని కుమారుడైన రాజపరేండు కోనమండలాధీశుడని చెప్పబడింది. ఆ శాసనపాఠం కింది విధంగా వుంది.

" శ్రీమా౯ రాజపటేండు ఖాఠ్మానాథః కోనమండలాధీశ ఉపయేమేయః కులజే లక్ష్మీతొండాంబికేదేవ్యౌ"

పైన పేర్కొన్న రాజపరేని కుమారుడైన రాజేంద్రచోడుని ద్రాక్షారామ శాసనాలలో ఒకదానిలో శ్రీరామేశ్వదేవుడికి ఏలవియ, నడుంబూడి, ముక్రోమల గ్రామాలను దానంగా ఇవ్వడం జరిగింది. ఏలవియ గ్రామం నేటి ఏలవేల, నడుంబూడి నేటి నడుపూడి, ముక్రోమల గ్రామానికి గల నేటి పేరు ముక్కామల.

అనవేమా రెడ్డి నడుపూరుశాసనములో...

 "శాకాద్దే రసరత్న ఖాను గణితే గ్రస్తేవిధో రాహుణాకార్తి క్యాం విజయేశ్వ రస్యపురతః శ్రీ గౌతమీ రోధసి విప్రేభ్యోః పరమన్న వేమనృపతిః శ్రీ వేమసాన్యాః స్వసుః పుణ్యార్థ నడుపూరు సంజ్ఞక మదాద్రామం సకోణస్థలే"

అని కోణస్థలములోని గౌతమీనది తీరములోని నడుపూరు గ్రామము దానము ఇచ్చినట్లుగా వ్రాయబడివుంది.

కాటయవేముని తొత్తరమూడి శాసనములో " కోనదేశే గ్రహారోయం భాతి మల్ల వరాభిదం | తీరేచ వృద్ధ గౌతమ్యాః పుణ్యో ముక్తిశ్వరాంతికే "
అని కోనదేశములోని మల్లవరము, ముక్తేశ్వరము గ్రామాలను పెర్కొనడం జరిగింది.

కోన భీమరాజు భార్యయైన పద్మావతీ వ్రాయించిన ద్రాక్షారామ శాసనములో ఆమె భీమేశ్వరదేవునికి "ఖుండెనపల్లి" గ్రామము దానము చేసినట్లు కలదు.

కోరుకొండ రాజ్యమునేలిన ముమ్మడి నాయకుడు ఉభయగోదావరీ మధ్యప్రాంతము నందలి కోన, పానార, కురవాట, చెంగర సీమల పాలకుడని అతని శ్రీరంగము, కోరుకొండ శాసనములలో ప్రశక్తి వుంది

కోనసీమకు సంబంధించిన శాసనాలలో ప్రాచీన గ్రామాలకు
నేటి గ్రామనామలేమిటో చూద్దాం.

(1) ఏలవియ - ఏలివెల
(2) నడుపుంబూడి - నడుపూడి
(3) ముక్రోమల - ముక్కామల
(4) నడుపూరు -నడుపూడి
(5) మల్లవరము -తొత్తరమూడి
(6) ముక్తీశ్వరము - ముక్తీశ్వరము ( మార్పులేదు)
(7) ఖుండెనపల్లి - గున్నేపల్లి
(8) తోత్తమూండి - తొత్తర మూడి.